Thursday, 10 March 2016

Breast feeding and Doubts - తల్లిపాల ఆరోగ్యం అపోహలు


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Breast feeding and Doubts-తల్లిపాల ఆరోగ్యం అపోహలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

Q : ఈ మధ్యకాలంలో ఆరోగ్య కార్యకర్తలు అప్పుడేపుట్టిన శిశువుకు నీరు, గ్లూకోజు నీరు, తేనెలాంటి పదార్థాలు తాగించొద్దు అంటున్నారు. ఎందువల్ల?


తల్లిపాల ఉత్పత్తికి ప్రధానంగా చేయాల్సింది తల్లులు చిన్నా రులకు తరచుగా పాలుపట్టడం. పాల ఉత్పత్తి పాలు తాగడం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు చాలామంది నీరుగానీ, గ్లూకోజునీరుగానీ, చక్కెరగానీ, తేనెగానీ రకరకాల పదార్థాలు తాగిస్తుంటారు. వీటివల్ల కడుపు నిండి శిశువుపాలు తాగే ప్రయత్నం చేయదు. పాల ఉత్పత్తి ప్రక్రియ జరగదు. అంతేగాక వీటి ద్వారా చిన్నారులు సూక్ష్మజీవుల బారినపడే ప్రమాదముంది. చిన్నారుల రక్షణకు ఉపయోగపడే ముర్రుపాలు వారికి లభించవు.

Q : మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?
కాన్పు అయిన ప్రతీస్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలుపట్టగలదు. ముందుగా వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో 'టైలర్‌ మేడ్‌' అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. ప్రకృతి ఏర్పరచిన దారిలో నడవడం వివేకం.

Q : కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారు. ఎందువల్ల? ఎలాంటి మందులు వాడాలి?

అలా చేసే దానిని 'వాంతి' అనకూడదు. పాలు తాగేటప్పుడు పిల్లలు పాలతో పాటు కొంతగాలి కూడా మింగుతుంటారు. కొందరు తల్లులు పిల్లల్ని ఎక్కు వగా కదిలిస్తారు. అందువల్ల తాగినపాలు బయటకి వస్తాయి. దీనిని వైద్యపరిభాషలో 'పొసెట్టింగ్‌' అంటారు. ఇది వాంతి వ్యాధి కాదు. ఈ సహజ చర్యకు ఎలాంటి మందులు వాడకూడదు. తల్లిపాలు పట్టిన తర్వాత భుజంపై పడుకోబెట్టుకుని, శిశువు వీపుపై తరచుగా చేతితో తట్టాలి. ఇందువల్ల మింగిన గాలి బయటకు వస్తుంది. పాలుపట్టిన తర్వాత శిశువులను ఎక్కువగా కదిలించరాదు.

Q : కొందరు చిన్నారులు ఊరకే ఎప్పుడూ ఏడు స్తుంటారు. తల్లిపాలు చాలనందువల్లా?
చిన్నారులలో ఏడుపునకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్లకన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.

Q : చిన్నస్తనాలు ఉంటే పాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. చిన్న స్తనాలు ఉండేవారు పాల ఉత్పత్తికి ఏమి చేయాలి?

స్తనాల సైజు కొవ్వుపదార్థంపై ఆధారపడి ఉంటుంది. పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు అందరిలో సమానమే. స్తనాల సైజుకూ, పాల ఉత్పత్తికీ ఎలాంటి సంబంధం లేదు.

Q : పాపాయికి పాలు పడితే స్తనాలు వదులై అమ్మల అందం తగ్గుతుందా?

ఇదో పెద్ద అపోహ. పవిత్రమైన మన తల్లుల ఆలోచనా విధానాన్ని సమాజం వక్రీకరించడం ఈ ఆలోచనకు కారణం. ఈ ఆలోచన మాతృత్వాన్ని, ప్రాకృత్రిక ధర్మాన్ని అవమానం చేసే ఆలోచన. నిజంగా మనం స్త్రీలు ఈ ఆలోచన చేయడంలేదు. వారు అలా అనుకుంటారని ఇతరులు అంటున్నారు. పాపాయికి పాలుపట్టడం ద్వారా అమ్మల అందం పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో కొవ్వుపదార్థం తగ్గుతుంది. పాలిచ్చే తల్లి మనస్సు నిర్మలంగా, చిన్నారిని గురించి భద్రతా భావంతో ఉంటుంది.

Q : పాలు బాగా పట్టాలంటే ఎలాంటి మందులు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినాలి?

పాల ఉత్పత్తిని పెంచే మందులు లేవు. ఆహారానికి పాల ఉత్పత్తికి ఎలాంటి సంబంధం లేదు. తల్లులు సాధారణంగా తినే ఆహారం తింటే చాలు. అయితే మాములు కన్నా ఎక్కువగా తినాలి.

Q : మాకు తల్లిపాలు పట్టడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి, పోతపాలు వాడతాం. విదేశాల నుంచైనా పాల పొడి తెప్పించుకుంటాం. మంచి పాలపొడి ఏమిటో చెప్పండి?

మీరు నిత్య జీవితంలో ప్రకృ తి ప్రసాదించిన చాలా ప్రాణరక్షక వస్తువులకు బదులు ఏమిటని ఆలోచించడం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు, గాలికి మరో మార్గం ఆలోచించడం లేదు. అదే పద్ధతిలో తల్లిపాలకు బదులు ఏమిటని ఆలోచించకండి. మరో ముఖ్య విషయం తల్లిపాలకు సమానమైన పాలపొడులు, పోతపాలు విదేశాల్లో కూడాలేవు.

Q : తల్లిపాలు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం పట్టాలి?

బిడ్డ పుట్టిన మొదటిగంటలోనే తల్లిపాలు పట్ట డం మొదలుపెట్టాలి. బిడ్డకు ఆరునెలలు పూర్తి అయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఆరవనెల ఆఖరు వారంలో ఇంటిలో తయరుచేసిన అదనపు ఆహారం మొదలుపెట్టాలి. అదనపు ఆహారంతోపాటు కనీసం రెండేళ్లు తల్లిపాలు పట్టాలి. రెండేళ్ల తర్వాత తల్లీ-బిడ్డ లకు ఇష్టమైతే ఎంతకాలమైనా తల్లిపాలు పట్టవచ్చు.

Q : మీరెన్ని చెప్పినా, కొందరిలో తల్లిపాల ఉత్పత్తి అసలు ఉండదు?
తొందరపడవద్దు. తేలికపాటి నిర్ణయాలు తీసు కోకండి. ఈ తేలికపాటి నిర్ణయాలే ఇన్ని అనర్థాలకు కారణం. మీమాటే సత్యమైతే దాదాపు నాలుగు వేల పైబడి క్షీరజంతువులు మనేవి కావు. ఈ ప్రపంచంలో. సృష్టి చరిత్రలో మనుషుల్లో పోతపాల చరిత్ర దాదాపు 150, 200 సంవత్సరాలే. తల్లిపాల సంస్కృతి కోసం అంకితభావంతో కృషిచేసే ఆరోగ్యకార్యకర్తల, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.

No comments:

Post a Comment