Tuesday, 2 February 2016

Stress in Day to Day life , ఒత్తిడి వల్ల దుష్పరిణామాలు రోజువారిజీవితంలో


ఒత్తిడి నేటి నవసమాజము లో ప్రతి ఒక్కరినీ బాధించే సమస్య అయ్యింది . విద్యాలయాలలో విద్యార్ధులు , ఆఫీషుల్లో బృందం నాయకుడు , ఇంట్లో ఇంటి యజమాని , రాజకీయల్లో పార్టీనాయకుడు , హాస్పిటల్స్ లో సంబంధిత డాక్టరు ఇలా ఎంతోమంది ప్రతిరోజూ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు .

మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు, తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో శారీరక , మానషిక వత్తిడులకు లోనవుతూ ఉండాడు . ఒత్తిడిని భౌతికశాస్త్రము నుండి అరువు తెచ్చుకున్నాము ... ఒత్తిడి అంటే " ప్రెజర్ (pressure)" అన్నమాట . ప్రతిరోజూ మనము సంతోషముగా ఉండదల్చుకున్నామో , విషాదముగా ఉండదల్చుకున్నామో , ఒత్తిడితో ఉండదల్చుకున్నామో , విశ్రాంతిగా ఉండదల్చుకున్నామో మనమే ఎంపికచేసుకోవచ్చును . తాను చేసేపనిని ఎంజాయ్ చేయగలిగినంతకాలము ఒక వ్యక్తి ఎన్ని గంటలైనా పనిచేయవచ్చు ... లేదంటే అది వత్తిడికి దారి తీస్తుంది .

ప్రతి సంవత్సరము కూడా ఒత్తిడికి సంబంధించిన ఆరోగ్యసమస్యల వల్ల అనేకమంది ఆఫీసులకు సెలవులు పెట్టాల్సివస్తోంది . సరిగా పనిచేయలేక పని గంటలు కుంటుబడుతున్నాయి . ఈ వత్తిడికి సంబంధించినంతవరకు రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి . టైప్ ' ఎ ' వ్యక్తులు కోపము గా దురుసుగా ఉండేవారు . టైప్ ' బి ' తమ భావాలను పైకి వెల్లడించకుండా దాచుకొని తక్కువ మాట్లాడే వారు . ఈ రెండు రకాల వ్యక్తిత్వాల వల్ల " అడ్రినాలిన్‌ , నార్ అడ్రినాలిన్‌ , కార్టిసాల్ " హార్మోన్లు లెవల్స్ పెరుగుతాయి . దీనివల్ల గుండె కొట్టుకునే రీతి , పల్స్ రేటు , రక్తపోటు , ర్క్తము లో షుగర్ , చెడ్డ కొలెస్టరాల్ పెరుగుతాయి . . తద్వారా అనేక శరీరక రుగ్మతలు తలలెత్తుతాయి .

  • ఇలాంటివారి కి ఏ పని యైనా ఒత్తిడిగా అనిపిస్తుంది . అధికము గా తిండి తింటారు . ఎక్షరసైజులు చేయకుండా , ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండే జీవిత విధానము గడుపుతుంటారు .
  • ఊబకాయము తయారవడం , పొగ త్రాగుతుంటారు . . . ఇటువంటి జీవనము వలం నరాల పనితీరు అధికము గా స్పందించడం వల్ల -- డిప్రషన్‌ , డయబిటీస్ , జుట్టురాలిపోవడం , గుండె జబ్బులు , థైరాయిడ్ జబ్బులు , యాంగ్జైటీ డిజార్డర్ , దాంపత్యజీవనము లో మార్పులు , గాస్ట్రిక్ ఉలసర్స్ వంటివి వస్తాయి .

* గతకొద్ది సంవత్సరాలుగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ మానసిక ఒత్తిడి కారణంగా కొన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకోవడం అందరూ గమనిస్తున్న విషయమే! విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణాలు అనేకం. ముఖ్యమైనవిగా కింది వాటిని చెప్పుకోవచ్చు.

(1) ఆత్మవిశ్వాసం లోపించడం, (2) చదువుపట్ల లేదా సబ్జెక్టు పట్ల అనాసక్తత, (3) పెద్దల ఒత్తిడి, (4) రిలాక్సేషన్‌కు టైమ్‌ లేకపోవడం, (5) ఇష్టం లేని వాతావరణం, (6) పరీక్షల పట్ల భయం, (7) జ్ఞాపకశక్తి మీద అపనమ్మకం.
కారణాలు ఏవైనా మనిషిలో మానసిక ఒత్తిడి ఏర్పడినప్పుడు అతడు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అయితే టీనేజ్‌లో ఏర్పడే శారీరక ఇబ్బందులు అధితమించడం పెద్ద కష్టం కాదు. కానీ మానసిక ఇబ్బందులను మాత్రం అధిగమించడం వారి శక్తికి మించిన పనిగా మారుతోంది. దాంతో వారు భావోద్వేగ పరంగా, ప్రవర్తనా పరంగా, ఆలోచనా పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

భావోద్వేగ పరంగా : ఆందోళన చెందడం, అనవసరంగా ఆవేశ పడడం, అతిగా భయపడడం, నిరాసక్తతకు లోనుకావడం మొదలైనవి.

ప్రవర్తనా పరంగా : అతిగా లేదా మితంగా తినడం, మాటల తడబాటు, అతివేగంగా వాహనాలు నడపడం, అతిగా నిద్రపోవడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోవడం మొదలైనవి.

ఆలోచనా పరంగా : మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం మొదలైనవి.

  • మన మీద మనం విశ్వాసం కోల్పోయినప్పుడో లేదా కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నప్పుడో ఆ సమస్యలే అంతవరకు లేని వాటినే ఉన్న వాటిగా మారుస్తాయి. ఉదాహరణకి మీకు జ్ఞాపకశక్తి మీద అపనమ్మకం ఉండి తద్వారా టెన్షన్‌పడడం మొదలుపెడితే, ఆ టెన్షన్‌ కారణంగా ఏకాగ్రత లోపించి నిజంగానే మతిమరుపు మొదలవుతుంది. ఇలా లేని సమస్యల గురించి అతిగా ఆలోచించడం వలన కొత్త సమస్యలను కూడా కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. అలాగని లేని సమస్యల ద్వారానే స్ట్రెస్‌ వస్తుందని చెప్పలేం. మనకు వాస్తవంగా ఉన్న సమస్యలు కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఉదాహరణకు సబ్జెక్ట్స్‌ పట్ల అనాసక్తత, రిలాక్సేషన్‌కు టైమ్‌ లేకుండా చదవాల్సి రావడం - ఈ సమస్యలు నిజమైనవే! కాబట్టి లేని సమస్యల వల్ల గానీ, ఉన్న సమస్యల వల్ల గానీ మానసిక ఒత్తిడి కలిగితే తప్పకుండా మనం నష్టపోతాం. అందుకే మనకు మొదట ఎలాంటి సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుందో గుర్తించాలి.

ఇలాంటి మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలంటే :

1. మానసిక ఒత్తిడికి కారణమేమిటో గుర్తించాలి.

2. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి.

3. సమస్యలు తగ్గించుకోవాలి.

ఇక ఇప్పుడు మీ మానసిక ఒత్తిడి కారణాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోండి

1. మీరు అనీజీగా ఫీలవుతున్న సమయాలను, అంశాల జాబితాను రాసుకోండి.

ఉదాహరణకు ఏదైనా పుస్తకం చేతిలోకి తీసుకోగానే ఇబ్బందిగా, అయిష్టంగా కనిపిస్తే ఆ భావాన్ని గుర్తించి నోట్‌ చేసుకోండి. ఆ భావానికి మరేవైనా కారణాలున్నాయేమో కూడా గుర్తించండి. ఉదాహరణకు 'జ్ఞాపకశక్తి' లోపించిదన్న భావన ఆ సబ్జెక్ట్స్‌ మీద అయిష్టతను ఏర్పరచిందేమో, విశ్లేషించుకోండి.

2. మీ మానసిక ఒత్తిడికి కారణాల లిస్ట్‌లో నుండి ఓ నోట్స్‌ తయారు చేసుకోండి. 'నాకు ఫలానా సమయంలో, ఫలానా కారణం, విపరీతంగా/ ఓ మోస్తరు ఒత్తిడి ఏర్పడుతోంది. దాని పర్యవసానంగా నేను చదవలేకపోతున్నాను/ మరచిపోతున్నాను.

3. ఈ నోట్స్‌ ద్వారా మీ స్ట్రెస్‌ గురించి మీకో క్లారిటీ ఏర్పడాలి. దాని ప్రకారం దానిని తొలగించుకుని మానసిక స్థైర్యాన్ని పొందే ప్రయత్నాన్ని చేయండి.

మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండిలా :


1. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని వందల టెక్నిక్స్‌ ఉన్నాయి. కాసేపు వ్యాయామం చేసినా, మెడిటేషన్‌ చేసినా ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే టెక్నిక్స్‌ ఏవేవి ఉన్నాయో మొదట తెలుసుకోండి. (స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ బుక్స్‌ మీకీ విషయంలో బాగా ఉపయోగపడతాయి)

2. మీ పరిసరాలకు, సమయానుకూలతకు తగిన స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌ ఎన్నుకోండి. వాటిని సిన్సియర్‌గా ప్రాక్టీస్‌ చేయండి.

3. స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌ అప్లయి చేశాక మీలో వచ్చిన మార్పును గుర్తించండి. ఆ మార్పును ఫీలవుతూ, పాజిటివ్‌ థింకింగ్‌ ద్వారా ముందుకు సాగండి.

సమస్యలను తగ్గించుకోండిలా :


1. సాధారణంగా ఎక్కువ సమస్యలు మనం సృష్టించుకోవడం ద్వారానే ఏర్పడతాయి. మన మానసిక ధోరణిలో మార్పు ఏర్పడినప్పుడు నిజమైన సమస్యలు కూడా సమస్యలుగా అనిపించవు. ఉదాహరణకు 'చదువు పట్ల అనాసక్తత' అనేది మనం సృష్టించుకున్న సమస్యనే. మన మానసిక ధోరణిలో మార్పు ద్వారా దానిని అధిగమించవచ్చు. 'ఈ అనాసక్తతకు కారణమేంటి?..... నేను చదువు పట్ల ఇష్టం పెంచుకుంటాను' అని నిరంతరం మనసుకు సజెషన్స్‌ ఇచ్చుకోవాలి. ఇలా మనం ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతాం.

2. అలాగే కొత్తగా సమస్యలను ఆహ్వానించకుండా, మనసును పాజిటివ్‌గా ఆలోచించేలా మార్చుకోవాలి. ఉదాహరణకు ఒక వాతావరణంలోకి వెళ్ళగానే, 'ఈ పరిసరాలు నాకు సరిపడేలా లేవు. ఈ చోట నేను అడ్జస్ట్‌ కాలేనేమో' అని ముందుగానే అనుకోవడం కాకుండా, ఆ పరిసరాలలోని పాజిటివ్‌ అంశాలను ఆస్వాదిస్తూ ఎంజారు చేసేలా మనసుకు ట్రయినింగ్‌ ఇవ్వాలి. అప్పుడు మరిన్ని సమస్యలను మనం సృష్టించుకోకుండా ఉంటాం.

3. ఇక నిజమైన సమస్యలు వచ్చినా, ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని నిర్ణయించుకోండి. సరయిన భోజనం లేదు. లెక్చరర్స్‌ నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్నేహితులు లేదా క్లాస్‌మేట్స్‌ సమస్యలు సృష్టిస్తున్నారు వంటి వాటిని పట్టించుకోకండి. ఇవేవీ కష్టపెట్టలేవు. నష్టపెట్టలేవు అని ఆత్మవిశ్వాసంతో అనుకోండి. ఇలా మీరు మానసిక ఒత్తిడిని అధిగమిస్తే, మీ శక్తి సామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి.

ఒత్తిడిని దూరం చేయండి ఇలా :
లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో రామ్‌ సిద్ధహస్తుడు. బృందనాయకుడిగా కార్యాలయంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. అందరితోనూ కలుపుగోలుగా ఉండే అతను ప్రస్తుతం సహచరులతో సరిగా మాట్లాడడం లేదు. దీనికంతటికీ కారణం రామ్‌ విపరీతమైన ఒత్తిడికి గురికావడమే. అయితే ఈ ఒత్తిడి సహచరుల పనితీరుతో ఏర్పడిందే కానీ అతడిలో స్వతహాగా ఏ ఒత్తిడి లేదు. ఎంతో ఓర్పుగా ఉంటున్నప్పటికీ సహచరులు ఒత్తిడికి గురవడం వల్ల అతనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సాధారణంగా సహచరుల సాయంతో ఒత్తిడి అధిగమించొచ్చు. కానీ సహచరులే ఇబ్బంది పడుతుంటేబృందనాయకుడి పనిమీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా రామ్‌ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. మీరూ అటువంటి ఇబ్బందులు పడుతున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించి ఆ తరహా ఒత్తిడి మటుమాయం అవుతుంది.

సహచరుల తీరు గమనించండి:
సహచరులు ఎలా పనిచేస్తున్నారు అనేదాన్ని పరిశీలించడం ముఖ్యం. లక్ష్యాలు నెరవేర్చడంలో అశ్రద్ధ చూపే వారిని గమనించండి. ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో తెలుసుకోండి. వ్యక్తిగతజీవితం ప్రభావం వల్లా లేక ఇతరత్రా కారణాలా క్షుణ్నంగా పరిశీలించాలి. ఇలాంటి వారందరికీ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయించండి. కౌన్సిలింగ్‌ చేయడం ద్వారా వారి దృష్టి లక్ష్యాల మీదకి మరలించొచ్చు. అటువంటి వారికి అవసరమైతే బృందంగా కాకుండా ప్రత్యేకించి ప్రాజెక్టులు అప్పగించండి. సకాలంలో ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్‌ చేయండి. ఏ విధమైన ఒత్తిడి లేకుండా పనిదొంగల్లా వ్యవహరించే వారూ ఉంటారు. వారినీ ఓ కంట కనిపెట్టాల్సిందే.
 


సమస్యలపై దృష్టి పెట్టాలి:
ఒత్తిడికి గురయ్యేవారి సమస్యల మీద దృష్టి పెట్టాలి. అంతేకాని వారిని వేరుగా చూడడం తగదు. వేరుగా చూడడం వల్ల తమను దూరం చేస్తున్నారని భావించి సహచరులు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశముంటుంది. సమస్యను భూతద్దంలో చూసే వారు ఉంటారు. ఇలాంటి వారు తరచూ సెలవులు కోరుతుంటారు. ఆ పని భారం బృంద నాయకుడి మీద పడుతుంటుంది. ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఒకసారి వారితో చర్చించడం మంచింది. తగిన పరిష్కార మార్గాలు సూచించండి. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. అప్పుడు తప్పకుండా వృత్తి జీవితం మీద దృష్టి పెడతారు.

తరచూ పర్యవేక్షణ:
ఒత్తిడికి గురయ్యే సహచరులను బృంద నాయకుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. వారి ప్రణాళిక తెలుసుకోవాలి. ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడాలి. కౌన్సిలింగ్‌ తర్వాత వారిలో వస్తున్న మార్పులు గమనించాలి. దీనివల్ల లక్ష్యాల మీద దృష్టి మరలిందా ఇంకా అలాగే ఉన్నారా అనేది తెలుస్తుంది. ఇంకా ఒత్తిడికి లోనవుతుంటే వైద్య సలహాకు పంపడం శ్రేయస్కరం.

* విరామంలో సహచరులతో సంభాషించాలి.
* కార్యాలయానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత ఆలోచనలు మానుకోవాలి.
* యోగా తరగతులకు వెళ్లడం ద్వారా మానసికంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పని ఒత్తిడి వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. ఎంత సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ దీన్ని తప్పించుకోవడం కష్టసాధ్యమే. ఒక్కోసారి లక్ష్యాలు సాధించడానికి అది ఎన్నో ప్రతిబంధకాలను ఏర్పరస్తుంది కూడా. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెంటిలోనూ ఒత్తిడి సహజం. ఒత్తిడి జయించడమూ ఒక కళే. దీన్ని అధిగమించి లక్ష్యాల మీద దాని ప్రభావం లేకుండా చూసుకోవడమే బృందనాయకుడి విజయసూత్రం.

ఒత్తిడి గురించిన అవాస్తవాలు :

  • ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉంటుంది :
ఇది సరి కాదు . ఒత్తిడి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది . మనిషి మనిషి కీ , మనసు మనసుకీ తేడా ఉన్నట్లే అందరిలోనూ ఒత్తిడి ఒకేలా ఉండదు .
  • ఒత్తిడి అనేది ఎప్పుడూ చెరుపుచేస్తుంది . ఒత్తిడి అసలు లేకపోతే సొంతోషముగా , అరోగ్యముగా ఉండవచ్చును .
ఇదీ నిజం కాదు . ఒత్తిడిని సరిగా మేనేజ్ చేస్తే ఎక్కువ పని చేయగలుగుతాము , సంతోషముగానూ ఉంటాము . ఎటువంటి చెడు జరుగదు .
  • ఒత్తిడి ప్రతీ చోటా ఉంటుంది . . కాబట్టి మనము చేయగలిగేది ఏమీ ఉండదు ..
తప్పు . ఎక్కువగా మనము ఏర్పాటు చేసుకున్న పరిసల పరిస్తుతుల పై అధారపడి ఒత్తిడి వస్తూ ఉంటుంది . ఒత్తిడి ఇంద్రియాలను మరీ ఎక్కువ పనిచేసేలా చేస్తుంది . ఒత్తిడిని మనము అధుపుచెసుకోవచ్చును . ఒత్తిడి అన్నిచోట్లా ఒకేలా ఉండదు .

No comments:

Post a Comment