Wednesday, 10 February 2016

Obesete in menopausal stage prablems awareness - స్థూలకాయము మెనోపాజ్ దశలో ఉన్నవారి ఇబ్బందుల మీద అవగాహన



  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - స్థూలకాయము  మెనోపాజ్ దశలో ఉన్నవారి ఇబ్బందుల మీద అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
 స్థూలకాయము  మెనోపాజ్  రెండూమహిళల ఎముకలు , కీళ్ళ మీద ప్రభావము చూపిస్తాయి. ఎముకల్ బళీరత అందులో ముఖ్యమైనది. దీనిని " ఆస్టియోపొరోసిస్ అంటారు. ఎముకలు బలహీనపడడముతో పాటు పెళుసుగా మారి సులభము గా విరుతాయి. ఎటువండి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలంటే పౌష్టికాహారము , వ్యాయామానికి ప్రధాన్యత నిస్తూ కాల్షియం , విటమిన్‌ డి . తీసుకోవాలి . 1.2 గ్రా. కాల్షియం ప్రతిరోజూ తీసుకోవాలి. 51-70 సం లు ల మధ్య ఉన్నవారు 400 ఐ.యు . విటిమిన్‌ డి తీసుకోవాలి. సైక్లింగ్ , ఏరోబిక్ వ్యాయామాము చేయాలి. తాజా పండ్లు తీసుకోవాలి.

ఎముకలు విరగడమే కాక , స్థూలకాయం వల్ల కీళ్ళనొప్పలు ఎక్కువగా వస్తాయి. కీళ్ళ ఆరుగౌదలకు ప్రాధమిక కారణము స్థూల కాయము . స్థూల కాయము వల్ల కండ బలము తగ్గి కీళ్ళమీద ఒత్తిడి అధికమవుతుంది .. ఫలితముగా కీళ్ళదగ్గర లలిసే ఎముకల చివర తో ఉండే  కార్టిలేజ్ దెబ్బతిని రండు ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురి అవుతాయి. దానితో కీళ్ళదగ్గర నొప్పి మొదలవుతుంది. ఇంటి పనిలో బాగము  గాకింద కూర్చుని పని చేయడము , మెట్లు ఎక్కి దిగడము వ్యాయామము అనే భావించే మహిళలు లేకపొలేదు . . కాని అటువంటి పనులు కీళ్ళను , వెన్నును కూడా బాగా దెబ్బ తీస్తాయి అని గమనించాలి .  చాలా మంది పేసెంట్లు తమ కీళ్ళలోని గుజ్జు ఎండిపోయిందని, ఎండిపోయిన ఆ గుజ్జు పట్టటానికి మందులు వేసుకుంటే కీళ్ళు బాగవుతాయనే అభిప్రాయము లో ఉంటారు. కీళ్ళ రక్షణ నిచ్చే మందులైన కాండ్రాయిటిన్‌ , గ్లుకోసామిన్‌ , డయాసెరిన్‌ మందులు కీళ్ళ అరుగుదళ తొలి రెండు దశలలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి కాని 3- 4 వ దశ కు చేరిన తరువాత అంతగా ఉపయోగ పడవు .

జాయింట్ ఆర్థరైటిస్ రోగులకు ముఖ్యముగా అవసరమైనది ... వారి బరువు తగ్గుదళ . , కాల్సియం , విటమిన్‌ డి . మాత్రమే కీళ్ళను రక్షిస్తాయి . ప్రత్యేకమైన వ్యాయామములు కొంతవరకు సహాయపడతాయి. చాలా మంది రోగులు నొప్పివేసినప్పుడు మందులు మింగితే చాలనుకుంటారు .. అది సరియైన విధానము కాదు.  స్తూల కాయము గల రోగులు లో కీళ్ళ మార్పిడి అంత సులువు కాదు . వారికి ప్రత్యేకమైన ఇంప్లాంట్స్ కావాలి. వీటి అమరికకు ప్రత్యేక సంకేతిక విధానము ఉన్నది. స్తూల కాయము గల వారికి హైప్లెక్ష్ జాయింట్స్ అంత ఉపయోగము కావు . కీళ్ళ మార్పిడి అయిన తర్వాత స్తూలకాయులు ఆహారము విషయము లో జాగ్రత్తలు తీసుకోవాలి.

పైన చెప్పిన సమస్యలే కాక మరికొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి. నిద్ర లేచిన వెంటానే పాదం కింద పెట్టాలంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. వంట ఇంటిలో రెండు గంటలు నిలబడితే పాదం నొప్పి , చీలమండ ప్రాంటాన్ని వేధంచే ఈ సమస్యని వైద్యశాస్త్రము లో్ " ప్లాంటార్ ఫాసైటిస్ " అంటాము . ఈ ఇబ్బంధికి సాఫ్ట్ ఫుట్ వేర్ ఆయింట్ మెంట్ మర్ధించడం , పాదభాగ వ్యాయామాలు చేయడము .

మరో  ఇబ్బంది మోచేతిబాధ " టెన్నిస్ ఎల్బొ "  అనే ఈ బ్బంది ఏ వయసులో నైనా రావచ్చు కాని మెనోపాజ్ తరువాత వయసులో అధికం గా సతుంది. దీని ట్రీట్ మెంట్ కి స్పెషల్ క్రీములు , ఇంజక్షన్‌ లు సహాయపడతాయి. నొప్పికి మందులు తక్కువగా మిడ కిందబాగము , స్పాండిలైటిస్ , భుజముల మీద బాధ , వీపునొప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  నొప్పికి మందులు తక్కువగా వాడాలి .

No comments:

Post a Comment