కారణాలు:-
1. ఏదైనా బలమైనది ముక్కుపైన తగిలినప్పుడు.
2. బలమైన పని చేసినా.
3. రక్తపోటు ఎక్కువ అయినా.
4. ఎత్తైన ప్రదేశములో ఉన్నా.
5. ఎక్కువ వత్తిడి తో ముక్కును చీదినా.
ముక్కునుండి రక్తం కారితే ఏమి చెయ్యాలి?
1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే,ఆ ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూ రక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.
దోహదం చేసే కారణాలు :
ఎలర్జీ ,
ఇన్ఫెక్షన్ (CommonCold),
రక్తపోటు ,
కొన్ని రకాల మందులు వాడడం వల్ల :
- Aspirin,
- Fexofenadine/Allegra/Telfast,
- warfarin,
- ibuprofen,
- clopidogrel,
- isotretinoin,
- desmopressin,
- ginseng
- బాగా సారా త్రాగడము వలన
- రక్తహీనత ఉన్న కొంతమందిలోను ,
- కీళ్ళ సంభందిత వ్యాదులతో భాదపడుతున్న వారిలోనూ ,
- కొన్ని రకాల రక్త కాన్సర్లు లోను ,
- గుండె జబ్బులున్నవారిలోను (HeartFailure),
- కొంతమంది గర్భిణీ స్త్రీలలోను ,
- కొన్ని రక్తనాల వ్యాధులలోను ,
- విటమిన్ ' సి' , విటమిన్ ' కే ' లోపమున్నవారిలోను , ఈ యవాది కనిపించును ,
ఏవిదం గా ముక్కు నుండి రక్తం కారును :
నాసికా రంద్రం పైబాగం లో చిన్న చిన్న రక్తనాళాలు ఒకేచోట గుమి కుడి ఉంటాయి . ఇలా ఉండటాన్ని " కిసేల్స్ బాచ్ ప్లెక్షెస్ (KiesselbachsPlexus)" ఈ ప్రదేశాన్ని లిటిల్స్ ఏరియా (LittlesArea) అని అంటారు . సాదారనము గా ఈ ప్రదేశం లో చిన్న దెబ్బ తగిలినా , వత్తిడికి లోనైనా రక్తనాళాలు పగిలి రక్తస్రావము జరుగును . ఈ ప్రదేశం ప్రమాదకరమైనది .
చికిత్స :
1) ప్రశాంతంగా కూర్చోవాలి.
2) కొంచెం ముందుకు వంగాలి,కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి.
3) ఒక సైడు ముక్కునుండి రక్తం వస్తుంటే,ఆ ముక్కు నరానికి పైభాగంలో గట్టిగా వత్తిపట్టుకోవాలి.
4) ఐస్ గాని లేక తడి(చల్లటి) బట్టను ముక్కుపై ఉంచాలి.దీని ద్వారా ముక్కుకు సంబధించిన రక్తనాళాలు సంకోచించటం జరుగుతుంది.
5) రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నచో ముక్కులు రెండింటినీ గట్టిగా నొక్కి పట్టుకోవాలి,కనీసం 10 నిమిషాల పాటు పట్టుకొని ఉంచాలి.ఇంకనూరక్తప్రసరణ ఉన్నచో,ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టి ఉంచాలి.
6) ముక్కుకు బలమైన గాయం అయినచో చాలా సున్నితంగా పట్టి ఉంచాలి.
7) రక్తస్రావం ఎక్కువగా గాని లేక మరలా మరలా రక్తం కారుతున్నా వెంటనే డాక్టర్ ని కలవ వలసి ఉంటుంది.
No comments:
Post a Comment