Tuesday, 9 February 2016

Blood Cancer - రక్త కాన్సర్ - blood cancer symptoms


 

క్యాన్సర్‌ సోకే అవయవాలు...క్యాన్సర్‌ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. క్యాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సర్‌, జీర్ణ కోశ - పేగుల క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయముఖ క్యాన్సర్‌, తల, మెడ క్యాన్సర్‌, ప్రోస్టేట్‌, రక్త సంబంధిత క్యాన్సర్లు ముఖ్యమైనవి.

బ్లడ్‌ క్యాన్సర్‌...:రక్త కణాల ఉత్పత్తి, ధర్మాలను రక్త క్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రధానంగా బోన్‌ మారో (ఎముకల మజ్జ / మూలగ) లో ప్రారంభమవుతుంది. ఇక్కడే రక్తం, రక్తకణా లు ఉత్పత్తవుతాయి. మామూలుగా మజ్జలో వున్న మూల కణాలు అభివృద్ధి అయి, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు తయారవుతాయి. ఎక్కువ రక్తక్యాన్సర్‌ల్లో తెల్లరక్త క ణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దీనితో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా అడ్డగోలుగా పెరిగే కణాల్ని క్యాన్సర్‌ కణాలంటారు. ఇవి మిగతాకణాల్ని సరిగా పనిచేయ నియ్యవు. ఫలితంగా, రోగ నిరోధకశక్తిని కోల్పోయేలా చేస్తుం ది. రక్తాన్ని గడ్డకట్టనీయదు. రక్త క్యాన్సర్‌కు ప్రధానంగా మందులతో (కీమోథెరిపీ పద్ధతిలో) చికిత్స చేస్తారు.

ప్రధానంగా మూడురకాలైన రక్త క్యాన్సర్‌లున్నాయి.
అవి... 1) లుకేమియా, 2) లింఫోమా, 3) మైలోమా.

లుకేమియా...:

తీవ్రస్థాయిలో వున్నప్పుడు ప్రభావితమైన తెల్ల రక్తకణాల ఆధారంతో రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
లింఫోబ్లాస్టిక్‌ (తెల్లరక్తకణాలు) లుకేమియా: దీనివల్ల సహ జంగా వున్న వైరల్‌ అంటు రోగాల్ని ఎదిరించేశక్తిని కోల్పో తుంది. ఇది పిల్లల్లో (15 సంవత్సరా లలోపు) ఎక్కువగా వస్తుంది. ఎక్కువ మందిలో ఇది రెండు నుండి ఐదేళ్లలోపు పిల్లలకి వస్తుంది. దీనికి కారణాలు తెలియదు. మందులతో పిల్లల్లో 85 శాతం మందిలో దీన్ని తగ్గించవచ్చు. అయితే పెద్దవాళ్లల్లో 40 శాతం మందిలోనే తగ్గే అవకాశం వుంది.
మైలాయిడ్‌ సెల్స్‌ (మూలగ) లుకేమియా: ఇది సహజంగా వున్న బ్యాక్టీరియా, పరాన్న జీవుల్ని, కణజాల నష్టాన్ని పరిమితంచేసే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఈ రకం క్యాన్సర్‌ వచ్చినప్పుడు పాలిపోవడం, అలసిపోవడం, శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. తరచుగా అంటురోగాలు వస్తాయి. అసాధారణంగా, తరచుగా రక్తస్రావం జరుగు తుంది. ఇది ఎక్కువగా 60 ఏళ్లు పైబడినవారిలో, అదీ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. పొగాకు తాగడం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ.

లింఫోమా: ఈ క్యాన్సర్‌ శోషరస నాళ వ్యవస్థ (లింఫ్‌ సిస్టమ్‌) ను ప్రభావితం చేస్తుంది. ఇది రోగ నిరోధకశక్తిలో ఒక భాగం. ఎముకల మజ్జ, తెల్లరక్తకణాలు, లింఫ్‌ గ్రంథు లు రోగ నిరోధకశక్తిలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇది వస్తే లింఫ్‌ గ్రంథులు ఉబ్బు తాయి. ఇదే క్యాన్సర్‌కి చిహ్నం. తెల్లరక్తకణాలు పనిచేయవు. తరచుగా ఇన్ఫెక్షన్స్‌, వ్యాధులు వస్తాయి.

మైలోమా: ప్లాస్మా జీవకణాలకు క్యాన్సర్‌ సోకుతుంది. ఈ జీవకణాలు మామూలుగా రోగ నిరోధకశక్తికి అవసరమైన యాంటీబాడీల్ని తయారుచేస్తాయి. క్యాన్సర్‌ వచ్చినప్పుడు ఈ శక్తిని కోల్పోతాయి. ఎముక మజ్జలో వుండే కణాలు కూడా వేగంగా పునరుత్పత్తి అయ్యి, అక్కడే వుంటాయి. దీనివల్ల ఎముకలు ఉబ్బుతాయి. వెన్నెముకలో, పుర్రెలో, తొంటి ఎముకల్లో, ఉరః పంజరం (రిబ్స్‌) లో, ఇలా ఎక్కడైనా ఎముకల్లో ఏర్పడవచ్చు. దీన్ని ఎముకల క్యాన్సర్‌ అంటారు. దీనివల్ల నొప్పి, రక్తహీనత, ఎముకలు విరిగిపోవడం, శరీరంలో గడ్డలు గడ్డలుగా ఏర్పడటం, అలసిపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం జరుగుతుంది. ఇవన్నీ ఆలస్యంగా బయటపడతాయి.


మందులకు లొంగని 'ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా' అనే జబ్బు. ఒక రకమైన రక్త క్యాన్సరు..... పది లక్షల మందిలో 30 పిల్లలకు రావచ్చు. అది కూడా 2 నుంచి 5 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా వస్తుంది.

లక్షణాలు:
రక్త క్యాన్సరులో అపరిపక్వమైన తెల్ల రక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి జరిగి సాధారణ, ఆరోగ్యమైన తెల్లరక్తకణాలను స్థానభ్రంశం చేసి ఎముక మజ్జుకు హాని కలిగిస్తాయి. దీని మూలంగా రక్తం గడ్డకట్టడాని (గాయాలు కలిగినప్పుడు) అవసరమయే రక్తపట్టకల సంఖ్య తగ్గిపోతుంది. దీని మూలంగా రక్త క్యాన్సరు వున్న రోగుల కలగాయం కలిగినప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్టుగా కనపడడం, చర్మంమీద ఎర్ర రక్తపు దద్దుర్లు కనపడడం వంటి లక్షణాలు వుంటాయి.

తెల్లరక్తకణాలు వ్యాధికారక సూక్ష్మజీవులకు విరుధ్ధంగా నిరంతరం పోరాడుతూవుంటాయి. ఇవి ఈ వ్యాధితో అణచి చేయబడుతాయి లేక సరిగావాటి విధి నిర్వర్తించలేకపోతాయి. పర్యావసానంగా రోగి యొక్క నిరోధక వ్యవస్థ (తెల్లరక్తకణాలు మొ,,) శరీరంలోని ఇతర కణాలపై దాడి మొదలు పెడతాయి.

ఆఖరుకు ఎట్టి రక్తకణాల కొరత రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతవల్ల రోగికి ఆయాసం రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చును. రోగ నిర్ధారణకు రక్తపరీక్షలు, ఎముక, మజ్జాల పరీక్షలు అవసరమవుతాయి.

తత్సంభందమైన ఇతర లక్షణాలు:-

* జ్వరము, వణుకుడు, రాత్రుళ్ళు చెమటపోయడం, ఇతర ఇన్ ప్లూయన్ జా లక్షణాలు
* బలహీనత, అలసట,
* ఆకలి లేమి, రక్తం కారడం
* చిన్న గాయం నుంచి అధిక రక్తస్రావం
* నరాల జబ్బులకు సంభంధించిన లక్షణాలు (తలనొప్పి)
* కాలేయము, ప్లీహము యొక్క వాపు.
* చిన్నగాయాలే తేలికగా చర్మం కంది పోవడం
* తరచుగా సూక్ష్మక్రిమి సంపర్కము
* ఎముకల నొప్పి
* కీళ్ళ నొప్పులు
* గళగ్రంధుల యొక్క వాపు లుకీమియా (రక్త క్యాన్లరు) అనాగా తెల్ల రక్తము అని అర్థం.

సార్ధకనామంగా ఈ వ్యాధిలో తెల్లరక్తకణాల సంఖ్య రోగిరక్తంలో చికిత్సకు ముందు అధికంగా ఉంటాయి. సూక్ష్మ దర్శని క్రింద రక్తం యొక్క నమూనా పరీక్షించినప్పుడు తెల్లకణాల సంఖ్య ఆధిక్యత స్పష్టంగా తెలుస్తుంది. చాలా వరకు ఈ అధిక సంఖ్యలో ఉన్న తెల్ల రక్తకణాలు ఇతర కణాల కార్యకలాపాలలో అడ్డుపడతాయి.

కొంతమంది రక్త క్యాన్సరు రోగులలో తెల్లరక్తకణాల ఆధిక్యత స్పష్టంగా కనపడేంతగా వుండదు. దీనిని ఎలుకీమియా అంటారు. ఎముక మజ్జులో క్యాన్సరు కలుగజేసే తెల్ల రక్తకణాలు వుంటాయి మరియు ఇవి సాధారణంగా ఉత్పత్తయే రక్తకణాలలో విభేధము కలిగిస్తాయి. అయినప్పటికీ ఇటువంటి క్యాన్సరును కలుగజేసే రక్తకణాల రక్తస్రావంలోకి చేరకుండా ఎముక మజ్జులోనే ఉండిపోతాయి. ఇవి రక్త పరీక్షలో కనపడవు. ఎలుకీమియా రక్త క్యాన్సరు ఉన్న రోగులలో రక్తంలోని తెల్లరక్త కణాల సంఖ్య సాధారణంగా లేక సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చును. నాలుగు ప్రముఖ రకాలైన రక్త క్యాన్సరులలో ఎలుకీమియా ఒకరకం కావచ్చును. ఎలుకీమియా కేశకణాల ఎలుకీమియాలలో అధికంగా వుంటుంది.


నాలుగు ప్రముఖ రకాలు:

రక్త క్యాన్సరు అనే పదం చాలా రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులకు కలిపి వర్తిస్తుంది.
రక్త క్యాన్సరును వైద్య పరీక్షలకు అనుగుణంగా వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా రెండు రకాలుగా విభజించవచ్చును.

1.ఆకస్మికంగా అవతరించే రకము. 2.దీర్ఘకాలికంగా ఉండే రకము

ఆకస్మికంగా అవతరించే రకముః-

ఇందులో అపరిపక్వమైన రక్తకణాలు వేగంగా వృద్ధి చెందుతూ పోతాయి. ఈ కణాలు గుంపులు, గుంపులుగా ఎముక మజ్జునులో ఏర్పడి దీనిని ఆరోగ్యవంతమైన రక్తకణాల ఉత్పత్తి చేసే వీలు లేకుండా చేస్తాయి. ఈ రకము రక్త క్యాన్సరు పిల్లలలో మరియు యౌవ్వనంలో వున్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణ చికిత్స చాలా అవసరం ఎందుకంటే ఈ రకం రక్త క్యాన్సరులో క్యాన్సరు కణాలు వేగంగా పెరిగిపోయి గుంపులుగా చేరిపోయి రక్త ప్రసరణలోకి చేరి ఇతర అవయవాలలోకి వ్యాప్తి చెందుతాయి. కానీ కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావితం చేయదు. అప్పుడప్పుడు కేంద్ర నాడుల పక్షవాతం వచ్చే అవకాశాలు వుంటాయి.

దీర్ఘకాలికంగా ఉండే రకముః-

ఈ రకం క్యాన్సరులో ఆకస్మిక రక్త క్యాన్సరులో లాగా కాక క్యాన్సరు కణాలు దరిదాపు పరిపక్వంగా వుంటాయి. కానీ అసాధారణంగా వుంటాయి. ఇవికూడా త్వరితగతిన వృద్ధి చెందుతాయి. కొన్ని నెలలనుంచి కొన్ని సం,, కాలంలో వృద్ధి చెందుతూ సాధారణ కణాలు వృద్ధి చెందే సమయము కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొంటాయి. ఫలితంగా రక్తంలో అసాధారణ తెల్లరక్తకణాలు ఎన్నో కనపడతాయి. దీర్ఘకాలిక రక్త క్యాన్సరు చాలా వరకూ వృద్ధులలో కనబడుతుంది. కానీ సిద్దాంతాలు ప్రకారం చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా రావచ్చును. ఆకస్మిక రక్త క్యాన్సరుకు తక్షణం చికిత్స అవసరం, కానీ దీర్ఘకాలిక క్యాన్సరు రోగులను కొంతకాలం వరకూ గమనించి చికిత్స యొక్క ప్రభావం పూర్తిగా లభించే వరకూ ఎదురు చూడవచ్చును.


కారణాలు మరియు రోగం అపాయకరమైన అంశాలు:

అన్ని రకాల రక్త క్యాన్సరులకు ఏదో ఒకటే కారణం అంటూ లేదు. వివిధ రకాల రక్త క్యాన్సరులకు వివిధ కారణాలు వుండవచ్చును. దీని గురించి తెలిసింది చాలా తక్కువ. శాస్త్రజ్ఞుల ఈ క్రింది పేర్కొన్న నాలుగు కారణాలు కారణం కావచ్చునని నమ్ముతున్నారు.

* స్వాభావిక లేక కృత్రిమ అయనీకరణ కిరణ ప్రసారాలు (కిరణ ప్రసరణ వలన కలిగే ఉష్ణము)
* కొన్ని రకాల రసాయన పదార్థములు
* కొన్ని వైరస్ లు
* అనువంశికం, వంశపారంపర్యం

రక్త క్యాన్సరులో వేరే క్యాన్సరులు లాగానే జన్యు పదార్థ శరీర నిర్మాణంలో మార్పులు (శాశ్వత) కలుగుతాయి. ఈ మార్పులు మామూలు కణాలను, క్యాన్సరు కణాలుగా అణచి వేసే జన్యువులను నిసైజ్ పరుస్తాయి. ఇంకా నియమబద్దంగా జరుగవలసిన కణ విభజన, ఏర్పాటు, కణక్షీణత వంటి ప్రక్రియలన్నీతారుమారవుతాయి. ఈ జన్యువు ఉత్పరివర్తనాలు ఆకస్మికంగా జరుగవచ్చును. లేదా జన్యుపరమైన కారణాం వికిరణ కిరణాల ప్రభావం, క్యాన్సరుకు కారణ భూతమయ్యే పదార్థాలు వంటి కారణాలతో కూడా ప్రభావితం కావచ్చును. కోహార్ట్ వంటి శాస్త్రజ్ఞుల పరిశోధనలలో జెంజోన్ వంటి పెట్రోలుకు సంబంధించి రసాయన పదార్థాలు, వెంట్రుకలకు వేసుకొనే రంగులు కొన్ని రకాల రక్త క్యాన్సరుకు కారణం కావచ్చునని కొంతమంది రోగుల పై ప్రయోగాల ఫలితాలను పరిశీలించ పిమ్మట, ఈ విధంగా భావిస్తున్నారు.

కొన్ని రకాల రక్త క్యాన్సర్లకు కారణం కొన్ని వైరసులు కూడా కావచ్చు. అయిన రక్త క్యాన్సర్లలో హెచ్.ఐ.వి. వైరస్ కారణం (ఎయిడ్స్ కు కారణం అయిన వైరస్) లేక హ్యుమన్ టి- లింఫాట్రాఫిక్ వైరస్ -1, 2 - దీని మూలంగా టి-కణ రక్త క్యాన్సరు లేక లింఫామా అను క్యాన్సరు వస్తాయి.

ఫాంకానీ రక్తహీనత లో ఆకస్మిక మైలో జీనస్ రక్త క్యాన్సరు వచ్చే అపాయం వుంటుంది.
కారణాలు తెలిసే వరకూ రక్త క్యాన్సరు నివారణ సాధ్యపడదు. కారణాలు తెలిసిన తరువాత కాడా నివారణ అంతగా నియంత్రించడం జరుగదు. ఉదాహరణకు సహజంగా, సూర్యరశ్మి లోని అయనీకరణ వికిరణాల ప్రభావాన్ని ప్రతిదినం వాటి ప్రబావాన్నుంచి కాపాడుకోవడం సాధ్యపడదు. దీని వలన నివారణ పరంగా పెద్దగా ఉపయోగం కూడా లేదు.

No comments:

Post a Comment