Tuesday, 22 March 2016

Typhoid Fever - టైఫాయిడ్ జ్వరము



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Typhoid Fever , టైఫాయిడ్ జ్వరము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వర్షాకాలపు అనారోగ్యాలు ఒక జాబితాలోకి తీసుకురావడం కష్టతరం. టైఫాయిడ్‌ జ్వరం లేదా టైఫాయిడ్‌ అనేది ఈ వ్యవధిలో తీవ్ర ఆందోళనకు గురిచేసే అలాంటి ఒక వ్యాధి.ఒక్క మాటలో చెప్పాలంటే, టైఫాయిడ్‌ అనేది అతిసారం మరియు దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్‌ మరియు టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్‌ లక్షణాల నుండి మరియు గ్రీక్‌ పదానికి అర్థం వచ్చే ''Stupor - స్తబ్దత'' నుండి టైఫాయిడ్‌ అనే పేరు వచ్చినది . ఇది నీటి-జనిత వ్యాధి. ఇది వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మలంతో కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్‌ అనేది సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా ద్వారా సర్వసాధారణంగా సోకుతుంది. ఈ S.టైఫి త్వరితగతిన మరియు భారీసంఖ్యలో వృద్ధి చెందుతుంది. తీసుకున్న ఆహారం మరియు నీటినుండి ఈ బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా వ్యాపించి ప్రేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో ప్రవేశిస్తుంది మరియు దీనిని మలం మరియు రక్తనమూనాల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. పారిశ్రామిక నగరాలయొక్క పేదలుండే ప్రదేశాలలో మరియు సులభంగా నీరు కలుషితమయ్యే ప్రాంతాలలో టైఫాయిడ్‌ ఎక్కువగా ప్రబలుతుంది. కోస్తా తీర ప్రాంతాలలో నివశించే ప్రజలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అధికంగా పిల్లలపై మరియు 5మరియు 19సంవత్సరాల మధ్య వయసుగల యుక్తవయస్కులైన పిల్లలపై మరియు వయసు పైబడిన వృద్ధులపై మరియు రోగనిరోధక శక్తి కోల్పోయిన వ్యక్తులపై దీని ప్రభావం ఉంటుంది.

టైఫాయిడ్‌ వలన 104 డిగ్రీలF వరకు వదిలిపెట్టని జ్వరం, ముచ్చెమటలు, అతిసారం కలుగుతుంది మరియు కొంతమందిలో శరీరం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చును. లక్షణాలు ముదిరి స్పృహ కోల్పోవచ్చును. చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్లీహం మరియు కాలేయం పెరగవచ్చును. ఈ సందర్భంలో, ఇది నాలుగు వారాల వరకు ఉంటుంది మరియు ప్రాణాంతకం కూడా కావచ్చును. కావున, ఈ వ్యాధి బారినపడిన వ్యక్తికి చికిత్సనందించే చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. 'చికిత్స కంటే నివారణే ఉత్తమం' అనే విషయం మనకు తెలిసిందే. ఇలాంటి భయంకరమైన వ్యాధులకు చికిత్సనందించే ప్రయత్నంకన్నా ఇవి ప్రబలకుండా నివారించటానికి తీసుకొనే చర్యలు ఎంతో సులువైనవి. దాదాపు 3%-5% మంది రోగులు తీవ్రంగా ఈ వ్యాధి బారినపడిన తర్వాత ఈ బ్యాక్టీరియాను వ్యాప్తిచేసే వాహకులవుతారు మరియు ఈ అంటువ్యాధి యొక్క నిధిగా వ్యవహరిస్తారు. వీరు తమ మలంలో ఈ బ్యాక్టీరియాను విడుదల చేస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని మరియు నీటిని కలుషితం చేస్తుంది మరియు ఈ వ్యాధి ఇతరులకు సంక్రమింపజేస్తుంది.

  • టైఫాయిడ్ జ్వరములో స్టేజీలు :
ఫస్ట్ స్టేజ్ : ఈ సమయము లో తీవ్రమైన జ్వరము , నీరసము , తలనొప్పి , కడుపు నొప్పి, చర్మముపై దద్దుర్లు ఉంటాయి.

సెకెండ్ స్టేజ్ : బరువు తగ్గిపోవడము , జ్వరము , విరోచనాలు లేదా మందము , కడుపుబ్బడము ఉంటాయి.

థర్డ్ స్టేజ్ : 2-3 వారాలు చికిత్స లేని టైఫాయిడ్ లో మనిషి బాగా నీరసించి , అపస్మారక స్థితిలోనికి జారుకుంటాడు . పేలాపన , తీవ్రమైన జ్వరము ఉండి ... మరణానికి దగ్గరగా ఉంటాడు .

  • రోగ నిర్ధారణ

* వైడాల్ పరీక్ష (Widal test) ద్వారా సాల్మోనెల్లా ప్రతిరక్షకాలను గుర్తించడం జరుగుతుంది.
* రక్తం మరియు మల పరీక్ష (Blood and Stool culture) ద్వారా సాల్మోనెల్లా క్రిములను ప్రయోగశాలలో వృద్ధిచెందించి గుర్తిస్తారు.

నివారణ వ్యాక్సిన్లు లభ్యమవుతున్నప్పటికీ, ఇవి 60-80%మాత్రమే సురక్షితం మరియు ముఖ్యంగా ఈ వ్యాధి ప్రబలినప్పుడు ఉపయోగపడతాయి. మలవిసర్జన తర్వాత మరియు ఆహారాన్ని హ్యాండిల్‌ చేసేముందు ఆరోగ్య సబ్బుతో మీ చేతులు కడుగుకోవటం అనేది ఈ అంటువ్యాధిని మరియు మరిన్ని ఇతర రోగాలను నివారించటానికి దోహదపడటంలో ఎంతో మేలు చేస్తుంది. బయటనుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులను కడుగుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి అలవాట్లు చిన్నతనం నుండే అలవడితే ఇంతకన్నా మంచిదేముంటుంది. మానవ మల మూత్రాలు ఆహారం మరియు త్రాగునీటితో కలిసిన ప్రదేశాలలో టైఫాయిడ్‌ ప్రబలుతుంది. సరిగ్గాలేని లేదా సక్రమంగా వండని ఆహారం మరియు పచ్చి ఆహారంను తినుట లేదా పచ్చిపాలను త్రాగుటవలన ఈ వ్యాధి విస్తరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మరియు ఈ వ్యాధి ప్రబలినప్పుడు త్రాగునీటిని తప్పనిసరిగా కాయాలి మరియు తెరచి ఉన్న పాత్రలనుండి త్రాగునీటిని త్రాగకుండా ఉండటం ఒక మంచి ఆలోచన అవుతుంది.

మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవటం అనేది రోగాలకు దూరంగా ఉండే అత్యంత సులభమైన మార్గం. అసలు మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచే మంచి మార్గం. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవటం మరియు బ్యాక్టీరియా నుండి విముక్తి అవటం. సురక్ష ద్వారా తందురుష్టి.

మీ ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి ఒక మంచి హెల్త్‌ సోప్‌ మరియు మీ శుభ్రమైన చేతులు.

చేయవల్సినవి మరియు చేయకూడనివి:

* పచ్చి లేదా సరిగ్గా వండని ఆహారానికి దూరంగా ఉండండి.
* వ్యాధిసోకిన వ్యక్తితో ఆహారాన్ని పంచుకోవద్దు.
* బయటినుండి వచ్చిన తర్వాత మరియు టాయ్‌లెట్స్‌ తర్వాత మంచి ఆరోగ్య సబ్బుతో మీ చేతులను మరియు ముఖాన్ని కడుక్కోండి.
* గోళ్లు కొరికే అలవాటును మానండి.
* యాక్టివ్‌ 5 లాంటి రక్షిత పదార్థాలను కలిగిన సబ్బు సాధారణ సబ్బుకు విరుద్ధంగా అదనపు రక్షణను ఆఫరు చేస్తున్నది.

చికిత్స : పెద్దవారికి ->

Tab.Ciprofloxin(500mg) +Tinidazole(600mg) -- combination two times/day for 7-10 days .
Tab.paracetamol 500mg three times / day for fever controle 7-10 days,
Rest for10 days.

1960 లో ఓరల్ రిహైడ్రేషన్‌ చికిత్స కనుగొన్న తర్వాత టైఫాయిడ్ జ్వరము , విరోచనాలు వలన చనిపోయేవారి సంఖ్య బాగా తగ్గిపోయినది . మంచి అధునాతన యాంటీబయోటిక్స్ అందుబాటులోనికి రావడము వలన దీని చికిత్స చాలా సునాయాసము అయిపోయినది . సమయానికి యాంటీబయోటిక్స్ వాడడము వలన సుమారు 99% మరణాలు నుండి బయటపడడము జరుగుతూ ఉన్నది .

సాదారణము గా సిఫ్రోఫ్లోక్షాసిన్‌ , 3వ తరము సెఫలోస్పోరిన్స్ బాగా పనిచేస్తాయి. 2 వారాలు పాటు చికిత్స చేయాలి .

No comments:

Post a Comment