Thursday 17 March 2016

Hip exercise is good Urine problems - కటి వ్యాయామం-మూత్ర సమస్యలు ,


  • imagie : courtesy with google
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కటి వ్యాయామం-మూత్ర సమస్యలు , Hip exercise is good Urine problems- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మూత్రాన్ని ఆపుకోలేకపోవటం, మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావటమనేది మహిళల్లో తరచుగా కనిపించే సమస్యే. అయితే ఇలాంటిది పురుషుల్లో కనిపిస్తే చాలామంది ప్రోస్టేట్‌ సంబంధ సమస్యగా భావిస్తుంటారు. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. మూత్రం ఆపుకోలేని మహిళలకు కటి భాగం కండరాలు బలోపేతం కావటానికి ప్రత్యేకమైన వ్యాయామాలను వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి స్త్రీలకు మాత్రమే కాదు ఇలాంటి సమస్యతో బాధపడే పురుషులకూ మేలు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బటయపడింది. ఇవి మందులతో సమానంగా పనిచేస్తున్నట్టూ వెల్లడైంది. మూత్రాశయం అతిగా స్పందించే (ఓవర్‌యాక్టివ్‌ బ్లాడర్‌) గుణం గలవాళ్లు మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాల్సిందే. ఇది క్రమంగా మూత్రం ఆపుకోలేకపోవటానికీ దారితీస్తుంది. వీళ్లు ప్రవర్తనకు సంబంధించిన మార్పులను పాటించటంతో పాటు అవసరమైతే మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. మందులు వేసుకుంటున్నప్పటికీ మూత్ర సమస్యలతో బాధపడుతున్న మధ్యవయసు, వృద్ధులపై ఇటీవల అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. అప్పటికే వేసుకుంటున్న మందులకు తోడు అదనంగా ఆక్సీబుటీనిన్‌ మందు వేసుకోవటం గానీ ప్రవర్తన పరమైన మార్పులను గానీ ఎనిమిది వారాల పాటు పాటించాలని వీరికి సూచించారు. ఈ పద్ధతుల్లో సాయంత్రం వేళల్లో ద్రవాలను తగ్గించటం, రాత్రిపూట మూత్రం వస్తున్నట్టు అనిపించినపుడు దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయటం, కటి భాగం కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వంటివి ఉన్నాయి. ఈ వ్యాయామాల్లో భాగంగా.. కటి భాగం కండరాలు సంకోచించేలా రెండు నుంచి పది సెకన్ల పాటు గట్టిగా బిగపట్టి వదిలేయాలని చెప్పారు. ఈ వ్యాయామాన్ని రోజుకి 45 సార్లు (మొత్తం మూడు విడతల్లో) చేయాలని సూచించారు. మందులు వేసుకున్నవారితో పోలిస్తే వ్యాయామం చేసినవారిలో రాత్రిపూట మూత్రానికి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో మొత్తమ్మీద 90 శాతం మంది కొత్త చికిత్సతో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పటం విశేషం. మూత్రాశయ నియంత్రణ సమస్యలు గల పురుషుల్లో కటి వ్యాయాయం ప్రభావాలపై చేసిన తొలి అధ్యయనం ఇదేనని ఎమోరీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ తియోడోర్‌ ఎం.జాన్సన్‌ వివరిస్తున్నారు. ఈ సమస్యలకు మందులను ఇస్తున్నప్పటికీ వీటితో నోరు ఎండిపోవటం, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తుండటంతో చాలామంది మధ్యలోనే మానివేస్తుంటారు. కాబట్టి తేలికైన, ఖర్చుతో పనిలేని ఈ వ్యాయామం చేయటం మంచిదని జాన్సన్‌ సూచిస్తున్నారు.

Kegel ఎక్సర్సైజేస్- పురుషులకు * Kegel ఎక్సర్సైజేస్:

Kegel వ్యాయామాలు కటి కండరాలు శక్తివంతం సహాయపడతాయి. Kegel వ్యాయామాలు బాగు లేదా మూత్ర ఆపుకొనలేని ఉన్న ప్రజలకు మూత్రాశయమును నియంత్రణ (మూత్రం లీకేజ్) మెరుగు కు సహాయపడవచ్చు. ఈ వ్యాయామాలు కాంట్రాక్టు (కష్టతరం) మరియు కటి కండరాలు వదులు చేయడం ద్వారా పూర్తి చేసారు. Kegel వ్యాయామాలు కూడా కటి ఫ్లోర్ కండరము శిక్షణ లేదా కటి ఫ్లోర్ వ్యాయామాలు అని పిలుస్తారు. అవి కటి కండరాలు శక్తివంతం సహాయం చేయడానికి సరిగ్గా మరియు క్రమం తప్పకుండా చేయాలి.

కటి కండరాలు ఏమిటి?కటి కండరాలు మీ కటి (హిప్) ఎముకలు మధ్య ప్రదేశం జోడించబడినవి. ఈ కండరాలు మీ కటి అవయవాలు స్థానంలోఉంచడాఅనికి సహాయపడుతుంది .. కటి అవయవాలు ఉదాహరణలు మూత్రాయమును (మూత్రం ఉంది) మరియు పురీషనాళం (ప్రేగు ఉద్యమాలు ఉన్నది) ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కటి కండరాలు నిర్వీర్యం చేయడానికి కారణం కావచ్చు. ఈ పరిస్థితులు కొన్ని-- అధిక బరువు మోయడము , వయస్సు మీదపడిన, లేదా ప్రోస్టేట్ శస్త్రచికిత్స మొదలగునవి . మీ కటి కండరాలు బలహీనంగా మారి మీరు మూత్రం ఆపుకొనలేని లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు.

No comments:

Post a Comment