Friday 18 March 2016

Gynaecomastia - మగవారిలో స్తనాలు , పురుషులలో రొమ్ములు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Gynaecomastia ,మగవారిలో స్తనాలు , పురుషులలో రొమ్ములు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మగవారిలో స్తనాలు పెరిగితే అసహ్యముగా ఉంటుంది . ఎబ్బెట్టుగా కనిపించే వాటిని భరించడం కష్టమే . పురుషులలో స్తనాలు రావడమనే సమస్యను Gynaecomastia లేదా Hypertrophi of Male Breast అని అంటారు. మగవారి రొమ్ముల్లో ఆడవారికి మల్లే పాలు స్రవించని గ్రంథులు, నాళాల సంఖ్య ఎక్కువ అవడంవలన అలాంటి సమస్య వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డలలో తల్లి స్త్రీ హార్మొనుల ప్రభావము వలన కనిపించి దానంతటదే తగ్గిపోతుంది . పెద్దవారిలోనూ , యవ్వనము లోనూ ఈ పరిస్థితి ఏదో ఒక రకమైన వ్యాధి లేదా మారిన శరీర ఆరోగ్య పరిస్ఠితి కారణము . యవ్వనము లో ఉబ్బకారము వలన వచ్చి నది కాకపోతే కొద్ది సం.లలో దానంతటదే తగ్గిపోతుంది .

ఎలా వస్తుంది ?(physiology) : 
ఇది ఎందుకు , ఎలా వస్తుందో పూర్తిగా తెలియదు . లింగ సంబంధిత హార్మోనుల అసమతుల్యము వలన , ఈస్ట్రొజన్‌ , యాండ్రోజన్‌స్ నిస్పత్తి లో తేడాలు రొమ్ము కణాలపైన ప్రభావము చూపడము వలన కలుగుతుందని శాస్త్రజ్ఞులు అంచనా.

కారణాలు : 

  • ఈస్ట్రోజన్ అనే స్ర్తి హార్మోన్లవలన కూడా ఈ సమస్య వస్తుంది. ఇది ఎక్కువగా 13-17 సంవత్సరాల మధ్య ఉండే టీనేజీ మగపిల్లలలో ఎక్కువగా వస్తుంది. దీన్ని ప్యూబర్టల్ గైనెకోమాస్టియా అని అంటారు. 40- 50 సం.ల మధ్య వచ్చేదాన్ని సైలెంట్ గైనెకోమాస్టియా అంటారు.
  • అలాగే కొన్నిరకాల వినాళ గ్రంథుల వ్యాధుల్లో స్ర్తిలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం,
  • పురుష ఆండ్రోజెన్స్ పనితీరు తగ్గడం ఉంటుంది.కొన్ని వ్యాధులలో ఇది తగ్గుతుంది . అవి
  • హెపటిక్ సిర్రోసిస్ (లివర్ వ్యాధి),
  • వృషణాలలో , పిట్యూటరీ గ్రంథులు లో కణతలు (Tumours),
  • లంగ్ కేన్సర్- అలాగే ,
  • పురుషులలో ప్రొస్టేట్ కేన్సర్,
  • వృషణాల వ్యాధులు వచ్చినప్పుడు ,
  • ఈస్ట్రోజెన్ చికిత్సగా ఇచ్చినప్పుడు కూడా మగవారిలో రొమ్ములు పెరుగుతాయి.
  • అధిక బరువు వల్ల రొమ్ముభాగంలో కొవ్వు పేరుకుపోవడం,
  • ఆడవారిలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ మగవారిలో ఎక్కువగా ఉండటం,
  • టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువ ఉండటం,
  • కొన్ని రకాల మందులు వాడకం-- spironolactone , Digoxin , Furosemide etc.,
  • కొన్ని జన్యుపరమైన వ్యాధులు,

చికిత్స : 
బ్రెస్ట్ ఎత్తుగా కనిపించడము దేనివలన వచ్చినదో తెలుసుకోవాలి. కొంతమందిలొ కొవ్వుకణాలు (fat) చర్మము కింద పెరగడము , లేదా చాతి కండరాలు అతిగా పెరగడము (muscle hypertrophy due to exercise) అయివుండవచ్చునేమో. కొంతమందిలో వంశపారంపర్యము (heriditary) అయితే ఈ గైనెకోమాస్టియా సర్జరీ ద్వారా తగ్గించుకోవచ్చు. కొన్ని మందుల ద్వారా కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. సూడోగైనకోమాటియా అయితే అహారనియమాలు , వ్యాయామము ద్వారా తగ్గించేందుకు ప్రయత్నించాలి లేదా లైపోసక్షన్‌ ని వినియోగించవచ్చును .. ప్లాస్టిక్ సర్జరీ విధానాన్ని కూడా అవలంభించ వచ్చు. దగ్గరలోని అండ్రాలజిస్ట్ డాక్టర్ వద్దకువెళ్ళి ఇతర ఏ వ్యాధులేమైనా ఉన్నాయేమో పరీక్షలు చేయించుకోండి.

మందులు :

  • కారణము తెలుసుకొని మందులు వాడాలి .
  • ఏవైనా మందులు వాడుతున్నట్లైతే వాటిని వాడడము ఆపాలి .
  • ఈస్ట్రోజన్‌ రెసిప్టార్ మాడ్యులేటర్ ... tamoxifen , clomiphene ,
  • Testosterone ని వాడవచ్చు ను .
  • aromatase inhibitors ... anastrozole .
  • Liposuction ,
  • Excision of breast tissue .
  • radiationa therapy

  • గైనకోమాస్టియా లో తోడు (co-existing) గా ఉండే అనారోగ్యసమస్యలు :
హార్మొనులు ఎచ్చుతగ్గులు మూలాన ఈ క్రింది సమస్యలు తలెత్తవచ్చు ........

హైపోగొనాడిజం (Hypogonadism) : గైనకోమాటియాతో కూడా ఉండవచ్చును . పురుష హార్మోనులు ... టెస్టోస్టిరాన్‌ తగ్గి పురుష బీజాలు పరిమాణము , పెరుగుదల తగ్గుముఖము పడును .

కణితి లు పుట్టడం (Tumours) : వృషణాలలోను , మెదడు పిట్యూటరీ లోను ట్యూమర్స్ ఉండవచ్చును .

Hypothyroidism : థైరాయిడ్ గ్రంది పనితీరులో తగ్గుదల .

కిడ్నీ ఫైల్యూర్ : మూత్రపిండాలు పనితీరులో లోపాలూ ఉండవచ్చును .

లివర్ ఫైల్యూర్ : కాలేయము దాని పనితనము కుంటుపడే పరిస్థితి.

No comments:

Post a Comment