Thursday 10 March 2016

Cholesterol role in Muscle improovement - కండర నిర్మాణము-మరమ్మత్తులో కొలెస్టిరాల్ పాత్ర



  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Cholesterol role in Muscle improovement, కండర నిర్మాణము-మరమ్మత్తులో కొలెస్టిరాల్ పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    కొలెస్ట్రాల్‌తో నష్టమే కాదు, లాభాలూ ఉన్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కండర నిర్మాణాలు పెరగటానికీ, బలహీనపడిన కండరాల మరమ్మతులోనూ కొలెస్ట్రాల్‌ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు గుర్తించారు. కొలెస్ట్రాల్‌ మైనంలాంటి కొవ్వు పదార్థం. ఇది శరీరమంతటా పరచుకుని ఉంటుంది. మనం తీసుకున్న కొవ్వు నుంచి కాలేయం కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. ఒంట్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు ఎక్కువైతే గుండెజబ్బు సహా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే.. మితంగా ఉన్నంత వరకూ దీనితో పలు ఉపయోగాలు ఉన్నట్లు టెక్సాస్‌ ఏఎమ్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 60-69 ఏళ్ల మధ్య వయసున్న 55 మంది స్త్రీ పురుషుల్ని 12 వారాలపాటు పలురకాల వ్యాయామాలు చేయించారు. ఆహారం ద్వారా కొలెస్ట్రాల్‌ తీసుకున్న వారిలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా.. కండర సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. కొలెస్ట్రాల్‌ నిల్వలు తక్కువగా ఉంటే.. వ్యాయామం వల్ల కండర సామర్థ్యం పెరగటాన్ని తగ్గిస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌ వాపు తరహా స్పందనలను ప్రేరేపిస్తుంది. అయితే.. గుండె వంటి ప్రాంతంలో ఈ రకం ఇన్‌ఫ్లమేషన్‌ అంతగా క్షేమకరం కాదు, కానీ కండర నిర్మాణానికి మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో కొలెస్ట్రాల్‌ చక్కగా ఉపయోగపడుతున్నట్లు తేలింది.

No comments:

Post a Comment