టమోటాలు కూరకు రంగు, రుచి ఇవ్వడమే కాదు, వయసు తాలూకు ప్రభావం పడకుండా మనని చాలా కాపాడుతాయని పరిశోధకులంటున్నారు. అంతే కాదు... రోజు మనకు కావలసిన విటమిన్లలో చాలా వరకు టమోటా అందిస్తుంది. పైగా కాన్సర్ వ్యాధి రాకుండాను నివారిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధికి కాన్సర్ సోకకుండా టమోటా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణుల అభిప్రాయము. టమోటాలలో ఉండే లైకోపిన్ అనే యాంటి ఆక్సిడెంట్ శరీరంలో హానికారకాలైన ప్రీరాడీకల్స్ లేకుండా చూస్తుంది. ఒక్క టమోటాలలోనే కాదు...నహజమైన రంగులున్న పండ్లు, కూరగాయలన్నీ కూడా వ్యాధుల తాలూకు నష్టం కలగకుండా నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా పచ్చి టమోటాలలో ఈ లైకోపిన్ ఎక్కువగా వుంటుంది. దాంతో యాపిల్ పండుకన్నా ఎక్కువ ఫలితం టమోటాల వల్ల కలుగుతుంది.
కంటిలోని మాక్యులా ఆరోగ్యంగా ఉండేందుకు, క్యాన్సర్ల నివారణకు లైకోపేన్ బాగా సహకరిస్తుంది. ఇది టమాటాల్లో సమృద్దిగా ఉంటుంది. తర్వాత పుచ్చకాయ, జల్దరు (అఫ్రికాట్ ) పండ్ల వంటివాటిలోనూ లభిస్తుంది.
కంటిలోని మాక్యులా ఆరోగ్యంగా ఉండేందుకు, క్యాన్సర్ల నివారణకు లైకోపేన్ బాగా సహకరిస్తుంది. ఇది టమాటాల్లో సమృద్దిగా ఉంటుంది. తర్వాత పుచ్చకాయ, జల్దరు (అఫ్రికాట్ ) పండ్ల వంటివాటిలోనూ లభిస్తుంది.
No comments:
Post a Comment