ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతానలేమికి కారణాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
-ఆధునికత పెరిగిన కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, పొగతాగడం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా సమస్యల కు కారణమవ్ఞతున్నాయి. అలాంటి వాటిలో సంతానలేమి కూడా ఒకటి. ప్రతి ఇరవై జంట ల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. అందుకే సంతాన సాఫల్యత కేంద్రా లకు వచ్చే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సాధారణంగా పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఏడాదిలోపైతే 75 శాతం అవకాశం ఉంటుంది. 85 నుంచి 90 శాతం మందిలో పెళ్లయిన రెండేళ్లలోగా గర్భం రావచ్చు. రానియెడల ఆ స్థితిని ప్రాధమిక సంతానలేమి (primary ifertility) అంటాము .
పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?పెళ్లవగానే అందరూ ఎదురుచూసే తీపి కబురు కొత్త పెళ్లికూతురు నెల తప్పడం. కొంతమంది ఈ కబురు త్వరగా చెప్పేస్తారు. మరికొంతమందికి ఇలాంటి కబురు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు .కారణము తెలియదు .
ఎవరు కారకులు?
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. ఇటువంటి కేసుల్లో 33 శాతం మగవారు, 33 శాతం ఆడవారు కారణం కాగా మిగిలిన 34 శాతానికి కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు. ప్రతి ముగ్గురు మగవారిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దీనివల్ల కొంతమందికి సంతాన సామర్ధ్యం ఉండడం లేదు. వేగంగా వాహనాలు నడపడం, అతిగా మద్యం సేవించడం, తినకూడనివి తినడం వంటి వాటివల్ల మగవారిలో పునరుత్పత్తి శక్తి దెబ్బతింటోంది. కొంతమంది మగవారిలో 35 సంవత్సరాలకే వీర్యంలో క్వాలిటీ తగ్గిపోతోంది. అటువంటి వారికి పిల్లలు పుట్టించే సామర్ధ్యం క్షీణించిపోతుంది. కొన్ని పరిశ్రమల్లో పనిచేసే మగవారి వృషణాలు ఎక్కువ ఉష్ణానికి గురికావడం వల్ల వారి వీర్యం పలుచబడిపోయి సంతానం పొందే సమర్థత కోల్పోతున్నారు. చిన్నతనంలో గవదలు వంటి రోగాల వల్ల శాశ్వతంగా వృషణాలు హానికి గురవుతుంటాయి.
మగవారిలో వంధత్వానికి కారణాలు:
* ఏదో ఒక రకమైన అనారోగ్యం
* వైద్య చరిత్ర (గవద బిళ్లలు, సుఖరోగాల వంటివి)
* శస్త్రచికిత్సల చరిత్ర (వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా మరమ్మతు, శస్త్రచికిత్స వంటివి)
* వృత్తిపరమైన ప్రమాదాలు ( అధికంగా వేడికి గురికావడం, విష పదార్థాల ప్రభావానికి లోను కావడం వంటివి)
* ఔషధాలు (కీమోథెరపీ)
* పొగతాగడం, మద్యం సేవించడం.
ఆడవారిలో కారణాలు:
*వయసు కారణంగా చాలామందిలో సంతానం పొందే సమర్థత కోల్పోతుంటారు. వయసు పెరుగుతుంటే ఆడవారికి సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. వైద్య చికిత్స చేయించినా ఇటువంటి వారిలో సత్ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తక్కువ వయసుగల యువతుల్లో అండాశయం పలుచగా ఉంటుంది. ఫలితంగా సంతానం కలిగే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి.
* గైనకాలజీ పరిస్థితులు
* అండాశయం సరిగా పనిచేయలేకపోవడం, రుతుస్రావం బాగా తగ్గిపోవడం, సెర్వికల్ మ్యూకస్ లోపాలు, యుటిరిన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్... మొదలైనవి.
* సంధాన సమస్యలు
* క్రమరహిత రుతుస్రావం
* పెల్‌విక్ ఇన్‌ఫెక్షన్స్ (ప్రస్తుతం లేదా పూర్వం)
* టి.బి (క్షయ) వంటి ప్రస్తుత రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
90 శాతం స్త్రీలు ఏడాదిలోపుగానే గర్భం ధరిస్తారు. క్రమం తప్పకుండా శృంగార జీవితం గడిపే దంపతుల విషయంలో 95 శాతం స్త్రీలు రెండు సంవత్సరాలలోపు గర్భం ధరిస్తారు. ఈ కాల వ్యవధిలో సంతానం కోసం చికిత్స అవసరం లేదు. ప్రయత్నించినా సాధారణంగా వైద్య చికిత్సకు వైద్యులు ఇష్టపడరు. ఈ సమయం దాటితే స్పెషలిస్టుని సంప్రదించడం మంచిది.
వైద్యుని దగ్గరకి ఎప్పుడు వెళ్లాలి?
*పెళ్లైన మూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలుగకపోతే ,
*స్త్రీ వయసు 38 సంవత్సరాలు దాటితే ,
*మగవారిలో తక్కువ లేదా అసాధారణ వీర్య కణాలు ఉన్నప్పుడు.
*వంధత్వానికి కారణాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వైద్యచికిత్స ప్రారంభిస్తారు.
కొన్ని ముఖ్య సంగతులు:
పిల్లలు కలుగని దంపతుల్లో 15శాతం మందిలో లోపానికి ఒకటికి మించి కారణాలు ఉంటాయి. మగవారికి వీర్యపరీక్ష ప్రాథమిక పరిశోధనగా చేయిస్తారు. వీర్యం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోతే రెండు లేదా మూడు నెలల కాలవ్యవధిలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన వైద్యచికిత్సలు అవసరం మేరకు అందిస్తారు. ఆడవారి విషయంలో వైద్య పరీక్షలు కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. రుతుచక్రంలో వేర్వేరు సమయాల్లో అనేక హార్మోన్ల స్థాయిని కనుగొంటారు. దాన్ని బట్టి అండాశయంలో అండం విడుదల లోపాలను తెలుసుకుంటారు. సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే ఆడవారిలో 20 శాతం మందికి అండాశయ సమస్యలు ఉంటాయి. క్రమ పద్ధతిలో అండం విడుదల కాకపోతే హార్మోన్ల చికిత్స చేస్తారు. ఆడవారికి సెర్వికల్ మ్యూకస్ దళసరిగా తయారై ఉండడం, మగవారికి శీఘ్రస్కలనం, మగతనం లేకపోవడం లేదా తదితర శారీరక అసాధారణాలు ఉంటే స్త్రీ సెర్విక్సులోకి వీర్యాన్ని పంపుతారు.
ఇటువంటి చికిత్స ఆరోగ్యకరమైన ఫెలోపియన్ ట్యూబులు గల ఆడవారికే వీలవుతుంది. గర్భం ధరించే అవకాశాలు పెంచేందుకు స్త్రీలకు ఫెర్టిలిటి ఔషధాలు ఇస్తారు. దీనివల్ల అండాశయం నుండి కనీసం ఒక అండమైనా విడుదలయ్యేందుకు ఉత్తేజం కలుగుతుంది. కొంతమందికి అండంతో వీర్యకణాలు ఫెలోపియన్ ట్యూబ్‌లో సాధారణ పరిస్థితిలో కలవడం చాలా కష్టం లేదా అసంభవం కావచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా శరీరానికి వెలుపల ఒక గ్లాసు డిష్‌లో వీర్యం, అండం ఫలదీకరణ చెందిస్తారు. దీనినే కల్చర్ డిష్ అంటారు. సంతానం పొందేందుకు ఇంకా ఎన్నెన్నో అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. కేసును బట్టి వైద్య నిపుణులు తగిన పద్ధతి ఎన్నుకుంటారు.
ఇంకా కొన్ని కారణాలు :
హార్మోన్లలో తేడాలున్నా,
గర్భాశయంలో అనుకూల పరిస్థితులు లేకపోయినా గర్భం నిలవదు.
అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయకున్నా,
లోపభూయిష్ఠ అండాలు విడుదలైనా,
ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అంతేకాదు ,
క్షయ, వ్యాధులుంటే ,
ఎండోమెట్రియాసిస్ వ్యాధులుంటే ,
గర్భా శయం, దాని ముఖద్వారంలో చిక్కని ద్రవాలు ఉత్పత్తి అయి అడ్డు యేర్పడినా.
ఈ ద్రవాల గాఢతలో చాలా మార్పులు ఉం టాయి. అందువల్ల వీర్యకణాలు లోపలికి రాలేవు . పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉం డటం ఎక్కువ మందిలో కనిపి స్తుంది. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ వీర్యం లో 60 మిలియన్ల కంటే తక్కువ శుక్రకణాలు ఉంటే సం తానం కల గడం కష్టమవ్ఞతుంది. కాబట్టి సంతానలేమి సమస్య ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరికీ పరీక్ష చేస్తే తప్ప లోపం ఎవరిలో ఉందో, సమస్యకు పరిష్కారం ఏమిటో తేలదు.
ఫెలోపియన్ ట్యూబ్‌లో లోపం ఉన్నప్పుడు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సరిచేస్తారు. అలా వీలుపడకపోతే ఐవిఎఫ్ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చేయిస్తారు. ఈ విధానాన్నే టెస్ట్ ట్యూబ్ పద్ధతి అంటారు. గర్భాశయ ముఖద్వారం లో సమస్యలుంటే ఐయుఐ పద్ధతి ద్వారా కృత్రిమంగా వీరాన్ని సరాసరి గర్భాశయ ముఖద్వారం వద్దకు పంపిస్తారు.
వీర్యకణాలు అతి తక్కువ ఉన్న యెడల ఇక్సీ టెక్నిక్ ద్వారా సంతానప్రాప్తి కలిగించవచ్చు. వీర్యంలో కణాలు లేకుంటే నేరుగా బీజము నుండి కణాలను తీసే పద్ధతిలో సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. సాదారణముగా వీర్యకణాలు 60,000,000/క్యూబిక్ మి.మీ. ఉండాలి .
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -భయం కూడా ఓ జబ్బే , Phobia is also a Disease- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
క్షణ క్షణం భయం.. భయంగా చాలా మంది గడుపుతుంటారు. ప్రతిదానికి ఏదో భయం వారిని పీడిస్తుంటుంది. మాకు తెలిసిన ఒక కుర్రాడు నవీన్. బి.టెక్ పాసయ్యాడు. మంచిర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని మల్టీ నేషనల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. స్టేషన్ వరకు వెళ్ళి రైలు ఎక్కడానికి భయపడి ప్రయాణం రద్దు చేసుకున్నాడు. దూరప్రాంతాలలో ఉద్యోగం చేస్తే రైలు ఎక్కాల్సి వస్తుందన్న భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఉన్న ఊరిలోనే చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు.
వైదేహి అమెరికాలో ఎం.ఎస్. చేసింది. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించింది. పెద్దల బలవంతంమీద అక్కడే ఉద్యోగం చేస్తున్న తెలుగువారి అబ్బాయిని పెళ్ళి చేసుకుంది. మొదటి రాత్రి విపరీతంగా భయపడి విచిత్రంగా ప్రవర్తించింది. మానసిక వైద్యునికి చూపిస్తే ఆమె పానిక్ డిజార్డర్ (కారణం లేని భయం)తో బాధ పడుతున్నట్టు చెప్పాడు. దీంతో భర్త ఆమెను ఒదిలిపెట్టేశాడు.
- భయాలు పలురకాలు : ఉదాహరణ ->
ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.
- ఏక్రోఫోబియా (Acrophobia) : ఎత్తైన ప్రదేశాలంటే భయం
- క్లాస్ట్రోఫోబియా (Claustrophobia): ఒంటరితనం అంటే భయం.
- నెక్రోఫోబియా (Necrophobia) : చావు అంటే భయం
- పైరోఫోబియా (Pyrophobia) : అగ్గి అంటే భయం
- హీమోఫోబియా (Hemophobia) : రక్తం అంటే భయం
- హైడ్రోఫోబియా (Hydrophobia) : నీరు అంటే విపరీతమైన భయం
భయం మనిషి సహజ లక్షణం. ప్రమాదకర వ్యక్తులు, జంతువులు, సంఘటనలు ఎదురైనప్పుడు ప్రతివారు భయపడతారు. అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా భయపడుతూ ఉంటారు. ‘‘క్షణక్షణం భయం భయం… బ్రతుకంతా చీకటిమయం’’ అన్నట్టు వ్యవహరిస్తుంటారు. పులికంటె గిలి (భయం) ప్రమాదమన్నట్టు చిన్న విషయాలకే వణికి పోతుంటారు.
మరణం మనిషికి ఒకసారి వస్తే అనవసర భయస్తులు ప్రతి నిత్యం చచ్చి బ్రతుకుతుంటారు. ప్రాణాంతక వ్యాధుల కంటే భయం ఎక్కువగా బాధిస్తుంటుంది. మనిషిలో స్వతహాగా ఉండే శక్తియుక్తుల్ని, మేధా సంపత్తిని భయం విచ్ఛిన్నం చేస్తుంది. అన్నిటికీ అవరోధంగా మారుతుంది.
కాదేదీ కవిత్వకనర్హం అన్నమాట భయానికి వర్తిస్తుంది. బల్లి, నల్లి, గాలి, నీరు లాంటి చిన్నచిన్న విషయాలకు భయపడేవారున్నారు. భయం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వైఫల్యం చెందుతామన్న భయం విజయానికి అవరోధంగా మారుతుంది. లక్ష్య సాధనకు అడ్డంకిగా పరిణమిస్తుంది. ఆరోగ్యంపట్ల పెంచుకునే భయం లేని జబ్బులను గూర్చి ఆలోచింపచేస్తుంది. మరణభయం ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. నష్టాలను గూర్చిన భయం ఆందోళనకు దారి తీస్తుంది.
భయాలన్నింటికంటే అపజయం పాలవుతామన్న భయం ప్రగతికి అవరోధంగా నిలుస్తుంది. ప్రతికూల భావాలను పెంచి పోషిస్తుంది. అధిక శాతం విద్యార్థులు పరీక్షలంటే భయపడుతుంటారు. ఈ భయం ముదిరి డిప్రెషన్, ఆత్మహత్యలకు దారి తీస్తుంటుంది. అలాగే ఒక్కో విద్యార్థి ఓక్కో సబ్జెక్టును చూసి భయపడుతుంటారు. ఇలాంటి భయం వారి ఉన్నత చదువులకు అడ్డంకిగా మారుతుంది. లెక్కల భయం ఇంజనీరుని కానివ్వదు. కప్పలు, పాములను కోయాల్సి వస్తుందన్న భయం మెడిసన్ చదవనివ్వదు. ఈ భయం ముదిరితే ఫోబియగా మారుతుంది.
నిజానికి భయం, ధైర్యం లాంటివి అలవాటుగా వస్తాయి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న నమ్మకాలు, విశ్వాసాలు, అనుభవాలే ఇందుకు మూలలుగా ఉంటాయి. పెంపకలోపం, పరిసరాల ప్రభావం భయాన్ని పెంచి పోషిస్తాయి. కొంతమంది బాల్యపు అనుభవాలవల్ల భయానికి గురవుతారు. అధిక శాతం మందిలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలే భయాన్ని రేకెత్తిస్తుంటారు. బాల్యంలో అన్నం తినని పిల్లల్ని బూచోడు వస్తాడు అంటూ భయపెడతారు. అల్లరి చేస్తే స్కూలుకు పంపేస్తా. హాస్టల్లో పడేస్తా… డాక్టర్‌చేత సూది వేయిస్తా అంటూ భయపెడుతుంటారు. సైకిల్ తొక్కాలంటే పడిపోతావని, ఈత నేర్చుకోవాలంటే మునిగిపోతావని భయాన్ని రుద్దుతారు. అలాగే ప్రతికూలంగా మాట్లాడి పిల్లల్లో పిరికిమందు పోస్తుంటారు. మా బాబుకి ఎక్కాలే రావు. వాడు ఇంజనీరింగ్ ఏమి చేస్తాడు అంటూ ఇతరుల ముందు హేళన చేస్తారు. అలాగే మా అమ్మాయి బొద్దింక అంటే ఆమడ దూరంలో ఉంటుంది. ఇక డాక్టర్ కోర్సు ఎలా చేస్తుందంటూ ఆట పట్టిస్తుంటారు. ఇలాంటి మాటలు పిల్లలను భయస్తులుగా మారుస్తాయి. చాలామంది తల్లిదండ్రులు భయపెడితే బాగుపడతారని ఆలా చేస్తుంటారు. భయపెట్టడానికి జాగ్రత్త పర్చడానికి తేడా తెలియక అలా చేస్తుంటారు.
అయితే భయాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. భయం, ఫోబియాలకు గురయ్యేవారు వాస్తవాలను ఆలోచించాలి. మిగిలిన వారికి లేని భయం తమకే ఎందుకుందో విశే్లషించుకోవాలి. సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నెమ్మది, నెమ్మదిగా భయాన్ని ఎదుర్కోవడంలో సాధన చేయాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం పొందాలి.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఫుడ్ అలెర్జీ , Food Allergy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఫుడ్ అలెర్జీకి కారణం కనుక్కోపోతే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఫుడ్ అలెర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు లాంటి చిన్న ఇబ్బందులే కాక శ్వాససంబంధిత సమస్యల వంటి పెద్ద కష్టాలు కూడా వస్తాయి. పల్లీలు తినడం వల్ల కూడా కొందరికి అలర్జీ వస్తుంది. కొన్ని రకాల ఫుడ్ అలెర్జీలు కుటుంబ వారసత్వంగా వస్తాయి. అందుకే వీటి గురించి కొంచెమైనా తెలుసుకుని ఉండటం మంచిది. తొంభైశాతం ఫుడ్ అలర్జీలు ఎనిమిదిరకాల ఆహారపదార్ధాలు వల్ల వస్తాయి. అవేమిటంటే పాలు, గుడ్డు (గుడ్డులోని తెల్లసొన), పల్లీలు, వాల్‌నట్స్, జీడిపప్పు, ఆల్మండ్, చేపల్లో ... షెల్ ఫిష్ అంటే అంటే పీతలు, రొయ్యలు, ఆహారధాన్యాల్లో గోధుమలు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాలు వల్ల కూడా ఒక్కొసారి అలర్జీలు వస్తాయి. ఫుడ్ అలర్జీల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడా వుంటుంది.మనషి మనషి కీ తేడా ఉంటుంది .
ఫుడ్ అలర్జీ లక్షణాలు:
1. దురద, ఎక్జిమా, చర్మం పగిలిపోవడం 2. కనుర్పెలు, పెదవులు, ముఖం, నాలుక, గొంతులో వాపు లేదా ఇతర శరీర భాగాల్లో వాపు.
3. శ్వాసలో ఇబ్బంది, పొట్టలో నెప్పి, డయేరియా, నీరసం, వాంతులు 4. తలబరువు, అపస్మారక స్థితి, మత్తుగా వుంటం మొదలైనవి ఆహారం వలన కలిగే అలర్జీలను
'ఎనాఫైలాక్సిస్' అంటారు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణానికే హాని కలిగే ప్రమాదం వుంది. అంటే శ్వాస నాళాలు కుంచించుకుపోవడం, గొంతువాపు, రక్త
పీడనంలో తగ్గుదల, పల్స్ రేటు బాగా పెరగడం వంటవి జరుగుతాయి.
అలర్జీకి దూరంగా.... ఫుడ్ అలర్జీల విషయంలో జాగ్రత్త వహించాలంటే - మొదట మీకు అలెర్జీని కలిగించే ఆహారం ఏదో కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఆహార పదార్ధాలన్నింటినీ తినడం మానేయాలి. అంటే ఉదాహరణకి రొయ్యలు వల్ల అలర్జీ వుంటే పీతలు తిన్నా అలర్జీ వస్తుంది. ఇదే నియమం వెజిటేరియన్ రకాలకు కూడా వర్తిస్తుంది. మార్కెట్‌లో లభించే రెడీమేడ్ ఆహరపదార్ధాలపై వున్న లేబిల్స్‌ను జాగ్రత్తగా చదవండి. వాటిమీద వున్న సాంకేతిక, శాస్త్రీయ పదాలను సరిగ్గా అర్థం చేసుకోండి.
మీకు పాల వల్ల అలర్జీ వుంటే, సోడియం కాసినేట్ అని రాసి వున్న వేవీ తీసుకోకండి. గోధుమలు వల్ల అలర్జీ వుంటే .... గోధుమలతో తయారుచేసిన వస్తువులు ప్యాక్ పైన గ్లుటేన్ అని రాసి వున్న వాటికి దూరంగా వుండాలి. గుడ్డు వల్ల అలర్జీ వేంటే బేకరీ బిస్కట్లు, బ్రెడ్‌లను , మయొనైజ్‌తో డ్రసింగ్ చేసిన సలాడ్‌లను, బేకింగ్ మిక్స్‌లను వాడొద్దు.బయట హోటళ్ళలో తినేటప్పుడు మెను ఎంపికలో చాలా జాగ్రత్తగా వుండాలి.వీలుంటే ముందుగానే వెయిటర్లకు, చెఫ్ లేదా మేనేజర్లకు మీ ఫుడ్ అలర్జీ గురించి చెప్పండి బయట ఆర్డర్ చేసేటప్పుడు సింపుల్‌గా వుండే మెనునే ఎంపిక చేసుకోండి.ఫుడ్ అలర్జీ, ఇంకా ఇతర రకాలైన అలర్జీలున్నవారు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎనాఫైలాక్టిక్ రియాక్షన్ ఉంటే, 'ఎపినెఫ్రైన్' ఇంజెక్షన్ మీ దగ్గర వుంచుకోవాలి. ఒకవేళ ఆహారపదార్ధాలు వికటించి రియాక్షన్ వస్తే ఈ ఇంజెక్షన్ వెంటే
వేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దాన్ని ఎలా వాడాలో చెప్పాలి. మీకు అలర్జీ కలిగించే పదార్ధాలు వేటి వేటిలో వున్నాయో ముందుగానే తెలుసుకోండి.
గోధుమల వల్ల అలర్జీ వుంటే మాల్టెడ్ బెవరేజ్‌లను తీసుకోవద్దు. కోకో డ్రింక్, బీర్, విస్కీల వంటి వాటికి దూరంగా వుండాలి. హోటళ్ళలో సాస్‌లు, కూరలు చిక్కగా వుండటానికి గోధుమ పిండి కలుపుతారు. అందువల్ల బయట తినేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి. పాల వల్ల అలర్జీ వుంటే బ్రెడ్, కేకులు, వెన్న, మీగడ వున్న ఉత్పత్తులన్నింటినీ వాడకపోవడం మంచిది. అలాగే ఐస్‌క్రీం, మిల్క్ చాకొలెట్, క్రీమ్ సాస్‌లను పూర్తిగా మానివేస్త్తే మంచిది.
చికిత్స : వెంటనే ఉపశయనము కోసము :
ఎవిల్ ఇంజక్షన్ , బెట్నెసాల్ ఇంజక్షన్ , అడ్రినాలిన్ ఇంజక్షన్ వాడుతారు . తదుపరి అవే మాత్రల రూపములో 2-3 రోజులు వాడాలి.
దీర్ఘకాలిక ఎలర్గీ ఉన్నవారు :
ప్రతిరోజూ ఒక లీవో సిట్రజైన్ మాత్ర వేసుకుంటే ... ముందుజాగ్రత్తగా ఎలర్జీ తీవ్రత నుండి బయట పడవచ్చును.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మెల్లకన్ను,Squint- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రెండు కళ్లూ కలిసికట్టుగా పనిచేస్తేనే.. మన చూపు బాగుంటుంది. సంపూర్ణ దృష్టికి మనకు రెండు కళ్లు ఎంత అవసరమో.. ఆ రెండూ సమన్వయంతో పని చేయటం కూడా అంతే అవసరం. కానీ 'మెల్ల' బాధితుల్లో.. ఆ సమన్వయం కొరవడి.. ఒక కన్ను ఒక దిక్కు చూస్తుంటే.. రెండోది మరో దిక్కు చూస్తుండటం.. పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చూపుకు చేటు .
కానీ మెల్లపై మన సమాజంలో ఇప్పటికీ బోలెడు అపోహలు పాతుకుపోయాయి. ఎన్నో తప్పుడు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చూపుకి చేటు తెచ్చేవే. బిడ్డకు మెల్ల ఉందని గుర్తిస్తే.. వెంటనే పిల్లల నేత్రవైద్యుల సలహా తీసుకోవటం.. అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచేయించటం బిడ్డ భవిష్యత్తుకు చాలా కీలకం.
పసిపిల్లలకు అభంశుభం తెలియదు. కొన్ని ఆరోగ్య సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నా.. వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పలేరు. కానీ... వాటి విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకుని వెంటనే చికిత్స చేయించకపోతే పిల్లలు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... మెల్ల! ఎందుకంటే తమ కంటిలో మెల్ల ఉన్నా పిల్లలకు నొప్పీ, బాధా ఏదీ ఉండదు కాబట్టి.. తమకు కనిపిస్తున్నదే ఈ లోకమని భావిస్తూ.. అలాగే పెరిగి పెద్దవాళ్లవుతారు. కానీ దాని ప్రభావం వాళ్లను జీవితాంతం బాధిస్తుంది. ఎలాగో అర్థం చేసుకోవాలంటే.. మెల్ల గురించి కాస్త వివరంగా తెలుసుకోవటం అవసరం.
మెల్ల అంటే..?మన కళ్లు అద్భుతమైన కెమేరాల్లాంటివి! మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ... రెండూ ఒకే దిశలో కదులుతూ.. ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి.. మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెంటినీ సమన్వయించుకుని మెదడు మనకు.. పొడవు-వెడల్పు-లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని (త్రీడీ చిత్రాన్ని) చూపిస్తుంది. ఇదీ సాధారణంగా జరిగేది. ఇలా మన రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి. కనుగుడ్డు కదలికలకు ఈ కండరాలే కీలకం. కానీ కొందరిలో ఈ కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. ఫలితంగా ఒక కనుగుడ్డు ఒక దిక్కు చూస్తుంటే... రెండో కనుగుడ్డు మరో దిక్కు చూస్తుంటుంది. దీన్నే మనం మెల్ల (స్క్వింట్/స్ట్రెబిస్మస్) అని పిలుస్తాం.
మెల్లతో నష్టం ఏమిటి?
మెల్ల ఉన్న కన్ను పంపించే చిత్రం అస్పష్టంగా ఉంటుంది. రెండు కళ్లూ పంపించే చిత్రాలూ ఒకే తీరుగా లేకపోవటం.. అవి సరిపోలకపోవటంతో క్రమేపీ మెల్ల కన్ను పంపించే చిత్రాన్ని మెదడు గ్రహించటం మానేస్తుంది. ఉదాహరణకు కుడి కన్నులో మెల్ల ఉంటే.. ఆ కంటి నుంచి వచ్చే మసక, మసక దృశ్యాన్ని మెదడు సరిగా గ్రహించలేక.. మంచిగా ఉన్న ఎడమ కంటి నుంచి వచ్చే సంకేతాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. క్రమేపీ కుడి కంటి నుంచి మెదడుకు అందాల్సిన సంకేతాలు క్షీణించిపోతాయి. దీనివల్ల మెదడులో దృశ్యాలను క్రోడీకరించుకునే ప్రక్రియ దెబ్బతిని.. మెదడులోని ఆయా భాగాలూ బలహీనపడతాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ (ఆంబ్లయోపియా)' అంటారు. ఫలితంగా మెదడు ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన (బైనాక్యులర్, త్రీడీ విజన్) దృష్టి లోపిస్తుంది. రోడ్డు మీద ఏదైనా వాహనం వస్తున్నప్పుడు అదెంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తోంది వంటి అంశాలను సరిగా అంచనా వేయలేరు. చూడటంలో అస్పష్టత నుంచి ప్రమాదాల బారినపడటం వరకూ.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎందుకొస్తుందీ మెల్ల?
మెల్ల ఎందుకొస్తుందో స్పష్టమైన కారణాలు తెలియదు. ఓ 10-20% మందిలో ఇది జన్యుపరంగా రావొచ్చు. 50-60% మందిలో మాత్రం కచ్చితంగా కారణం చెప్పటం కష్టం. చాలా అరుదుగా మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులు, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, చిన్నతనంలోనే కంట్లో శుక్లాలు ఉండటం, కంటికి దెబ్బ తగలటం, కంట్లో కణుతుల వంటివాటివల్ల రావచ్చు. కానీ ఇలాంటివి చాలా చాలా అరుదు. ఎక్కువ శాతం మందిలో ఇలాంటి కారణాలేమీ లేకుండానే మెల్ల మొదలవుతుంది.
గుర్తించేదెలా?
మెల్లను గుర్తించటం కష్టమేం కాదు. చాలావరకూ తల్లిదండ్రులే తేలికగా పసిగడతారు. పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూసి నవ్వకపోవటం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేకపోవటం.. మెల్లను గుర్తించటానికి తొలి లక్షణాలుగా భావించొచ్చు. కనుగుడ్లు వేర్వేరు దిక్కుల్లో తిరుగుతుండటం, ఒక కన్ను పూర్తిగా కదులుతుంటే రెండో కన్ను దాన్ని అనుసరించకపోవటం.. ఇలాంటి లక్షణాలను బట్టి మెల్లను గుర్తించొచ్చు. చాలాసార్లు ఫొటోల్లో మెల్ల స్పష్టంగా కనబడుతుంది. అరుదుగా మెల్ల కారణంగా కొందరిలో కనుగుడ్లు పైకీకిందికీ కదిలిపోతుంటాయి కూడా(షేకింగ్/నిష్టాగ్మస్). అయితే 80% మందిలో ఒక కనుగుడ్డు రెండోదాని కన్నా భిన్నంగా బయటివైపో, లోపలివైపో, పైకో, కిందికో తిరిగి ఉండటం కనిపిస్తుంది.
*మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి రోజంతా.. నిరంతరం కనబడే రకం. రెండోది- రోజులో ఎప్పుడన్నా కొన్నికొన్ని సమయాల్లో, ముఖ్యంగా బాగా అలసినప్పుడు, తీవ్రమైన జ్వరం వచ్చినపుడు, పగటి కలలు కంటున్నప్పుడు కనబడుతూ.. ఆ తర్వాత పోతుంటుంది. వీటిలో ఏది కనబడినా, ఏ కొంచెం అనుమానం ఉన్నా పిల్లల కంటి వైద్యులతో పరీక్ష చేయించటం ఉత్తమం. ఈ పరీక్ష ఎంత చిన్న వయసులో చేయిస్తే అంత మంచిది. ఏడాదిలోపు మరీ ఉత్తమం.
చిన్నతనంలో లేకుండా.. పెద్ద వయసులో ఉన్నట్టుండి మెల్ల వస్తే- రెండు కళ్లూ మెదడుకు రెండు రకాల చిత్రాలను పంపిస్తాయి. దీంతో దృశ్యాలన్నీ రెండుగా కనబడతాయి. చూపు దెబ్బతింటుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా కనుగుడ్లను సరైన సమన్వయంతో పనిచేసేలా సర్జరీతో చక్కదిద్దాల్సి ఉంటుంది.
సర్జరీ ఎప్పుడు మేలు?
పసితనంలోనే మెల్ల కనబడితే 8-9 నెలల వయసులో సర్జరీ చేయటం ఉత్తమం. దీనివల్ల చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కనుగుడ్లు రెండూ చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి కాబట్టి మెదడులోనూ పెద్దగా మార్పులు రావు. చూపు క్షీణించటమన్న సమస్య ఉండదు. స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని రకాలైతే 4-5 ఏళ్లు ఆగొచ్చు. కానీ దేనికి ఆగొచ్చు, దేనికి ఆగకూడదన్నది నిపుణులైన వైద్యులే నిర్ధారించాల్సి ఉంటుంది.
రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ మెల్ల సమస్య వల్ల ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ' అంటారు. ఫలితంగా మెదడు చూపు కోసం- బాగున్న ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన దృష్టి (బైనాక్యులర్, త్రీడీ విజన్) లోపిస్తుంది.
మెల్ల అపోహల పుట్ట:
'మెల్ల'పై మన సమాజంలో బోలెడు అపోహలు పాతుకుపోయాయి.
1 మెల్లకన్ను అందానికి చిహ్నమని నమ్మేవాళ్లున్నారు.. కానీ మెల్ల వల్ల అందం ఇనుమడించకపోగా... తోటివారు గేలి చేయటం, చిన్నచూపు చూడటం, వీరితో స్నేహం చేయటానికి అంతగా ముందుకురాకపోవటం.. ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ క్రమేపీ ఈ పిల్లలు న్యూనతా భావానికి గురవుతుంటారు. ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గమనించటం లేదు.
2 మెల్లకన్ను దేవుడిచ్చిన వరంగా నమ్మేవాళ్లూ ఉన్నారు.. కానీ వాస్తవానికి ఇది వరం కాదు.. మెల్లను నిర్లక్ష్యం చేస్తే ఆ కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
3 పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మెల్ల దానంతట అదే పోతుందని భావిస్తూ.. తాత్సారం చేసేవాళ్లున్నారు. కొందరు వైద్యులు కూడా 5-6 ఏళ్ల వరకూ చూడొచ్చని సూచిస్తుంటారుగానీ.. మెల్ల తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నవయసులోనే దాన్ని సరిదిద్దకపోతే ఆ కంటి చూపు క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసులో దాన్ని సరిచేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోతుంది.. ఫలితాలు సంపూర్ణంగాఉండవు.
4 మెల్లకు సర్జరీ చేస్తే మొత్తం చూపు దెబ్బతింటుందన్న భయాలూ కొందరిలో ఉన్నాయిగానీ.. వాస్తవానికి అవసరమైనప్పుడు సర్జరీ చేయించకపోతేనే చూపు దెబ్బతింటుందిగానీ చేయిస్తే కాదు. మెల్ల సరిదిద్దేందుకు చేసే సర్జరీ చాలా సురక్షితమైనది, దాంతో దుష్ప్రభావాలు చాలా తక్కువ.
చిన్నతనంలో తల్లిదండ్రులు అవగాహనారాహిత్యంతో మెల్లను సరిచేయించకుండా వదిలేయటం వల్ల.. పిల్లలు మెల్ల సమస్యతోనే పెరిగి పెద్దవాళ్త్లె.. అప్పుడు పెళ్లి సంబంధాలు కుదరవనో... ఉద్యోగం దొరకటం కష్టంగా ఉందనో హడావుడిగా కంటి వైద్యులను సంప్రదిస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ వయసులోనూ సర్జరీతో 'మెల్ల' కనబడకుండా చక్కదిద్దచ్చుగానీ చూపు విషయంలో ఫలితాలు సంపూర్ణంగా ఉండకపోవచ్చు. అదే చిన్న వయసులోనే సరిచేస్తే చూపు ఎక్కువగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
అందరికీ ఆపరేషన్ అక్కర్లేదు!
మెల్ల కన్ను సమస్య ఉన్నవారందరికీ ఆపరేషన్ అవసరం రాదు. కొన్నింటిని కేవలం అద్దాలతోనే సరిచేయొచ్చు. మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి- కంజెనైటల్ లేదా ఇన్‌ఫంటైల్ ఈసోట్రోపియా. మెల్ల బాధితుల్లో 70% వరకూ ఇలాంటి వారే. వీరికి ఆపరేషన్ తప్పనిసరి. రెండోది- దృష్టిదోషం వల్ల వచ్చే 'అకామడేటివ్ ఈసోట్రోపియా' రకం. దీన్ని చాలావరకూ కళ్లద్దాలతోనే సరిచేయొచ్చు. కంటి చూపును పరీక్షించి వారికి అవసరమైన మేరకు అద్దాలు ఇస్తే సరిపోతుంది. కంట్లో దృష్టిదోషం ఉన్నప్పుడు స్పష్టంగా చూసేందుకు మరింత శ్రమతో చూడాల్సి వస్తుంది. దీనివల్ల మెల్లగా కనుగుడ్డు పక్కకు జరగటం ఆరంభిస్తుంది. ఇది క్రమంగా 'మెల్ల'కు దారి తీస్తుంది. ఈ దృష్టిదోషాన్ని సరిచేస్తూ కళ్లద్దాలు ఇస్తే ఈ రకం క్రమేపీ చక్కబడుతుంది. అందుకే వైద్యులు మెల్ల సమస్యతో వచ్చినప్పుడు ముందు సమస్య ఏ స్థాయిలో ఉంది? రెండు కళ్లలోనూ చూపు ఎలా ఉంది? పవర్ ఏదైనా ఉందా? కనుగుడ్డు పక్కలకు మాత్రమే మళ్లిందా? పైకీ కిందికీ జరిగిందా? వంటి వాటిని కొలతలతో సహా నిర్ధారిస్తారు. ఎక్కువమందిలో కన్ను లోపలికి మళ్లటం (ఈసోట్రోపియా), బయటకు మళ్లటం (ఎక్సోట్రోపియా) కనిపిస్తాయి. కంట్లో శుక్లాలు, కణుతుల వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయేమో చూసేందుకు సంపూర్ణంగా నేత్ర పరీక్ష చేస్తారు. ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం మెల్ల మాత్రమే ఉందని నిర్ధారిస్తే... 20-30 శాతం మందికి కేవలం గ్లాసులు ఇస్తేనే సరిపోతుంది. వీటితో మెల్ల పూర్తిగా సరి అయిపోతుంది.
* ప్యాచింగ్: కొన్నిసార్లు బలహీనపడిన కంటిని మళ్లీ పనిచేయించేందుకు అద్దాలతో పాటు 'ప్యాచ్ థెరపీ' కూడా చేస్తారు. బాగున్న కంటిని మూసివేస్తే.. మెల్లతో బలహీనపడిన కన్ను క్రమేపీ అధికంగా పని చేయటానికి అలవాటుపడి, దారిలోకి వస్తుంది. ఉదాహరణకు పిల్లవాడు 4 ఏళ్ల వయసులో వస్తే.. అప్పటికే మెల్ల ఉన్న కన్ను బలహీనపడి ఉంటుంది కాబట్టి దాన్ని మెరుగుపరిచేందుకు- 'లేజీ'గా మారిన ఆ కంటిని మరింతగా పని చేయిచేందుకు.. బాగున్న కంటిని 'ప్యాచ్'తో మూసివేస్తారు. కొందరికి కేవలం ఈ ప్యాచ్‌లతోనే మెల్ల సరి అయిపోతుంది.
* సర్జరీ: మెల్ల నిరంతరం లేకుండా వచ్చిపోతుంటే.. సాధారణంగా కొంతకాలం వేచి చూడొచ్చు. నిరంతరం ఉండే వారికి మాత్రం సత్వరమే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. కనుగుడ్లు రెండూ సమన్వయంతో కదిలేందుకు వెనకున్న కండరాలు కీలకం కాబట్టి.. సర్జరీలో ప్రధానంగా ఈ కండరాలను సరిచేస్తారు. ఉదాహరణకు గుడ్డు లోపలి వైపు తిరిగితే ఒకవైపు కండరాలను, బయటివైపు తిరిగితే మరో వైపు కండరాలను బిగువు చేయటం, వదులు చేయటం వంటి సర్దుబాట్లు చేస్తారు. దీంతో కనుగుడ్లు రెండూ ఒకే దిశలో కదలటం వీలవుతుంది. వీటిమధ్య సమన్వయం కోసం కొన్నిసార్లు మెల్ల ఉన్న కంటితో పాటు మెల్లలేని రెండో కంటికీ సర్జరీ చెయ్యాల్సి వస్తుంది. ఈ దిద్దుబాటు అంతా కూడా సూక్ష్మమైన లెక్కలతో ముడిపడినది కాబట్టి దీనిలో మంచి అనుభవం ఉన్న సర్జన్లు మాత్రమే దీన్ని చెయ్యగలరు. సర్జరీలోకనుగుడ్డు మీద చాలా చిన్న కోత మాత్రమే పెడతారు, కంటి చుట్టూ ఎటువంటి కోతలూ, మచ్చలూ ఉండవు. ఆపరేషన్ తర్వాత కూడా చూపు మెరుగయ్యే వరకూ కొంతకాలం ప్యాచ్‌లు వాడాల్సి రావచ్చు. 90 శాతం మందిలో ఈ సర్జరీతోనే సమస్య తొలగిపోతుంది. 10% మందిలో మాత్రం సర్జరీ తర్వాత కొంతకాలానికి మళ్లీ మెల్ల రావచ్చు. అప్పుడు మరోసారి దిద్దుబాటు చెయ్యాల్సి వస్తుంది. కొందరిలో బొటాక్స్ ఇంజక్షన్ల వంటివాటితోనూ దీన్ని సరిదిద్దే వీలుంటుంది.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --కళ్లు తిరుగుడు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయ. ఇవి సాధారణమే అయనా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి వ్యాధులు రావడానికి ముందు సూచనగా కూడా ఇవి బయటపడుతుంటాయ. కనుక ఎప్పుడైన కళ్లు తిరిగినా, ఒళ్లు తూలిన దానికి కారణాలను తెలుసుకోవాలి. అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్టర్ల సలహాను పాటించవలసి ఉంటుంది.
వ్యాధుల వలన కలిగే తలతిరుగుడుకు కారణం:
- తలకు పెద్ద గాయం అవడం,
- లోపలి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవం లోపల చేరిన వైరస్,
- లోపలి చెవిలో అవయవం లోపం,
- లోపలి చెవి శస్తచ్రికిత్స అనంతరం ఇలాంటి జబ్బు కనపడుతుంది.
- యూస్టాషియన్ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ,
- రాయలా గట్టిగా చెవిలో గులివి ఏర్పడినపుడూ,
- మెడ ఎముకలు అరుగుదల లాంటివి ఏర్పడినపుడు తల తిరుగుడు ... కళ్లు తిరుగుడు కనిపిస్తుంది.
- అదిక రక్తపోటు ఉన్నవారిలో కూడా ఒక్కక్క సారి తలతిరిగినట్లు ఉంటుంది .
కళ్ళు తిరగడానికి కారణాలు:
ఇవి మూదు రకాలైనవి --->
1. వ్యాధి వలన (పేథోలాజికల్)--2.వ్యాధి లేకుండానే (నాన్ పేథోలాజికల్)---3. తీవ్ర మానసిక ఆందోళనలు (సైకొలాజికల్)కలిగినపుడు...
1.తలకి తగిలిన దెబ్బలు (రోడ్ ప్రమాదాలు)
2. వాహన ప్రయాణంలో కదలికలు పడక వచ్చే లక్షణం (ట్రావెల్ సికనెేస్)
3. చెవిలో సమతూల్య నియంత్రణ కలిగించే అవయవం (మినియర్స్ వ్యాధి)
4. వైరస్ వ్యాధులు, గవద బిళ్ళలు, తట్టు వంటి వ్యాధులు సోకిన తరువాత
5. లోపలి చెవి శస్త్ర చికిత్స అనంతరం
6. తీవ్రమైన పెద్ద శబ్దాలు దగ్గరగా విన్నపðడు
7. చెవిలో చీము (ప్రమాదకరమైన రకం అన్ సేఫ్ సి.ఎస్.ఓ.ఎం)
8. యూస్టాషియన్ గొట్టం మూసుకొనుట వలన కలిగిన చెవి దిబ్బడ
9. రాయిలా గట్టిగా గులివి ఏర్పడినపðడు
10. మెడ ఎముకల ఆరుగుదల (సర్వైకల్ స్పాండిలోసిస్)
11. కంటి చూపులో పవర్‌లో మార్పులు
12. రక్తపోటు అస్తవ్యస్తం (అధిక పోటు/బి.పి. తగ్గుట)
13. తీవ్రమైన రక్తహీనత
14. మెదడులో కంతులు
15. అతి తీవ్రంగా మానసిక వత్తిడులు
16. పక్క నుండి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుండి పక్కకు తిప్పినా తల తిరుగుడు వస్తుంది. (పొజిషనల్ వర్టిగో)వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
ఈ వ్యాధి చికిత్సలో చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులతో బాటు ఫిజీషియన్ నరాల సంబంధిత వైద్యుల పాత్ర కూడా ఉంటుంది.
- చెవి పరీక్ష
- ఆడియోలజీ పరీక్షలు
- సమతూల్య (వెస్టిబ్యులర్స్) పరీక్షలు, ఇఎన్‌జి, కేలోరిక పరీక్షలు
- రక్త పరీక్షలు
- మధుమేహం, కొవ్వు (కొలస్ట్రాల్) పరీక్షలు
- హెచ్.ఐ.వి. పరీక్షలు
- మెడ ఎక్సరే
- ఈసిజి ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశితంగా పరీక్షించాలి.
రోగానికి గల కారణం నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేయాలి. మొట్టమొదట కళ్ళు తిరగటం, తలతిరగటం తీవ్రంగా ఉన్నప్పుడు రోగికి ధైర్యం చెప్పాలి. కారణం తెలుసుకున్నాకా కొన్ని యాంటీ వర్టిగో మందులతో, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించవచ్చును. మెద డులో కంతుల వంటి వ్యాధులకు శస్త్ర చికిత్స అవసరమౌతుంది. మినియర్స్ వ్యాధి ఇది తరచుగా వచ్చే వ్యాధి. ఇందులో తలతిరగ టం, చెవిలో హౌరు, వినికిడిలోపం మధ్యమధ్యలో ఉధృతం అవుతూ (అటాక్ లా) వస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవాలి. లేనిచో శాశ్వతంగా వినికిడి లోపించి మనిషికి అసహాయత రావచ్చు.గుండె సంబంధమైనవి:
అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై పీడం ఏర్పడినప్పుడు, రక్తనాళాల్లో కొవ్వు పదార్థాం చేరడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ పరిమాణం తగ్గి తలతిరగడం జరుగుతుంది.
వైద్యం :
మూలకారణమైన అధిక రక్తపోటు తగ్గించే మందులు వాడాలి. కొవ్వు పదార్థాలు తగ్గించే స్టాటిన్స్ వాడాలి. అంతేకాక తగినంత విశ్రాంతి తీసుకోవాలి. చెవి, ముక్కు, గొంతు:
చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోనూ, రక్త సరఫరాలోనూ, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వల్ల చెవిలో మీనిమర్స్ వ్యాధి,Vertigo ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది.
వైద్యం :
ఇఎన్‌టి వైద్యనిపుణులను సంప్రదించి ‘స్టిరాయిడ్’ వైద్యం, సినర్జిన్ వంటి మందులు వాడాలి.
ఆర్థోపెడిక్:
మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రసరించే రక్తం మెడ ముందు భాగంలోని రెండు కెరోటాడ్ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా రెండు సర్వైకల్ వెర్టబ్రల్ రక్త నాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనక భాగానికి రక్తాన్నందిస్తాయి. మెడలోని ఎముకల అరుగుదలలో ఈ రక్త నాళాలు ఒక్కోసారి ఒత్తిడికి లోనై మెదడుకు సరఫరా అయ్యేరక్తం తగ్గినప్పుడు తలతిరగడం, నిద్ర నుండి లేచినప్పుడు తలతిరిగి పడిపోతారు.---
వైద్యం :
దీనికి కాలర్, ట్రాక్షన్ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి.
తాత్కాలికముగా వాడే మందులు :
సిన్నర్జిన్ – 25 మిల్లీ గ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు రోజూ రెండు సార్లు వాడాలి.
డోమ్‌పెరిడోన్ – 10 నుండి 20 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు వాడాలి.
బీటా హిస్టిన్ హైడ్రోక్లోరైడ్ – 8,16,24 మిల్లీగ్రాముల డోసులు రోజుకు 2 లేక 3 సార్లు వాడాలి.
స్టెమ్‌టిల్ 5 మి.గా రోకుకు 2-3 సార్లు . 4-5 రోజులు .
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --రోగ నివారణి గా ఆహారు ,Food as disease preventive- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వ్యాధుల బారిన పడకుండా మనలోని రోగనిరోధకశక్తి నిరంతరం కాపాడుతుంటుందని తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇది పొరపాటున మన శరీరం మీదే దాడి చేస్తుంది. దీంతో కణజాలం దెబ్బతినటంతో పాటు క్షీణత వ్యాధులుగా పిలిచే ఆటో ఇమ్యూన్ జబ్బులకూ రావటానికి దోహదం చేస్తుంది. మల్టిపుల్ స్ల్కెరోసిస్, కీళ్లవాతం, క్రాన్స్ వంటివి అలాంటి జబ్బులే. ఇవి చాలావరకు జన్యు కారణంగా వచ్చేవే కానీ ఇన్‌ఫెక్షన్లు, మందుల వంటి పలు అంశాలు వీటిని ప్రేరేపిస్తుంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీని ఆహారం ఏమైనా ప్రభావితం చేస్తుందా? అన్న దానిపైనా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనిపై ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఆలస్యం చేయటం లేదా వెనక్కి మళ్లించటం, నివారించటంలో ఆహారం పాత్ర కూడా ఉంటున్నట్టు బయటపడుతోంది. ముఖ్యంగా ఇందుకు విటమిన్ డి, విటమిన్ ఏ, సెలీనియం, జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రొ బయోటిక్స్, గ్లుటమైన్, ఫ్లావనోల్స్ వంటివి బాగా ఉపయోగపడుతున్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, క్యాల్షియం సమతుల్యతకు విటమిన్ డి దోహదం చేస్తుంది. మల్టిపుల్ స్ల్కెరోసిస్, కీళ్లవాతం జబ్బులకూ విటమిన్ డి లోపానికి సంబంధం ఉంటున్నట్టు తేలింది. పేగుల్లో వాపు, ఆటో ఇమ్యూనిటీని విటమిన్ ఏ, సెలీనియం నిరోధిస్తాయి. చేపలు, అవిసెగింజల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నివారణకు మాత్రమే కాదు.. ఆటో ఇమ్యూనిటీ ముప్పును కూడా తగ్గిస్తాయి. అందువల్ల ముందునుంచే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జబ్బులు మొదలుకాగానే ఆహారంపై శ్రద్ధ పెట్టినా మంచిదే. సమతులాహారం తీసుకోవటం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకుంటూ మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Milk allergy , పాల అసహనీయత ,లాక్టోజ్ ఇంటోలరెన్స్ , Lactose intolarence- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పాల అసహనీయత (Milk allergy) అనేది ఫుడ్ ఎలర్జీ లలో ఒక రకము . ఏదైనా ఆహారపదార్ధము పడనిచో వచ్చే ఎలర్గిక్ లక్షణాలన్నీ పాల ఎలర్జీలో ఉంటాయి. కాని ఇక్కడ చిన్నపిల్లలలో వచ్చే లాక్టోజ్ పడకపోవడం (Lactose intolarence) గురించి తెలుసుకుందాం .
కొందరికి చిన్నప్పటినుండీ పాలు , పాల ఉత్పత్తులు పడవు . పాలు త్రాగగానే కడుపులో కిందభాగములో నొప్పి , ఉబ్బినట్లు , విరోచనాలు అవడము జరుగుతుంది . దీనికి కారణము పాలలో ఉండే లాక్టోజ్ అనే చెక్కెర . శరీరములో లాక్టేస్ (Lactase) ఎంజైమ్ తయారవకపోవడము , లేదా తక్కువగా తయారవడము (hypolactasia) వలన ఈ లాక్టోజ్ చెక్కెర జీర్ణమవక కడుపు నొప్పి , కడుపుబ్బడము , విరోచనాలు అవడము , వాంతులు అవడము ,వికారముగా ఉండడము జరుగుతుంది . దీనినే పాలు పడకపోవడము(Lactose intolarence syndrome) అంటాము . చిన్న పిల్లలలో ఇది చాలా ఇబ్బంది పెడుతుంది . అటువంటి ఇబ్బందులు కలిగినవారు పాలు , పాల ఉత్పత్తులు ... పెరుగు , మజ్జిక ,వెన్న , పాలబిస్కెట్లు , పాల ఐస్క్రీం వంటి వాటికి దూరముగా ఉండాలి .
పాలు ఎలర్జీ వచ్చిందంటే కనిపించే లక్షణాలు చికాకుపడటం, వాంతులు, వీరోచనాలు, బరువు పెరగకపోవడం వంటివి. పిల్లల్లో వాంతులు, రక్తం లేకపోవడం, రక్తవీరోచనాలు, పొట్టఉబ్బడంవంటివి కనిపిస్తాయి. పాలద్వారా వచ్చే ఎలర్జీ. ఏడాదిలోపల వస్తుంది. గుడ్డు ఎలర్జీ 18 నెలలలోపల రావచ్చు. సాధారణ ఫుడ్ ఎలర్జీకి కారణమైన ఆహార పదార్థాలు ఆవుపాలు, గుడ్డు, చేప, వేరుశెనగపప్పులు.
ఎలర్జీ... ఈ పదం దాదాపు అందరికీ పరిచయమే. వాతావరణంలో తేడాలవల్ల కూడా కొందరికి ఎలర్జీ వస్తుంది. అంటే కాలుష్యం, పొగ, దుమ్ము, కొన్ని వాసనలు పడకపోవడంలాంటివి. ఇవికాకుండా ఆహారంవల్ల ఎలర్జీవస్తే దాన్ని 'ఫుడ్ ఎలర్జీ' అంటారు. కొందరికి కొన్ని ఆహారపదార్థాలు ఒంటికి సరిపడవు. శరీరంలో ఆ మార్పులు వెంటనే కనిపిస్తాయి. సాధారణంగా ఫుడ్ ఎలర్జీ వచ్చిందంటే దద్దుర్లు, వాపు కనిపిస్తాయి. ఇవికాక వారి వారి శరీర మనస్తత్వాన్ని బట్టి మరికొన్ని మార్పులొస్తాయి. కొందరికి గుడ్డు తింటే పడదు. కొందరికి చెట్లల్లో తిరిగితే దురదలు వస్తాయి. ఇంకొందరికి పాలు తాగితే తేడాచేస్తుంది. ఇలా చాలామందికి ఎప్పుడో ఏదో ఒక చిన్న అనుభవం ఉంటూనే వుంటుంది.
పాలుకి ప్రత్యామ్నాయము : సోయాపాలు , కొబ్బరిపాలు , బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
లాక్టోజ్ ఇంటోలరెన్స్ ను మూడు రకాలు గా విభజించారు వైద్యనిపుణులు .
ప్రైమరీ లక్టోజ్ డెఫిసియన్సీ : ఇది (జెనిటికల్) వంశపారంపర్యము గా వస్తుంది . ఇందులో " lactase persistence allele" అనే జీనులు లేకపోవడము వల్ల లాక్టోస్ ఎంజైం తయారవదు . లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారు ఎక్కువగా ఈ కోవకు చెందినవరే .
సెకెండరీ లాక్టోజ డెఫిసియన్సీ : పసికందులలో చినంప్రేగులు వ్యాదిగ్రస్తమయినపుడు ... సాదారణము గా " గాస్ట్రోఎంటరైటిస్ , డయేరియా, కీమొతెరఫీ, పొట్తపురుగులు " మున్నగు వాటివలన లాక్టేస్ ఎంజైం తయారీలో మార్పులు వచ్చి ఈ వ్యాదికి దారితీస్తుంది .
కంజెనిటల్ లాక్టోజ డెఫిసియన్సీ : ఇది చాలా అరుదుగా వస్తుంది . పుట్టుకతో 'ఆటోసోమల్ రెసిసివ్ జెనెటిక్ డిసార్డర్ '... లాక్టోస్ తయారీని నియంత్రించును . ఈ వ్యాది Finland దే్శము లో ఎక్కువగా కనిపిస్తుంది .
నిర్ధారణ పరీక్షలు :
Hydrogen breath test : ఒక రాత్రి ఉపవాసము ఉంది ఉదయాన్నే 25 గ్రాముల లాక్టోజ్ ద్రావకము తాగించి 2-3 గంటలు తర్వాత ఊపిరి వాసన పరీక్ష చేస్తారు . ఇక్కడ లాక్టేస్ ఎంజైం లేదుగనక బాక్టీరియా లాక్టోజ్ ద్రావకాన్నుండి హైడ్రోజన్ వాయువును, మీథేన్ ను తయారుచేయడం వలన ఆవాసనతో ఊపిరి మిలితమువును .
Blood test : లాక్టోజ్ ద్రావకము తాగించి 15 నిముషాల తర్వాత రక్తములొ చెక్కెర పరీక్ష చేసినచో బ్లడ్ సుగర్ లెవల్ .. ప్లాట్ కర్వ్ వస్తుంది . ఇక్కడ లాక్టోజ్ జీర్ణము అవనందున రక్తములోని చెక్కెర శాతము పెరగదు . దీనిని హైడ్రోజన్ బ్రెత్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు .
Stool acidity test : ఈ పరీక్షలో లాక్టోజ్ జీర్ణము అవక పెద్దపేగులలోని బాక్టీరియా వలన లాక్టిక్ ఆమ్లము తయారవడము మూలాన మలము పరీక్షలో ఆమ్లగుణము కనిపించును ,
Intestinal biopsy : ఈ పరీక్ష వలన వ్యాది నిర్ధారణ చేయబడును .
చికిత్స : ఈ వ్యాదికి సరియైన చికిత్స లేదు . పాలు , పాల ఉత్పత్తులు తినకుండా ఉండాలి . తప్పనిసరి పరిస్థితులలో " లాక్టోస్ ఎంజైమ్" ప్రత్యామ్నాయము గా తీసుకోవడమే . లాక్టోస్ ఎంజైం ను 'genus Aspergillus జాతి fungi ' నుండి తయారు చేస్తున్నారు .
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కార్నియా దృస్టికి మూలకణ చికిత్సా విధానం,Stemcell treatmet for corneal blindness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
'కంట్లో కారం' గురించి మనం భయంకరంగా చెప్పుకొంటాం. కానీ కంటికి సంబంధించినంత వరకూ 'సున్నం' అతి భయంకరమైనది! ఒక్క సున్నమే కాదు.. మనం నిత్యం వాడే బ్లీచింగ్ పౌడర్.. రకరకాల యాసిడ్లు.. ఇవన్నీ కంట్లో విపత్తు సృష్టించేవే! ప్రమాదవశాత్తూ ఇవి ఒక్కసారి కంట్లో పడ్డాయంటే చాలు.. అతి సున్నితమైన కంటి భాగాలను తినేస్తాయి. దృష్టిని దెబ్బతీస్తాయి. ఆ కన్ను తిరిగి కోలుకునేలా చెయ్యటం.. తిరిగి చూపు తెప్పించటం.. ఎంతో కష్టంతో కూడుకున్న పని!
ముఖ్యంగా మన కంటిలోని నల్లగుడ్డు పైన ఉండే పారదర్శకమైన 'కార్నియా' పొర అత్యంత సున్నితమైనది. ఇదొక్కటే దెబ్బతింటే.. నేత్రదానం ద్వారా స్వీకరించిన కార్నియాను తెచ్చి మార్పిడి చెయ్యటం ద్వారా పరిస్థితి చక్కదిద్దచ్చు. కానీ ఈ కార్నియా పొరకు నిత్యం జవజీవాలను అందిస్తూ.. ఈ చుట్టూ ఉండే 'లింబస్' ప్రాంతం దెబ్బతింటే మాత్రం దీన్ని సరిచెయ్యటం మహాకష్టం. పదేళ్ల క్రితం వరకూ కూడా దీనికి సరైన పరిష్కారమే లేదు. ఫలితంగా... సున్నం వంటి ప్రమాదాల బారినపడిన ఎంతోమంది బాధితులు దృష్టికి దూరంగా, అంధకారంలో ఉండిపోయారు. మోడువారిన వీరి జీవితాల్లో కొత్త వెలుగులు పూయించింది మూలకణ చికిత్సా విధానం!.
కంటిలో రసాయనాలు పడటం సర్వసాధారణమైనదే కాదు, అత్యంత ప్రమాదకరమైన సమస్య కూడా! కంటికి సంబంధించి ఇదో అతిపెద్ద విపత్తు. మామూలుగానే మన కంట్లో ఏం పడినా క్షణాల్లో మంట, ఎర్రబడటం, వాపు, నీరుకారటం వంటివన్నీ మొదలవుతాయి. కాకపోతే సరైన చికిత్సతో ఇవన్నీ కొద్దిగంటల్లోనో, రోజుల్లోనో తగ్గిపోయి.. కన్ను మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అదే గాఢమైన ఆమ్లాలుగానీ, క్షారాలుగానీ పడినప్పుడు పరిస్థితి ఇంత తేలికగా ఉండదు. అవి కనుగుడ్డు మీద ఉండే సున్నితమైన, కంటి చూపునకు అత్యంత కీలకమైన పొరలను తినేస్తాయి. ముఖ్యంగా సున్నం, బ్లీచింగ్ పౌడర్ వంటి క్షార రసాయనాలు కనుగుడ్డు పైభాగాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి రెండు కళ్లలోనూ పడితే పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో కార్నియా పొర దెబ్బతిన్నప్పుడు తక్షణ వైద్యంతో పాటు చూపు పునరుద్ధరణ కోసం ఎంతో సంక్లిష్టమైన చికిత్సలూ అవసరమవుతాయి.
మూలకణ మార్పిడి చికిత్సా విధానం వీటిలో అత్యంత కీలకమైనది.
ఏమిటీ మూలకణ చికిత్స?
మన కంట్లో నల్లగుడ్డు మీద పారదర్శకమైన పొర ఉంటుంది. దీన్నే 'కార్నియా' అంటారు. ఈ కార్నియా చుట్టూ తెల్లగుడ్డు ఉంటుంది, దీన్ని 'కంజెంక్త్టెవా(conjectiva)' అంటారు. ఈ రెంటికీ మధ్య ఉండే రింగులాంటి ప్రాంతం 'లింబస్'. కార్నియా పొర బాగుండాలంటే దాని చుట్టూ ఉండే ఈ లింబస్ పొర అత్యంత కీలకం. ఎందుకంటే కార్నియా పొరకు కావాల్సిన కణాలన్నింటినీ ఈ లింబస్ రింగే అందిస్తుంటుంది. కార్నియా స్వచ్ఛమైన అద్దంలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి దానిలో రక్తనాళాలు, రక్తసరఫరా ఉండవు. కానీ శరీరంలో అన్నిభాగాల్లాగే అక్కడి కణాలు కూడా నిరంతరం క్షీణిస్తుంటాయి. మరి దానికి నిరంతరం కొత్తకణాలు అందుతుంటేనే అది చక్కగా ఉంటుంది. అందుకే దానిచుట్టూ అద్భుతమైన 'లింబస్' ఏర్పాటు ఉంది. ఈ లింబస్ రింగులో మూల కణాలుంటాయి. ఇవి నిరంతరం కార్నియా కణాలుగా మార్పుచెందుతూ.. పైకి వ్యాపిస్తుంటాయి. దీంతో కార్నియా ఎప్పుడూ చక్కగా ఉంటుంది. ఇదీ ప్రాథమికంగా కార్నియా, లింబస్‌ల నిర్మాణం.
ప్రమాదం జరిగితే..?
కంట్లో ఏవైనా రసాయనాలు పడి.. కార్నియా పొర దెబ్బతింటే.. వేరొక నేత్రదాత నుంచి స్వీకరించిన కార్నియా మార్పిడి చేస్తారు. ఆ తర్వాత దానికి అవసరమైన కణాలన్నింటినీ యథాప్రకారం లింబస్ అందిస్తుంటుంది. కానీ ప్రమాదంలో లింబస్ భాగం కూడా దెబ్బతింటే..? అప్పుడే అసలు సమస్య తలెత్తుతుంది. కార్నియా మార్పిడి చేసినా.. దానికి నిరంతరం కణాలను సరఫరా చేసే లింబస్ ప్రాంతం లేక అది అట్టేకాలం నిలబడలేదు. రెండోది- లింబస్ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే. ఇలాంటి వారికి కార్నియా మార్చినా.. లింబస్ లేదు కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడలేదు. కాబట్టి లింబస్ ప్రాంతం దెబ్బతిన్నప్పుడు.. దాన్ని తిరిగి ఏర్పాటు చేయటం అత్యవసరం. ఒక కన్ను బాగుంటే దాని నుంచి కొద్దిభాగం తీసుకువచ్చి మార్పిడి చెయ్యచ్చు. కానీ లింబస్‌లో మరీ ఎక్కువ భాగం దెబ్బతినిపోతే ఎలా? అలాగే ఒక కన్ను దెబ్బతింది కాబట్టి బాగున్న కంటి నుంచి లింబస్ తెచ్చి అమర్చటమంటే.. ఆ బాగున్న ఒక్క కంటినీ కూడా దెబ్బతీసిన వాళ్లమవుతామా? అన్నదీ ముఖ్యమే. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నది అత్యంత క్లిష్టమైన సమస్య. దీనికి పరిష్కారంగానే 'లింబస్ మూలకణాల మార్పిడి' విధానాన్ని రూపొందించారు. మార్పిడి అద్భుతం!
బాధితుల రెండో కన్ను బాగుంటే.. దాని నుంచి చాలా తక్కువగా (2 మి.మీ.) లింబస్ రింగు పొరను తీసుకుంటారు. ఒకవేళ రెండోకన్నూ దెబ్బతింటే తలిదండ్రులు, లేదా సన్నిహిత
బంధువుల నుంచి కొద్దిగా లింబస్ పొరను సేకరిస్తారు. దాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సాధ్యమైనంత పెద్దగా పెంచటమన్నది ఈ ప్రక్రియలోని మూలసూత్రం. ఇలా మూలకణాలను పెంచవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమవ్వటంతో ఎల్వీప్రసాద్ పరిశోధకులు.. దాన్ని కంటి లింబస్ కణాలకు వర్తింపజేస్తూ సాధ్యమైనంత తక్కువ ఖర్చులో సాధించేందుకు కృషి చేసి విజయం సాధించారు.
బాగున్న కంటి నుంచి కేవలం 2 మి.మీ. లింబస్ మాత్రమే తీసుకుని.. దాన్ని ప్రయోగశాలలో పెద్దగా పెంచాలి. అందుకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చే మాయ (ఆమ్నియాన్) పొర సహాయం తీసుకున్నారు. మాయపొరను ప్రయోగశాలలో చిన్నచిన్న ముక్కలుగా చేసి ప్రత్యేక రసాయనాల్లో సిద్ధంగా ఉంచుతారు. రోగి కంటి నుంచి తీసుకున్న 2 మి.మీ.ల లింబస్ పొరను దాని మీద ఉంచి.. క్రమేపీ దాన్ని 2 వారాల్లో పెద్దగా పెంచుతారు. రెండు కళ్లూ బాగా దెబ్బతిన్నా కూడా చిన్న లింబస్ ముక్క బాగుంటే చాలు.. అదే రోగి నుంచి దాన్ని తీసుకుని.. ప్రయోగశాలలో పెంచుతారు. ఇలా పెంచిన పొరను తీసుకువెళ్లి.. దెబ్బతిన్న కంటిలో అతికిస్తారు. అది క్రమేపీ కుదురుకుని.. తన మూలకణాల నుంచి కార్నియా కణాలను తయారు చెయ్యటం ఆరంభిస్తుంది. క్రమేపీ కార్నియా చక్కబడుతుంది. లేదంటే నేత్రదాతల నుంచి కార్నియా తెచ్చి మార్పిడి చెయ్యచ్చు. ఇప్పటికే లింబస్‌ను బాగు చేశారు కాబట్టి కార్నియా చక్కగా స్థిరపడుతుంది. ఇదీ ఈ ప్రక్రియ ప్రత్యేకత!
చూపు వచ్చేస్తుందా?
ప్రమాదం జరగగానే కన్ను పెద్దగా ఉబ్బిపోయి.. ఎర్రగా.. నీరుకారుతూ.. అసలు ఎంత దెబ్బతిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ స్థితిలో చెప్పటం కష్టం. అందుకే చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి.. తక్షణం రకరకాల చుక్కల మందులతో వైద్యం అందిస్తారు. ఇలా కొన్ని రోజులు లేదా వారాలు చికిత్స చేస్తే అదంతా తగ్గి.. కనుగుడ్డు అసలు పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు కేవలం కార్నియానే దెబ్బతిందా? లింబస్ కూడా దెబ్బతిందా? దాన్ని మార్చాలా? ఇవన్నీ అప్పుడు నిర్ధారించి.. చికిత్స చేస్తారు. లింబల్ మూలకణాల మార్పిడి విధానం చక్కటి సత్ఫలితాలను ఇస్తోంది. ప్రామాణిక అంతర్జాతీయ వైద్య, పరిశోధన పత్రికలన్నీ ఈ పరిశోధన వ్యాసాలను ప్రచురించి, కితాబులిచ్చాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కొద్దినిమిషాల పాటు శుభ్రంగా కడగటం చాలా చాలా అవసరం. సాధ్యమైనంత త్వరగా కంటి వైద్యులను సంప్రదించాలి. కంట్లో పడినదేమిటో కచ్చితంగా వైద్యులకు చెప్పటం చికిత్సా విధానానికి ఉపయోగపడుతుంది. వైద్యులు కూడా కంటి నుంచి ఆ రసాయనం, దాని అవశేషాలు మొత్తం పోయే వరకూ శుభ్రం చేస్తారు. ఆ తర్వాత చికిత్స అందిస్తారు.
దేశంలో దాదాపు 89 లక్షల మంది కార్నియా సమస్యలతో అంధత్వాన్ని అనుభవిస్తుండగా వీరిలో కనీసం 15-20% మందికి ఈ మూలకణ మార్పిడి చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. కొందరికి ఒంట్లోని రోగనిరోధక వ్యవస్థ తమమీదే దాడి చెయ్యటం (ఆటోఇమ్యూన్ వ్యాధుల) వల్ల కూడా కంటిలో ఇటువంటి సమస్య తలెత్తుతుంది. వారికీ దీనితో ప్రయోజనం ఉంటుంది.''
నల్లగుడ్డు మీదికి తెల్లగుడ్డు దురాక్రమణ:కంటిలో లింబస్ భాగం దెబ్బతిన్నప్పుడు.. ఏకంగా తెల్లగుడ్డే ఇలా నల్లగుడ్డు మీదికి వ్యాపించటం ఆరంభిస్తుంది. తనతో పాటు అది రక్తనాళాలనూ నల్లగుడ్డు మీదకు వ్యాప్తి చేస్తుంది. దీంతో కనుగుడ్డే మూసుకుపోయి చూపు పోతుంది. సున్నం వంటి వాటివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఇదే.
ప్రమాదకారకాలు:
కంట్లో రసాయనాలు పడటం పెద్ద ప్రమాదం! నిత్యం మనం ఇంట్లో ఉపయోగించే ఎన్నో ఆమ్లాలు, ముఖ్యంగా క్షారాలు కనుగుడ్డును తినేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి:
* సున్నం కంటికి అతిపెద్ద శత్రువు. కిళ్లీల్లో ఉపయోగించే సున్నం కూడా ప్రమాదకరమైనదే.
* బ్లీచింగ్ పౌడర్. శుభ్రం చేసేందుకు ఉపయోగించే చాలా రకాల పౌడర్లలో అమ్మోనియా ఉంటుంది. ఇది ప్రమాదకరమైనది.
* అమ్మోనియా, పొటాష్ ఎరువులు
* బ్యాటరీల్లో ఉండే యాసిడ్, లోహాలను శుభ్రం చేసేందుకు పరిశ్రమల్లో బ్లీచ్‌గా వాడే సల్ఫరస్ ఆమ్లం, గ్లాసులకు పాలిష్ వేసేందుకు వాడే హైడ్రోఫ్లూరిక్ ఆమ్లం, నిత్యం ఇంట్లో వాడే వెనిగర్ (ఎసిటిక్ ఆమ్లం), అత్యంత ప్రమాదకరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం.. ఇవన్నీ ప్రమాదకరమైనవే.
* ఇటువంటి ప్రమాదాల బారినపడుతున్న వారిలో దాదాపు 75% శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. పరిశ్రమల్లోనే కాదు.. సున్నం పడటం వంటి ప్రమాదాలు ఇళ్లలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి.