Saturday 2 January 2016

Balanced Diet ten hints - పౌష్టికాహారానికి పది చిట్కాలు

పౌష్టికాహారానికి పది చిట్కాలు..


Food items for balanced diet

ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడంఅనేవి, ఆరోగ్యంగాఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా. మరి ఈ క్రింది సూచనలు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష కాగలవు.

1) వైవిధ్యంతో కూడిన పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోండి: మంచి ఆరోగ్యానికి మీకు దరిదాపుగా 40 రకాలు అయిన చిన్న పోషకాలు కావాలి. ఏ ఒక్కతరహా ఆహారమూ మీకు వాటిని ఇవ్వలేదు. మీ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా వుండవలసినవి: పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు లేదా పదార్థాలు; శాకాహారులు కాకుంటే మాంసం ఉత్పత్తులయిన చేపలు, చికెన్‌, ఇతర మాంసకృత్తులు, అలాగే తృణధాన్యాలు వంటివి. మీరు, ఈ తరహా ఆహారాలను, ఏ మోతాదులో తీసుకోవాలి అన్నదిమీకు అవసరం అయ్యే కేలరీల స్థాయిని బట్టి వుంటుంది.

2) సాధ్యమైనంత ఎక్కువగా తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోండి.

3) సమతుల శరీర బరువును కొనసాగించండి. మీ శరీరం బరువు ఎంత వుండవచ్చుననేది, పలు అంశాలపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు: మీరు పురుషులా, స్త్రీలా, ఎత్తు, వయస్సు, వారసత్వం లేదా జన్యువుల వంటి అంశాలు ప్రధానమైనవి. స్థూలకాయం వలన పలు వ్యాధులు రావచ్చు. మచ్చుకు: రక్తపోటు, హృద్రోగాలు, మధు మేహం, కొన్నిరకాల క్యాన్సర్లు మొదలైనవి చెప్పుకోవచ్చును. అయితే, దీనితో పాటుగా మీ శరీరం వుండాల్సినంత బరువును కలిగి లేకపోవడం కూడా ప్రమాదమే. దీనివలన: ఎముకల సమస్యలు, బుుతుస్రావ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చును. కాబట్టి మీ శరీరంబరువు అతిగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా వైద్యుల సలహాతో మీ ఆహార అలవాట్లను మార్చుకోండి. అలాగే, క్రమం తప్పని వైద్యం కూడా శరీరం బరువును తగిన స్థాయిలో ఉంచుకోగలిగేటందుకు ప్రధానం.

4) పరిమితంగా, వైవిధ్యంతో ఆహారాన్ని తీసుకోండి. ఏ ఒక్క ఆహార పదార్థాన్ని శృతిమించి తీసుకోకుంటే, భిన్నమైన ఆహార పదార్థాలను మీరు క్రమం తప్పకుండా, తీసు కోగలుగుతారు.

5) సమయ బద్ధంగా ఆహారం తీసుకోండి: తగిన సమయంలో, తగినంతఆహారం తీసుకోకపోవడం వలన శృతిమించి ఆకలి ఏర్పడితిన్నప్పుడుఒకేసారి, అతిగా తినే అవకాశం ఉంది. శృతిమించిన ఆకలితో ఆహారపు పౌష్ఠిక విలువల గురించి విస్మరించే ప్రమాదం ఉంది. భోజనానికీభోజనానికి నడుమ అల్పాహారం మంచిదే అయినా, అల్పాహారాన్ని అతిగా తీసుకుంటే అదే పూర్తిస్థాయి భోజనంగా తయారవ్వగలదు.

6) కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మెనూలోంచి తొలగించవద్దు; తగ్గించండిచాలు. మనలో పలువురం ఆహారాన్ని దాని పౌష్ఠిక విలువలతో పాటుగా, రుచికోసం కూడా తీసుకుంటాం. మీకు ఇష్టమైన ఆహారంలో కొవ్వు పదార్థాలూ,ఉప్పు లేదా తియ్యదనం (పంచ దార వంటివి) అధికంగా ఉంటేవాటిని పూర్తిగా వదిలివేయడం కంటే (వైద్యులుదీనికి భిన్నం గా చెబితే మినహా) వాటిని పరిమితంగా, తీసుకోండి. లేదా బాగా తక్కు వగా తీసుకోండి. ఈ రకం పదార్థాలు ప్రధానంగా ఉండేమీ ఆహారాలను గమనించుకొనిఅవసరం అయితే, మార్పులు, చేర్పులు చేసుకోండి.

7) ఒక నిర్ణీత కాల వ్యవధిలోమీ ఆహార సమతుల్యతను కొనసాగించండి: ప్రతీ ఆహారం ''అత్యుత్తమం''గా వుండాల్సిన అగత్యం లేదు. అతిగా క్రొవ్వులు, ఉప్పులు లేదా తియ్యదనం ఉన్న పదార్థాలనువాటితో సమతుల్యతనుకాపాడగల ఇతరేతర ఆహారాలతో కలిపి తీసుకోండి. ఒకరోజు, ఆహారంలో గనుకఈ సమతుల్యత లోపిస్తే, మరుసటిరోజున ఈ సమతుల్యతను కొనసాగించే విధంగా ఆహారం తీసుకోండి. లేదా ఒక నిర్ణీత కాలవ్యవధినిఈ సమతుల్యతను కొనసాగించండి.

8) మీ ఆహార స్వీకరణలో లోపాలను గమనించండి: మీ ఆహారపు అలవాట్లను మెరుగు పరుచుకునేందుకు దాని తాలూకు లోపాలను గమనించండి. కనీసం,మూడు రోజు లపాటు వరుసగామీరు తీసుకునే ఆహార పదార్థాల జాబి తాను రాసుకోండి. మీరు అతిగా క్రొవ్వు పదార్థాలూ, మాంస కృత్తులూ, పిండి పదార్థాలను తీసు కుంటున్నారేమో: గమనించండి. తర్వాతమీ, ఆహారంలో వీటిని పూర్తిగా తొలగించడం బదులుగా వాటి మోతాదును పరిమితం చేయండి. అలాగే, పండ్లు, కూరగాయలను తీసుకోవడంమీ శరీరంలో సమతుల పోషకాలకు తప్పనిసరి.

9) ఈ మార్పులు మెల్లమెల్లగా చేయండి. ఒకేసారి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం సాధ్యం కాకపోవచ్చును. కాబట్టి, ప్రయత్న పూర్వకంగా, మెల్లమెల్లగా వాటిని మార్చుకోండి.

10) ఏ ఆహారమూ పూర్తిగా మంచిది లేదా చెడ్డది కాదు:ప్రతీ ఆహార పదార్థంలోనూదాని గుణానికి అనుగుణం అయిన పోషకాలు వుంటాయి. కాబట్టి, దానిని పూర్తి గా పరిత్యజించనవసరం లేదు. పరిమితి మరచిపోకుంటే చాలు.

No comments:

Post a Comment