దోమ కాటు నుండి తప్పించుకునేందుకు వినియోగింఛే దోమల చక్రాలు , ఇతర రసాయనాలు , మనుషుల ఆరోగ్యము పై తీవ్ర ప్రభావము చూపిస్తాయి . చిన్న పిల్లల విషయము లో అయితే మరీను . రోజూ వీటిని వాడడం వలన ముఖ్యముగా పసికందుల నుంది 5 ఏళ్ళ పిల్లలు శ్వాసకోస ఇబ్బందులకు గురివనుతారు . ఇవి లేకుంటే దోమ కాటుకు గురై అనేక వ్యాధులతో పాటు ప్రశాంతం గా నిద్రపోలేని పరిస్థితికి లోనవుతారు . అమందువలన శ్వాసకోస వ్యాదులు , ఉబ్బసము ఉన్న వారు తప్ప మిగతావారంతా వీటిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తునారు . కొంతమందికి గొంతునొప్పి , కళ్ళమంటలు , ఊపిరి తీసుకోవడం లో ఇబ్బదులకు లోనవుతున్నారు .
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 27 లక్షల జనాబా ఉన్నారు . ఏటా 50 వేల మంది పిల్లలు జన్మిస్తున్నారు . జిల్లాలో 5 ఏళ్ళు లోపు పిల్లలు సుమారు 3 లక్షల మంది ఉన్నారు . ఇంతమంది కి ప్రభుత్వము అన్ని నివారణ చర్యలు తీసుకోలేదు . ఎవరి బాధ్యత వారికి ఉండాలి .
ఇంట్లో చిన్నపిల్లలు లేనిచో ఎటువంటి దోమ నివారణ రసాయనాలు వాడినా పరవాలేదు . దోమకాటువల్ల వచ్చే జబ్బులతో పోల్చితే ఈ పొగవలన వచ్చే శ్వాస ఇబ్బందులు ఈజీ గా తట్టుకోవచ్చును .
ప్రత్యామ్నాయ మార్గాలు :
- దోమలు లేకుండా నివారణమార్గాలు చేపట్టడం ,
- దోమతెరలను వాడడం ,
- చిన్నారులకు గొడుగు లాంటి చిన్న దోమతెరలు వాడాలి,
- ఇంటి కిటికీలకు , తలుపులకు దోమలు రాకుండా మెస్ లను వాడడం ,
- సాయంత్రం 5 గంటలు తరువాత ఇళ్ళ కిటికీలు , తలుపులు మూసే ఉంచాలి .
- కటుకరోహిణి , పసుపు , సాంబ్రాణి , ఎండిన వేపాకులు కలిపి పొడిచేసి ఇంట్లో సాయంత్రం 5 గంటల సమయమ్లో పొగవేస్తే దోమలు రావు .
No comments:
Post a Comment