Thursday, 21 January 2016

Antibiotics use in Children - పిల్లలకు యాంటీ బయోటిక్స్‌ జాగ్రత్తలు



  • పిల్లలకు యాంటీ బయోటిక్‌ మందులు వేస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము . యాంటి(Anti) అనంటే వ్యతిరేకమై(opposite)నది అని అర్ధము . జీవులు నశింపజేయడానికి ... తద్వారా వాటివల్ల కలిగే జబ్బులను నయము చేయడానికి వాడే రసాయనాలు .



  • వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా యాంటీ బయోటిక్‌ మందులను వాడొద్దు.



  • దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్‌ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు 3-7 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలావాటికి యాంటిబయోటిక్స్‌ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువ ఇవ్వటం, అవసరమైతే కొద్ది మోతాదులో నొప్పి నివారణ మందులతోనే ఇవి నయమవుతాయి.



  • కడుపు నిండుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీ బయోటిక్స్‌ వెయ్యద్దు. అలాచేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.



  • ఆంపిసిలిన్‌, అమాక్జసిలిన్‌ వంటి యాంటీ బయోటిక్స్‌ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే. వాటంతటవే తగ్గిపోతాయి. మందులు మానేయాల్సిన అవసరం లేదు.



  • పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా.. దద్దు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.



  • యాంటీ బయోటిక్స్‌ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

No comments:

Post a Comment