Wednesday, 27 January 2016

Computer Vision Syndrome - కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్





కాలం మారింది. తినే తిండిలో, కట్టే బట్టలో ఇలా వేసే ప్రతి అడుగులోనూ మార్పులు వచ్చాయి. ఇక పిల్లల పరిస్థితి వేరే చెప్పక్కరలేదు. వీరి ప్రతి కదలికలోను వైవిధ్యం ఉంటోంది. నూటికి ఎనభై శాతం మంది హైపర్‌ ఆక్టివ్‌ పిల్లలు ఉంటున్నారు. రోజులో దాదాపు 10 గంటలు కంప్యూటర్స్‌, టివీల ముందు గడుపుతున్నారు. వీరిలో ఎంతమంది టివీ చూసేముందు, కంప్యూటర్‌ వాడేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు? అంటే దాదాపు ఎవ్వరూ పాటించట్లేదనే చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పూర్తిగా కంప్యూటర్లతోనే పనిచేస్తున్నారు. వీరు ఎంతసేపూ పని ఎప్పుడు త్వరగా అవ్ఞతుందా అని చూస్తున్నారు తప్పితే, పనిచేసేటపుపడు జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మనిషికి కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వాడకం ఒక నిత్యకృత్యమైపోయింది. దానితోపాటే వివిధ రకాల జీవనశైలికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. ఈ రకమైన వ్యాధుల్లో కళ్లు తడి ఆరిపోవడం, కంటి నొప్పి, తల, మెడ కండరాల నొప్పులు మొదలైనవి ముఖ్యమైనవి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సుమారు 10 మిలియన్ల మంది కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌)కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్‌పై పని చేసే వారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

సివిఎస్‌ సమస్య ఉత్పన్నమవడానికి కంప్యూటర్‌ స్క్రీన్‌నుంచి వెలువడే రేడియేషన్‌ ఒక ప్రధాన కారణం. అలాగే పరిసరాలలోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కంప్యూటర్‌ ముందు కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌ మీద పని చేయడం వంటి కారణాలతోపాటు, దృష్టి లోపాలు కూడా సివిఎస్‌ కలగడానికి కారణమవుతాయి.

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ కింద పేర్కొన్న సూచనలు సహాయకారిగా ఉంటాయి.అర్హత కలిగిన నేత్ర వైద్యులతో పరీక్షలు చేయించుకుని, తడి ఆరిపోయిన కళ్లకు, దృష్టిలోపాలకు సకాలంలో సరైన చికిత్స చేయించుకోవాలి. యాంటిగ్లేర్‌ అద్దాలను వాడాలి.కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి కనీసం 10 నిముషాలపాటు విశ్రాంతి తీసుకోవాలి. చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

కంప్యూటర్‌పై పని చేస్తున్న సమయంలో కను రెప్పలు కొట్టు కోవడం తగ్గు తుంది. కనుక ఎక్కువసార్లు కంటి రెప్పలు మూసి తెరుస్తూ ఉండాలి.
సవ్య, అపసవ్య దిశలలో ఐదుసార్లు కనుగుడ్లు తిప్పడం వల్ల ఇబ్బంది తగ్గుతుంది.కండి తడి ఆరి పోయిన వారు (డ్రై ఐస్‌ సమస్యతో బాధపడేవారు) వైద్య సలహా మేరకు లూబ్రికెంట్‌ మందులను వాడాలి.

కంటిని నీటితో కడగడం, అశాస్త్రీయ పద్ధతుల్లో కంటి చుక్కల మందులను వాడటం వల్ల కంటి దృష్టి మరింత మందగించే ప్రమాదం ఉంది.కళ్లు లాగుతున్నా, తరచుగా తలనొప్పి, మెడనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స పొందాలి.

‘‘సివిఎస్’’ నివారించాలంటే....ఈ క్రింది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి :


1. కాంట్రాస్ట్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసిన పరిసర ప్రాంతాలలో, అదే విదంగా, స్ర్కీన్ పైన ఎక్కువ కాంతి ఉండే విధంగా చూడకూడదు. స్ర్కీన్ పైన కూడా డార్క్ నెస్ ఎక్కువ ఉంచకూడదు. దీనివలన లెటర్స్ కన్పించే అవకాశం తక్కువ....అంటే...స్ర్కీన్ బ్రైట్ నెస్ ను తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
2. యాంటీ గ్లేర్ : మానిటర్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళపై పడకుండా, నిరోధించటానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దీన్ని మానిటర్ కు అమర్చుకోవటం వలన కళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది.
3. కలర్ : కలర్స్ ను కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి.
4. వర్క్ స్టేషన్ : కంప్యూటర్ ను ఇన్ స్టాల్ చేసుకున్న పరిసర ప్రాంతాలలో వాతావరణం చక్కగా ఉండేటట్లు చూడాలి. అంటే ఎర్గానమిక్ చైర్స్ ను ఉపయోగించటం...కంప్యూటర్ ను ఒక పద్ధతి ప్రకారం సెటప్ చేసుకోవం వంటివి చేయాలి. ఉదాహరణకు : కీ-బోర్డ్, మౌస్ ను సులువుగా, ఉపయోగించే విధంగా, అదే విధంగా మన చేతులకు కంటే కింద ఉంటే విధంగా సెటప్ చేయాలి. తరుచుగా ఉపయోగించే ఆబ్జెక్టులను కూడా మానిటర్ కు దగ్గరగా ఉంచటం వలన వాటికోసం వెతకనవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది.
5. మోనిటర్ : సాదారణంగా మానిటర్ మధ్య భాగం, కళ్ళతో పోల్చినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు కిందకు ఉండాలి. దీనివలన కంటి రెప్పలు, కల్ళను కొంత వరకూ కప్పి ఉంచుతాయి. దీనితో కళ్ళు ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదే విధంగా కంటికి స్క్రీన్ కు మధ్య దూరం 55 నుంచి 75 సెంటీ మీటర్స్ వరకూ ఉండాలి.

No comments:

Post a Comment