- 21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది. ఈ సమస్య ఎంతమేరకు వ్యాపించిందో నిర్ధిష్టంగా తెలియకపోయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలలో 20-40 శాతం మంది వయోజనులు, 10-20 శాతం మంది పిల్లలు, యువత దీని బారిన పడుతున్నారని అంచనా. స్థూలకాయం పెరగడానికి కారణాలలో ప్రధానమైనది గ్రామీణ జీవనం నుంచి నగర జీవితానికి పరివర్తన చెందడం, వ్యక్తులకు భౌతిక వ్యాయామం లేకపోవడం. స్థూలకాయాన్ని మందులు లేకుండానే తగ్గించవచ్చు. అయితే దాని వ్యాప్తి గురించి, రావడానికి కారణాలు, జీవితంపై దాని ప్రభావం, సామాజిక, మానసిక ప్రభావాలు, మరణానికి చేరువ చేసే దాని సామర్ధ్యం గురించి సరైన అవగాహన ఉండాలి.
-
నిర్వచనము : ఆరోగ్య పరం గా చెడు ప్రభావము చూపే విధం గా శరీరము లో కొవ్వు అధికం గా పెరుకుపోవడాన్నే ఉబకాయము (obesity) అంటాము . ఇది ఎన్నో అనారోగ్యాలకు (జబ్బులకు) కారణమవుతుంది . బాడీ మాస్ ఇన్దెక్ష్ (BMI) దీనికి కొలమానము గా పరిగనిస్తారు
బి.యం.ఐ = బరువు కిలో గ్రాముల్లో /ఎత్తు స్క్వేర్ (మీటర్లలో) (BMI = weight in kg/height ^2 in meters)
BMI Classification
<> underweight
18.5–24.9 normal weight
25.0–29.9 overweight
30.0–34.9 class I obesity
35.0–39.9 class II obesity
≥ 40.0 class III obesity
ఉబాకాయాన్ని మూడు విధములు గా వర్గీకరించారు . క్లాస్ 1, క్లాస్ 2 , క్లాస్ 3 . పై టేబుల్ లో చూడవచ్చును .
కలిగే అనర్ధాలు :
గుండె జబ్బులు - హార్ట్ ఎటాక్ , యాంజైన , బి.ఫై , హార్ట్ ఫైల్యూర్ , హై కొలెస్టిరాల్ , డీప్ వెయిన్ త్రోమ్బోసిస్ ,
మదుమేహ వ్యాధి -టైపు 2 దయబిటీస్ ,
నిద్రలో శ్వాశ తీసుకోవడానికి కష్టము గా ఉంటుంది .
కొన్ని రకాల కాన్సెర్ జబ్బులు ,
కీళ్ళ నొప్పులు (Osteoarthritis) -గౌట్ , నడుము నొప్పి ,
శరీర ఆకృతి లో పలుమార్పులు (Disfiguration) ,
పెళ్ళైన తరువాత గర్భం దాల్చడం ఇబ్బందులు (conceiving problems) పిల్లల పుట్టుక లో కొన్ని అవకతవకలు ,
ఫంగల్ చర్మ వ్యాదులు ఎక్కువ ,
రుతుక్రమములో తేడాలు ,
డిప్రషన్ , సమాజము లో ఒంటరి తనము ,
ఊబకాయానికి కారణాలు :
ఎక్కువ క్యాలరీస్ ఆహారము తీసుకోవడం,
శరీర వ్యాయామము లేకపోవడం ,
వంశ పారంపర్యం ,
ఎండో క్రయిన్ అసమతుల్యము వలన ,
ఏ కారణము తెలియనివి (UnknownCause),
ట్రీట్మెంట్ :
ఎక్కువ పీచు పదార్ధము ఉన్న ఆహారము - ఆకుకూరలు , కాయకురాలు గింజలు గల ఆహారము ,
రోజు వ్యామాము చేయాలి ,
ఆహారము తక్కువగా తీసుకోవము ,
తైరాయిడ్ జబ్బులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి ,
మంచి డాక్టర్ ను కలిసి - యాంటి ఒబీసిటి మందులు వాడాలి ,
తిండి ముందు ఎంత నోరు కట్టేసుకుని కూర్చున్నా బరువు తగ్గట్లేదా?
...అయితే రోజు మార్చి రోజు ఉపవాసం ఉండి చూడండి. బరువు తగ్గడం బహు సులభం అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. పదహారు మంది స్థూలకాయులపై పదివారాల పాటు ఒక క్రమపద్ధతిలో వారు జరిపిన అధ్యయనంలో తేలిన ఫలితమిది. వారికి తొలి రెండు వారాల పాటూ మామూలుగానే ఆహారమిచ్చారు. మిగతా ఎనిమిది వారాల్లో రోజు విడిచి రోజు తిండి బాగా తగ్గించి పెట్టారు. రోజుకు 1800-2200 క్యాలరీల ఆహారం అవసరమైతే అందులో 20 నుంచి 25 శాతం మేర మాత్రమే తిననిచ్చారు. పదివారాల తర్వాత చూస్తే ఒక్కొక్కరూ వారి శరీరతత్వాన్ని బట్టీ 3 నుంచి 13 కేజీల దాకా తగ్గారు. శరీరానికి హానిచేసే తక్కువ సాంద్రత గల కొవ్వు(ఎల్‌డీఎల్), ట్రైగ్లిజరైడ్‌లూ, రక్తపోటు స్థాయులూ కూడా బాగా తగ్గినట్టు గమనించారు.
నిద్రలేమితో వూబకాయం
అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట హాయిగా నిద్రపోండి. లేకపోతే వూబకాయం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోని కేస్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. రాత్రిపూట రోజుకి ఏడు గంటల పాటు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు వూబకాయులయ్యే అవకాశం 70 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పులే దీనికి కారణమవుతున్నాయి.
నిద్రలేమి మూలంగా శరీరంలో లెప్టిన్, ఘ్రెలిన్ అనే హార్మోన్ల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. కొవ్వు తగినంతగా ఉందని చెప్పేందుకు కొవ్వు కణాలు లెప్టిన్‌ను విడుదల చేస్తాయి. ఇది తక్కువగా తినమని శరీరానికి సూచిస్తుంది. మరోవైపు ఘ్రెలిన్ ఆహారాన్ని తీసుకోవాలంటూ మెదడుకు సంకేతాలు పంపిస్తుంటుంది. సరిగా నిద్రపోతే లెప్టిన్, మెలకువగా ఉంటే ఘ్రెలిన్ అధిక మోతాదులో విడుదలవుతాయి. అంటే నిద్రలేమి వల్ల ఆకలి పెరగటం వల్ల తిండి కూడా ఎక్కువెక్కువగానే తింటారన్నమాట. ఇలా రాత్రిపూట మాత్రమే కాదు, తెల్లారిన తర్వాత కూడా తింటుంటారు. అది కూడా పండ్లు, కూరగాయల వంటివి కాకుండా స్వీట్లు, పిండి పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండేవి తీసుకోవటం వల్ల కేలరీల మోతాదూ పెరుగుతుంది. దీంతో జీవక్రియలు మందగించి చివరికి బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా శరీరం కేలరీలను తగినంతగా వినియోగించుకోలేదు. పైగా నిద్రించాల్సిన సమయంలో మెలకువగా ఉంటే దెబ్బతిన్న కణాలను సరిచేసుకోవటం, మెదడుకు విశ్రాంతి దొరికే అవకాశం కూడా తగ్గిపోతుంది.--- ఈనాడు సుఖీభవ 21-09-2010.
ప్రశ్న: శరీరంలోని జన్యువుల కారణంగానే వూబకాయం వస్తుందా?
జవాబు: ఒక వయసులో ఉండవలసిన బరువుకన్నా చాలా ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి వూబకాయానికి కారణం 60 శాతం వరకూ జన్యు సంబంధమైన సమస్యేనని అనుకోవచ్చు. శరీరంలో ఆకలిని ప్రభావితం చేసే జన్యువులు కొన్ని ఉంటాయి. అవి ఆకలిని ప్రేరేపించే, ఆకలిని తీర్చే హార్మోన్లను విడుదల చేస్తాయి. అవి కొందరి విషయంలో తిన్న ఆహారాన్ని మండించి శక్తిగా మార్చకుండా కొవ్వు రూపంలో దేహంలోని వివిధ భాగాల్లో నిలువ చేస్తాయి. ఈ లోపం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువుల వల్ల ఏర్పడిందే. కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే ఊబకాయాన్ని కొంతవరకూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా తగ్గించవచ్చు. కానీ జన్యుపరంగా వచ్చిన వూబకాయం విషయంలో ఇది సాధ్యం కాదు. మెదడులో ఆకలిని ప్రేరేపించే హార్మోన్ ఉండే ప్రదేశం జన్యు ప్రభావం వల్ల ఎప్పుడూ చురుగ్గా పని చేస్తూ ఉంటే ఊబకాయాన్ని తగ్గించడం అసాధ్యం. ఇలాంటి వారికి వైద్య చికిత్స ఒకటే పరిష్కారం.
ఎండ తగలకపోతే ఊబకాయం ఖాయం
ఎండను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్ అందదు.
డి విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది.
శరీరంలో క్యాల్షియమ్‌కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్‌లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే.
వూబకాయం నుంచి బయట పడాలంటే డి vitamin -- సి పట్టండి
వూబకాయం నుంచి బయట పడాలంటే మితాహారం, వ్యాయామమే కాదు తగినంత సూర్యరశ్మిని గ్రహించడమూ ముఖ్యమేనని చెబుతోంది ఓ తాజా పరిశోధన. ఉదయం పదకొండులోపూ సాయంత్రం మూడు తర్వాతా ఉండే ఎండలో మనకు కావాల్సిన విటమిన్-డి లభిస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగించడంలో దీనిది ముఖ్యపాత్ర. విటమిన్-డి తక్కువైతే మనశరీరంలో, ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. కేవలం వూబకాయం మాత్రమే కాదు, క్యాన్సర్‌కూ ఇది మందు. విటమిన్-డి తగినంత లేకుంటే క్యాన్సర్ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్ డి లేమి కారణంగా అల్జీమర్స్, ఒత్తిడి, మధుమేహం వంటి వ్యాధులూ వస్తాయి. శరీరంలోని కణాలచుట్టూ ఉండే రక్షణ కవచం ఏర్పడటంలో విటమిన్-డి పాత్ర కీలకం. అర్థమైందిగా, చలికాలం కదా అని ఎనిమిదివరకూ ముసుగు తన్ని పడుకోకుండా, కాస్త ముందేలేచి అలా ఎండలో కాసేపు నడవాలి మరి!
క్రమం తప్పిన నెలసరితో స్థూలకాయం,Obesity in girls of irregular periods :
యుక్తవయసు అమ్మాయిల్లో నెలసరి క్రమం ప్రకారం రాకుండా అస్తవ్యస్తంగా తయారవ్వటం తరచుగా కనిపించే సమస్యే. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ ఇలాంటి అమ్మాయిలకు అధిక బరువు, స్థూలకాయం ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బు లక్షణాలు కూడా త్వరగానే బయటపడుతున్నట్టు వెల్లడైంది. నెలనెలా రుతుక్రమం సరిగా కాకపోవటానికి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) సమస్య కారణం కావొచ్చు. హార్మోన్ల వ్యత్యాసం మూలంగా కనబడే ఇది.... సంతానం కలగకపోవటం, స్థూలకాయం వంటి వాటికీ దారితీస్తుంది. బాడీమాస్ ఇండెక్స్, నడుం చుట్టుకొలత అధికంగా ఉండటం, మధుమేహం ముప్పులకు నెలసరి సమస్యలతో ఎంతమేరకు సంబంధం ఉందోననే దానిపై అమెరికాలోని నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. పద్నాలుగు ఏళ్ల నుంచి ఆపైన వయసు గలవారిని ఇందుకు ఎంచుకున్నారు. వీరి రుతుక్రమంతో పాటు సెక్స్ హార్మోన్లు, గ్లూకోజ్, ఇన్స్‌లిన్, రక్తపోటు స్థాయులను కూడా పరిశీలించారు. 42 రోజుల తర్వాత నెలసరి వస్తున్నవారు 14 ఏళ్ల వయసులోనే అధిక బరువు కలిగి ఉంటున్నట్టు గుర్తించటం గమనార్హం. అధ్యయనం సాగుతున్నకొద్దీ వీరి బరువు, నడుం కొలత కూడా పెరుగుతూనే ఉంది కూడా. ఈ అమ్మాయిలు 25 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి మిగతావారితో పోలిస్తే వీరి బాడీమాస్ ఇండెక్స్ సగటున 37.8గా నమోదైంది. ఇది స్థూలకాయానికి సూచిక. అంతేకాదు వీరిలో ఇన్స్‌లిన్, రక్తంలో చక్కెర శాతం కూడా అధిక మోతాదుల్లోనే కనిపించాయి. అయితే వీటికి నెలసరి సరిగా కాకపోవటమే కారణమవుతున్నది అని అధ్యయనంలో నిర్ధారణ కాలేదు. కానీ నెలసరి సరిగా రాకపోవటానికి జీవక్రియల్లో మార్పులను బట్టి (ఇన్స్‌లిన్ మోతాదు పెరగటం లాంటివి) అండాశయాలు స్పందించటం వంటి ఇతర అంశాలేవైనా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంటే మధుమేహ సంబంధ ముప్పులు నెలసరి సమస్యలకు ముందు నుంచే ఆరంభమవుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయటం లేదనటానికి నెలసరి సరిగా కాకపోవటం ఓ హెచ్చరిక అనుకోవచ్చు.
బరువు.. కాస్త తగ్గినా క్యాన్సర్ దూరం
వూబకాయం తెచ్చిపెట్టే అనర్థాలు ఎన్నెన్నో. దీంతో పలు రకాల సమస్యలు ముంచుకు రావొచ్చు. అయితే ఊబకాయులు ఏమాత్రం బరువు తగ్గినా మంచి ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగిడిన మహిళలు ఓ మోస్తరుగా బరువు తగ్గినా క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు బయటపడింది. వీళ్లు తమ శరీరబరువులో కనీసం 5 శాతం బరువు తగ్గినా సరే. రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్‌లుకైన్-6 వంటి వాపు సూచికలు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. ఈ వాపు సూచికలు పెరిగితే గుండెజబ్బుతో పాటు రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఊబకాయ స్త్రీలు తక్కువ కేలరీ ఆహారం తీసుకోవటంతో పాటు వ్యాయామం ఎక్కువగా చేయటం ద్వారా బరువు తగ్గితే క్యాన్సర్ ముప్పూ తగ్గుతున్నట్టు ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అధ్యయనకర్త డాక్టర్ అన్నే మెక్‌టీర్నర్ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరిని ఎంచుకొని తక్కువ కేలరీలు ఆహారం తీసుకోవాలని, రోజుకి 45 నిమిషాల సేపు (వారంలో ఐదు రోజులు) ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని సూచించారు. వీలైతే రెండూ పాటించాలనీ చెప్పారు. ఏడాది తర్వాత తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో సీ-రియాక్టివ్ ప్రోటీన్ 36 శాతం, ఇంటర్‌ల్యూకిన్ 26% తగ్గింది. కేలరీలు తగ్గించటంతో పాటు వ్యాయమమూ చేసినవారిలో సీ-రియాక్టివ్ ప్రోటీన్ 42 శాతం, ఇంటర్‌ల్యూకిన్ 24 శాతం తగ్గింది. కనీసం 5% బరువు తగ్గినవారిలో ఈ స్థాయులు గణనీయంగా పడిపోవటం గమనార్హం. మెనోపాజ్‌లోకి అడుగిడిన వారిలో సీ-రియాక్టివ్ ప్రోటీన్ 40% తగ్గితే రొమ్ము, ఎండోమెట్రియల్, తదితర క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బరువు తగ్గటం వల్ల కొవ్వు కణాలు కుంచించుకుపోయి వాపు కారక హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. వాపు మూలంగా గుండెజబ్బులతో పాటు పలు సమస్యలూ ముంచుకొస్తాయి కూడా.
ముంచెత్తుతున్న వూబకాయ సునామీ :
ప్రపంచంలో 30% మంది అధికబరువు గలవారే--అరికట్టటంలో అన్ని దేశాలూ విఫలం-- తాజా విశ్లేషణలో వెల్లడి--
లండన్: ప్రపంచాన్ని వూబకాయ సునామీ ముంచెత్తుతోంది. ప్రస్తుత ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది వూబకాయులేనని తాజా విశ్లేషణలో తేలటమే దీనికి నిదర్శనం. ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదు. గత మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయులు సంఖ్య పెరగటాన్ని అరికట్టలేకపోవటం గమనార్హం. ప్రపంచంలోని 200 కోట్ల మంది (30%) అధిక బరువు లేదా వూబకాయం గలవారేనని పరిశోధకులు గుర్తించారు. వూబకాయుల సంఖ్యలో మధ్య తూర్పు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు అన్నింటికన్నా ముందున్నాయి. అక్కడ 60% మంది పురుషులు, 65% మంది స్త్రీలు వూబకాయులేనని తేలింది. ఇక అమెరికాలో మరే దేశంలోనూ లేనంత ఎక్కువగా.. 13% మంది వూబకాయులు ఉన్నట్టు బయటపడింది. భారత్, చైనా.. రెండు దేశాల్లో కలిపి 15% మంది వూబకాయులు ఉన్నట్టు వెల్లడైంది. ఇది చాలా తీవ్రమైన విషయమని అధ్యయన నేత, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టఫర్ ముర్రే వ్యాఖ్యానించారు. ఆయన తన బృందంతో కలిసి 1980-2013 మధ్య 188 దేశాల్లో చేసిన 1,700 అధ్యయనాలను సమీక్షించి విశ్లేషించారు.
బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రూపొందించిన ఈ నివేదిక ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌లో గురువారం ప్రచురితమైంది. మూడు దశాబ్దాలుగా ఏ దేశమూ వూబకాయాన్ని తగ్గించలేకపోయినట్టు తేలిందని, అందువల్ల ఇది ఎంత కష్టమైన సవాలో అర్థమవుతోందని ముర్రే వ్యాఖ్యానించారు. ఆదాయానికీ వూబకాయానికీ బలమైన సంబంధం కనబడుతోందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ధనవంతులుగా మారుతున్నకొద్దీ వారి నడుం చుట్టుకొలత కూడా పెరుగుతూ వస్తోందని వివరించారు. అమెరికా, బ్రిటన్ వంటి సంపన్నదేశాల్లో ఈ ధోరణి తగ్గుతున్నప్పటికీ.. అది చాలా స్వల్పంగానే ఉందని పెదవి విరిచారు. వూబకాయంతో పాటు మధుమేహం కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారని, అలాగే క్యాన్సర్ల సంఖ్య కూడా పెరుగుతోందని హెచ్చరించారన్నారు.
Medical Tips in Telugu - All Medical Related Queries, Some Common Medical Problems And Solutions, Medical Knowledge, Medical Tips
Wednesday, 30 December 2015
Obesity in Now a Days - ఊబకాయము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment