Ayurvedic Medicine Information - ఆయుర్వేదము
ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరవాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. దీనిలో అనేక సాంప్రదాయములు కలవు.
ఆయుర్వేదం మందు :
ప్రక్రుతి లో దొరికే , మందుగా వాడ దగ్గ ఆకులు , కాయలు , vaeLLu , పువ్వులు , గింజలు(విత్తనాలు) , బెరడు , మందు గా వాడే లోహాలు , మూలకాలు , రసాయనాలు ... ఒక్కటిగా గాని , కలిపిగాని ... లేహము రూపం లోనో , పౌడర్ రూపం లోనో , టానిక్ రూపంలోనో , పచ్సిగానో .. వండి గాని రోగానివారణకు వాడే దాన్నే ఆయుర్వేదిక్ ఔషదం అంటాము . ( definition : Crude extract of naturally available leaves , roots ,barks, flowers , nuts , medicinal metals , medicinal minerals , medicinal chemicals ... used as medicine).
ఆయుర్వేదం (Ayurveda) . దీనిలో అనేక సాంప్రదాయములు కలవు. ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు .
పౌరాణిక గాథలు:
వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకొనిరి అన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ
ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.
చారిత్రక ఆభివృద్ధి:
ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశి రాజగు దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.
ఇతర వైద్యవిధానాలతో పోలిక:
ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు మరియు రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.
No comments:
Post a Comment