సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా పరిస్కారము కాని సమస్యలు అనేకం ఉన్నాయి . మనిషికి సంభవించే అనేక అనారోగ్యలము మందులు కనుగొన్నా ప్రతి ఒక్కరికీ వేధించే జలుబుకి (common cold) ప్రత్యేకం గా చికిత్స నేటివరకు సాధ్యము కాలేదు .
వాతావరణంలో మార్పు చోటుచేసుకొన్నప్పుడల్లా ముక్కు మొరాయస్తుంది. పడిశం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్టు అనీ అనిపించగానే తుమ్ములు, ముక్కునుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయ. అందుకే పడిశం పదిరోగాలపెట్టు అంటారు. పడిశం చేయగానే తలనుంచి పాదం దాకా అన్ని అవయాలు నొప్పి అనిపిస్తాయ. గాలి ఆడకుండా ముక్కు దిబ్బడి వేసినట్టుగా ఉంటుంది.
జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారినపడని మని షంటూ ఎవరూ ఉండరు.చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా ప్రతివారూ ఎప్పుడోఒకప్పుడు జలుబుబారిన పడుతుంటారు. జలుబు మనిషికి ఎంతటి సహజమైనదో, అంతటి సర్వసాధారణమైనది. సగటున మనిషి ఏడాదికి రెండుసార్లు అయినా జలుబుతో బాధపడుతుంటాడని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి అంచనా. జలుబు రావడానికి కనీసం 200 పైచిలుకు వైరస్‌లు కారణంగా ఉంటాయి. మనిషినుంచి మనిషికి మారుతున్న కొద్దీ ఈ వైరస్‌ల జన్యు నిర్మాణం మారిపోతుంటుంది. అంటే భార్యాభర్తలలో ఒకరినుంచి మరొకరికి జలుబు అంటుకుంటే, ఆ ఇద్దరి జలుబు ఒకటి కాదన్నమాట. అయితే, ముక్కు చీదడం, తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు మాత్రం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి.
అపోహలు:
జలుబు విషయంలో మనుష్యులలో రకరకాల అపోహలు చోటు చేసుకుని ఉన్నాయి. వర్షంలో తడిస్తే...వర్షంలో తడిస్తేజలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. వర్షంలో తడిసినంత మాత్రం చేత జలుబు చేయదు. నిజానికి జలుబు మూసి ఉన్న తలుపులోపలే,అంటే ఇంటిలోపలే అంటుకుంటుంది. జలుబు వైరస్‌లు మాయిస్ట్ హీట్‌లో వృద్ధి చెందుతాయి. అంటే మీరు బైట వర్షం కురుస్తున్నప్పుడు ఇంటిలోపలే ఉంటారు.గదిలోపలి చెమ్మగిల్లిన వేడి వాతావరణంలో వైరస్ వలన జలుబు చేస్తుంది.
ఇది వర్షాకాలము , ఆపైన వచ్చేది చలి కాలము లోను , వర్షం లో తడవడము , చలికాలపు మంచులో తిరగడము వల్ల ప్రతి వక్కరినీ వేధిస్తుంది ఈ జలుబు . ముక్కు కారడం తో మొదలై తలనొప్పి , జ్వరము , దగ్గు , వల్లునోప్పులు తలబరువుగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నా ఈ జలుబును రాకుడా చూసుకోవడమే మంచిది ... ఒక వేళ వచ్చినా మందులు వాడినా వాడకపోయినా ఒక వారము రోజులలో తగ్గుముఖం పడుతుంది . ఈ జలుబునే ఎలర్జీ జలుబు అంటాము. కాని కొన్ని వైరస్ క్రిముల వల్ల వచ్చే జలుబు అయితే మాత్రం డాక్టర్ ని సంప్ర డించాల్సిందే . జలుబు ముఖ్యము గా పిల్లలను పట్టి పీడిస్తుంది . . . ఇది వైరస్ వల్ల నే వస్తుంది .
టిప్స్ :
1 . వ్యాపించే విధానము : సాధారణ జలుబు ఒకరి నుండి మరొకరికి స్పర్శద్వారా , గాలిద్వారా , వస్తువుల ద్వారా వ్యాప్తిచెండుతుంది . చేయిగాని , కర్చీప్ గుద్దగాని తుమ్మ , దగ్గు వచ్చినపుడు అడ్డం గా పెట్టుకోవాలి .
2. జలుబు క్రిములు తుమ్మినా , దగ్గినా చుట్టుప్రక్కల ఉన్నా వస్తువులపై పడి ఇతరులకు వ్యాప్తిచెందుతాయి కావున చేతులు సబ్బుతో సుబ్రం గా కడుగుకోవాలి .
౩ . జలుబు ఉన్నపుడు నోరు పాడవుతుంది , జ్వరం వస్తుంది కావున ఎంతోకొంత డీహైడ్రేషన్ వస్తుంది . నీరు ఎక్కువగా త్రాగాలి ... సుమారు 1.5 నుండి 2 లీటర్ల నీటిని త్రాగాలి . నీరు తాగడానికి ఇష్టం లేనపుడు ఏ ద్రవ రూపములోనైనా నీరు తీసుకోవచ్చును .
4. జలుబు వల్ల కలిగే నీరసము పోవడానికి మంచి ఆహారము తీసుకోవాలి . వేడి పదార్ధాలు తినాలి . తేలికగా జీర్ణం అయ్యే ఆహారము నే తీసుకోవాలి . ఉడికించిన కూరలు , పాలు , రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మజాతి పదార్ధాలు తిననాలి .
5. జలుబు ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాలి . ఆఫీసుకి , పనులకు వెళ్ళకూడదు . తలుపులు మూసిన గదిలో ఉండకుండా బాగా గాలి వచ్చే ప్రదేశం లో విశ్రాంతి తీసుకోవాలి , చల్లని గాలి , మంచు లో తిరగకూడదు . తక్కువ తేమ , ఓ మోస్తరు వేడి ఉన్నా గదిలో ఉన్న్డాలి .
6. జలుబు ఉన్నా వారు బాగా అలిసిపోయే పనులు చేయకూడదు ... అలాగని ముసుగుతన్ని పడుకోకూడదు . ఉసారుగానే తిరగాలి . చురుకుదనం వల్ల శరీరము లోని రోగనిరోధక శక్తి మెరుగు పడుగుంది .
7. జలుబు ఉన్నవారు వేడినీరు స్నానం చేయండి . తలస్నానం చేయకూడదు . వేడినీరు స్నానం శరీర రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది .
8. జలుబుకి వాడే ఆయింట్ మెంట్లు ముక్కు కు రాయవచ్చును , వేడినీటిలో వేసి ఆవిరిపీల్చడం మంచిది .
9. మత్తుపానీయాలు తీసుకోకూడదు . పొగ తాగకూడదు . ఐస్ క్రీములు , చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు .
10. గొంతు నొప్పి ఉంటే జలుబు లేపనములు (ointments) గొంతు పైన రాయవచ్చును . వేడి కాఫీ , తీ , పాలు తీసుకుంటే గోతులో గురగుర తగ్గుతుంది .
చికిత్స చేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది. చికిత్స చేయకపోతే ఏడురోజులకు తగ్గుతుంది... అనేది జలుబుకు సంబంధించి చెప్పే ఓ పాత సామెత. అంటే వైద్యం చేసినా, చేయకపోయినా జలుబు వస్తే ఓ వారం పాటు బాధపడక తప్పదు అనేదే ఈ సామెతలోని అంతరార్థం.
సాధారణ జలుబు:
ఎలా వస్తుంది?
జలుబు తో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా,చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి.ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది.
జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని,చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి చీదిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి.
చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ప్రధానంగా వ్యాపించదు.ఈ వాతావరణ మార్పు జలుబు వ్యాప్తిలో పెద్దగా ప్రభావితము చూపించదు.
ఎంతకాలం వుంటుంది?
* జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన,ఆ వైరస్ రకాల పైన ఆధారపడి వుంటుంది.
* సాధారణంగా జలుబు 2 - 7 రోజుల మధ్య ఉంటుంది.విపరీతమైన జలుబు, దగ్గుతో కూడిన జలుబు వారం నుండి రెండు వారాల వరకు వుండవచ్చును.
జలుబు తగ్గించే విధానాలు:
* ఆహారం:-జలుబు ఉన్నప్పుడు,కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.
* తాజా పళ్ళ రసాలను, కాయకూరలు అధికంగా తీసుకోవాలి.
* మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది.
* వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.
* గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది.
అంతా బాగానే ఉంది. మరి వారం రోజులపాటు జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? జలుబు బాధలు తగ్గేందుకు ఇంగ్లీషు వైద్యంలో ఇప్పుడు బేషైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే జలుబులాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...
వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడి తగ్గకుండా చేస్తే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది.
వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది.
ఓ గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది.
ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత ఓ నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.
చికిత్స :
జాగ్రత్తలు-
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వలన మనలోని రోగనిరోధక యంత్రాంగం బలోపేతమవుతుంది. తద్వారా జలుబులాంటి అస్వస్థతలు మన దరికి రాకుండా ఉంటాయి.నడక, జాగింగ్, ఈతకొట్టడం, సైకిల్ తొక్కడం వంటివి రోజుకు ఒక అరగంట చేస్తే సరిపోతుంది.
మానసిక వత్తిడి:
మీరుగమనించారో లేదో కాని, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఏవైనా తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎక్కువగాజలుబు చేస్తుంటుంది. మాన సిక వత్తిళ్లు మనలో రోగ నిరోధక శక్తిని దెబ్బ తీయటం అందుకు కారణం.
నీళ్లు ఎక్కువ తాగాలి:
మంచినీరు, టీ, పళ్ల రసాలు మొదలైన ద్రవ పదార్థాలు పుష్కలంగా లోపలికి తీసుకుంటే మనం జలుబుకు దూరంగా ఉంటామని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
తలుపులు తెరిచి ఉంచండి:
జలుబు చేసిన మనిషి దగ్గినా, తుమ్మినా మిలియన్ల కొద్దీ వైరస తుంపరలు గాలిలో వ్యాపిస్తాయి. అందుకే జలుబు చేసిన మనిషి దగ్గుతున్నప్పుడూ, తుమ్ముతున్నప్పుడూ నోటికి చేతిని అడ్డంపెట్టుకోవటం మంచిది. జలుబు చేసిన మనిషి ఇంట్లో ఉండి, ఆ ఇంటి కిటికీ తలుపులు మూసేసి ఉంటే, అతడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు జలుబు వైరస్‌లు బైటికిపోయే వీలులేక ఇంటిలోపలే ఉండిపోయి మిగతా వాళ్లకు తేలికగా అంటుకుంటాయి.
తేమ వాతావరణం:
పొడి వాతావరణంలో జలుబు వైరస్‌లు తేలి కగా వ్యాప్తి చెందుతాయి. తేమ వాతావరణంలో వ్యాప్తి చెందవు.
విశ్రాంతి:
కొందరు జలుబు చేసినప్పుడు ఒంట్లో బాగులేదంటూ ఆఫీసునుంచి లేదా, కాలేజినుంచి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. జలుబు చేసిన ప్రతివారూ ఈ పద్ధతి పాటించడం మంచిది. దాని వలన ఇతరులకు జలుబు అంటకుండా కాపాడిన వారవుతారు.
తగ్గించే మార్గాలు:
విటమిన్ సి : విటమిన్ సి, పెన్సిలిన్ లేదా యాంటి బయాటిక్స్‌లాంటివి జలుబును తగ్గిస్తాయనుకోవడం భ్రమ మాత్రమే. యాంటిబయాటిక్స్ వంటివి బాక్టీరియా వలన వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి తప్ప వైరస్ వలన వచ్చే జలుబులాంటి అస్వస్థలకు ఉపయోగపడవు. విటమిన్ సి మన శరీరంలో ఉండే నానాచెత్తనూ బైటికి పారదోలే స్కావెంజర్‌లా పని చేస్తుంది. జలుబును అది పూర్తిగా తొలగించలేదు కాని, వారం రోజుల పాటు ఉండే దాని రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేట్లు చేస్తుందని అంటున్నారు ఈ విషయంలో నిష్ణాతులైన డాక్టర్లు.
ఆహారం:
జలుబు చేసినప్పుడు కొవ్వు గల ఆహార పదా ర్థాలు, మాంసం, పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోండి. తాజా పళ్ల రసాలు, కాయగూరలను ఎక్కువగా తీసుకోండి.
సిగరెట్లు మానండి:
పొగ తాగడం వల్ల గొంతు మండుతుంది. జలుబు ఆ మంటను మరింత పెంచుతుంది. ముక్కులోపల ఉండే సిలియా అనే చిరు వెంట్రుకల లైనింగ్ ముక్కులోనికి ప్రవేశించే బాక్టీరియా గొంతులోకీ, ఊపిరితిత్తులకూ పోకుండా అడ్డుకుంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం జరిపే సిలియా చర్యలను పొగతాగడం నిరోధిస్తుంది. కనుక జలుబు రోజులలోనైనా పొగ తాగడాన్ని తగ్గించడం లేదా మానుకోవడం మంచిది.
ఉప్పునీటి పుక్కిలింత:
జలుబుతో బాధపడుతున్నప్పుడు ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్పునీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల కొంత రిలీఫ్ లభిస్తుంది.
ఆవిరి కాపడం:
ఇది మన పెద్దవాళ్లు పాటించే పద్ధతే. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్స్‌ను కాని, అమృతాంజన్‌ను కాని కలిపి తల మీద దుప్పటి కప్పుకుని ఆ ఆవిరిని గాఢంగా ముక్కుద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.
జలుబుకి ... మార్కెట్ లో దొరికే (Anticold)జలుబు మాత్రలు వాడవచ్చు . ఉదా : Zincold , Coldact ,
జ్వరానికి : పారాసెటమోల్ (Paracetamol)
దగ్గుకి : ఏదైనా దగ్గుమందు ను తీసుకోవచ్చు . ఉదా : DM , Tossex , instaryl.
వాళ్ళు నొప్పులకు : Combiflame , dolomed , acelonac 750 ,
అప్పటికి తగ్గకపోతే వైద్య సలహా పొందాలి .
ఆవిరితో జలుబుకు చెక్:
చినుకుల కాలమిది. జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్ వంటి సమస్యలు కొందరిని తరచూ బాధిస్తాయి. వాటిని నివారించాలంటే అదేపనిగా మందులు వేసుకోవడం కాదు.. ఇలాంటి చిట్కాలు పాటించి చూడండి.
పెద్ద గిన్నెలో మరిగించిన నీరు తీసుకుని మధ్యకు కోసిన రెండు ఉల్లిపాయ మక్కలు వేయండి. ఈ నీళ్లతో కనీసం పదిహేను నిమిషాలు ఆవిరిపట్టండి. జలుబుతో మూసుకుపోయిన ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. జలుబు ఉన్నా లేకపోయినా సరే.. వారానికోసారి యూకలిప్టస్ నూనె వేసిన నీటితో ఆవిరిపట్టండి. దీనివల్ల శ్వాససంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
ముఖానికి చేసే మర్దనతో సైనస్ చాలామటుకు అదుపులో ఉంచుతుంది.చూపుడు వేళ్లను రెండు కనుబొమల మధ్యలో ఉంచి.. సున్నితంగా మర్దన చేయాలి. ఇప్పుడు కనుబొమల చివర్ల వేళ్లను ఉంచి... గుండ్రంగా తిప్పాలి. ఇలా తరచూ చేస్తుంటే.. సమస్య అదుపులో ఉంటుంది.
తులసి, మిరియాలతో చేసే కషాయం జలుబు సమస్యను అదుపులో ఉంచుతుంది. జలుబు, ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీల్చితే మార్పు ఉంటుంది.
No comments:
Post a Comment