కొన్ని వ్యాధులు కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తాయి. అలాంటి వాటిలో ఫిషర్, ఫిస్టులా (భగందరం), పైల్స్ (అర్శమొలలు), ఆబ్సిస్ (Abscess-చీము గడ్డ) మలద్వారంలో వచ్చే నాలుగు ప్రధాన సమస్యలు. కాకపోతే, ఈ నాలుగింటిలోనూ స్వల్పమైన తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక వ్యాధిని మరో వ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. కాకపోతే నాలుగింట్లో ఏ వ్యాధి వచ్చినా చాలా మంది అర్శమొలలే అనుకుంటారు.
ఫిస్టులా:
ఈ వ్యాధిని కొందరు ''లూటి'' అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు.''భగంధరం'' వ్యాధి అని కూడా అంటారు . మలవిసర్జన మార్గము ప్రక్కన ఎటో ఒకవైపు కురుపు ఏర్పడి అది పెరుగుతూ పోయి లోపల పెద్దపేగు చివర భాగములో రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. బయటి చర్మము మరియు లోపల ప్రేగుకు రెండువైపులా రంధ్రము ఏర్పడడాన్ని ఫిస్టులా అంటారు. ఫిస్టులా అన్నది ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్య. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకూ ఖచ్చితముగా తెలియదు. ఇకపోతే మలబద్ధకం వల్ల అంతకు ముందే ఉన్న ఫిస్టులా సమస్య ఎక్కువవుతుందే తప్ప మలబద్ధకం వల్ల ఫిస్టులా రాదు. అలాగే దూరప్రయాణాలు, మాంసాహారం, మసాలా పదార్థాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. మలద్వారం చుట్టూ గడ్డలు వస్తాయి. తరువాత చీము పడుతుంది. ఈ సందర్భంలో సరైన చికిత్స చేయకపోవడం వల్ల భగంధరం ఏర్పడుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాల్లో చేసే శస్త్ర చికి త్స వల్ల ఫిస్టులా సమస్య ఎప్పుడూ పూర్తిగా పోదు. కొంత కాలం ఉపశమనంగా ఉన్నా కొన్నాళ్లకు మళ్లీ ఆ సమస్య మొదలవుతుంది. ఎక్కువ కాలం ఈ సమస్య ఇలాగే కొనసాగితే అక్కడ ఏర్పడిన చీము పేగుల్లోకి కూడా వెళ్లి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.
- పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. పిస్టులాను లోలెవెల్, హైలెవెల్ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్ రకం దోవ పొడవు తక్కువ గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.
ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.్
ప్రేరేపించే కారణాలు :
- జీర్ణవ్యవస్థలోని లోపాలు, ఆ కారణంగా వచ్చే మలబద్ధకం సమస్యే ప్రధాన కారణం.
- ఆహారంలో పీచుపదార్థాలు తక్కువగా ఉండడం,
- నీరు తక్కువగా తాగడం,
- శరీర శ్రమ లేకపోవడం,
- స్థూలకాయం,
- ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం,
- గంటల పర్యంతం వాహనాలు నడపడం
- గర్భంలోని శిశువు బరువు కారణంగా కూడా కొంత మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటారు.
- పెద్ద వ్యవధి లేకుండా వెంట వెంట ప్రసవాలు జరిగినప్పుడు .
లక్షణాలు:
- నొప్పి,
- రక్తస్రావం,
- చీము-జిగురు పడటం,
- దురద
ఇవే ప్రధానంగా కనిపించినా మరి కొన్ని ఉప లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో
- జీర్ణక్రియ, విసర్జన క్రియ సరిగా లేకపోవడం.
- ఆహారం మీద ఆసక్తి లేకపోవడం,
- కడుపు ఉబ్బరం,
- నోటినుంచి మలద్వారందాకా మంటగా ఉండడం,
- కడుపులో శబ్దాలు రావడం,
- బరువు తగ్గడం,
- తేన్పులు రావడం,
- రక్తహీనత ఏర్పడటం,
- కళ్లు తిరిగినట్లు అనిపించడం,
వ్యాధి నిర్ధారణ :
- చికి్త్సకు ముందు వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యము. దానికోసము -- ట్రాన్స్ యానల్ స్కాన్, ఫిస్టులోగ్రామ్, యం.ఆర్.ఐ.ఫిస్తులా, లాంటి పరీక్షలు చేసి ... కాన్సర్ కాదని బలపడిన తరువాత ముందుకు సాగాలి.
చికిత్స :
- ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా హైరానా పడే వ్యక్తులో దురదలు పెట్టే వ్యాధులు ఎక్కువగానే కనిపిస్తాయి. చాలారకాల చర్మవ్యాధులు మానసి కంగా నలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా బహిర్గతమవు తాయి. ఈ తరహా సమస్యలున్నప్పుడు కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు కూడా చికిత్స చేయాల్సిఉంటుంది.
అల్లోపతి : నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen , diclofenac, aceclofenac) వాడాలి . ఇన్‌ఫెక్షన్ అయి చీము , రసి కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్ (ciprofloxin +ornidazole) వాడాలి.
ఏమీ చెయ్యకుండా ఉండడము : రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .
ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.
సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .
- ఆయుర్వేదము : క్షారసూత్ర ప్రక్రియ ద్వారా క్షార సూత్ర వైద్య ప్రక్రియతో భగంధరం దూరం అవుతుందని ఓరుగల్లు నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కెఎంవిడి ప్రసాద్ చెప్పారు. దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,
- మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,
- మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.
- మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.
- ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.
- మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవసరం.
ఫిస్టులా-భగందరం.. లోలోపల భయం / ఈనాడు సుఖీభవ 18/11/2014 /డా.వర్ఘీస్ ముత్తయ్ -కొలొరెక్టర్ సర్జన్ .యశోదా హాస్పిటల్ ,హైదరాబాద్ .
చెప్పుకోవాలంటే సిగ్గు. అలాగని వూరుకోవాలంటే భయం! నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక.. పట్టించుకోకుండా తిరిగితే ఇదెంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందోనన్న ఆందోళన. ఇవన్నీ నిరంతరం మనసును తొలి చేస్తుంటాయి. ఏ పని చెయ్యాలన్నా ఇదే బెరుకు. మలద్వారానికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఆ బాధలకు తోడు మనసు కూడా ఇలా పరిపరివిధాలుగా విలకమై పోతుంటుంది. ఇక భగందరం వంటి సమస్యలైతే ఈ బాధ మాటల్లో చెప్పలేం! మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో పుండులా మొదలవుతుంది. చిట్లి చీము కారుతూ వేధించి.. కొద్దిరోజుల్లో మానినట్లే ఉంటుంది. పోయిందిలెమ్మని అనుకుంటుండగానే మళ్లీ మొదటికి వస్తుంటుంది. ఇలా ఆ చుట్టు పక్కలే ఒకటి.. రెండు.. చాలా పుండ్లు మొదలవ్వచ్చు. పైపైన పుండ్లు మానినట్లే ఉంటాయి, కానీ ఎక్కడో లోపలి నుంచి మళ్లీ మొలుచుకొస్తుంటాయి. నిజానికి ఈ సమస్యకు మూలం పైన చర్మం మీద కాదు.. లోలోపల ఎక్కడో మలమార్గం నుంచే ఉంటుంది. దాన్ని ఆ లోపలి నుంచి సంపూర్ణంగా ముయ్యగలిగితేనేగానీ ఇది మానదు. ఇదే భగందరం! ఒక రకంగా మొండి సమస్య. సరైన నైపుణ్యంతో చికిత్స చెయ్యకపోతే.. మొదటికే మోసం వచ్చి, మలంపై పట్టు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని సరిగ్గా గుర్తించటం.. మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. అది సంపూర్ణంగా తొలగిపోయేలా సరైన చికిత్స తీసుకోవటం అవసరం.
మలద్వార బాధల గురించి మాటల్లో చెప్పటం కష్టం! అందుకే చాలామంది సాధ్యమైనంత వరకూ తోసేసుకు తిరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవి తెచ్చిపెట్టే చికాకు, బాధ, ఇబ్బందుల కారణంగా అట్టే కాలం వీటిని విస్మరించటం కష్టం. రెండోది- ముడ్డి దగ్గర వచ్చే సమస్యలన్నీ ఒకే రకం కూడా కాదు. వీటిల్లో మూలశంక, భగందరం, చీలికల వంటి చాలా సమస్యలు ఉంటాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు అంత ఇబ్బంది పెట్టకపోయినా మెల్లగా ముదిరి తీవ్ర ఇబ్బందులూ తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి మలద్వారం వద్ద ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వైద్యులకు చూపించుకుని.. అసలా సమస్య ఏమిటో నిర్ధారించుకోవటం, సత్వరమే వాటికి చికిత్స తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు భగందరాన్నే తీసుకుంటే.. మామూలుగా ఎవరికి వారు దీన్ని గుర్తుపట్టటం కష్టం. ఎందుకంటే మలద్వారం చుటుపక్కల ఎక్కడో.. చిన్న సెగగడ్డలా మొదలవుతుంది కాబట్టి చాలామంది దీన్ని అసలు మలద్వారానికి సంబంధించిన సమస్య అనే అనుకోకపోవచ్చు. కానీ అది వదలకుండా మళ్లీమళ్లీ వేధిస్తూనే ఉంటుంది. చివరకు పగిలి చీము-రక్తం వస్తోందనో.. బట్టలు ఖరాబవుతున్నాయనో.. ఎప్పుడో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం మంచిది. దీనికి సర్జరీ ఒక్కటే సరైన చికిత్స! దీనిలో కూడా చాలా రకాలుంటాయి. ఈ మార్గాల మూలాలను గుర్తించటం, కండర వలయాలు దెబ్బతినకుండా నైపుణ్యంతో చికిత్స చెయ్యటం ముఖ్యం.
ఏమిటీ ఫిస్టులా?
తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు 'దారులు' ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.
మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్ గ్లాండ్స్) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి. ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్ ఆబ్సెస్) తయారవుతుంది. ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోపల్లోపలే విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది. అందుకే చీము బయటకు పోయినా.. సమస్యకు మూలం గ్రంథిలో ఉంది కాబట్టి, దాన్ని తొలగిస్తేనే ఫిస్టులా పూర్తిగా నయమవుతుందని గుర్తించాలి.
అసలా మలద్వార గ్రంథులు ఎందుకు మూసుకుపోతాయన్నది కచ్చితంగా చెప్పటం కష్టం. కొందరిలో మలబద్ధకం వంటివి, మరికొందరిలో ఇతరత్రా కారణాలూ దీనికి కారణం కావచ్చు. మొత్తమ్మీద ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషుల్లో అధికం. వృద్ధులకూ రావచ్చుగానీ యువకుల్లో ఎక్కువ. ఒకసారి గ్రంథులకు చీముపట్టి, లోపల దారులు ఏర్పడిన తర్వాత.. దానంతట అదే మానటం కష్టం. ఆ ఫిస్టులా మార్గాన్ని శుభ్రం చేసి వదిలేసినా ఉపయోగం ఉండదు. ఇన్‌ఫెక్షన్ సోకిన గ్రంథి అలాగే ఉంటుంది కాబట్టి సమస్య మళ్లీమళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. సక్రమమైన చికిత్స తీసుకోకపోతే ఇది మానదు. నాటు విధానాలను ఆశ్రయిస్తే మల విసర్జన మీద పట్టు పోయే ప్రమాదం ఉండటం దీనితో ఎదురయ్యే పెద్ద ఇబ్బంది.
నిర్ధారణ ఎలా?
చీముగడ్డతో వచ్చినప్పుడు.. ముందుగా చీమును తొలగించి మార్గాన్ని శుభ్రం చేస్తారు. అక్కడి కండర కణజాలమంతా వాచి ఉంటుంది కాబట్టి నిపుణులైన వైద్యులు తప్పించి ఆ సమయంలో లోలపకు గొట్టం ప్రవేశపెట్టటం వంటివేవీ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ గొట్టం వేరే భాగాల్లోకి చేరి, కొత్త మార్గాలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమును తొలగించాక, అక్కడి కణజాలం వాపు వంటివన్నీ తగ్గిన తర్వాత.. పరీక్షలు చేసి ఫిస్టులాను కచ్చితంగా గుర్తిస్తారు.
* వేలితో పరీక్షించటం: ఫిస్టులాను చాలా వరకూ లక్షణాలను బట్టే గుర్తించొచ్చు. మలద్వారం బయటగానీ, లోపలికి గానీ వేలు పెట్టి చూస్తే రంధ్రం ఉన్న భాగం తగులుతుంది. నైపుణ్యాన్ని బట్టి మార్గం ఎక్కడికి వెళ్తుందో కూడా కొంతవరకూ తెలుసుకోవచ్చు.
* ఎండోయానల్ స్కాన్: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.
* ఎంఆర్‌ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్‌ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.
వీటి ఆధారంగా వైద్యులు లోపల మార్గం ఒకటే ఉందా? చాలా మార్గాలున్నాయా? అవి మలద్వారానికి దగ్గరగా, కిందగానే ఉన్నాయా? లేక పైనుంచి ఉన్నాయా? ముఖ్యంగా మల నియంత్రణకు ఉపయోగపడే కీలకమైన రెండు కండర వలయాలకు (స్ఫింక్టర్‌కు) ఇవి దగ్గరగా ఉన్నాయా? వాటి మధ్య నుంచి వస్తున్నాయా? ఎక్కడి నుంచి మొదలై ఎటు వెళుతున్నాయి? వంటివన్నీ గుర్తిస్తారు. చికిత్సకు ఇది ఏరకమన్నది గుర్తించటం చాలా కీలకం.
చికిత్స ఏమిటి?
సాధారణంగా భగందరం దానంతట అదే మానిపోవటమనేది ఉండదు. చాలాసార్లు దీనికి సర్జరీ తప్పదు. ఏ చికిత్స చేసినా ఇది మళ్లీ మళ్లీ రాకుండా పూర్తిగా మూసుకుపోయేలా చూడటం ముఖ్యం. రెండోది- ఈ చికిత్సా క్రమంలో మలవిసర్జనను నియంత్రించే రెండు కండరవలయాలూ (స్ఫింక్టర్లు) దెబ్బతినకుండా చూడటం మరింత ముఖ్యం. దీనికోసం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రామాణిక సర్జరీ విధానాలతో పాటు ఇటీవలి కాలంలో కొత్తరకాలూ అందుబాటులోకి వచ్చాయి. భగందరం మార్గం ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? స్ఫింక్టర్లకు దగ్గరగా ఉందా? వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు వీటిలో ఏ విధానం ఉత్తమమన్నది నిర్ధారిస్తారు.
* ఫిస్టులాటమీ: చాలకాలంగా అనుసరిస్తున్న, ఇప్పటికీ ప్రామాణికమైన విధానం ఇది. భగందరం మార్గం లోపలా బయటా స్పష్టంగా ఉన్నప్పుడు దాని గుండా గొట్టాన్ని పంపటం, మార్గం మొత్తాన్ని తెరవటం, శుభ్రం చేసి.. చీముపట్టిన గ్రంథిని తీసేసి.. వదిలేయటం ద్వారా దానంతట అదే మానేలా చూస్తారు. దీనివల్ల చాలాసార్లు బాగానే మానుతుంది. ఫిస్టులా మార్గం కండరంలో తక్కువ భాగానికే పరిమితమైనప్పుడు ఇది ఉత్తమమైన విధానం. ఈ విచక్షణ ముఖ్యం కాబట్టి నిపుణులైన వైద్యుల వద్ద చేయించుకోవటం ముఖ్యం.
* 'లిఫ్ట్' సర్జరీ: ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ 'లైగేషన్ ఆఫ్ ఇంటర్ స్ఫింక్టరిక్ ఫిస్టులా ట్రాక్ట్' పద్ధతితో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. మన మలద్వారం వద్ద అంతర, బాహ్య కండర వలయాలకు (ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ స్ఫింక్టర్లు) తోడు కటి-మలద్వార (ప్యూబోరెక్టాలిస్) కండరం కూడా ఉంటుంది. బాహ్య, అంతర కండర వలయాలు రెండూ ఒకదానితో మరోటి అనుసంధానమై పని చేస్తాయి. మలాన్ని పట్టి ఉంచటంలో కటి-మలద్వార కండరం ప్రధానమైంది. ఇది దెబ్బతింటే మల విసర్జనపై పట్టు పోతుంది. అందుకని ఇవేవీ దెబ్బతినకుండా.. ఈ లిఫ్ట్ పద్ధతిలో అంతర, బాహ్య కండర వలయం మధ్యలోంచి లోపలికి వెళ్లి, ఫిస్టులా మార్గాన్ని గుర్తించి.. దాన్ని మధ్యలో కత్తిరిస్తారు. రెండు వైపులా శుభ్రం చేసి, అటూఇటూ ముడివేసేస్తారు. ఈ ప్రక్రియతో ఫిస్టులా నయం కావటమే కాకుండా మల విసర్జన మీద పట్టు కూడా దెబ్బతినదు, 90% వరకూ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉండటం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
* సీటన్ విధానం: కొన్ని రకాల ఫిస్టులాలకు- భగందర మార్గం లోపలి నుంచి దారం వంటిదాన్ని లోపలికి పంపి, మలద్వారం గుండా బయటకు తెచ్చి ముడివేసే విధానం బాగానే ఉపయోగపడుతుంది. క్రమేపీ బిగువుగా ముడి వేస్తూ.. కొన్ని నెలల సమయంలో మార్గం దానంతట అదే మానిపోయేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. క్షారసూత్రం పేరుతో మన దేశంలో కూడా ఈ విధానం చిరకాలంగా అమల్లో ఉంది. కండరం ఎంత భాగం ప్రభావితమైందో తెలియనప్పుడు తాత్కాలికంగా ఈ చికిత్స చేసి తర్వాత పూర్తిగా మానేలా చేయటానికి ఏ విధానాన్ని అనుసరించాలో నిర్ధరిస్తారు. ఏ రకం భగందరానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నది గుర్తించి చికిత్స చెయ్యటం కీలకం.
* ఫిబ్రిన్ గ్లూ: భగందర మార్గాన్ని శుభ్రం చేసి.. దానిలోకి జిగురువంటి పదార్ధాన్ని ఎక్కించి.. రెండు వైపులా కుట్టేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా మార్గం మూసుకుపోయి మానినట్లే అనిపించినా దీర్ఘకాలంలో మళ్లీ వస్తున్నట్టు గుర్తించారు. అలాగే 'ఫిస్టులా ప్లగ్' అనే మరో విధానం కూడా ఉంది. దీనిలో జంతుచర్మం నుంచి తయారు చేసిన ప్లగ్‌ను అమర్చి మార్గాన్ని మూసేస్తారుగానీ వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ, దీర్ఘకాలంలో మళ్లీ వచ్చే అవకాశం ఉంటోంది. అందుకని సర్జరీని తట్టుకోలేని వృద్ధులు, కండరాలు బాగా బలహీనపడిన వారికి దీనిని సిఫార్సు చేస్తుంటారు.
సర్జరీ తర్వాత..:
ఆపరేషన్ తర్వాత వైద్యులు అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌తో పాటు నొప్పి తెలియకుండా మందులు సిఫార్సు చేస్తారు. అలాగే మలవిసర్జన ఇబ్బంది లేకుండా సాఫీగా అయ్యేందుకు కూడా మందులు ఇస్తారు. ఇవాల్టిరోజున అందుబాటులో ఉన్న సమర్థ విధానాలతో సర్జరీ చేస్తే ఫిస్టులా మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
స్త్రీలలో మరింత సమస్యాత్మకం!
కొందరు స్త్రీలకు భగందరం- యోని వద్ద ముందు భాగంలో తెరచుకొని ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంట యోని వైపున కండర వలయం పల్చగా ఉంటుంది. రెండోది కాన్పు అయిన వారిలో ఈ కండరం మరింతగా సాగినట్త్లె దృఢత్వాన్ని కూడా కోల్పోయి ఉంటుంది. పురుషులతో పోలిస్తే వీరిలో మలంపై పట్టు కోల్పోయే ముప్పు మరింత ఎక్కువ. అందుకే స్త్రీలు, వృద్ధులకు సర్జరీ మరింత జాగ్రత్తగా చెయ్యాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment