మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు, తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో శారీరక , మానషిక వత్తిడులకు లోనవుతూ ఉండాడు . ఒత్తిడిని భౌతికశాస్త్రము నుండి అరువు తెచ్చుకున్నాము ... ఒత్తిడి అంటే " ప్రెజర్ (pressure)" అన్నమాట . ప్రతిరోజూ మనము సంతోషముగా ఉండదల్చుకున్నామో , విషాదముగా ఉండదల్చుకున్నామో , ఒత్తిడితో ఉండదల్చుకున్నామో , విశ్రాంతిగా ఉండదల్చుకున్నామో మనమే ఎంపికచేసుకోవచ్చును . తాను చేసేపనిని ఎంజాయ్ చేయగలిగినంతకాలము ఒక వ్యక్తి ఎన్ని గంటలైనా పనిచేయవచ్చు ... లేదంటే అది వత్తిడికి దారి తీస్తుంది .
ఒత్తిడి
చేదు జ్ఞాపకాలు గుర్తుంచుకోకూడదు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. కుటుంబంతో, స్నేహితులతో, కుటుంబ డాక్టర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను కలుస్తుండాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, మసాజ్ వంటివి చేయాలి. పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఆసక్తి ఉన్న కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలి. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అన్న సంగతి మర్చిపోకూడదు. సాధించిన లక్ష్యాలు గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి.
ఇది సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆధునికత కూడా. కొత్త సహస్రాబ్దిలో మానసిక ఆరోగ్య రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. జీవితం అత్యంత వేగంగా మారింది. కనీస జీవ అవసరాలైన నిద్ర, ఆహారానికి సైతం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. ప్రస్తుతం అనేకమంది ఆయా వృత్తుల్లో నిమగ్నమై 6 నుంచి 8 గంటలు సైతం నిద్రలేకపోతున్నారు. పదినిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుని భోనం చేయలేకపోతున్నారు. ఇది మార్పు అవుతుందా? అనుసరణీయం కానీ...ఈ సంస్కృతిల ప్రపంచం మారిపోతుందా? ఒకవేళ అవును అయితే మానసిక వైకల్య పరిణామాల వ…ల్ల వచ్చే తరాలు `శారీరక దారుఢ్య మనుగడ' రేసులో పాల్గొనాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరానికి 15 శాతం మంది న్యూరోసైకియాట్రిక్ సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆత్మన్యూన్యత, ఆందోళన కేసులు దశాబ్దంలో ఎక్కువగానే వెలుగుచూస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాషా్టల్ల్రో వైరుధ్య ఆలోచనలు పోటీపడుతున్నాయి. దీనివల్ల సాంప్రదాయానికి, ఆధునికతకు పోటీ అనివార్యమైంది. ఇది నిరుత్సాహపరిచే అనుభవం. నా రోగుల్లో చాలా మంది 25-35 ఏళ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆందోళన సంబంధిత రుగ్మతలతో వస్తుంటారు. ఒబెసివ్ కంపల్సివ్ డిజాస్టర్ (ఒఎస్‌డి), సోషల్ ఫోబియా వంటి రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి.
ఆందోళన మనిషికి సంబంధించిన భావోద్వేగం అని చెప్పొచ్చు. దాదాపు సగం మంది బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి జంకుతారు. 30 శాతం రోగులు ఆందోళన లక్షణాలు కనిపిస్తే 15-20 శాతం మంది ఔట్ పేషెంట్లు ఆందోళనకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారు. జీవితాంతం ఆందోళనకు సంబంధించిన రుగ్మతలతో 15 శాతం మంది బాధపడుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేమంటే మగవాళ్లలో ఆందోళనకు సంబంధించిన రుగ్మతలు అధికంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. మహిళలు ఆత్మనూన్యత, ఆందోళన రెండూ కలిపి బాధపడుతున్నారు. కౌమారదశలో వస్తున్నప్పుడు ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. దాదాపు 10 శాతం పిల్లలు ఆందోళన, ఆత్మనూన్యతతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం టీన్‌స్ట్రెస్‌ను సాక్షిభూతంగా నిలిచింది. చదువులు, భారీ అంచనాలు, క్రీడలు, మ్యూజిక్ తదితర రంగాల్లో పోటీవల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, సామాజిక ఒత్తిడి వల్ల వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఆర్థిక పురోగతి, పెద్ద ఇల్లు కావాలని కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఒత్తిడికి గురవుతున్నారు.
యువత టివి, మీడియా ద్వారా వెలిగిపోవాలని చూస్తున్నారు. జీవితంలో రాణించడానికి చూడ్డానికి అందంగా కనబడాలి. పాపులారిటీ రావాలని నమ్మే రోజులివి. ఒకవేళ ఈ కలలు నెరవేరకపోతే ఆందోళన, ఆత్మనూన్యత వారివెంటే ఉంటుంది. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడం, సొంతంగా ఎదిగే వాతావరణం కనిపించడం లేదు. దీనికి మంచి పరిష్కారం ఉంది. సుఖనిద్ర, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తల్లో రావడానికి అవకాశం ఉంది. వారిపిల్లలను జాగ్రత్తగా చూసుకునే పనిలో ఒత్తిడి మీటర్ కాస్తా పెరుగుతుంది. ఆత్మహత్యలు, స్థూలకాయం, దాంపత్య రుగ్మతలు, ప్రమాదాలు, విడాకులు ఒత్తిడికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఒత్తిడికి దూరంగా ఉండేందుకు సూచనలు:
చేదు జ్ఞాపకాలు గుర్తుంచుకోకూడదు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. కుటుంబంతో, స్నేహితులతో, కుటుంబ డాక్టర్ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను కలుస్తుండాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, మసాజ్ వంటివి చేయాలి. పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఆసక్తి ఉన్న కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలి. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అన్న సంగతి మర్చిపోకూడదు. సాధించిన లక్ష్యాలు గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి.
No comments:
Post a Comment