Monday, 25 January 2016

Raach.affordability.quality of medical services-వైద్యసేవల లభ్యత.స్థోమత.నాణ్యత

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Raach.affordability.quality of medical services-వైద్యసేవల లభ్యత.స్థోమత.నాణ్యత--  గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




 



జనాభా లో సగటున వెయ్యిమందికి ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంష్థ చెబుతుండగా మనదేశములో 1700 మందికి ఒకరు చొప్పున్న డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.

దేశము లో ప్రభుత్వకళాశాలలు 181, ప్రవేటు రంగములో 206 , కలిపి మొత్తము 387 వైద్యకళాశాలు ఉన్నాయి.

సంవత్సరానికి మనదేశములో ....
30 వేల మంది డాక్టర్లు ,
18 వేల మంది స్పెసలిస్టులు ,
30 వేల మంది ఆయుష్ వైద్యులు ,
54 వేల మంది నర్సులు ,
15 వేల మంది ఎ.ఎన్‌.ఎం.లు ,
36 వేల మంది పార్మశిస్టులు , ............ పట్టాలు పొందుతున్నారు.

ప్రస్తుతం మనదేశములో ఉన్న డాక్టర్లు  సంఖ్య : 6.5 లక్షలు .

ఇంతమంది ఆరోగ్య సేవకులు ఉన్నా సామాన్య ప్రజలకు వైద్యము అందడములేదు . కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి వైద్య ఖర్చులు మోయలేని భారముగా తయారైనవి. వైద్యము వ్యాపారము గా మారినది. రోగులను రిఫర్ చేస్తున్న RMP లకు పర్సెంటేజ్ ఇవ్వడము తప్పనిసరి అయినది. లేబు బిల్ లో 30%, ఆపరేషన్‌ బిల్లు లో 30%-40% , డెలివరీ బిల్లులోనూ 30%  p.c లు గా ఫిక్ష్ అయినది. ఈ విధముగా రోగి ఆనారోగ్యము తో వ్యాపారము చేస్తూ ఉన్నారు.

ఇక మందులు కంపెనీలు లక్షలకొద్దీ పుట్తగొడుగులు గా పుట్టుకొస్తూ ఉన్నాయి. మందుల MRP  రేట్లు పెంచేసి ... మందుల షాపులకు 10 కి 10 ఫ్రీ ఆఫర్లు ఇస్తూ రోగి మందుల బిల్లులు చెల్లించలేని బారము గా తయారైనవి.

డయాగ్నోస్టిక్ ... లేబరిటరీలు పరీక్షలు , ఎక్సురే , స్కానింగ్ లు అవసరము లేకపోయినా చేస్తూ రోగి ఖర్చు విపరీతముగా పెరిగేటట్లు దోహదం చేస్తూ ఉన్నాయి. జ్వరం అని వచ్చిన పేసెంట్ కి సుమారు 600- 800 రూపాయిల రక్తపరీక్షలు అవుతున్నాయంటే .. ఏ ష్థాయిలో వైద్య-వ్యాపారము జరుగుతుందో ఊహించవచ్చును. ఇక ఎక్స్ రేలు , స్కానింగ్ లు , ఇ,సి.జి లు , ఎండోస్కోపులు , ఎం.ఆర్.ఐ లు ఖరీదులు ఎలా ఉంటాయో ఊహించగలరు.

ఇన్ని జరిగినా పేసెంటుకు నాణ్యమైన వైద్యము దొరకదు. నాసిరకం మందులే ... కంపెనీలు ఇచ్చే గిఫ్ట్ ల కోసము .. చెలామని అవుతూ ఉన్నాయి.

No comments:

Post a Comment