
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Age related problems and hints - వయసు తో వచ్చే చిక్కులకు సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నాలుగు పదుల వయసొచ్చిందంటే అనారోగ్య సూచనలు కనబడుతుంటాయి. 'వయసు పెరిగిపోతోందిలే...' అని సరిపెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.
*నిద్రపోయే ముందూ నిద్ర లేచాక కూడా చేయాల్సిన పనుల గురించి సతమతమయ్యే వారు చాలామందే. దీనివల్ల ఒరిగేదేమీ లేకపోయినా ఒత్తిడి పెరిగిపోతుంది. రక్తపోటు సమస్య ఇబ్బందిపెడుతుంది. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే ఉదయం కాసేపు వ్యాయామం చేయాలి. యోగాకు సమయం కేటాయించాలి. ఓ అరగంట మొక్కలకు నీళ్లుపెట్టడం, ప్రూనింగ్ చేయడం వంటి పనులు మనసుని తేలిక పరుస్తాయి. శరీరానికి చురుకుదనం వస్తుంది.
*పెరిగే వయసుని తెలిపేవి ముఖంపై ముడతలే. వయసు పెరిగే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. అందువల్లే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నీటి శాతం అధికంగా ఉండి చర్మాన్ని తాజాగా ఉంచే కీర, సొరకాయ, ఆకుపచ్చని ఆకు కూరల్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో మాంసకృత్తులు లభించే కోడి గుడ్డుని తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -cataract,క్యాటరాక్టు,కంటి తెల్లపువ్వు,కంటిశుక్లం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కంటిలో ఒక లెన్సు ఉంది.. రానురాను ఈ లెన్సు పారదర్శకత్వాన్ని కోల్పోతుంది. చూపు మందగిస్తుంది. ఈ దశను క్యాటరాక్టు అంటారు.
క్యాటరాక్టు వచ్చిన వారికి ఈ క్రింది లక్షణములు ఉంటాయి :
రాను రాను నొప్పి లేకుండా కంటిచూపు తగ్గుతుంది. దగ్గర దూర చూపులో వ్యత్యాసం దుర్లభం. రంగులు గుర్తు పట్టడంలో కష్టం, ఒకే దృశ్యం రెండుగ కనబడడం. కంటిపాప రంగుమారి తెల్లపడడం, మబ్బుమబ్బుగా ఉండడం.
క్యాటరాక్టును ఏవిధంగా చికిత్స చేయగలం?
సామాన్య కంటిచూపు మళ్ళీ తెచ్చుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఒక సామాన్య ఆపరేషన్ ద్వారా కంటిలోని లెన్సు తొలగించడమే.
క్యాటరాక్టు ఆపరేషన్ దుష్పరిణామానికి దారితీస్తుందా?
ఇదొక సామాన్యమైన ఆపరేషన్. ఇందులో నొప్పి ఉండదు. రోగికి స్పృహ లేకుండా చెయ్యరు. మత్తుమందు ఇవ్వనవసరము లేదు.
కంటి సంరక్షణ కోసం, క్యాటరాక్టు వచ్చిన వారిని పరీక్షించడానికి, వారికి చికిత్స చేయడానికి, జిల్లా అంధత్వ నివారణ సంఘములను, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు.
స్వచ్ఛంద సేవా సం)స్థల ద్వారా నేత్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత రోగులకు ఉచితంగా కంటద్దాలు అందచేస్తున్నారు.
జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు :
భారతదేశంలో క్యాటరాక్టు, అంధత్యానికి మూల కారణం. అంధులలో 85 శాతం, క్యాటరాక్టువల్ల చూపు కోల్పోయిన వారే.
సరైన సమయంలో క్యాటరాక్టుకు చికిత్స చేయాలి. అశ్రద్ధ చేయవద్దు.
క్యాటరాక్టు వృద్ధాప్యంలో వస్తుంది. కంటికి దెబ్బ తగిలిందంటే క్యాటరాక్టు ఏ వయస్సులోనైనా రావచ్చు.
క్యాటరాక్టువల్ల ఆపరేషన్ సులభమైంది. నిశ్చింతగా చేయించుకోవచ్చు.
ఆపరోషన్ తరువాత కంటి పరీక్ష చేయించుకొని సరైన కళ్ళజోళ్ళు వాడాలి.
క్యాటరాక్టు వచ్చిన వ్యక్తి ఆత్మ స్థైర్యంతో ఆపరేషన్ చేయించుకొనేటట్లు చూడాలి.
- Cataract surgery-శక్లాల సర్జరీ:
విజ్ఞానశాస్త్రం విస్తరించిన కొద్దీ.. మన `దృష్టి' మెరుగవుతోంది! అందుకు ఆధునిక `శక్లాల' సర్జరీలే సాక్ష్యం! మలివయసులో చూపునకు పట్టే గ్రహణం.. శక్లం!
పుట్టుకతోనే మన కంటిలో ఉండి.. నిరంతరం మనకు లోకాన్ని చూపిస్తుండే సహజమైన `కటకం' ముదిరిపోయి.. మబ్బుగా.. కాంతి ప్రసరించనంతటి గట్టి `కొబ్బరి ముక్క'లా తయారవ్వటమే ఈ సమస్యకు మూలం!
సర్జరీ చేసి... మబ్బుగా ఉన్న ఈ శక్లాన్ని తొలగించి ఎంతోకొంత చూపు పునరుద్ధరించటం ఒక ముందడుగు. దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమర్చటం మరో గొప్ప పురోగతి.
అయితే.. ఈ ప్రయోగపరంపర ఇక్కడితో ఆగిపోలేదు. ఈ కృత్రిమ కటకాలకు మరిన్ని మెరుగుదిద్దుతూ సానబెట్టే పని నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అందుేక ఇప్ఫుడు సాధ్యమైనంత సహజంగా.. మన్నికగా.. బహుళ ప్రయోజనాలను చేకూర్చే విధంగా రకరకాల కటకాలు అందుబాటులోకి వస్తున్నాయి.
శక్లాల ఆపరేషన్ చాలా సాధారణమైపోయిన ఈ కాలంలో.. ఈ ఆధునిక కటకాలపై అవగాహన పెంచుకోవటం చాలా ఉపయోగకరం. అందుేక దీనిపై సమగ్ర కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాం!
అసలేమిటి శక్లం?మన కన్ను ఓ ెకమేరాలాంటి అమోఘమైన నిర్మాణం!
మన కనుగుడ్డు మీద ఉండే తెల్లటి కార్నియా పొర, దాని వెనేక ఉండే సహజ కటకం.. ఈ రెండూ బయటి నుంచి వచ్చే కాంతి కిరణలు కచ్చితంగా లోపలి రెటీనా పొర మీద ేకంద్రీకృతమయ్యేలా చేస్తాయి. తెరలాంటి ఆ రెటీనా పొర.. ఆ కిరణ బింబాన్ని విద్యుత్ ప్రేరణలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. దీంతో మనకు కళ్ళ ముందరి దృశ్యం కనిపిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగుతుండటానికి... కంటిలోని సహజమైన కటకం చాలా కీలకం!
ఎప్ఫుడూ లేత ముంజిలా.. బయటి నుంచి వచ్చే కిరణాలు సరిగ్గా రెటీనా మీద పడేలా చాలా పారదర్శకంగా ఉండే ఈ కటకం.. వయసుతో పాటు.. లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. బాగా ముదిరిపోయి కొబ్బరిముక్కలా తయారైపోతుంది. ఇదే శక్లం. దీని గుండా లోపలికి కాంతి కిరణాలు ప్రసరించవు. దీంతో చూపు మందగిస్తుంది!
ఎందుకిలా?
1. వయసుతో పాటు సహజంగానే రావచ్చు.
2. అతినీల లోహిత కిరణలు ఎక్కువగా సోకినప్ఫుడు
3. సహజ కటకానికి దెబ్బల వంటివి తగిలినప్ఫుడు
4. మధుమేహం వంటి సమస్యలున్నప్ఫుడు
5. స్టిరాయిడ్ల వంటి మందులు ఎక్కువగా వాడినప్ఫుడు
... సహజ కటకం దళసరిగా తయారై శక్లం ఏర్ఫడొచ్చు. సాధారణంగా 50, 55 ఏళ్ళ తర్వాత వచ్చే శక్లాలకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. పిల్లల్లో కూడా శక్లాలు ఏర్ఫడొచ్చుగానీ దీనికి చాలా వరకూ జన్యుపరమైన, వంశపారంపర్యమైన అంశాలే కారణం.
మధుమేహ బాధితులకు.. శక్లాలు ఏర్ఫడే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తంలో చెక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆ చెక్కెర కటకం లోపలికి వెళ్థూవస్తూఉంటుంది. దానివల్ల క్రమేపీ కటకంలో తేడాలు వచ్చి పారదర్శకమైన కటకం.. శక్లంగా మారుతుంది. లేదా ఇప్ఫటిేక శక్లాలు ఏర్ఫడుతుంటే వాటిని త్వరగా ముదిరేలా చేస్తుంది.
శక్లం: లక్షణలేమిటి?
* చూపు మందగించి.. మబ్బుగా తయారవటం
* రంగుల మధ్య, తలాల మధ్య వ్యత్యాసం (కాంట్రాస్‌ట) సరిగా తెలియదు.
* అరుదుగా ఒక వస్తువు, ఒక కాంతి రెండు మూడుగా కనబడుతుండొచ్చు. ఉదా: చంద్రబింబాలు రెండుగా కనబడొచ్చు
* మిరుమిటు్ల గొల్ఫే కాంతిలో చూపు కష్టం కావచ్చు.
* కటకం మధ్యభాగం శక్లంలా మారటం వల్ల కొన్నిసార్లు తీƒణమైన వెలుతురులోకి వెళ్లినప్ఫుడు కొద్దిసేపు ఒక్కసారిగా చూపు మొత్తం కనబడకుండా పోవచ్చు. దీనివల్ల డ్రైవర్ల వంటివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
* కొందరిలో కటకం మధ్యభాగం బాగా దళసరిగా మారి మైనస్ పవర్ బాగా పెరుగుతుంటుంది, దీంతో దగ్గరి చూపు మెరుెగనట్టనిపించవచ్చుగానీ శక్లం కారణంగా మొత్తం మీద చూపు ఇబ్బందిగా తయారవుతుంది.
మందులున్నాయా?
వాస్తవానికి శక్లాలను కరిగించే ప్రామాణికమైన మందులేం లేవు. దీనికి ఆపరేషన్ ఒక్కటే ఉత్తమ మార్గం. కొందరు `యాంటీక్యాటరాక్‌ట' చుక్కలు వాడుతుంటారుగానీ వీటితో ఉపయోగం ఉన్నటు్ట శాస్త్రీయమైన ఆధారాలేం లేవు. పైగా ఈ మందులు చాలా రీదైనవి. వీటిని ఏళ్ళ తరబడి వాడినా ఏ ప్రయోజనమూ ఉండకపోవచ్చు. కాబట్టి పనిచేస్తాయో లేదో తెలీని ఈ మందులతో సమయాన్ని వృథా చేసుకునే కంటే ఆపరేషన్ చేయించుకోవటం ఉత్తమం.
ఆపరేషన్ ఎప్ఫుడు మంచిది?
శక్లం ముదిరే వరకూ వేచి ఉండాలన్నది ఒకప్ఫటి, పాతకాలపు ధోరణి. 15-20 ఏళ్ళ క్రితం శక్లాల ఆపరేషన్‌ను చాలా నాటుగా చేసేవాళ్లు. (ఇప్ఫుడూ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇలాేగ చేస్తున్నారు.) వీటితో దుష్ర్ఫభావాలు తలెత్తి చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. అందుేక డాక్టర్లు శక్లం బాగా ముదిరినప్ఫుడు ఎలాగో ఏమీ కనబడదు కాబట్టి.. ఆ సమయంలో సర్జరీ చేస్తే ఫలితం ఉన్నాలేకున్నా నష్టం ఉండదని భావించేవారు. కానీ ఇప్ఫుడు అత్యాధునికమైన సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో... ఆల్ట్రాసౌండ్ తరంగాలతో `ఫేకోఎమల్సిఫిేకషన్' పద్ధతిలో శక్లాన్ని తొలగిస్తూ దాని స్థానంలో లోపల కృత్రిమ కటకం (ఇంట్రా ఆక్యులర్ లెన్‌స-ఐఓఎల్) అమర్చటమన్నది చాలా ప్రామాణికమైన.. అద్భుతమైన విధానమని చెప్ఫవచ్చు. ఇది చాలా సురక్షితమైన, చక్కటి చూపునిచ్చే పద్ధతి. కాబట్టి ఇవాల్టి రోజున.. శక్లాలు ముదిరే వరకూ ఎదురు చూడాల్సిన పని అస్సలు లేనే లేదు! శక్లాల కారణంగా రోగి దైనందిన జీవితం ఎప్ఫుడు ఇబ్బందికరంగా తయారవుతుంటే.. అప్ఫుడే సర్జరీ చేయించుకోవచ్చు, తొలిదశలో కూడా చేయించుకోవచ్చు.'
ఏమిటీ సర్జరీ?
సర్జరీకి ముందు... మధుమేహం, హైబీపీ ఉంటే సర్జరీకి వెళ్ళే ముందు వాటిని నియంత్రించుకోవటం చాలా అవసరం. లేకపోతే అధిక రక్తపోటు వల్ల కంటిలో రక్తస్రావం అవుతుంది. మధుమేహం ఎక్కువగా ఉన్నప్ఫుడు ఇన్ఫెక్షన్లు వస్తే వాటిని నియంత్రించటం కష్టం. అలాేగ రక్తాన్ని పల్చగా చేసే ఆస్ఫిరిన్ తరహా మందులు వాడుకుంటూ ఉంటే.. వాటిని తప్ఫనిసరిగా ఆపరేషన్‌కు రెండు మూడు ముందు నుంచీ మానెయ్యాలి.
ఆపరేషన్...:
ఒకప్ఫుడు ేకవలం కంటిలోని శక్లాన్ని తొలగించి వదిలేసేవాళ్లు. దానివల్ల దాదాపు ప్లస్ 10 పవర్ ఉండే సోడాబుడీ్డ అద్దాలు పెటు్టకోవాల్సి వచ్చేది. ఈ అద్దాల్లేకపోతే ఏమీ కనబడేది కాదు. మెట్ల వంటివి దిగాలంటే మహా కష్టం. దీనికి విరుగుడుగా.. మొదటగా బ్రిటన్‌నేత్ర వైద్యుడు హెరాల్‌డ రిడ్లే 1948లో లోపలే కృత్రిమ కటకం (ఐఓఎల్) అమర్చటం ఆరంభించాడు. శక్లాల ఆపరేషన్‌లో ఇదో గొప్ఫ ముందడుగు. రెండోది- లోపలి శక్లాన్ని తీసి, కృత్రిమ కటకం అమర్చేందుకు కనుగుడ్డు మీద పెద్ద కోతబెట్టాల్సి వచ్చేది. ఈ పెద్ద కోత వల్ల కార్నియా బల్లబరుపుగా తయారై.. చూపు బాగా ప్రభావితమయ్యేది. దీనికి విరుగుడుగా- ఆల్ట్రాసౌండ్ పద్ధతిలో.. చాలా చిన్న కోత ద్వరానే శక్లాన్ని తొలగించే పద్ధతిని 1968లో ఛాల్‌స ెకల్మన్ అనే అమెరికా నేత్ర వైద్యుడు ఆరంభించాడు. తరువాత ఆ చిన్న కోత ద్వారానే కృత్రిమ కటకాన్ని మడతబెట్టి లోపలికి పంపించి.. అమర్చటమన్న అత్యాధునిక పద్ధతి అందుబాటులోకి వచ్చింది! ఇదే ఇప్ఫుడు ప్రామాణిక చికిత్స!

కోత కీలకం!
కనుగుడ్డు కార్నియా పొర మీద ఎంత పెద్ద కోతబెడితే.. ఆ తర్వాత పెటు్టకోవాల్సిన అద్దాల పవర్ అంత పెరుగుతుంది. పెద్ద కోతబెట్టినప్ఫుడు.. పుండు మానిన తర్వాత కార్నియాలో ఆ కాస్త భాగం బల్లబరుపుగా తయారవుతుంది, దీంతో అద్దాల పవర్ ఇంకా పెరుగుతుంది. అందుేక సాధ్యమైనంత `చిన్న కోత' ద్వారానే లోపలి కటకం తొలగించటం, కొత్త కటకం అమర్చటం.. రెండూ పూర్తి చేసేందుకు విస్తృతంగా ప్రయోగాలు సాగాయి. ఆల్ట్రాసౌండ్ పరిజ్ఞానం సాయంతో `ఫేకో' పద్ధతిలో 2, 2.5 మిల్లీమీటర్ల చిన్నకోత ద్వారా లోపలి శుక్లాన్ని తొలగించటం తేలిక అయ్యిందిగానీ కొత్త కటకాన్ని ఆ చిన్న కోత ద్వారా లోపలికి పంపటం కష్టమైంది. కటకం పంపాలంటే కనీసం 6 మిల్లీమీటర్ల దారి అవసరమైంది. అందుేక దీనికి విరుగుడుగా మడతపెట్టే రకం `ఫోల్డబుల్' కృత్రిమ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సన్నటి కోత ద్వారా లోపలికి తోసి.. అక్కడ విచ్చుకునేలా చెయ్యచ్చు. 90ల నుంచీ ఈ రకం మడతపెట్టే లెన్సులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద కోత అవసరం తప్ఫింది.. అద్దాలు పెటు్టకోకున్నా కూడా చూపు కొంత మెరుగ్గా ఉంటుంది.
పదార్థమూ ముఖ్యమే!
కంట్లో అమర్చేందుకు కృత్రిమ కటకాలను ఏ రకం పదార్థంతో తయారుచేస్తే ఫలితాలు బాగుంటాయన్న దానిపై చాలా ప్రయోగాలు జరిగాయి. వీటిలో సిలికాన్, అక్రిలిక్ పదార్ధాలు ఉత్తమమైనవని గుర్తించారు. మళ్లీ ఈ అక్రిలిక్‌లో కూడా హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ అనే రెండు రకాల పదార్ధాలతో తయారైన కటకాలున్నాయి. వీటితో ఆపరేషన్ తర్వాత.. శక్లాలకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ. ముఖ్యంగా శక్లం ఆపరేషన్ చేసిన తర్వాత రెండుమూడేళ్లు చూపు బాగానే ఉండి.. ఆ తర్వాత మళ్లీ తిత్తి మొత్తం దళసరిగా మారుతూ చూపు తేగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే `కాప్సులార్ ఒపేసిఫిేకషన్' అంటారు. ఈ రకం సమస్య అక్రిలిక్ కటకాలతో చాలా తక్కువనీ, ఈ కటకాల్లో కూడా వెనక భాగం పలకలుగా, ముందు భాగం గుండ్రంగా ఉండే కటకాలతో మరీ తక్కువని గుర్తించారు. కాకపోతే వీటి ఖరీదు కొంత ఎక్కువగా ఉంటుంది.
లెన్సులు
1. నాన్‌ఫోల్డబుల్:
* సాధారణంగా దీనితో కోత 5-5.5 మి.మీ. వరకూ అవసరమవుతుంది. కోత పెరిగిన కొద్దీ కార్నియా చదునుగా అయిపోతుంది, కోత మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్లాసుల పవర్ ఎక్కువ అవుతుంది. అద్దాలు పెటు్టకోకపోతే బాగా కనబడదు, కాబట్టి ఎప్ఫుడూ అద్దాలు పెటు్టకునే ఉండాలి.
* వీటిలో స్వదేశీ, విదేశీ కటకాలు రెండూ లభిస్తాయి. సాధారణంగా ఈ లెన్సుతో, ఫేకో పద్ధతితో సర్జరీ చేస్తే రూ.6-8 వేల వరకూ అవుతుంది.
2. ఫోల్డబుల్‌చిన్నకోత ద్వరానే మడతపెట్టి లోపల అమర్చటానికి వీలైన ఈ లెన్సులను ఎ. సిలికాన్ బి. హైడ్రోఫిలిక్ అక్రిలిక్ సి. హైడ్రోఫోబిక్ అక్రిలిక్. అనే మూడు రకాల పదర్ధాలతో తయారైనవి దొరుకుతాయి.
మళ్లీ వీటిలో ప్రతి ఒక్కటీ- స్వదేశీ, విదేశీ తయారీలో ఉంటాయి, దీన్ని బట్టి వీటి రీదు కూడా మారుతుంది.
డిజైన్లూ ముఖ్యమే!
అంచులు:ఈ కటకాలలో వెనక భాగం పలకలుగానూ, ముందు భాగం గుండ్రంగానూ ఉన్న వాటితో తిరిగి శక్లం తిత్తి దళసరిగా మారే అవకాశం తక్కువని, చూపు కూడా నాణ్యంగా ఉంటుందని గుర్తించారు. కాబట్టి ఏ పదార్థంతో తయారైన కటకాన్ని అమర్చుకున్నా కూడా... ఈ రకం డిజైన్ వాటిని ఎంచుకోవటం మంచిది.
ఉపరితలం:
సాధారణంగా మన కంటిలోని కార్నియా పొరకు +దృష్టిలోపం ఉంటుంది, కటకానికి -దృష్టిలోపం ఉంటుంది. ఈ రెండూ కలిసి న్యూట్రల్‌గా మారి మనకు చక్కటి చూపునిస్తాయి. కానీ వయసు పెరిగిన కొద్దీ శక్లం ఏర్ఫడితే కటకానికి ఉండే -దృష్టిలోపం తగ్గుతుంది, చూపులో అస్ఫష్టత పెరుగుతుంది. అలాేగ స్థాయీవ్యత్యాసాలూ (కాంట్రాస్‌ట) సరిగా తెలీవు. దీనికి విరుగుడుగా కొత్తగా కంటిలో అమర్చే కటకాలను `ఏస్ఫెరిక్' లేదా `ఆబరేషన్ ఫ్రీ' తరహా డిజైన్లలో తయారు చేస్తున్నాయి. అన్ని రకాల పదార్ధాల్లోనూ లభ్యమయ్యే ఈ డిజైన్లలో.. కటకం ముందు ఉపరితలం కొద్దిగా ఉబ్బుగా ఉంచుతారు. దీంతో రాత్రిపూట, డే లైట్‌లో కూడా చూపు మెరుగవుతుంది. మంచి కాంట్రాస్‌ట ఉంటుంది, వాహన ప్రమాదాలు తగ్గుతాయి.
మల్టీఫోకల్:
సాధారణంగా ఈ కృత్రిమ కటకాలన్నీ కూడా దీర్ఘదృష్టికో, హ్రస్వదృష్టికో.. ఏదో ఒక దాని మీద మాత్రమే ేకంద్రీకరించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏదో ఒకదానికి పరిమితం కాకుండా వీటిని మధ్యేమార్గంగా కొంతకొంత రెంటికీ పనికొచ్చేలా అమరుస్తారు. దీంతో ఇంట్లో పనులన్నీ అద్దాల్లేకుండా చేసుకుంటారు, చదువుకూ, దూరపు చూపుకూ అద్దాలు వాడుకుంటారు. ఇవి మోనోఫోకల్ లెన్సులు. ఈ కాస్త ఇబ్బందినీ కూడా తగ్గించేందుకు ఇటీవలికాలంలో `మల్టీఫోకల్ లెన్సులు' వస్తున్నాయి. ఈ కటకాల మీద కొన్నికొన్ని వలయాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని దగ్గర చూపునకు, కొన్ని దూరపు చూపునకు ఉపయోగపడతాయి. దీంతో కళ్ళద్దాలు పెటు్టకోవల్సిన అవసరం అంతగా ఉండదు. కాకపోతే ఈ రకం డిజైన్ లెన్సులు పెట్టించుకుంటే రెండు కళ్ళకూ చేయించుకోవాలి. ఒక్క రాత్రిపూట డ్రైవింగ్ వంటివి చేసేవారికి మాత్రం వీటి వల్ల ేగ్లరింగ్ సమస్య రావచ్చు, కాబట్ట వారు మోనోఫోకల్ అద్దాలు పెట్టించుకోవటం మంచిది.
మూవీ అబ్జార్బింగ్ లెన్స్:
సాధారణంగా మన కంటిలోని సహజమైన కటకం.. అతినీల లోహిత కిరణలను కొంతవరకులోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కృత్రిమ లెన్సుకు ఈ స్వభావం ఉండదు. దీంతో ఈ కిరణాలు లోపలికి వెళ్లి రెటీనాను దెబ్బతీసే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కృత్రిమ లెన్సులను కూడా అతినీలలోహిత కిరణాలు లోపలకు సోకకుండా ఉండేలా రంగు కలిపి.. తయారు చేస్తారు. మాక్యులర్ డీనరేషన్ వంటి సమస్యలు రాకుండా వృద్ధులకు ఇవి మంచివే. ఇవి అక్రిలిక్ లెన్సులన్నింటిల్లోనూ అందుబాటులో ఉంటాయి.
* కాబట్టి అన్ని కటకాలూ మంచివే అయినా ఇవాల్టి రోజున స్తోమతును బట్టి సాధ్యమైనంత మన్నికైన కటకానికి వెళ్ళటం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.
* ప్రస్తుతం శక్లాన్ని తొలగించేందుకు- `ఫేకోఎమల్సిఫిేకషన్' సర్జరీ పద్ధతి ఉత్తమం.
*దీనికి తోడుగా... దీర్ఘకాలం మన్నికైన, సురక్షితమైన ఫలితాల కోసం లోపల- ఫోల్డబుల్, ఎక్రిలిక్ హైడ్రోఫోబిక్ కటకాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్ఫవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Role of Nutritional food in growth , పెరుగుదలలో పోషకాహారం పాత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ లక్షణాలివీ :
కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పవచ్చు. అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు,ఖనిజాలు,విటమిన్లు,శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం
మనకు శక్తి ఎందుకు అవసరం? :
మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం.శరీర ఉష్టోగ్రతను స్ధిరంగా ఉంచటానికి, జైవిక క్రియకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం,మన దేశంలో 50శాతం మంది మహిళలు,పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.
--ఆహారంలో లభించే కాలరీలు : పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని ' క్యాలరీలు ' అంటారు. ఒక మనిషికి ఎంత శక్తి అవసరమనేది అతడు/ఆమె ప్రతి రోజు పడే శారీరక శ్రమ పై ఆధారపడి ఉంటుంది. వయస్సు ,లింగ భేదం శరీర బరువు, పెరుగుదల, శరీరం పని పాటలు ఒత్తిడిని బట్టి ఇది మారుతుంటుంది. భారత దేశంలో 70-80 శాతం మంది ప్రధాన గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కాయధాన్యాల నుంచి శక్తిని గ్రహిస్తున్నారు.
-- పిల్లలు ,కౌమార దశ వారు 55-60/శాతం రోజువారి కాలరీలను పిండి పదార్ధాల ద్వారా పొందుతున్నారు. కౌమార వయస్సు వారు ఆరోగ్యంగా పెరగటానికి ఎక్కువ కాలరీలు అవసరం. ఉదాహరణకు 16-18 ఏళ్ల అమ్మాయిలు ప్రతిరోజు కనీసం 2060కిలో క్యాలరీలు గల ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అదే వయస్సు అబ్బాయిలకైతే 2640 కిలో కాలరీలు అవసరం. గర్భవతులకు అదనపు క్యాలరీలు ఆహారం ఇవ్వాలి. పిండం ఎదుగుదలకు,గర్భవతి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే పోషణ లోపానికి దారి తీస్తుంది.అధికంగా తీసుకుంటే ఊబకాయం (లావు) కు దారి తీస్తుంది.
అధిక శక్తిని ఇచ్చే ఆహర పదార్ధాలు :
ప్రధాన గింజ ధాన్యాలు,చిరు ధాన్యాలు ,పప్పు దినుసులు,దుంప కాయగూరలు,వంట నూనేలు,వనస్పతి,నెయ్యి,వెన్న,నూనెలు విత్తనాలు,గింజకాయలు చెక్కర,బెల్లం తదితరాలు.
మనకు కాలరీలు ఎక్కువగా గింజ ధాన్యాలు నుంచి లభింస్తున్నాయి.కనుక గింజ ధాన్యాలు,చిరు ధాన్యాల్లో వివిధ రకాలను వినియోగించేలా చొరవ చూపాలి. జోన్నలు,సజ్జలు లాంటి ముతక ధాన్యాలు,రాగులు లాంటి చిరు ధాన్యాలు చౌకగా లభిస్తాయి. ఇవి అధిక శక్తినిచ్చేవి.
ఆహార పదార్ధాలు--- శక్తి (ప్రతి వందగ్రాములకు కి.కాలరిలలో)
బియ్యం--- గోధుమ పిండి-----జొన్న--- సజ్జలు --- రాగి--- మొక్కజొన్న
345----341-----------349--- 361--- 328--- 342

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి.
చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేది ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట అధికమయినప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారు
వేసవిలో వేడి మూలంగా చాలామందికి చర్మం పేలినట్లయి, చెమటకాయలు వస్తుంటాయి. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.
చెమటకాయలు ఎలా వస్తాయి?
చర్మంలో ఎక్రైన్ స్వెట్‌గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు ఉంటాయి. ప్రతి గ్రంథికి ఎక్రైన్ అనే ఒక నాళం (డక్ట్) ఉంటుంది. మన చర్మంలో సహజంగా స్టెఫలోకాకస్ ఎపిడెర్మిడిస్ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల, మృత చర్మ కణాల వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్వెట్ డక్ట్ కు అడ్డుపడి, చెమటకాయలలాగ తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయలలో చీము కూడా చేరుతుంది. దీనిని‘మిలీరియా పస్టులోసా అంటారు.
ఈ చెమటకాయలను నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద పెద్ద గడ్డలుగా మారే అవకాశం లేకపోలేదు. దీన్ని పెరిపొరైటిస్ స్టెఫిలోజిన్స్ అంటారు. సాధారణంగా చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చెమట పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే పగిలినట్టుగా అయిన స్వేద నాళిక ) పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొద్దిరోజులు పడుతుంది. చెమట పట్టకుండా ఆగిపోవడానికి ఇదే కారణం.
ఎవరికి వస్తాయి?
ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.
చిన్నపిల్లలకు, పెద్దవారికి:
ఎండలో ఎక్కువగా తిరిగేవారికి,
చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లిన వారికి,
బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు ధరించేవారికి,
జ్వరం వచ్చినవారికి,
చెమట పడితేనే చికాకుగా ఉంటుంది. అటువంటిది చెమటకాయలు వస్తే? చికాకు రెట్టింపు అవుతుంది. అంతేకాక ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని చేసినప్పటికీ చెమటకాయలు ఎక్కువ బాధిస్తుంటే మాత్రం చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.
ఏయే ప్రదేశాలు:
చెమటకాయలు శరీరం మీద చాలా భాగాలలో కనిపిస్తాయి. ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్ర్తాల ఒరిపిడి ఉండే చోట.
పిల్లలలో - వీపు, మెడ, గజ్జలు, బాహుమూలాలలో. పెద్దవారిలో - మెడ, తల, వీపు, బాహుమూలాలలో
జాగ్రత్తలు:
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు.
చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి,
వేడి వాతావరణం లోకి వెళ్లకూడదు,
చల్లటి ప్రదేశాలు లేదా ఏసి ఉన్నచోట ఉండాలి,
మందంగా ఉండి, శరీరాన్ని చుట్టేసేలాంటి వస్ర్తాలు ధరించకూడదు,
బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి,
సాధ్యమయినంతవరకు పల్చగా ఉండే నూలు వస్ర్తాలు ధరించాలి,
సబ్బును ఎక్కువగా వాడకూడదు,
సన్‌స్క్రీన్ లోషనులు వాడాలి,
పిల్లలు ఎండలో చెమటపట్టేలాంటి ఆటలు ఆడకూడదు,
ఎక్కువ మంచినీరు తాగుతుండాలి.,
చికిత్స:
ప్రిక్లీ హీట్ పౌడర్: ఈ పౌడర్‌లో డ్రయింగ్ మిల్క్ ప్రొటీన్, ట్రైక్లోజాన్, మెంథాల్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలోని మిల్క్‌ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.
తరచు స్నానం, అంటే రోజుకి మూడు నాలుగు సార్లు చన్నీటి చేస్తుండాలి. సబ్బును ఎక్కువగా వాడకూడదు,
క్యాలమిన్ లోషన్‌ను వాడాలి.
జింక్ ఆక్సైడ్ వాడటం మంచిది,
నిపుణుడైన వైద్యుని సలహా పై, ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా
ట్రోపికల్ యాంటీబయాటిక్స్ వాడాలి.
పైన చెప్పిన వాటిలో మొదటి రెండింటి (క్యాలమిన్ లోషన్, జింక్ ఆక్సైడ్) తో సమస్య తగ్గకపోతే, చర్మవ్యాధుల నిపుణుని (డెర్మటాలజిస్టు) సూచన మేరకు మాత్రమే (ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ యాంటీబయాటిక్స్) వాడాలి.
* కొన్నిసార్లు చుండ్రు కూడా నుదురు, బుగ్గల మీద చెమటకాయలు రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలి. దిండు కవర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై జుత్తు పడకుండా చూసుకోవటమే కాదు.. చెమటకాయలు ఉన్నచోట స్క్రబ్స్ అసలే ఉపయోగించరాదనీ గుర్తుంచుకోవాలి.
* జిడ్డుచర్మం గల కొందరు పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదు. దీంతో చర్మంలో పీహెచ్ స్థాయులు అస్తవ్యస్తమవుతాయి. అయితే వాతావరణం బాగా వేడిగా, తేమగా ఉన్నపుపడు మామూలు నీటితో ముఖాన్ని తరచుగా కడుక్కుంటే ఇబ్బందేమీ ఉండదు.
* ఉదయం, రాత్రి రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దూదితో చర్మం బిగుతుగా ఉండేందుకు దోహదం చేసే (ఆస్ట్రింజెట్) లోషన్ లేదా దోసకాయ రసం రాసుకొని.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
* చెమటకాయలు వచ్చినచోట గోళ్లతో గోకటం ఏమాత్రం మంచిదికాదు. దీంతో ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. బాగా దురద పెడుతుంటే మూడొంతుల నీరు, ఒకవంతు వెనిగర్‌ను కలిపి, అందులో దూదిని ముంచి దద్దు వచ్చినచోట అద్దాలి. ఇది దురద తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో కొద్దిగా బైకార్బోనేట్ సోడాను కలిపి కడుక్కునా దురద తగ్గుతుంది. జిడ్డు కూడా తొలగిపోతుంది.
* గంధం అన్నిరకాల చర్మాలకీ బాగా పనిచేస్తుంది. ఇది మంచి యాంటీసెప్టిక్ మాత్రమే కాదు.. చర్మంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దురదనూ తగ్గిస్తుంది.
* గంధానికి కొద్దిగా రోజ్ వాటర్‌ను కలిపి ముద్దగా చేయాలి. దీన్ని చెమటకాయలు వచ్చినచోట అద్ది, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
* పిడికెడు వేప ఆకులు తీసుకొని నాలుగు కప్పుల నీటిలో వేసి సన్నటి మంట మీద గంటసేపు మరిగించాలి. దీన్ని రాత్రిపూట అలాగే వదిలేసి, తెల్లారాక ఆకులను వడగట్టి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను కూడా ముద్దగా నూరి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
* అయితే చెమటకాయలు, దురద తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించటం తప్పనిసరి.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fats and human health , కొవ్వుపదార్ధాలు - మనిషి ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధము
1 gram కొవ్వు = 9 cal ఇంధనము శరీరానికి అందిస్తుంది.
vit A, B, E & K అను విటమినులు, రక్తంలో కొవ్వుపదార్ధాము ఇమడడానికి చాలా అవసరం.
కొవ్వు అనేది – ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.
veg-ఆయిల్ - మనము తీసుకొనే ఆహారంలొ చాలా ముఖ్యమైనది.
దీనిలోఅవసరమైన కొవ్వు ఆమ్లములు,
1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)
2. పాలీ ఆన్ సాచ్యురేటడ్
ఉదా :అన్ సాచ్యురేటడ్ కొవ్వుఆమ్లాలు-వెజిటబుల్ oils
సాచ్యురేటడ్ కొవ్వు అనగా - వెన్న, నెయ్యి
పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రొజినేటడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకొవాలి కొబ్బరినూనెవాడరాదు.
హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కోలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు.
వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొ్వ్వును చూడగలము.
తినుబండారాలలో వుండె కొవ్వు, కరగగలిగే మాంసము కొవ్వు, లేక ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఎక్కువ శాతం సాచ్యురేటడ్ కొవ్వులు -
ప్రతిరోజు ఆహారంలో ఉండాల్సిన కొవ్వుశాతం -:
యుక్త వయస్సు పిల్లలో రోజుకు, 25గ్రా- వరకు సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.
పెద్దవాళ్ళకు - 20గ్రా రోజుకు.
గర్బవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.
గుర్తుంచుకోవలసినవి -:
1. తగినంతగా సరిపడగలిగే కొవ్వు పధార్ధాలు తీసుకోవాలి.
2. వంటలో ఒకటి కన్నాఎక్కువ రకాల నూనెలువాడాలి.
3. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.
4. ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి.
5. జంతు అవయవాలు తినరాదు మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Fever in Adults - పెద్దవాళ్ళలో జ్వరం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 370 లేక 98.60ఉంటే అది నార్మల్ అని అంటారు. శరీర ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉంటే అది జ్వరం అంటారు. సాధారణంగా 37.50 (100 ) వుంటుంది. జ్వరం అన్నది శరీరంలో వున్న ఏదో ఒక వ్యాధి లక్షణము మాత్రమే వ్యాధి ప్రభావము పెరిగే కొద్ది జ్వర తీవ్రత అధికమవుతుంది. 39.50 c లేదా 1030Fకు పైన ఉన్నా తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి.
సాధారణ కారణాలు:
మలేరియా, టైఫాయిడ్ , క్షయ, రుమాటిక్ జ్వరము, ఆటలమ్మ, గవదలమ్మ, ఊపిరితిత్తులు ఇన్ పెక్షన్, జలుబు, దగ్గు, టాన్సిలైటిస్ , బ్రాంకైటిస్ మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ మొదలైనవి. బ్యాక్టీరియా, వైరస్.
సాధారణ జ్వరం లక్షణాలు:
37.50 C లేదా 1000 F ఆ పైన జ్వరం నమోదు
తలనొప్పి
చలితో కూడిన జ్వరం
కీళ్ళనొప్పులు
నోరు చేదుగా ఉండుట
అకలి తగ్గడం, మలబద్దకం
కొన్ని ప్రత్యేక సమయాలలో కలవరింతలు మొదలైనవి
జ్వరం వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు:
జ్వరం వచ్చిన వ్యక్తి వున్న వాతావరణం చల్లగా ఉండేటట్లు చూడాలి
సాధారణ ఫ్యాన్ క్రింద పరుండబెడితే కొంత ఉపశమనముంటుంది
పలుచటి దుస్తులు వాడాలి
పలుచటి దుప్పట్లు వాడాలి
గోరువెచ్చని నీళ్ళతో శరీరమంతా తుడవాలి
నీళ్ళు ద్రవ పదార్దాలు అధికంగా తీసుకోవాలి
చల్లని నీళ్ళ తో శరీరము తుడవరాదు. నుదుటి మీద తడిగుడ్డ వేయడం వలన ఉపయోగం లేదు
జ్వరం వచినపుడు తీసుకోవలిసిన ఆహారము
ఎక్కువ విశ్రాంతి తీసుకొని అధికంగా నీరు త్రాగాలి
జ్వరం ఉన్నప్పుడు శరీరానికి అధిక కేలరీలు అవసరము అవుతాయి కనుక గ్లూకోజ్ ,హార్లిక్స్ లాంటి ద్రవ పదార్దాలు, పండ్ల రసాలు వంటివి ఆధికంగా తీసుకోవాలి
బియ్యం గంజి,సగ్గుబియ్యం గంజి,జావ, బార్లీ నీళ్ళు సులభంగా జీర్ణమై య్యే పదార్దాలు ఇవ్వాలి
కాఫీ , టీ లాంటి ద్రవ పదార్దాలు సాధారణ వేడి తో తీసుకోవాలి
పాలు , రొట్టె లాంటి పదార్దాలు తీసుకోవచ్చును
మాంసం ,గుడ్డు, వెన్న , పెరుగు ,నూనె పదార్దాలు తీసుకోరాదు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Dehydration,నిర్జలీకరణం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నిర్జలీకరణం అనగా నేమి ?
శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. చాలా శరీరక శ్రమ చేసే వారికి దీనికి రెండు నుంచి మూడింతలు త్రాగవలసి వుంటుంది. శరీరంలో సహజంగా జరిగే జీవ ప్రక్రియలు అవసరమైన నీరు మనం అందించ వలసి వుంటుంది. తగిన మోతాదులో తీసుకొనక పోయినా, తీసుకొన్న దానికంటే అధికంగా నష్ట పోయినా నిర్జలీకరణం సంభవిస్తుంది.
నిర్జలీకరణకు కారణాలు:
అన్నవాహిక (జీర్ణ వ్యవస్ధ) నుంచి అధికంగా నీరు నష్టపోవడం మూలాన ఈ స్ధితి ఏర్పడవచ్చును.
దీనికి కారణాలు:
- ప్రేగుల లోపల ఉపరితలంలో వాపు, హాని కలిగి ఉండడం.
- బాక్టీరియా,వైరసుల మూలంగా అధికంగా ద్రవం స్రవించడం, దీనిలో చూషణ (absorption) కన్నా స్రవించడం అధికంగా వుంటుంది.
- నోటి ద్వారా తీసుకునే నీరు సరిపడా లేకపోవడం, ఉదా: కడుపులో త్రిప్పుట, వాంతులు.
- వడదెబ్బ (sun stroke) ,
- కొన్ని దీర్ఘకాలిక వ్యాదులు (Diabetes , peptic ulcers ,T.B. etc.)
లక్షణాలు చిహ్నాలు
నిర్జలీకరణకు గుర్తు కొద్ది రోజులలో అధికంగా బరువు తగ్గిపోవడం.
(కొన్ని మార్లు కొద్ది గంటలలో త్వరిత గతిన బరువు తగ్గడం 10 శాతం కన్నా ఎక్కువ వున్నప్పుడు సమస్యకు తీవ్రంగా పరిగణించ వలసి వుంటుంది.
కొన్ని సార్లు వేరే జబ్బు లక్షణాలతో కలిసి వుండి గుర్తించడం కష్టం కావచ్చు.
- ఎక్కువ దాహం
- ఎండి పోతున్న నాలిక
- చర్మము ఎండి పొవుట
- తల తేలికగా అనిపించడం. (ముఖ్యంగా నిలుచున్నప్పుడు)
- బలహీనత
- మూత్రం రంగు ముదురు పసుపులో వుండడం లేక మూత్రం తక్కువ గా రావడం.
- నిర్జలీకరణ తీవ్రంగా వున్నప్పుడు శరీరంలో వుండే రసాయనాల మార్పు రావచ్చు. మూత్ర పిండాలు అసఫలిత కొద్ది సమయాలలో ప్రాణ హాని కూడా కలుగవచ్చు.
వాంతులు విరోచనాలు అవుతున్నప్పుడు మన జీర్ణమండలము సరియైన రీతిలో పనిచేసే పరిస్థితిలో ఉండదు . కావున దానికి విశ్రాంతి అవసరము . విరోవనాలు + వాంతులు అవుతున్న రోగికి .... డీ హైడ్రేషన్ తీవ్రతను బట్టి మూడు రకాలు గా విభజించారు . 1.తక్కువ తీవ్రత(mild),2.ఒక మోస్తరు తీవ్రత (moderate) , ఎక్కువ తీవ్రత (severe) గలవి గా చెప్పబడినవి .
సివియర్ టైప్ లో 24 గంటలు నోటిద్వారా ఏమీ ఇవ్వకూడదు. I.V salines , I.V antibiotics, I.V vitamins ఇవ్వాలి . ఈవిషయము లో డాక్టర్ తప్పనిసరి .
మోడరేట్ టైప్ లో కొంతవరకూ ఐ.వి.ఫ్లూయిడ్స్ ఇస్తూ నోటిద్వారా అవసరమైన ద్రవపదార్ధాలు ఇవ్వవచ్చును.
మైల్డ్ టైప్ లో అన్నీ నోటిద్వారానే ఇవ్వవచ్చును . ఈ క్రింది విధము గా నోటిద్వారా ఇవ్వాలి ....
- * రోగికి దాహం తగ్గేంతవరకు 'అరలీటరు నీళ్లలో పిడికెడు చక్కెర, మూడు చిటికెల ఉప్పు కలిపి' లేదా 'ఓఆర్‌ఎస్' పొడిని ప్యాకెట్‌పై సూచించిన విధంగా నీళ్లలో కలిపి తాగించాలి.
- * కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించొచ్చు.
- * వాంతులు విరేచనాలతో కలుషితమైన దుస్తులను మార్చి, శరీరాన్ని నీళ్లతో శుభ్రపరచాలి.
జాగ్రత్తలు--:
- తొలుత మెత్తగా ఉండే ఘనాహారాన్ని మొదలుపెట్టి క్రమంగా రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి.
- ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా నీళ్లు కాచి తాగడం మంచిది.
- ఆహారంపై మూతలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
- తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
- వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో కాఫీ, ఆల్కహాలిక్ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. పాలు కూడా తాగకూడదు.
వాంతులు, విరేచనాలు ఆగకుండా అవుతున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.