Friday 1 April 2016

Antibiotics-Precautions with Antibiotics - యాంటీ బయోటిక్స్ తో జాగ్రత్తలు


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjIWPDxYMrjupRTiigTTwxfrYoZW1bFunYChaE5dl3Qu6zy5QfF8mlTm6JHH8mVwVt7zXHJxwA1t2zGBmzuOgMGHSDqTu55cE9SPpVF499ZtDQu4VUxr8VxRhLR_UMLo3j7N99uMaTvxLc/s1600/tablets-loose-spirulina.jpg   

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -యాంటీ బయోటిక్స్ తో జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము . యాంటి(Anti) అనంటే వ్యతిరేకమై(opposite)నది అని అర్ధము . జీవులు నశింపజేయడానికి ... తద్వారా వాటివల్ల కలిగే జబ్బులను నయము చేయడానికి వాడే రసాయనాలు .

* వివిధ వ్యాధుల నివారణకు యాంటీ బయోటిక్స్ వాడడం సర్వసాధారణం. ఈ యాంటీ బయోటిక్స్ ను సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో ఉంటాయి. చిన్నపిల్లలకు సిరప్ ల రూపంలో ఉంటాయి. కొన్ని టాబ్లెట్ల రూపంలో ఉండే యాంటీ బయోటిక్స్ లలో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మం మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఆ మచ్చల వద్ద దురద కూడా వస్తుంది. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. డాక్టర్లు రోగిని పరిక్షించి యాంటీ బయోటిక్స్ కు రియాక్షన్ కలగకుండా మందులిస్తారు. కొన్ని రకాల యాంటి బయాటిక్స్ తో వాంతులు,వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తుంది. ఈ తరహా మందులతో కొన్ని సార్లు విరేచనాలు అయ్యో అవకాశం ఉంది. ఈ స్థితిలో విరేచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటీ బయోటిక్స్ వాడడం ఆపేస్తే సరిపోతుంది.

దీర్ఘకాలిక దుష్ప్రభావాలు:
ఏ మందులనైనా డాక్టర్ సూచించిన పరిమిత కాలం వరకే వాడాలి. కానీ, చాలా మంది ఒకసారి సూచించిన మందులను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. ఇలా డాక్టర్ ప్రమేయం లేకుండా మందులు వాడుతున్నప్పుడు వెంటేనే ఏ ప్రభావం చూపించక పోవచ్చు కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం దేహంపై తప్పక పడుతుంది. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యంటి బయాటిక్స్ ప్రభావం పడి, అది జాండిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పవర్ ఫుల్ యాంటిబయోటిక్ ఇంజక్షన్లు ఎక్కువ కాలం పటు తీసుకుంటే అవి కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకనే ఏ మందులనైనా డాక్టర్ల సలహా సూచనలను అనుసరించే వాడాలి.
ఏదైనా వ్యాధి సోకినప్పుడు అవసరమైన రక్త, మూత్ర పరీక్షలన్నీ చేయించుకోవడం అవసరం. దీని వల్ల వ్యాధికి తగిన మందులు రాసే అవకాశం డాక్టర్ కు దొరుకుతుంది. వ్యాధిని బట్టే యాంటీ బయాటిక్స్ వాడే కాలవ్యవధి ఉంటుంది. కొన్ని సార్లు డాక్టర్లు సూచించిన గడువుకన్నా ముందే వ్యాధి నుండీ ఉపశమనం లభించవచ్చు. అలా ఉపశమనం లభించగానే మందులు వాడడం ఆపేస్తారు. అలా ఆపేయడం కూడా మంచిది కాదు. సమస్య తగ్గినా డాక్టర్ చెప్పే వరకు మందుల వాడకాని కొనసాగిస్తూనే ఉండాలి.

No comments:

Post a Comment