Sunday, 3 April 2016

hernia - హెర్నియా




  • హెర్నియా అంటే ఏమిటి? : 
  •  మనశరీరములో వివిధ భాగాలు నిర్ధిష్ట స్థానాలలో స్థిరముగా ఉండేలా చూసేవి కండరాలు గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

హెర్నియా పలు రకాలు:
* 1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
* 2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
* 3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
* 4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

వ్యాధి లక్షణాలు:
1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు. 

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

హెర్నియా ఎందువల్ల వస్తుంది?
పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

హెర్నియా ఏర్పడిన తరువాత ఏం జరుగుతుంది?
హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

హెర్నియాతో ఎలాంటి సమస్యలు రావచ్చు?
నిరంతరాయంగా తీవ్రమైన నొప్పి, వాపు, తీపు ఉండవచ్చు. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలే. సర్జరీ ద్వారా హెర్నియాను తొలగించుకోవచ్చు.

హెర్నియాను నయం చేయడమెలా?
లోకల్‌ అనస్తేషియా ఇచ్చి మూడు, నాలుగు అంగుళాల గాటు చేయడం ద్వారా సర్జరీ చేస్తారు. పేషెంట్‌ 5 రోజుల్లోఇంటికి వెళ్ళవచ్చు. లాప్రోస్కోప్‌ ద్వారా కూడా ఇది చేయవచ్చు. దీనికి జనరల్‌ అనస్త్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్‌ మరుసటి రోజు ఇంటికి వెళ్ళవచ్చు.

హెర్నియా సర్జరీతో ఇతర దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఏవైనా ఉంటాయా?
ఏ ఆపరేషన్‌కైనా ఇతర దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. హెర్నియా కూడా ఇతర సాధారణ ఆపరేషన్‌ లాంటిదే. దీనిలో వాటిల్లే సమస్య లు మాత్రం చాలా తక్కువ, మరీ ముఖ్యంగా లోకల్‌ అనస్తీషియా ఇచ్చి చేసినప్పుడు.

No comments:

Post a Comment