ఇది చాలా పెద్ద సమస్య. మన సమాజంలో దాదాపు మూడో వంతు మంది ఈ రకం అలర్జీతో బాధపడుతున్నారు. మనకు 'అలర్జీ' కలిగించే ఆ శత్రువు.. మన పరిసరాల్లోనే.. మన ఇంట్లోనే ఉండొచ్చు. అది ఇతరుల్ని ఏ ఇబ్బందీ పెట్టకపోవచ్చు. కానీ మన పాలిట మాత్రం విలయం సృష్టిస్తుంటుంది. నిజం చెప్పాలంటే దాన్ని మనమేం చెయ్యలేం. మరి దీన్నుంచి బయటపడేదెలా?
ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం.. ఇవన్నీ చూడటానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ కొందరి పాలిట ఇవే శత్రువులు! ఇవి తగులుతూనే శరీరంలో తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు.. పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు.. ఇలా అలర్జీ కారకాల జాబితా చాలా పెద్దది! సాధారణంగా ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యని ఈ సాధారణ పదార్థాలే కొందరి పాలిట మాత్రం తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. ముక్కు, కళ్లు, చెవులు, గొంతు, వూపిరితిత్తులు, చర్మం.. ఇలా రకరకాల శరీర భాగాల్లో విలయం సృష్టిస్తుంటాయి. ముక్కుకు సంబంధించి చాలా ఎక్కువగా కనబడే సమస్య ఈ అలర్జీ. దీన్నే 'అలర్జిక్ రైనైటిస్' అంటారు. ఆ సరిపడని పదార్థాలేవో ముక్కుకు సోకినప్పుడు.. ముక్కులోని సున్నితమైన పొరలు తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో 'అలర్జీ' బెడద ఆరంభమవుతుంది.
కొందరిలో ఎప్పుడూ..!
అలర్జీ అన్నది కొన్ని కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసి, గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉండే కాలంలో, అలాగే చల్లదనం పెరిగే శీతకాలంలో.. ఇలా కొన్నికొన్ని సీజన్లలో ముక్కు అలర్జీలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీన్నే 'సీజనల్ అలర్జిక్ రైనైటిస్' అంటారు. గాలి ద్వారా వచ్చే పుప్పొడి పెద్ద అలర్జీ కారకం. అందుకే పాశ్చాత్య దేశాల్లో మన వాతావరణ హెచ్చరికల్లాగే గాలిలో ఈ పుప్పొడి శాతం (పోలెన్ కౌంట్) ఎంత ఉందన్నది కూడా చెబుతుంటారు. అయితే కొందరిలో ఇలా కాలాలతో, సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవూనా అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి. దీన్నే 'పెరీనియల్ అలర్జిక్ రైనటిస్' అంటారు. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ అలర్జీ తత్వం రావచ్చు. ముఖ్యంగా చర్మం మీద అలర్జీలు, తుమ్ములు, ఉబ్బసం వంటివి కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. చిన్న పిల్లల్లో అంటే ఐదారేళ్ల వయసు వరకూ సాధారణంగా ముక్కు అలర్జీలు కనబడవుగానీ.. వూపిరితిత్తుల్లో అలర్జీ కారణంగా ఉబ్బసం (అలర్జిక్ ఆస్థమా) అన్నది చిన్నవయసులో కూడా కనబడుతుంటుంది. మొత్తానికి 'అలర్జీ' అన్నది ఎవరికైనా, వేటి కారణంగానైనా రావచ్చు. కాబట్టి ఎవరికివారు తమకు దేనివల్ల అలర్జీ వస్తోంది, ఆ సరిపడనిదేమిటి? అన్నది గుర్తించటం మంచిది.
అలర్జీ నుంచి ఆస్థమా!
ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి కూడా పాకితే.. అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనబడతాయి. 60-70 శాతం మందిలో ముక్కులోనూ, ఛాతీలోనూ కూడా ఈ అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి.
దూరమే విరుగుడు:
ప్రధానంగా అలర్జీ కారకాలు తగిలే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసేసుకోవటం, కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసెయ్యటం, పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయం సమయాల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండటం.. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్ వంటివి కట్టుకోవటం.. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.
సమస్యల దొంతర అలర్జీ ఆరంభం:
సరిపడనివేవో తగిలి ముక్కులోని పొరల్లో ఈ అలర్జీ మొదలైతే.. 'హిస్టమైన్' విడుదల అవుతుంది. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్త్లె.. ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. అప్పుడు ఆగకుండా తుమ్ములు, ఆ వెంటనే ముక్కు వెంట నీరు ధారలా కారటం మొదలవుతుంది. తర్వాత మెల్లగా ముక్కు బిగిసిపోతుంది. ఇది 'అలర్జిక్ రైనైటిస్'. ఇది బాగా చికాకుపెట్టే సమస్య. ఈ దశలోనే దీనికి చికిత్స తీసుకుంటే మంచిది. ఇది ముదిరి.. దీర్ఘకాలిక సమస్యగా తయారైతే 'సైనుసైటిస్' వంటి దుష్ప్రభావాలు చాలా తలెత్తుతాయి.
* చాలామందికి ముక్కు దూలం, రంధ్రాల మధ్య గోడ కాస్త వంకరగా ఉంటుంది (డీఎన్‌ఎస్). దీంతో ముక్కు మార్గాలు లోపలికి వెళ్లినకొద్దీ సన్నగా ఉంటాయి. అలర్జీ కారణంగా ముక్కులోని పొరలు కొద్దిగా ఉబ్బినా కూడా.. వెంటనే ఈ మార్గాలు మూసుకుపోయినట్లవుతుంటాయి.
* దీనికి తోడు- మనం పీల్చే గాలిని తడిగా మార్చేందుకు, ధూళిని వడకట్టేందుకు ముక్కులో వర్తులాకార కండల్లాంటి 'టర్బినేట్స్' మూడు ఉంటాయి. ముక్కుకు పక్కన ఉండే సైనస్ గాలి గదుల నుంచి వచ్చే మార్గాలు ఈ టర్బినేట్స్ మధ్యనే తెరుచుకుంటూ ఉంటాయి. ముక్కులో అలర్జీ తీవ్రంగా ఉన్న వారికి ఈ టర్బినేట్స్ కండలు బాగా ఉబ్బిపోయి (హైపర్‌ట్రోఫీ) ఉంటాయి. అలర్జీ తగ్గగానే ఇవి తగ్గిపోతుంటాయి. కానీ కొన్నేళ్లుగా అలర్జీ ఉన్న వారికి ఇవి ఉబ్బి, అలాగే ఉండిపోతాయి. ఇలా ఇలా టర్బినేట్స్ పెద్దగా అయిపోవటాన్ని 'మల్బరీ హైపర్‌ట్రోఫీ' అనీ అంటారు. గోడ వంకర ఉండి, ఈ టర్బినేట్స్ ఉబ్బి ఉంటే ముక్కు మరింతగా బిగిసిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటివల్ల లోపలికి గాలి సరిగా ఆడదు. దీంతో సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ వంటివి మొదలవుతాయి.
* ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచినకొద్దీ ఘ్రాణశక్తి, వాసనలు తగ్గిపోతాయి. ఎందుకంటే వాసన తెలియాలంటే మనం పీల్చే గాలి.. ముక్కు పైభాగాన ఉండే 'ఆల్‌ఫ్యాక్టరీ' ప్రాంతానికి తగలాలి. కానీ ముక్కులోని పొరలన్నీ ఉబ్బినప్పుడు గాలి అలా లోపలికి వెళ్లలేదు. దీంతో వాసనలూ తగ్గిపోతాయి.
అలర్జిక్ సైనుసైటిస్:
ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ముక్కుకు ఇరువైపులా, పై భాగాన ఉండే 'సైనస్ గదుల్లో' కూడా అలర్జీ ప్రక్రియ మొదలవుతుంది. మన ముక్కు చుట్టుపక్కల మొత్తం 8 సైనస్ గదులుంటాయి. ఒక రకంగా ఇవి గాలి గదులు. వీటిలో గాలి మినహా మరేమీ ఉండదు. కానీ దీర్ఘకాలంగా అలర్జీ ఉన్న వారికి ఈ గదుల్లోపలి పైచర్మమంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది. ఎక్స్-రేల వంటివి తీస్తే.. ఆ పొరలు ఉబ్బి వాచినట్లు స్పష్టంగా కనబడతాయి. దీంతో వీరికి తలభారంగా ఉండటం, ముందుకు వంచితే నొప్పి, ముఖం మధ్యభాగంలో నొప్పి వంటి 'సైనుసైటిస్' లక్షణాలు బాధిస్తాయి. దీన్నే 'అలర్జిక్ రైనో సైనుసైటిస్' అంటారు. దీన్నీ నిర్లక్ష్యం చేస్తే సైనస్ గదుల్లో నుంచి ముక్కులోకి తెరచుకునే గాలి గొట్టాలు మూసుకుపోతాయి. దీంతో సైనస్ గదుల్లో వూరే స్రావాలు లోపలే పేరుకుపోయి.. అవి చిక్కబడి ఇన్ఫెక్షన్ ఆరంభమవుతుంది. దీంతో తలనొప్పి వంటి బాధలు మొదలవుతాయి. దీన్నీ నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత ముదురుతుంది.
ముక్కులో పిలకలు:
అలర్జీ మరింతగా ముదిరితే ముక్కులో పాలిప్స్ (పిలకలు) కూడా తయారవ్వచ్చు. దీన్నే 'నేసల్ పాలిపోసిస్' అంటారు. ఇవి సాధారణంగా సైనస్‌లలో, ముఖ్యంగా కళ్ల మధ్య ఉండే సైనస్ గదుల్లో మొదలవుతాయి. ఇవి ముక్కులో రెండు వైపులా నీటి తిత్తుల్లా పెరుగుతాయి. ముక్కులోకి తెరుచుకునే సైనస్ మార్గాల్లో నుంచి ఇవి బయటకొచ్చి.. తోలు తీసిన తెల్లద్రాక్షలా.. ముక్కు మార్గాల్లోకి వేళ్లాడుతూ కనబడుతుంటాయి. సైనస్ గదుల్లో పేరుకుపోయి, అక్కడంతా నిండిపోయిన తర్వాత ఇవి ముక్కులోకి వచ్చి వేళ్లాడుతుండటంతో.. ముక్కు మార్గాలు మూసుకుపోయి.. అప్పుడు శ్వాస ఆడని పరిస్థితి ఎదురవుతుంటుంది.
తోడయ్యే ఫంగస్:
అలర్జీ ముదిరిపోయి ముక్కులోపల పిలకలు పెరిగిన దశలో.. అక్కడ 'ఫంగస్' కూడా చేరటం మొదలవుతుంది. దీన్నే 'అలర్జిక్ ఫంగల్ సైనుసైటిస్' అంటారు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూస్తున్న సమస్య ఇది. ముక్కులోకి కెమేరా గొట్టాన్ని (నేసల్ ఎండోస్కోప్) పెట్టి చూసినప్పుడు.. లోపల పిలకలతో పాటు తెల్లటి బంకలాంటి ముద్దలు, చిక్కటి జిగురు పదార్థం వంటివి కనబడుతుంటాయి. సీటీ స్కాన్లో చూస్తే- సైనస్ గదుల్లో తెల్లటి ముద్దల్లా, చుక్కల్లా కనబడతాయి. ఇవి కనబడ్డాయంటే ముక్కులో, సైనస్ గదుల్లో ఫంగస్ చేరిపోయిందని అర్థం. దీనికి సాధారణంగా 'ఆస్పర్‌జిల్లోసిస్' అనే రకం ఫంగస్ కారణమవుతుంటుంది. ఈ దశలో సాధారణంగా సర్జరీ చేసి దీన్నంతటినీ తొలగించటం తప్పనిసరి అవుతుంటుంది. అలర్జీకి తొలి దశలోనే చికిత్స తీసుకుని.. దాన్ని నియంత్రణలో పెట్టుకుంటుంటే పరిస్థితి ఇక్కడి వరకూ రాదు.
గుర్తించేదెలా?అలర్జీని చాలా వరకూ రోగి లక్షణాల ద్వారానే గుర్తించవచ్చు. చలిగాలి, దిండ్లు పరుపుల్లో ఉండే తవిటి పురుగులు, దుమ్ము, పుప్పొడి.. ఇవే ఎక్కువ మందిలో అలర్జీకి కారణమవుతుంటాయి. వీరికి రక్తపరీక్ష చేస్తే 'ఇస్నోఫిల్స్' పెరిగి ఉంటాయి. వైద్యులు లైట్‌తో లేదా కెమేరా గొట్టం (నేసల్ ఎండోస్కోపీ)తో ముక్కులోకి చూసి- 'టర్బినేట్స్' ఉబ్బి ఉన్నాయా? గోడ వంకర ఉందా? సైనస్ గదుల్లో ఎలా ఉంది? లోపల పిలకలు పెరుగుతున్నాయా? ఫంగస్ ఉందా? ఇవన్నీ పరిశీలిస్తారు. అలర్జీని గుర్తించేందుకు 'స్కిన్ ప్రిక్ టెస్టు'లు వంటివి ఉన్నాయిగానీ వాటి అవసరం పెద్దగా ఉండదు. లక్షణాలను బట్టి సైనస్ గదుల పరిస్థితి తెలుసుకునేందుకు ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటివి చేయిస్తారు. దీర్ఘకాలంగా అలర్జీ ఉన్న వారికి ముక్కులోని లోపలి పొరలన్నీ పాలిపోయినట్టు.. టర్బినేట్స్ ఉబ్బినట్లు కనబడతాయి. పాలిప్స్, ఫంగస్ వంటివీ సీటీ స్కాన్‌లో స్పష్టంగా కనబడతాయి.
ఏమిటి మార్గం?
అలర్జీ బాధలకు ప్రధానంగా చెయ్యాల్సింది ఆ 'అలర్జీ కారకాలకు' సాధ్యమైనంత దూరంగా ఉండటం. ఇది చెప్పటం తేలికేగానీ ఆచరించటం అంత సులభం కాదు. ఎందుకంటే దేనికి అలర్జీ వస్తోందో గుర్తు పట్టటమే పెద్ద సమస్య, ఒకవేళ గుర్తు పట్టినా కాలుష్యం వంటివాటన్నింటికీ దూరంగా ఉండటం అంత తేలిక కాదు.
* యాంటీ హిస్టమిన్ మాత్రలు: చికిత్సలో వైద్యులు ప్రధానంగా 'యాంటీ హిస్టమిన్' మాత్రలు ఇస్తుంటారు. వీటిలో 'క్లోర్‌ఫినిరామిన్ మాలియేట్, అవిల్' వంటివి ఎక్కువగా ఇస్తుంటారు. కానీ వీటితో సమస్య ఏమంటే వీటివల్ల మత్తు వస్తుంది. అలాగే సిట్రిజెన్ హైడ్రోక్లోరైడ్, లివో సిట్రిజెన్ వంటి వాటితో కూడా కొంత మత్తు ఉంటుంది. ఇప్పుడు 'ఫెక్సఫెనడిన్, లొరాటిడిన్, రూపాటిడిన్' వంటి యాంటీ హిస్టమిన్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజూ ఒక మాత్ర వేసుకుంటే 24 గంటల పాటు తుమ్ములు, ముక్కు కారటం వంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
* ఈ యాంటీ హిస్టమిన్ మాత్రలు వేసుకుంటే మత్తురావటం వంటి ఇబ్బందులున్నాయి. నిద్ర, తలభారం, దాహం, అంతా విరగలాగుకు పోతున్నట్లుండటం, రాత్రి ఈ బిళ్ల వేసుకుంటే పగలు కూడా మగతగా అనిపించటం, డ్రైవింగ్ వంటివి కష్టం కావటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వీటిని నేరుగా ముక్కులోకి కొట్టుకునే 'స్ప్రే'ల రూపంలో కూడా తెచ్చారు. కానీ ఈ స్ప్రేలను రోజుకు ఐదుసార్లు వాడాలి. కాబట్టి ఆచరణలో ఇబ్బంది ఎక్కువ. 'అజలాస్టిన్' వంటి స్ప్రేలు విపరీతమైన చేదు కావటం, ఐదుసార్లు వాడాల్సి రావటంతో ఈ 'యాంటీ హిస్టమిన్' రకం స్ప్రేలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.
* స్టిరాయిడ్ స్ప్రేలు: ముక్కులోకి కొట్టుకునే 'కార్టికో స్టిరాయిడ్' స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. ఇవి నేరుగా ముక్కులోకి వెళతాయి కాబట్టి వీటితో ఇతరత్రా దుష్ప్రభావాలూ ఉండవు. మత్తురావటం వంటి ఇబ్బందులూ ఉండవు. అలర్జీ లక్షణాలు తగ్గి వెంటనే ఫలితం ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వైద్యులు కేవలం ఈ స్టిరాయిడ్ స్ప్రేలనే సిఫార్సు చేస్తారు. 'ఫ్లూటికసోన్, మొమెటసోన్, బుడిసనైడ్, ట్రామ్‌సిలనోన్' వంటివి స్ప్రే రూపంలో లభిస్తాయి. వీటిని రోజుకు ఒక్కసారి- రెండు రంధ్రాల్లో రెండు రెండు స్ప్రేల చొప్పున కొట్టుకుంటే 24 గంటల వరకూ మళ్లీ సమస్య తలెత్తదు.
* ఈ స్ప్రేలను ఎంతకాలం వాడాలన్నది ముఖ్యమైన అంశం. సీజనల్‌గా వచ్చే వారికి ఆయా సీజన్లో వాడుకుంటే సరిపోతుంది. దీర్ఘకాలం ఉండే వారికి ఇన్ని రోజులు వాడాలనేం లేదు. ఓ నెల రోజులు వాడి.. ఆ తర్వాత ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు వాడొచ్చు. ఇవి సురక్షితమైనమే కానీ మరీ ఎక్కువ కాలం వాడితే అరుదుగా ముక్కు నుంచి కొద్దిగా రక్తం రావచ్చు. కాబట్టి వైద్యుల సిఫార్సు మేరకే వాడుకోవటం మంచిది.
* అలర్జీ లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే- కొంతకాలం నోటి ద్వారా యాంటీహిస్టమిన్ మాత్ర, ముక్కులోకి స్టిరాయిడ్ స్ప్రే- రెండూ సిఫార్సు చేస్తారు. అరుదుగా కొందరికి ఒకటి, రెండు వారాల పాటు 'ప్రెడ్నిసలోన్' వంటి స్టిరాయిడ్ నోటి మాత్రలూ సిఫార్సు చేస్తారు.
ఇప్పటికే సైనుసైటిస్‌కు మారితే:
అలర్జీ ముదిరిపోయి సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ బయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. గోడ వంకర (డీఎన్‌ఎస్) ఉంటే దాన్ని సర్జరీ చేసి సరిచెయ్యటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టర్బినేట్లు బాగా ఉబ్బిపోయి ఉంటే.. సర్జరీలో వాటిని తగ్గిస్తారు. దాంతో అలర్జీకారణంగా ముక్కు బిగిసిపోయే బాధ బాగా తగ్గుతుంది. టర్బినేట్లు తగ్గించేందుకు 'సబ్‌మ్యుకోజల్ డయాథర్మీ, లీనియర్ కాటరీ' వంటి అత్యాధునిక ప్రక్రియలున్నాయి. ఒకవేళ సైనుసైటిస్ బాగా ముదిరిపోయి ఉంటే సైనస్ సర్జరీ (ఎఫ్‌ఈఎస్‌ఎస్) చేసి.. సైనస్ గదులను, వాటి మార్గాలను తెరవటం అవసరం. ఫంగస్ చేరితే.. పాలిప్స్, వాటితో పాటు మొత్తం ఫంగల్ పదార్థాలను తొలగించి.. సైనస్‌లలోకి బాగా గాలి వచ్చేలా చేసి.. అప్పుడు స్టిరాయిడ్ స్ప్రేలు లేదా మాత్రలు ఇస్తారు. ఈ రకం ఫంగల్ సమస్యకు 'యాంటీఫంగల్' మందులతో ఎటువంటి ప్రయోజనం ఉండదు, దీనికి స్టిరాయిడ్ మందులు ఒక్కటే మార్గం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు మళ్లీమళ్లీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి తరచూ వీటిని ఎండోస్కోపీతో పరీక్షిస్తుండాలి. పాలిప్‌ల వంటివి పెరుగుతుంటే స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. స్ప్రేలు దీర్ఘకాలం వాడుకోవచ్చు.
* చాలామందికి ముక్కులోకి ఇచ్చే స్ప్రేలతోనే సమస్యను చక్కగా నియంత్రించవచ్చు. కొద్దిమందికే సర్జరీ అవసరమవుతుంది.
* అలర్జీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది కాబట్టి సర్జరీల తర్వాతా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
లోలోపల యుద్ధం.. అలర్జీ మనకు సరిపడని అలర్జీ కారకాలైన పుప్పొడి, తవిటి పురుగుల వంటివి సోకినప్పుడు.. మన శరీరంలో ఒక్కసారిగా తీవ్రమైన ప్రతిస్పందన మొదలవుతుంది. ఇదే 'అలర్జీ'.
* అలర్జీ కారకాలు తొలిసారిగా మనకు తగిలినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మన శరీరం కొన్ని యుద్ధకణాలు (యాంటీబాడీలు) ఉత్పత్తి చేస్తుంది. ముక్కు అలర్జీల్లో 'ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇ' (ఐజీఈ) రకం యాంటీబోడీలు సిద్ధంగా ఉంటాయి.
* ఈ యాంటీబాడీలు ముక్కులోని కణజాలంలో ఉండే 'మాస్ట్ కణాలకు' అతుక్కుని.. మళ్లీ అదే తరహా శత్రువు కనిపిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా కాచుకొని కూర్చుంటాయి.
* తర్వాత మళ్లీ ఎప్పుడైనా ఆ అలర్జీ కారకాలు తగిలితే.. అప్పటికే మాస్ట్ కణాల మీద కాచుకొని కూచున్న ఈ యాంటీబాడీలు వాటిని గట్టిగా పట్టేసుకుంటాయి.
* వెంటనే మాస్ట్ కణాలు ఒక్క ఉదుటున 'హిస్టమిన్' అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో ముక్కులోని పొరలన్నీ వాచి, దురద, వాటి నుంచి నీరు కారటం, తుమ్ములు రావటం, ముక్కు బిగిసిపోవటం.. ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే 'ఐజీఈ మీడియేటెడ్ హైపర్‌సెన్సిటివిటీ రియాక్షన్' అంటారు.
* అలర్జీ కారణంగా- కళ్ల దురద, గొంతులో కిచ్ కిచ్, చెవుల్లో దురద.. ఇవన్నీ రావచ్చు.

No comments:
Post a Comment