కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు (placenta)బయటకు రావడం.
చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్ ఇన్‌ఫెక్షన్స్ అంటారు.
ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నెన్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్ డిశ్చార్జ్ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది.
ఇన్‌ఫెక్షన్‌ల నివారణ, చికిత్సలు...:
మహిళల్లో కాన్పు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ల నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గర్బం ధరించినప్పుడు రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్లు రక్తం తక్కువగా ఉన్నవారికి, బిపి ఉన్న వారికి అవసరమైన చికిత్సలు చేస్తారు. ప్రసవానికి ముందు పళ్లలో, చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్ ఉన్నా, ట్రాన్సిల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకో వాలి. బిపి, షుగర్, టిబి, మలేరియా, యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. డెలివరీ సమయంలో వాటర్ లీక్ అవుతుందని తెలిస్తే డాక్టర్లు ముందే ట్రీట్‌మెంట్‌చేస్తారు.
-గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్, పల్స్ చెకప్, బిపి, లీవర్, లంగ్స్ చెకప్ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్ ఇన్‌ఫెక్షన్, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్, సర్విక్స్ నుంచి యూరిన్, బ్లడ్ టోటల్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.
ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్ మందులను వాడాలి. స్టెరైల్ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.
యూరినరీ సమస్యలు...:
-కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవాలి. ఈ మహిళలు మంచినీటిని బాగా తాగాలి. ఇటువంటి వారు మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వీరికి మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావచ్చు. యూరిన్ బ్లాడర్‌లో వాపు కూడా రావచ్చు. యూరిన్ ఇన్‌ఫెక్షన్ రావడానికి ఓవర్ ఫ్లో, వెజినల్ డ్యామేజీ కారణం కావచ్చు. దగ్గినప్పుడు నొప్పి రావచ్చు. కొన్నిసార్లు యూరిన్ ఔట్‌పుట్ తక్కువగా ఉండవచ్చు.
బ్రెస్ట్ సమస్యలు...:
ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్ నొప్పి నివారణకు క్రీమ్ రాసుకోవడం, పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్ పరీక్షలు సైతం చేసుకోవాలి.
బ్రెస్ట్ సమస్యల్లో అక్యూర్డ్ మాస్‌టైటిస్ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే రిట్రాచ్ నిప్పల్, క్రాక్ నిప్పల్ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్ ఇస్తారు. కొందరు మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది.
-ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్ ఉంటుంది. బిపి ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్ సమస్యలు ఏర్పడతాయి. పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్ చే యాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.
సబ్ ఇన్‌వల్యూషన్...:
డెలివరీ తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవ డాన్ని సబ్ ఇన్‌వల్యూషన్ అంటారు. ఇటువంటి వారికి బ్లీడింగ్ ఎక్కువ కావడం, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్ రంగు మారి వాసనరావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి ఏర్పడుతుంది. యుటెరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్న వాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...:
కాళ్ల నరాల్లో, పెల్విక్ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.
No comments:
Post a Comment