Sunday, 3 April 2016

Heart valvular diseases - గుండె కవాటాలకు వచ్చే సమస్యలు










గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... ట్రైకస్పిడ్‌ వాల్వ్‌, పల్మనరీ వాల్వ్‌, మైట్రల్‌ వాల్వ్‌, ఆయోర్టిక్‌ వాల్వ్‌.
ఇక ఈ నాలుగు కవాటాలలో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు.
1. వాల్వ్‌ సన్నబడడం (స్టెనోసిస్‌)
2. వాల్వ్‌ లీక్‌ కావడం (రీగర్జిటేషన్‌)

వాల్వ్‌ సమస్యలకు కారణాలు...:
- కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల...

- కొందరిలో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజెస్‌ వల్ల...

- మరికొందరిలో ఇవి పుట్టుకతోనే రావచ్చు(కొంజెనిటల్‌).

- కొందరిలో అవి వయసు పెరగడం వల్ల (డీజనరేటిల్‌) వచ్చే సమస్యలుగా రావచ్చు.

వాల్వ్‌ సమస్యలు...లక్షణాలు...:
- హార్ట్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయాసం.

- పొడి దగ్గు.

- పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం (నాక్టర్నల్‌ డిస్నియా).

- గుండె దడ (పాల్పిటేషన్స్‌).

- బలహీనంగా అయిపోవడం (వీక్‌నెస్‌).

- ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన గుండె కవాటాన్ని బట్టి నిర్దిష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు...

- ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ లీక్‌ (రీగర్జిటేషన్‌) సమస్యలో కాళ్లలో వాపు కనిపిస్తుంది.

- మైట్రల్‌ వాల్వ్‌ సన్నం (స్టెనోసిస్‌) అయితే రక్తపు వాంతులు కావచ్చు.

- అయోర్టిక్‌ వాల్వ్‌ సన్నం (స్టెనోసిస్‌) అయితే స్పృహ తప్పవచ్చు.

ట్రాన్స్‌ ఈపోఫీజియల్‌ కార్డియోగ్రామ్‌ ఒక వరం...
ఇప్పుడు ట్రాన్స్‌ ఈసోఫీజియల్‌ ఎకో కార్డియోగ్రామ్‌ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు.

వాల్వ్‌ సమస్యలకు చికిత్స ఇలా...:వాల్వ్‌ సమస్యలకు కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు.

- కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరం అవుతుంది.

- మైట్రాల్‌ వాల్వ్‌ సన్నగా మారడం (స్టెనోసిస్‌) అయితే అలాంటి రోగుల్లో బెలూన్‌ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు.


-అయితే మిగతా గుండె కవాటాలు సన్నగా మారినా లేదా లీక్‌ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ అన్నదే పరిష్కారం.
వాల్వ్‌ను రిప్లేస్‌ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్‌లను ఉపయోగించవచ్చు.
1.మెటల్‌ వాల్వ్‌
2.టిష్యు వాల్వ్‌

- మెకానికల్‌ వాల్వ్‌ (మెటల్‌ వాల్వ్‌)ను ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబరిచే మందుఎసిట్రోమ్‌ వాడాల్సి ఉంటుంది.

- ఒక టిష్యూ వాల్వ్‌లు అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్‌ను వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబర్చే మందు ఎసిట్రోమ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.

కవాటాలకు సరికొత్త చికిత్స ప్రక్రియలివే...:
ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్‌ చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను మార్చడం కన్న వాల్వ్‌ ఎప్పుడూ మెరుగైనది కావడం వల్ల ఇప్పుడు వైద్య నిపుణులు రిపేర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌ను రిపేర్‌ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్‌ (రక్తాన్ని పలుచబరిచే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్‌, ట్రైకస్పిడ్‌ వాల్వ్‌లు అయితే రిపేర్‌ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

No comments:

Post a Comment