Sunday, 3 April 2016

Some Hints for reduction of overweight - బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


- వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు ...

వ్యాయామ పద్ధతి:
                        
వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నిద్రలేమీ కారణమే:
                             
నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆరోగ్య సమస్యలతో:
                          
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగటానికి బీజం వేస్తుంది. అధిక బరువు గలవారు నిపుణులతో థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే తగు చికిత్స తీసుకోవాలి.

మితాహారం మేలు:
                      
బరువు తగ్గకపోవటానికి ఎక్కువగా తినటమూ ఒక కారణమే. అందువల్ల మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడి ముప్పు:
                         
అధిక బరువు, ఒత్తిడి ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిజోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది ఆకలి పెరగటానికే కాదు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికీ దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

క్రమం తప్పరాదు:
                         
వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

మద్యానికి దూరం:
                           

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

తిండి మానేస్తే చేటు:
బరువు తగ్గటానికి చాలామంది మధ్యమధ్యలో తిండి తినటం మానేస్తుంటారు. దీనివల్ల కీడే ఎక్కువ. ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవటానికి కండరాలు క్షీణించటం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకి 5-6 సార్లు తినటం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజుని ప్రారంభించటం మేలు.

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవగాహనాలేమితో చేసే పొరబాట్లతో మరింత బరువు పెరుగుతాం. వాస్తవాలు తెలుసుకుని సరైన నియమాలు పాటించగలగాలి.

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగాతినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.

బరువుకు సర్జరీ:బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ వ్యాయామం చేయాలన్నా, ఆహార నియమాలు పాటించాలన్నా కొందరు ఇష్టపడరు. చికిత్స పద్ధతులతో సన్నబడాలని కోరుకుంటారు. ఇలాంటివారికి సర్జరీ అవకాశముంది కానీ ఇది పెద్ద ప్రక్రియ. దీంతో బరువు గణనీయంగా తగ్గినప్పటికీ.. అది కొనసాగాలంటే మాత్రం ఆహార నియమాలు పాటించటంతో పాటు వ్యాయామమూ కచ్చితంగా చేయాల్సిందే. బరువు తగ్గటానికి కొన్ని మందులూ లేకపోలేదు. వీటిల్లో కొన్ని ఆకలిని తగ్గించేవైతే.. మరికొన్ని కొవ్వు జీర్ణం కాకుండా చేసేవి. వీటిని కూడా ఆపకుండా వేసుకోవటం తగదు. దుష్ప్రభావాలూ ఉంటాయి. ఆహారం, వ్యాయామంతో వాటిని పూడ్చుకోవాల్సీ ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం తప్పదు. తేలికైన మరో దగ్గరి మార్గమేదీ లేదు.

బరువు తగ్గడములో పండ్ల ఉపయోగము:కొందరు బరువు తగ్గటం కోసం మిగతా ఆహారం మానేసి రోజంతా కేవలం పండ్లు, కూరగాయలే తింటుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు, కూరగాయలు ఒకేవిధంగా ఉండవు. కొన్ని పండ్లలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే.. కొన్ని కూరగాయల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, బ్రకోలీ, పుట్టగొడుగుల వంటి వాటిల్లో పిండి పదార్థం తక్కువ. ఇలాంటివాటిని కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండే బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నమాట నిజమే కావొచ్చు. వాటితో పాటు సహజ చక్కెర కూడా ఉంటుందని మరవరాదు. ముఖ్యంగా మామిడి, యాపిల్‌, ద్రాక్ష వంటి పండ్లలో చక్కెర ఎక్కువ. ఇవి కేలరీల మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల అదేపనిగా పండ్లు, పండ్ల రసాలనే తీసుకుంటే బరువు తగ్గటం అటుంచి పెరిగే ప్రమాదముంది.


శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మ న్యూనతకి గురిచేసి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అధిక బరువు లావు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరింత కష్టం. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో ఇది సులభతరంగా మారింది.

కారణాలు:అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు.

సమస్యలు:అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి.

చికిత్స:బీసీఏ (బాడీ కాంపోజిషన్ ఎనలైజర్)--
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మొదట  బాడీ కంపోజేషన్ ఎనలైజర్ ద్వారా ఎనాలిసిస్ చేసి మీ ఆహారపు అలవాట్లు సమీక్షించి, మీరు బరువు పెరగటానికి కారణం గుర్తిస్తారు. కన్సల్టేషన్‌లో వీటి మీద ఒక అవగాహన వచ్చి, మీ శరీర సహకారం అంచనా వేసి మీరు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అని నిర్ణయిస్తారు.

నాన్‌సర్జికల్ లైపోకేవి:ఈ నాన్ సర్జికల్ లైపోకేవి చికిత్సా విధానం చాలా సులభతరం ఎలాంటి నొప్పి, రంధ్రం చేయడం కుట్టు వేయడం లాంటివి జరగవు. మీ శరీర పై భాగం నుంచి తక్కువ ప్రీక్వెన్సీ కలిగిన అల్ట్రాసోనిక్ తరంగాలు పంపించడం ద్వారా శరీరంలోని కొవ్వును తొలగించడం జరుగుతుంది. ఈ చికిత్సా విధానం వారానికి రెండు సిట్టింగులు అవసరం ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్ ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం ఉండదు.  క్లినిక్‌లో అడ్మిట్ అవటం కానీ మందులు, పొడులు ఇవ్వడం జరగదు. ఈ చికిత్స తీసుకోవడానికి పేషెంట్‌కు మరొకరి అవసరం ఉండదు. ఎటువంటి రెస్ట్ కూడా అవసరం ఉండదు. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ సిట్టింగులు అవసరం పడతాయి. కొవ్వు తక్కువ, నీరు ఎక్కువగా ఉన్న వారు తక్కువ సిట్టింగులతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సా విధానంలో 5 నుంచి 20 కేజీల వరకు బరువు తగ్గవచ్చు.

ఆర్‌ఎఫ్ (రేడియో ఫ్రీక్వెన్సీ):నాన్ సర్జికల్ లైపోకేవి ద్వారా కొవ్వు తగ్గడం వల్ల చర్మం వదులుగా అవుతుంది. అలా సాగిన చర్మం మళ్లీ బిగుతు కావాలంటే ఆర్‌ఎఫ్ మిషన్ ద్వారా అది సాధ్యమవుతుంది. చాలా మందికి చేతులు, పొట్ట తొడలు, గడ్డం కింద చర్మం వదులుగా ఉండి ఊగుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ పెరుగుదలకు అనుగుణంగా పొట్ట సాగుతుంది. కానీ ప్రసవం తర్వాత కొంత మందిలో ఈచర్మం మునపటి స్థితికి చేరుకోదు. అలాంటి వారికి ఈ చికిత్స ఒక వరమని చెప్పవచ్చు.

No comments:

Post a Comment