Wednesday, 27 January 2016

Thyroid Gland Problems - థైరోయిడ్ సమస్యలు .



ధైరాయిడ్‌ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

థైరాయిడ్‌:


థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్‌ ఏపిల్‌) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది.

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.

హైపర్‌ థైరాయిడ్‌జమ్‌:


ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది.

లక్షణాలు:


ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్‌).

1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ. 2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు. 3. చేతులు వణకడం. 4. చెమటలు పట్టడం. 5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం. 6. వేడి తట్టుకోలేక పోవటం.
7. జుట్టు ఊడిపోవటం 8. తరచూ విరేచనాలు. 9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం. 10. తరచూ రుతు శ్రావం.
11. సక్రమంగా లేని గుండె లయ

చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
propylthiouracil (PTU, AntiTyrox) and methimazole (Neomerkazole,MMI, Tapazole). Carbimazole (which is converted into MMI in the body) is available

మందులు స్పెసలిస్ట్ డాక్టర్ సలహా తో వాడాలి .

హైపోథైరాయిడిజం:


థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:


1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా?


డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .

రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుం ది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

స్పెసలిస్ట్ లు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో స్పెసలిస్ట్ ని కలిసే తగిన ట్రీట్మింట్ ఎంచుకోవాలి .

మరి కొంత సమచారము కోసం - > హైపో థైరోయిడజం

గాయిటర్‌-goiter:





థైరాయిడ్‌ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమ యంలో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యాధాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్‌లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనిని వైద్యం తప్పనిసరి అవుతుంది.
చికిత్స : ఇలా అసహజంగా పెరిగిందానికి శస్తచ్రికిత్స అవసరం అవుతుంది. గడ్డలు ఉన్న స్థాయి, ప్రాంతాన్ని, పరిమణాన్ని, సంఖ్యని బట్టి శస్తచ్రికిత్స ఆధారపడి ఉంటుంది. లోవెక్టమీ, హెమీ థైరాయిడ్‌ వెక్టమీ, సబ్‌టోటల్‌ వెక్టమీ అనే సర్జరీలు చేయాల్సి ఉంటుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ :


ఇది చాలా అరుదుగా వస్తుంది. సర్జరీయే దీనికి చికిత్స. ఇందులో థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌ తరువాత రోగి అందరిలాగే నిండైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది

గర్భిణులు థైరాయిడ్‌ గురించి ఆలోచించండి!


థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే గర్భిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే (హైపోథైరాయిడిజమ్‌) గర్భస్రావమయ్యే ముప్పు ఎక్కువని చాలామందికి తెలియదు. తగు చికిత్స తీసుకోకపోతే బరువు, రక్తపోటు పెరగటంతో పాటు ముందుగానే కాన్పు అయ్యే అవకాశమూ ఉంది. పుట్టిన పిల్లల్లోనూ బుద్ధి వికాసం అంతగా ఉండదు. మనదేశంలోని గర్భిణుల్లో హైపోథైరాయిడిజమ్‌ తరచుగానే కనిపిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడి కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగించేందుకు ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీ(ఐటీఎస్‌) జనవరి నెలను 'థింక్‌ థైరాయిడ్‌ మంత్‌'గా పాటిస్తోంది. మనదేశంలో గర్భిణుల్లో 6.47 శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్టు తేలటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణులంతా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలని (ఐటీఎస్‌) మెంబర్స్ చెబుతున్నారు. చాలామంది గర్భిణులు తాము తీసుకునే ఆహారం, రక్తపోటు, వ్యాయామం, డాక్టర్‌ వద్దకు వెళ్లటంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు గానీ థైరాయిడ్‌ పరీక్షను అంతగా పట్టించుకోరు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ పరీక్ష చేయించుకోవటం చాలా అవసరము .

థైరాయిడ్‌ వంటి సమస్యలుండే వారికి పోషకాహారము , Nutritive food for Thyroid patitients.


శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పోషకాహారమే పరిష్కారం..:


పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు.

ఇనుమే.. ఇంధనం :


పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.

ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.

క్రూసీఫెరస్‌ రకం ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి.

పాలు, చేపలతో ఫలితాలు :


విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం :


క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు.

Computer Waste & ill-health - కంప్యూటర్ అవశేషాలు (Waste) అనారోగ్యము


e - (కంప్యూటర్ ) వేస్ట్‌ను ఏం చేద్దాం ?


పెరుగుతున్న విజ్ఞానంతో పాటు మనిషి అవసరాలు తీర్చేందుకు కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, టీవిలు, ప్రిజ్‌లు, మైక్రోవేవ్‌ ఒవెన్లు పుట్టుకొచ్చాయి. వీటి సర్వీస్‌ పూర్తవడంతో వాటిని వేస్జేజీగా జమకట్టి అమ్మేస్తుంటాం. కానీ పనికిరాని ఈ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్ని అమ్మేసి మనం చేతులు దులుపుకున్నా తయారీ సమయంలో వీటిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాలు ధ్వంసం చేయడానికి వీలులేకుండా పోతున్నాయి. వీటినే ‘ఈ-వేస్టు ‌’గా అంటారు. ఈవేస్ట్‌లో నిక్షిప్తమై ఉన్న రసాయనపదార్థాలు మనిషి ఆరోగ్యానికి కీడు చేయడంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగిస్తున్నాయి. ఫలితంగా వీటి ప్రభావం మనతో పాటు రాబోయే తరాల వారికి కూడా ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలో ప్రతి సంవత్సరం 200 నుం డి 500 లక్షల టన్నుల ఈవేస్ట్‌ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే వ్యర్థ భాగంలో ఐదు శాతాన్ని ఆక్రమిస్తుంది. యూ రోపియన్‌ దేశాలు విడుదల చేసే ఈ వేస్ట్‌ నిష్పత్తి ప్రతి సంవత్సరం 35 శాతం పెరుగుతోందని గ్రీన్‌పీస్‌ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంటర్నేషనల్‌ సింపోజియమ్‌ ఆన్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ రిపోర్టు ప్రకారం చైనాలో ప్రతియేటా 7 కోట్ల మొ బైల్‌ ఫోన్లు, 3.3 కోట్ల టీవీలు, 44 లక్షల కంప్యూటర్లు పనికిరాని వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయట.



వదిలించుకుంటున్నాయి...:


అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఈ-వ్యర్థాల్ని భూమిలో పాతకుండా, కాస్త ఖరె్చైనా రిసైక్లింగ్‌ చేయాలని ఆయా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నాయి. కొన్ని దేశాలు తెలివిగా తమ దేశాల్లో పేరుకుపోయిన ఈవేస్ట్‌ను ఆసియా, ఆఫ్రికా వంటి పేదదేశాలకు కారుచౌకగా అమ్మేసి చేతులు దులుపుకుంటున్నాయి.

యూరోపియన్‌ దేశాల్లో యేటా విడుదలయ్యే 77లక్షల టన్నుల ఈవేస్ట్‌లో దాదాపు 66 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను అక్రమంగా చైనా, భారత్‌, ఆఫ్రికా దేశాలకు రవాణా చేస్తున్నాయి. 2005లో అమెరికాలో ఈవేస్ట్‌గా సేకరించిన కంప్యూటర్లలో 10 శాతం, టీవీల్లో 14 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు తరలించారు. మిగిలిన వాటిని నైజీరియా వంటి పేద దేశాలకు అక్రమంగా తరలిస్తున్నాయి. మెరికా నుండి ప్రతి నెలా కనీసం లక్ష కంప్యూటర్లు ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి.

ప్రమాదభరితంగా రీసైక్లింగ్‌....:


ధనిక దేశాలు రీసైక్లింగ్‌ పద్ధతులకు అవలంబించాల్సిన నిర్దుష్ట పద్ధతులు, నియమాలను తుంగలో తొక్కుతున్నాయి. దీనికి పేదరికం, నిరుద్యోగం తోడవడంతో వేలాది కార్మికులు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రాణాలకు తెగించి రీసైక్లింగ్‌ పరిశ్రమల్లో పనికి చేరుతున్నారు.యునైటెడ్‌ నేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ పోగ్రాం అందించిన నివేదిక ప్రకారం రీసైక్టింగ్‌ యూనిట్లలో విషతుల్య డైఆక్సీన్‌ శాతం పరిమితికి మించి 37-133 శాతం ఉన్నట్లు నిర్ధారించింది.

శ్వాససంబంధ వ్యాధులు, హృద్రోగ సమస్యలతో వేలాది కార్మికులు అకాల మరణం చెందుతున్నారని యూఎన్‌ఈపీ అధ్యయనంలో తేలింది. మనదేశం లో నూ ఈవేస్ట్‌ను రిసైక్లింగ్‌ చేసే ప రిశ్రమల్లో పెద్ద ఎత్తున కంప్యూటర్‌ మానిటర్లు, కేబు ళ్లు, ప్రింట్‌ కార్ట్‌రిజ్‌లు, సీడీలు, విద్యుత్‌బల్బులు, ట్యూబ్‌లైట్లను భస్మం చేస్తుంటారు. ఫలితంగా ప్రమాదకారకమైన లెడ్‌(సీసం) వ్యర్థా లు కార్మికుల ఆరోగ్యాన్ని హరించడంతో పాటు పర్యావరణాన్ని మరింత కలుషితయం చేస్తున్నాయి.
-----------------------------------------------------------------------------------

ఎలా ధ్వంసం చేయాలంటే....:





సాధారణంగా ఈవేస్ట్‌ను నాలుగు దశల్లో భస్మీపటలం చేస్తారు.
లాండ్‌పిల్‌:
ఇది సాధారణంగా అందరూ అవలంబించే పద్ధతి. కానీ ఈ పక్రియలో విషపూరిత రసాయనాలు, పదార్థాలు భూమిలో కలిసి జలవాయువుల్ని కలుషితం చేస్తున్నాయి. అమెరికన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీ అందజేసిన లెక్కల ప్రకారం ఒక్క అమెరికాలోనే 2005లో 46 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను భూమిలో పాతిపెట్టారు. యూరోపియన్‌ దేశాల్లో ఈవేస్ట్‌ను నేలలో పాతిపెట్టడం చట్టరీత్యా నేరం.

ఫైర్‌ (కాల్చడం) :
ఈ పక్రియలో సేకరించిన ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్ని నిర్దేశించిన ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. కానీ ఈ పద్ధతి వల్ల భారీ మోతాదులో సీసం, కాడ్మియం, డైఆక్సీన్‌ వంటి హానికారక రసాయనాలు వెలువడి గాలిని కలుషితయం చేస్తాయి.

రీయూజ్‌:
పరికరాల జీవన ప్రమాణాన్ని పెంచి మళ్లీ వాటిని వినియోగించడాన్నే రియూజ్‌ అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ వేస్ట్‌ను దిగుమతి చేసుకునే ఉద్యేశ్యం కూడా ఇదే. తక్కువ ఖర్చులో విలువైన సామాగ్రిని పేద ప్రజలకు అందించాలనే బృహత్తర లక్ష్యం దీని వెనుకుంది. కానీ వీటి జీవితకాలం బహుస్వల్పం కావడం వల్ల వాటిని దిగుమతి చేసుకున్న దేశాలు పర్యావరణ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాయి.

రీసైక్లింగ్‌:
ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించిన ముడిపదార్ధాల్ని జాగ్రత్తగా సేకరించి కొత్త వాటిలో ఉపయోగించే పక్రియే రిసైక్లింగ్‌. కానీ ఈ పక్రియలో పనిచేసే కార్మికులకు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురౌతాయి. చుట్టుపక్కల ప్రాంతాలు పర్యావరణ పరంగా కలుషితం అవుతాయి.



మన దేశంలో:


ఆర్థికంగా శీఘ్రగతిన అబివృద్ధి చెందుతోన్న మన దేశంలో సగటున ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం ప్రతియేటా పెరుగుతోంది. ఫలితంగా ఈవేస్ట్‌ పరిమాణం కాస్తా వృద్ధి చెందింది. కానీ ఇప్పటి వరకు వీటిని పర్యావరణానికి హాని కలిగించకుండా ధ్వంసం చేయడానికి సరైన వ్యవస్థగానీ, నిపుణులు గానీ మనదేశంలో లేకపోవడం గమనార్హం. 2008లో భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈవేస్ట్‌ను ధ్వంసం చేయడానికి కొత్తగా దిశానిర్దేశాల్ని జారీచేసింది. అయినా ఇప్పటి వరకు ఇవి కార్యరూపం దాల్చలేదు.

కంప్యూటర్ల పాత్ర...:


ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈవేస్ట్‌లో అధికభాగం కంప్యూటర్ల నుండి వస్తుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. గ్రీన్‌పీస్‌ లెక్కల ప్రకారం 2006నాటికి కంప్యూటర్లు 57.35 లక్షల టన్నుల ఈవేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. టోక్యో (జపాన్‌)లోని ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కంప్యూటర్‌లో ఉపయోగించే చిన్న చిప్‌ను ధ్వంసం చేస్తే కలిగే పర్యావరణహాని ఒక కారును ధ్వసం చేసినపుడు వచ్చిన కాలుష్యానికి సమానమట. రెండు గ్రాముల బరువుండే కంప్యూటర్‌ చిప్‌ను తయారు చేయడానికి 1.6 కిలో ఇంధనం, 72గ్రాముల రసాయనాలు అవసరమౌతాయి.

మనిషి శరీరంపై కంప్యూటర్‌ పరికరాల దుష్ర్పభావం...:


 మానిటర్‌: ఇందులో ఉండే క్యాథోడ్‌ రే ట్యూబ్‌లో 4-8పౌండ్ల లెడ్‌ ఉంటుంది. ఇది మానిటర్‌ అద్దానికి రేడియేషన్‌ కిరణాల్ని పంపడంతో అవి నేరుగా మనకి వచ్చి తాకుతాయి. మానిటర్‌ అద్దానికి వాడే బేరియం, ఫాస్ఫేట్‌ వంటి రసాయనాలు విషతుల్యాలే.

కంప్యూటర్‌ ఛేసిస్‌:
లోహంతో తయారు చేసే కంప్యూటర్‌ బాడీలు వాతావరణ ప్రభావానికి లోనవకుండా ఉండేందుకు హెక్సావాలెంట్‌ క్రోమియం అనే విషపూరిత రసాయనంతో పూత పూస్తారు.

కేబుల్స్‌, వైర్లు:
వీటి తయారీకి పి.వి.సి, పి.బి.డి.ఇ (పాలీ బ్రోమినేటెడ్‌ డిఫెన్లీథర్స్‌) పదార్థాల్ని వాడుతారు.

సర్క్యూట్లు, బోర్డులు:
సర్క్యూట్ల తయారీలో లెడ్‌ తీగలు, సెమికండక్టర్లు, చిప్స్‌ వాడితే, బోర్డు తయారికి బెరీలియాన్ని వాడుతారు. వీటిపై పూతకోసం మెర్క్యురీ వాడుతారు. సెమికండక్టర్లు, రెసిస్టర్లలో కాడ్మియం వాడుతారు.

మానవ శరీరంపై దుష్ర్పభావాలు...:


లెడ్‌ (సీసం):
మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది.

బేరియం:
మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

హెక్సావాలెంట్‌ క్రోమియం:
డి.ఎన్‌.ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది.

ఫాస్ఫరస్‌:
జ్ఞాపకశక్తి నశిస్తుంది.

బెరీలియం:
క్యాన్సర్‌ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది.

మెర్క్యురీ:
మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం, మహిళల్లో పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.

పి.బి.డి.ఇ:
పిండం ఎదుగుదలను అడ్డుకుంటుంది.

Computer Related Diseases & prevention - కంప్యూటర్ల వలన వఛ్ఛే వ్యాధులు నివారణ



  • నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .


అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్‌ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కంప్యూటర్‌ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్‌ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్‌ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.


  • కంప్యూటర్ పై పని చేసే వారికి సాదారణముగా కలిగే ఆరోగ్య సమస్యలు .:





  1. కంప్యూటర్ విజన సిండ్రోం - సి.వి.య స్ ,

  2. రిపిటేటివ్ స్టిములస్ ఇంజురీ - ఆర్.యస్.ఐ .,

  3. కండరాల నొప్పులు ,

  4. నిద్రపట్టక పోవడం ,

  5. సరిఅయిన వ్యాయామము లేక బి.పి , సుగర్ జబ్బులు వచ్చే ప్రమాదము ,





ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్‌ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్‌ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్‌ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్‌ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్‌ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్‌ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్‌ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్‌ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్‌ (ఫుట్‌ రెస్ట్‌) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం

సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నోస్ట్రెస్‌ (Technostress) : దీనివల్ల కంప్యూటర్‌ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్‌, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.

టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌ : ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ వాడేవారికి 'టొయస్ట్‌ స్కిన్‌ సిండ్రోమ్‌' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్‌' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్‌ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ నుంచి 125 ఫారిన్‌హీట్‌ (52 సెంటీగ్రేడ్‌) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్‌ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్‌ అన్‌డ్రెస్‌ అర్నాల్డ్‌ పీటర్‌ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్‌ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :



  • తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్‌ స్క్రీన్స్‌ వాడాలి. తద్వారా మోనిటర్‌ నుండి వచ్చే రేడియేషన్‌ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -

  • పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -

  • కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్‌ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -

  • ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -

  • కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్‌ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -

  • కీబోర్డ్‌ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -

  • కంప్యూటర్‌ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -

  • కాళ్ళకి కూడా సపోర్ట్‌ (ఫుట్‌రెస్ట్‌) వాడాలి, -

  • ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్‌ తీసుకోవాలి, -

  • ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి. 


పిల్లలకు మానసిక సమస్యలు :


మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్‌ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా



ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

Monday, 25 January 2016

Plastic feeding bottle..bad to heart - పాల సీసా.. గుండెకు చేటు





పిల్లలకు వాడుతున్న ప్లాస్టిక్‌ పాలసీసాలు ఎంత వరకూ సురక్షితం? దీనిపై అంతర్జాతీయంగా చాలా కాలంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాల తయారీలో 'బిస్ఫెనోల్‌ ఎ (బీపీఏ)' అనే రసాయనం వాడతారు. ఈ రసాయనం ప్రమాదకరమైనదని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా దీని కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తాజాగా జరిపిన విస్తృత అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. హార్మోన్ల పనితీరుపై తీవ్ర దుష్ప్రభావం చూపే రసాయనం ఇది. ఇది కేవలం ప్లాస్టిక్‌ సీసాల్లోనే కాదు, డ్రింకుల సీసాలు, ఆహారం పార్సిల్‌ చేసేందుకు వాడే ప్లాస్టిక్‌ వస్తువుల వంటివాటన్నింటిలోనూ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో నూటికి 90 మంది ఏదో రూపంలో ఈ రసాయనం ఉన్న వస్తువులను వాడుతూనే ఉన్నారు. మూత్రంలో ఈ రసాయనం అధికంగా గలవారికి గుండె జబ్బుల ముప్పు 33 శాతం ఎక్కువగా ఉంటోందని 'నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే' సమాచారం ఆధారంగా గుర్తించారు. గతంలో ఈ బీపీఏ రసాయనం మధుమేహం, లివర్‌ ఎంజైమ్‌ల వంటివాటి పైనా ప్రభావం చూపుతోందని భావించేవారు. అయితే తాజా అధ్యయనంలో వాటికి సంబంధించిన దుష్ప్రభావాలు కొంత తక్కువేగానీ గుండె జబ్బులు ముప్పును మాత్రం నిర్లక్ష్యం చేయటానికి లేదని తేలటం విశేషం.

అందుకే దీన్ని 'ఎండోక్రైన్‌ డిజ్రప్టర్‌' అనీ అంటున్నారు. ఇది శరీరంలోని స్త్రీహార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌తో పాటు పురుష హార్మోన్లను కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ఈ రసాయనం సృష్టించే దుష్ప్రభావాలపై ప్రజల్లోనూ, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీదారుల్లో కూడా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని... వీలైంత వరకూ ఆహార పదార్ధాల కోసం ఈ తరహా ప్లాస్టిక్‌ సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ పేపర్లు వాడకపోవటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Fistula in Ano - భగంధరం వ్యాధి - ఫిస్టులా





కొన్ని వ్యాధులు కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తాయి. అలాంటి వాటిలో ఫిషర్, ఫిస్టులా (భగందరం), పైల్స్ (అర్శమొలలు), ఆబ్సిస్ (Abscess-చీము గడ్డ) మలద్వారంలో వచ్చే నాలుగు ప్రధాన సమస్యలు. కాకపోతే, ఈ నాలుగింటిలోనూ స్వల్పమైన తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి. ఈ నాలుగింటిలో ఒక వ్యాధిని మరో వ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. కాకపోతే నాలుగింట్లో ఏ వ్యాధి వచ్చినా చాలా మంది అర్శమొలలే అనుకుంటారు.


  • ఫిస్టులా:




ఈ వ్యాధిని కొందరు ''లూటి'' అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు.''భగంధరం'' వ్యాధి అని కూడా అంటారు . మలవిసర్జన మార్గము ప్రక్కన ఎటో ఒకవైపు కురుపు ఏర్పడి అది పెరుగుతూ పోయి లోపల పెద్దపేగు చివర భాగములో రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. బయటి చర్మము మరియు లోపల ప్రేగుకు రెండువైపులా రంధ్రము ఏర్పడడాన్ని ఫిస్టులా అంటారు.  ఫిస్టులా అన్నది ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే సమస్య. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ ఇన్‌ఫెక్షన్లు ఎందుకు వస్తాయన్నది ఇంతవరకూ ఖచ్చితముగా తెలియదు. ఇకపోతే మలబద్ధకం వల్ల అంతకు ముందే ఉన్న ఫిస్టులా సమస్య ఎక్కువవుతుందే తప్ప మలబద్ధకం వల్ల ఫిస్టులా రాదు. అలాగే దూరప్రయాణాలు, మాంసాహారం, మసాలా పదార్థాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. మలద్వారం చుట్టూ గడ్డలు వస్తాయి. తరువాత చీము పడుతుంది. ఈ సందర్భంలో సరైన చికిత్స చేయకపోవడం వల్ల భగంధరం ఏర్పడుతుంది. అయితే ఆధునిక వైద్య విధానాల్లో చేసే శస్త్ర చికి త్స వల్ల ఫిస్టులా సమస్య ఎప్పుడూ పూర్తిగా పోదు. కొంత కాలం ఉపశమనంగా ఉన్నా కొన్నాళ్లకు మళ్లీ ఆ సమస్య మొదలవుతుంది. ఎక్కువ కాలం ఈ సమస్య ఇలాగే కొనసాగితే అక్కడ ఏర్పడిన చీము పేగుల్లోకి కూడా వెళ్లి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.

  • పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు తక్కువ గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.


ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.్

ప్రేరేపించే కారణాలు :



  • జీర్ణవ్యవస్థలోని లోపాలు, ఆ కారణంగా వచ్చే మలబద్ధకం సమస్యే ప్రధాన కారణం.

  • ఆహారంలో పీచుపదార్థాలు తక్కువగా ఉండడం,

  • నీరు తక్కువగా తాగడం,

  • శరీర శ్రమ లేకపోవడం,

  • స్థూలకాయం,

  • ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం,

  • గంటల పర్యంతం వాహనాలు నడపడం

  • గర్భంలోని శిశువు బరువు కారణంగా కూడా కొంత మంది స్త్రీలు ఈ సమస్యలను ఎదుర్కొంటారు.

  • పెద్ద వ్యవధి లేకుండా వెంట వెంట ప్రసవాలు జరిగినప్పుడు .


లక్షణాలు:



  • నొప్పి,

  • రక్తస్రావం,

  • చీము-జిగురు పడటం,

  • దురద


ఇవే ప్రధానంగా కనిపించినా మరి కొన్ని ఉప లక్షణాలు కూడా కనిపిస్తాయి. వాటిలో

  • జీర్ణక్రియ, విసర్జన క్రియ సరిగా లేకపోవడం.

  • ఆహారం మీద ఆసక్తి లేకపోవడం,

  • కడుపు ఉబ్బరం,

  • నోటినుంచి మలద్వారందాకా మంటగా ఉండడం,

  • కడుపులో శబ్దాలు రావడం,

  • బరువు తగ్గడం,

  • తేన్పులు రావడం,

  • రక్తహీనత ఏర్పడటం,

  • కళ్లు తిరిగినట్లు అనిపించడం,


వ్యాధి నిర్ధారణ : 



  • చికి్త్సకు ముందు వ్యాధి నిర్ధారణ చాలా ముఖ్యము. దానికోసము -- ట్రాన్స్ యానల్ స్కాన్‌, ఫిస్టులోగ్రామ్‌, యం.ఆర్.ఐ.ఫిస్తులా, లాంటి పరీక్షలు చేసి ... కాన్సర్ కాదని బలపడిన తరువాత ముందుకు సాగాలి.


చికిత్స :

  • ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా హైరానా పడే వ్యక్తులో దురదలు పెట్టే వ్యాధులు ఎక్కువగానే కనిపిస్తాయి. చాలారకాల చర్మవ్యాధులు మానసి కంగా నలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా బహిర్గతమవు తాయి. ఈ తరహా సమస్యలున్నప్పుడు కేవలం శరీరానికే కాకుండా మనస్సుకు కూడా చికిత్స చేయాల్సిఉంటుంది.


అల్లోపతి : నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen , diclofenac, aceclofenac) వాడాలి . ఇన్‌ఫెక్షన్‌ అయి చీము , రసి కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్ (ciprofloxin +ornidazole) వాడాలి.
ఏమీ చెయ్యకుండా ఉండడము : రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .
ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్‌ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.
సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .

  • ఆయుర్వేదము : క్షారసూత్ర ప్రక్రియ ద్వారా క్షార సూత్ర వైద్య ప్రక్రియతో భగంధరం దూరం అవుతుందని ఓరుగల్లు నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎంవిడి ప్రసాద్‌ చెప్పారు. దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:



  • చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,

  • మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,

  • మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.

  • మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.

  • ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.

  • మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవసరం.


ఫిస్టులా-భగందరం.. లోలోపల భయం / ఈనాడు సుఖీభవ 18/11/2014 /డా.వర్ఘీస్ ముత్తయ్ -కొలొరెక్టర్ సర్జన్‌ .యశోదా హాస్పిటల్ ,హైదరాబాద్ .

చెప్పుకోవాలంటే సిగ్గు. అలాగని వూరుకోవాలంటే భయం! నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక.. పట్టించుకోకుండా తిరిగితే ఇదెంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందోనన్న ఆందోళన. ఇవన్నీ నిరంతరం మనసును తొలి చేస్తుంటాయి. ఏ పని చెయ్యాలన్నా ఇదే బెరుకు. మలద్వారానికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఆ బాధలకు తోడు మనసు కూడా ఇలా పరిపరివిధాలుగా విలకమై పోతుంటుంది. ఇక భగందరం వంటి సమస్యలైతే ఈ బాధ మాటల్లో చెప్పలేం! మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో పుండులా మొదలవుతుంది. చిట్లి చీము కారుతూ వేధించి.. కొద్దిరోజుల్లో మానినట్లే ఉంటుంది. పోయిందిలెమ్మని అనుకుంటుండగానే మళ్లీ మొదటికి వస్తుంటుంది. ఇలా ఆ చుట్టు పక్కలే ఒకటి.. రెండు.. చాలా పుండ్లు మొదలవ్వచ్చు. పైపైన పుండ్లు మానినట్లే ఉంటాయి, కానీ ఎక్కడో లోపలి నుంచి మళ్లీ మొలుచుకొస్తుంటాయి. నిజానికి ఈ సమస్యకు మూలం పైన చర్మం మీద కాదు.. లోలోపల ఎక్కడో మలమార్గం నుంచే ఉంటుంది. దాన్ని ఆ లోపలి నుంచి సంపూర్ణంగా ముయ్యగలిగితేనేగానీ ఇది మానదు. ఇదే భగందరం! ఒక రకంగా మొండి సమస్య. సరైన నైపుణ్యంతో చికిత్స చెయ్యకపోతే.. మొదటికే మోసం వచ్చి, మలంపై పట్టు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని సరిగ్గా గుర్తించటం.. మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. అది సంపూర్ణంగా తొలగిపోయేలా సరైన చికిత్స తీసుకోవటం అవసరం.

మలద్వార బాధల గురించి మాటల్లో చెప్పటం కష్టం! అందుకే చాలామంది సాధ్యమైనంత వరకూ తోసేసుకు తిరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవి తెచ్చిపెట్టే చికాకు, బాధ, ఇబ్బందుల కారణంగా అట్టే కాలం వీటిని విస్మరించటం కష్టం. రెండోది- ముడ్డి దగ్గర వచ్చే సమస్యలన్నీ ఒకే రకం కూడా కాదు. వీటిల్లో మూలశంక, భగందరం, చీలికల వంటి చాలా సమస్యలు ఉంటాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు అంత ఇబ్బంది పెట్టకపోయినా మెల్లగా ముదిరి తీవ్ర ఇబ్బందులూ తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి మలద్వారం వద్ద ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వైద్యులకు చూపించుకుని.. అసలా సమస్య ఏమిటో నిర్ధారించుకోవటం, సత్వరమే వాటికి చికిత్స తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు భగందరాన్నే తీసుకుంటే.. మామూలుగా ఎవరికి వారు దీన్ని గుర్తుపట్టటం కష్టం. ఎందుకంటే మలద్వారం చుటుపక్కల ఎక్కడో.. చిన్న సెగగడ్డలా మొదలవుతుంది కాబట్టి చాలామంది దీన్ని అసలు మలద్వారానికి సంబంధించిన సమస్య అనే అనుకోకపోవచ్చు. కానీ అది వదలకుండా మళ్లీమళ్లీ వేధిస్తూనే ఉంటుంది. చివరకు పగిలి చీము-రక్తం వస్తోందనో.. బట్టలు ఖరాబవుతున్నాయనో.. ఎప్పుడో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్‌ కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం మంచిది. దీనికి సర్జరీ ఒక్కటే సరైన చికిత్స! దీనిలో కూడా చాలా రకాలుంటాయి. ఈ మార్గాల మూలాలను గుర్తించటం, కండర వలయాలు దెబ్బతినకుండా నైపుణ్యంతో చికిత్స చెయ్యటం ముఖ్యం.

ఏమిటీ ఫిస్టులా?


తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు 'దారులు' ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.

మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్‌ గ్లాండ్స్‌) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి. ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్‌ ఆబ్సెస్‌) తయారవుతుంది. ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోపల్లోపలే విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది. అందుకే చీము బయటకు పోయినా.. సమస్యకు మూలం గ్రంథిలో ఉంది కాబట్టి, దాన్ని తొలగిస్తేనే ఫిస్టులా పూర్తిగా నయమవుతుందని గుర్తించాలి.
అసలా మలద్వార గ్రంథులు ఎందుకు మూసుకుపోతాయన్నది కచ్చితంగా చెప్పటం కష్టం. కొందరిలో మలబద్ధకం వంటివి, మరికొందరిలో ఇతరత్రా కారణాలూ దీనికి కారణం కావచ్చు. మొత్తమ్మీద ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషుల్లో అధికం. వృద్ధులకూ రావచ్చుగానీ యువకుల్లో ఎక్కువ. ఒకసారి గ్రంథులకు చీముపట్టి, లోపల దారులు ఏర్పడిన తర్వాత.. దానంతట అదే మానటం కష్టం. ఆ ఫిస్టులా మార్గాన్ని శుభ్రం చేసి వదిలేసినా ఉపయోగం ఉండదు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంటుంది కాబట్టి సమస్య మళ్లీమళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. సక్రమమైన చికిత్స తీసుకోకపోతే ఇది మానదు. నాటు విధానాలను ఆశ్రయిస్తే మల విసర్జన మీద పట్టు పోయే ప్రమాదం ఉండటం దీనితో ఎదురయ్యే పెద్ద ఇబ్బంది.

నిర్ధారణ ఎలా? 


చీముగడ్డతో వచ్చినప్పుడు.. ముందుగా చీమును తొలగించి మార్గాన్ని శుభ్రం చేస్తారు. అక్కడి కండర కణజాలమంతా వాచి ఉంటుంది కాబట్టి నిపుణులైన వైద్యులు తప్పించి ఆ సమయంలో లోలపకు గొట్టం ప్రవేశపెట్టటం వంటివేవీ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ గొట్టం వేరే భాగాల్లోకి చేరి, కొత్త మార్గాలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమును తొలగించాక, అక్కడి కణజాలం వాపు వంటివన్నీ తగ్గిన తర్వాత.. పరీక్షలు చేసి ఫిస్టులాను కచ్చితంగా గుర్తిస్తారు.

* వేలితో పరీక్షించటం: ఫిస్టులాను చాలా వరకూ లక్షణాలను బట్టే గుర్తించొచ్చు. మలద్వారం బయటగానీ, లోపలికి గానీ వేలు పెట్టి చూస్తే రంధ్రం ఉన్న భాగం తగులుతుంది. నైపుణ్యాన్ని బట్టి మార్గం ఎక్కడికి వెళ్తుందో కూడా కొంతవరకూ తెలుసుకోవచ్చు.

* ఎండోయానల్‌ స్కాన్‌: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.

* ఎంఆర్‌ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్‌ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.

వీటి ఆధారంగా వైద్యులు లోపల మార్గం ఒకటే ఉందా? చాలా మార్గాలున్నాయా? అవి మలద్వారానికి దగ్గరగా, కిందగానే ఉన్నాయా? లేక పైనుంచి ఉన్నాయా? ముఖ్యంగా మల నియంత్రణకు ఉపయోగపడే కీలకమైన రెండు కండర వలయాలకు (స్ఫింక్టర్‌కు) ఇవి దగ్గరగా ఉన్నాయా? వాటి మధ్య నుంచి వస్తున్నాయా? ఎక్కడి నుంచి మొదలై ఎటు వెళుతున్నాయి? వంటివన్నీ గుర్తిస్తారు. చికిత్సకు ఇది ఏరకమన్నది గుర్తించటం చాలా కీలకం.

చికిత్స ఏమిటి? 


సాధారణంగా భగందరం దానంతట అదే మానిపోవటమనేది ఉండదు. చాలాసార్లు దీనికి సర్జరీ తప్పదు. ఏ చికిత్స చేసినా ఇది మళ్లీ మళ్లీ రాకుండా పూర్తిగా మూసుకుపోయేలా చూడటం ముఖ్యం. రెండోది- ఈ చికిత్సా క్రమంలో మలవిసర్జనను నియంత్రించే రెండు కండరవలయాలూ (స్ఫింక్టర్లు) దెబ్బతినకుండా చూడటం మరింత ముఖ్యం. దీనికోసం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రామాణిక సర్జరీ విధానాలతో పాటు ఇటీవలి కాలంలో కొత్తరకాలూ అందుబాటులోకి వచ్చాయి. భగందరం మార్గం ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? స్ఫింక్టర్లకు దగ్గరగా ఉందా? వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు వీటిలో ఏ విధానం ఉత్తమమన్నది నిర్ధారిస్తారు.

* ఫిస్టులాటమీ: చాలకాలంగా అనుసరిస్తున్న, ఇప్పటికీ ప్రామాణికమైన విధానం ఇది. భగందరం మార్గం లోపలా బయటా స్పష్టంగా ఉన్నప్పుడు దాని గుండా గొట్టాన్ని పంపటం, మార్గం మొత్తాన్ని తెరవటం, శుభ్రం చేసి.. చీముపట్టిన గ్రంథిని తీసేసి.. వదిలేయటం ద్వారా దానంతట అదే మానేలా చూస్తారు. దీనివల్ల చాలాసార్లు బాగానే మానుతుంది. ఫిస్టులా మార్గం కండరంలో తక్కువ భాగానికే పరిమితమైనప్పుడు ఇది ఉత్తమమైన విధానం. ఈ విచక్షణ ముఖ్యం కాబట్టి నిపుణులైన వైద్యుల వద్ద చేయించుకోవటం ముఖ్యం.

* 'లిఫ్ట్‌' సర్జరీ: ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ 'లైగేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌ స్ఫింక్టరిక్‌ ఫిస్టులా ట్రాక్ట్‌' పద్ధతితో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. మన మలద్వారం వద్ద అంతర, బాహ్య కండర వలయాలకు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ స్ఫింక్టర్లు) తోడు కటి-మలద్వార (ప్యూబోరెక్టాలిస్‌) కండరం కూడా ఉంటుంది. బాహ్య, అంతర కండర వలయాలు రెండూ ఒకదానితో మరోటి అనుసంధానమై పని చేస్తాయి. మలాన్ని పట్టి ఉంచటంలో కటి-మలద్వార కండరం ప్రధానమైంది. ఇది దెబ్బతింటే మల విసర్జనపై పట్టు పోతుంది. అందుకని ఇవేవీ దెబ్బతినకుండా.. ఈ లిఫ్ట్‌ పద్ధతిలో అంతర, బాహ్య కండర వలయం మధ్యలోంచి లోపలికి వెళ్లి, ఫిస్టులా మార్గాన్ని గుర్తించి.. దాన్ని మధ్యలో కత్తిరిస్తారు. రెండు వైపులా శుభ్రం చేసి, అటూఇటూ ముడివేసేస్తారు. ఈ ప్రక్రియతో ఫిస్టులా నయం కావటమే కాకుండా మల విసర్జన మీద పట్టు కూడా దెబ్బతినదు, 90% వరకూ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉండటం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

* సీటన్‌ విధానం: కొన్ని రకాల ఫిస్టులాలకు- భగందర మార్గం లోపలి నుంచి దారం వంటిదాన్ని లోపలికి పంపి, మలద్వారం గుండా బయటకు తెచ్చి ముడివేసే విధానం బాగానే ఉపయోగపడుతుంది. క్రమేపీ బిగువుగా ముడి వేస్తూ.. కొన్ని నెలల సమయంలో మార్గం దానంతట అదే మానిపోయేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. క్షారసూత్రం పేరుతో మన దేశంలో కూడా ఈ విధానం చిరకాలంగా అమల్లో ఉంది. కండరం ఎంత భాగం ప్రభావితమైందో తెలియనప్పుడు తాత్కాలికంగా ఈ చికిత్స చేసి తర్వాత పూర్తిగా మానేలా చేయటానికి ఏ విధానాన్ని అనుసరించాలో నిర్ధరిస్తారు. ఏ రకం భగందరానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నది గుర్తించి చికిత్స చెయ్యటం కీలకం.

* ఫిబ్రిన్‌ గ్లూ: భగందర మార్గాన్ని శుభ్రం చేసి.. దానిలోకి జిగురువంటి పదార్ధాన్ని ఎక్కించి.. రెండు వైపులా కుట్టేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా మార్గం మూసుకుపోయి మానినట్లే అనిపించినా దీర్ఘకాలంలో మళ్లీ వస్తున్నట్టు గుర్తించారు. అలాగే 'ఫిస్టులా ప్లగ్‌' అనే మరో విధానం కూడా ఉంది. దీనిలో జంతుచర్మం నుంచి తయారు చేసిన ప్లగ్‌ను అమర్చి మార్గాన్ని మూసేస్తారుగానీ వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ, దీర్ఘకాలంలో మళ్లీ వచ్చే అవకాశం ఉంటోంది. అందుకని సర్జరీని తట్టుకోలేని వృద్ధులు, కండరాలు బాగా బలహీనపడిన వారికి దీనిని సిఫార్సు చేస్తుంటారు.

సర్జరీ తర్వాత..: 


ఆపరేషన్‌ తర్వాత వైద్యులు అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌తో పాటు నొప్పి తెలియకుండా మందులు సిఫార్సు చేస్తారు. అలాగే మలవిసర్జన ఇబ్బంది లేకుండా సాఫీగా అయ్యేందుకు కూడా మందులు ఇస్తారు. ఇవాల్టిరోజున అందుబాటులో ఉన్న సమర్థ విధానాలతో సర్జరీ చేస్తే ఫిస్టులా మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

స్త్రీలలో మరింత సమస్యాత్మకం!


కొందరు స్త్రీలకు భగందరం- యోని వద్ద ముందు భాగంలో తెరచుకొని ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంట యోని వైపున కండర వలయం పల్చగా ఉంటుంది. రెండోది కాన్పు అయిన వారిలో ఈ కండరం మరింతగా సాగినట్త్లె దృఢత్వాన్ని కూడా కోల్పోయి ఉంటుంది. పురుషులతో పోలిస్తే వీరిలో మలంపై పట్టు కోల్పోయే ముప్పు మరింత ఎక్కువ. అందుకే స్త్రీలు, వృద్ధులకు సర్జరీ మరింత జాగ్రత్తగా చెయ్యాల్సి ఉంటుంది.

Rhemotoid Arthritis - రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్





వయసు తో నిమిత్తము లేకుండాఆ వచ్చే వ్యాధుల్లో కీళ్ళా నొప్పులు (Osteoarthritis ) ప్రధానమైనది . కాకపోతే వయసు పైబడిన వారిలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటది . మొత్తం గా చూస్తే నూటికి 90 శాతము ఏదో ఒక దశలో కీళ్ళనొప్పులతో బాధపడేవారే . జన్యుపరమైన వ్యాధుల్లో ఇదొకటి . శరీరములో ఉన్న కొన్ని ఇన్‌ఫెక్షన్‌ల వల్ల వచ్చే -- ఇన్‌ఫెక్టివ్ ఆర్థరైటిస్ , సోరియాటిక్ అర్థ్రైటిస్ , ప్రమాదలవలన వ్చ్చే - పోస్టు ట్రమాటిక్ ఆర్థరైటిస్ లు ఈ కీళ్ళ నొప్పులకు కారణమవుతాయి .

లక్షణాలు :



  • కీళ్ళు బిగుసుకు పోవడం ,

  • నొప్పి ,

  • కదలలేకపోవడం ,

  • కీళ్ళ వాపు ,


నేడు రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అధికంగా భారతీయులను బాధిస్తుంది. ఇది కీళ్లలో మంటను ప్రేరేపిస్తుంది. కండరాల మధ్య జిగు రుపదార్థాన్ని హరించేస్తుంది. ఈ జిగురుకు ప్రత్యామ్నాయం లేదు. కీళ్ల నొప్పి క్రమేపీ మిగతా శరీర అవయవాలైన హృద యం, ఊపిరితిత్తులు, కళ్లపై ప్రభావాన్ని చూపిస్తుందని కలకత్తా లోని అపోలో హాస్పి టల్‌ సిీనియర్‌ కన్సల్టెంట్‌ డా. బుద్ధదేవ్‌ ఛటర్జీ తెలియజేశారు.

బైయాలజీస్‌, ఎంబ్రెల్‌ మందులు:


గీతాషా ఢిల్లిలో సొంతంగా వ్యాపారం చేస్తుంది. గత ముప్ఫై సంవత్సరాలుగా కీళ్ల రోగంతో బాధపడుతుంది. ఒక్కోసారి తలుపు గెడకూడా తీయలేదు. సీసామూత తీయాలన్నా కష్టమే. చివరికి ఢిల్లిలోని ఇంద్రప్రస్థ వైద్యులు డా.ఎస్‌.జె. గుప్తా సలహా మేరకు 'నాన్‌ స్టీరో డియల్‌ ఏంటి ఇన్‌ఫ్లమ్మేటరీ' మందులను వాడు తుంది. ఇవేకాక, 'డిసీజ్‌ మాడిఫైయింగ్‌ ఏంటీ రుమాటిక్‌ మందులను వేసుకుంటుంది. ఇవి శ్వాశత పరిష్కారం కావు. తాత్కాలికంగా బాధ ను నివారిస్తాయి. బైయాలజీస్‌, ట్యూమర్‌ నెక్రోసిస్‌ ఫ్యాక్టర్‌ను టార్గెట్‌ చేస్తుంది. ఎంబ్రెల్‌ అనే మందుతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఇంజెక్షన్‌లో కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ల కారణాన గీతాషా తన పనులు కీళ్ల బాధలేకుండా చేసుకుంటుంది. వీటిని వాడితే పెయిన్‌ కిల్లర్స్‌ వాడనవసరం లేదు.

కాదెవరూ ఈ బాధకు అనర్హులు!


రుమాటైయిడ్‌ ఆర్థరైటిస్‌ బాధితులు వ్యాధి వచ్చిన రెండు సంవత్సరాలలోపే బైయాలజీస్‌ వాడాలి. లేకపోతే జాయింట్స్‌ను విపరీతంగా బాధకు గురిచేస్తుంది. 'ఆర్థరైటిస్‌ ఫౌండే షన్‌ ఆఫ్‌ ఇండియా' చైర్మన్‌ డా. సుశీల్‌ శర్మ, ''భారత్‌లో జనాభాలో ఒక శాతం ఆర్థరై టిస్‌ బాధితులే'' అంటారు. ఇది కేవలం వృద్ధు లనే బాధిస్తుందనేది అపోహ. ఢిల్లిలోని ప్రకాష్‌ మాధూర్‌ 16, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు కీళ్లనొప్పుల బాధితుడే. ముందు తనకు ఆటలో గాయం అయివుంటుందని అశ్రద్ధ చేశాడు. క్రీడా మైదానికి నడిచి వెళ్లలేక పోయేవాడు. చివరికి రక్త పరీక్ష ఎక్స్‌రేలలో 'ఏంకీలోసింగ్‌ స్పాండిలైటిస్‌' గానిర్థారించారు. ఇది 20-40 వయస్సులోని పురుషులలనే ఎక్కువగా బాధిస్తుంది. పిల్లలకు తక్కువ నొప్పులు కలుగుతాయి.

రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను అశ్రద్ధ చేస్తే స్త్రీలలో 10 సంవత్సరాలు పురుషులలో ఏడు సంవత్సరాలు జీవనకాలం తగ్గుతుంది. ఆధు నిక వైద్యం కారణాన వంద రకాల ఆర్థరైటిస్‌కు నేడు డాక్టర్లు చికిత్స కనుగొన్నారు.

ముంబైలోని గృహిణి కావేరీకి ఎడమ కాలు కీళ్లు రెండు సంవత్సరాలుగా బాధిస్తుంది. ఆమె తల్లికి ఆస్టియో ఆర్థరైటిస్‌. కావేరీ తల్లి బాధితురాలు కనుక, ఆమె ముందు జాగ్ర త్తలు తీసుకొంది. న్యూ ఢిల్లిలోని మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ లోని డా. ఎస్‌.కె. ఎస్‌. మార్య, చీఫ్‌ ఆర్థో పెడిక్స్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ ఏమంటారంటే, 'వృద్ధాప్యం, ఊబకా‌యం, కుటుంబ చరిత్ర ఆర్థరైటిస్‌కు దారి తీస్తాయి. పురుషులలో ఆల్కహాల్‌, ధూమ పానం, స్త్రీలలో ముందుగానే మెనోపాజ్‌, అమెనోరియా వస్తే ఆర్థరైటిస్‌ బాధకు లోనవుతారు.''

నివారణ:


జీవనసరళిని మార్చుకోవాలి. స్త్రీలు వంట గదిలో ఎక్కువసేపు నిలబడరాదు. కీళ్లకు నొప్పి కల్గించే పనులు చేయరాదు. ఫిజియో ధెరపీ, ఆహారంలో మార్పుకొంత వరకు నొప్పి నివా రణకు తోడ్పడ తాయి. రోజూ తేలి కపాటి వ్యాయా మం చేస్తే మంచి దంటారు. ... ముంబైలోని హిందూజా నేష నల్‌ హాస్పిటల్‌ వైద్యులు డా. సి. బాలకృష్ణన్‌.

మందులు:


కీళ్ల నొప్పికి అనాల్జసిక్స్‌ను వాడాలి. ఎన్‌ఎస్‌ ఎయిడ్‌(NSAIDS) పిల్స్‌ వల్ల రోగ నివారణ కలగకపోతే క్రీమ్‌ను వాడాలి. మాంట్రియల్‌ లోని ఆర్థరైటిస్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ డా. జీన్‌ పీర్రే పెల్లెటైర్‌ ఎంజైమ్స్‌ పై శ్రద్ధ వహించారు. హిప్‌ను మార్చటం ద్వారా నొప్పినివారణ కలుగుతుందని ముంబై ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా. నిరాద్‌ వెంగ్‌ సర్కార్‌ తెలియజేస్తున్నారు. వృద్ధులలో హిప్‌ మార్చితే 10 నుండి 12 సం త్సరాల దాకా ఫరవాలేదు. యువతకు 'ఆర్టిక్యులర్‌ సర్ఫేస్‌ రీప్లేస్‌మెంట్‌' మంచిది. ఈ చికిత్సలో కేవలం హిప్‌ సాకెట్‌, ఫెమూర్‌ నిర్మూలిస్తారు.

ఆస్టియోనెక్రోసిస్‌:


ఎముకకు రక్త ప్రసారణ ఆగిపోతే ఆస్టియోనె క్రోసిస్‌ వస్తుంది. క్రమేపీ ఆర్థరైటిస్‌ కు దారితీస్తుంది. యోగ, హైడ్రోధెరపీ తాత్కా లికంగా ఉపశమనాన్ని కలుగజేస్తాయి.

మెటల్‌ -ఆన్‌-మెటల్‌ చికిత్స:


ముఖ్యంగా క్రీడాకారులు యువతకు ఈ చికిత్స సరైనది. గర్భిణీలకు ఇది వాంఛ నీయం కాదు. పుట్టబోయే బిడ్డకు ఈ చికిత్స హాని చేస్తుంది. వీరికి సిరమిక్‌ -ఆన్‌-సిరమిక్‌ చికిత్స మేలు. అయితే ఇది ఖర్చుతో కూడు కున్నది. నాగపూర్‌లోని వ్యాపారి బల్చీర్‌సింగ్‌ రేణుకు 2004లో ఆస్టియో ఆర్థరైటిస్‌ అని డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్‌కు భయపడి, చికిత్స చేయించుకోలేదు. చివరికి నొప్పి తీవ్రమై నించోలేకపోయాడు. ఆపరేషన్‌ గత్యం తరమై ఇప్పుడు కోలుకున్నాడు. అయితే బ్యాడ్‌మింటన్‌ ఆటకు గుడ్‌ బై చెప్పాడు. కలకత్తాలోని ప్రొ. చక్రవర్తికి కీళ్ల నొప్పులు షడ్ష్థŠీఙ పోలీధైపాన్‌, కోబాల్డ్‌ క్రోమ్‌ ఎల్లాయ్‌ చికిత్సతో నొప్పినివారణ కల్గింది.

కంప్యూటర్‌ చికిత్స:


టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుచున్న ఈ రోజుల్లో కంప్యూటర్‌ నేవిగేషన్‌ ద్వారా, రోటే టింగ్‌ ప్లాట్‌ఫాం హైప్లెక్స్‌ డిజై న్ల కారణాన నేడు చికిత్స కష్టంకాదు. నొప్పి లేకుండా మేడమెట్లు ఎక్కగలరు, తమ పనులను వారు యధావిధిగా నిర్వహించుకుంటున్నారు. బస్‌లలో ్ఘŸిలి ఉ్శ చేయగలుగుచున్నారు.

ఆయుర్వేద చికిత్స:


శిరోధార చికిత్సలో మెడికేటెడ్‌ ఆయిల్‌ను చుక్కలు, చుక్కలుగా తలపై ధారవిడుస్తారు. కీళ్లకు ప్యాక్‌లు, హెర్బల్‌ పేస్ట్‌ ఉపయోగిస్తారు. మషాలాలు, నూనె, ఉప్పు తక్కువగా ఆహా రం తీసుకోవాలి. కీళ్ల వ్యాధిని బట్టి, హెర్బల్‌ మందులు, నూనెలు మారతాయి. వీటి ద్వారా కూడా బాధితులకు ఉప శమనం కలుగుతుంది.

రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌తో క్యాన్సర్‌ ముప్పు: 


లింఫ్‌ గ్రంథుల్లో ఏర్పడే క్యాన్సర్లకు (లింఫోమా) రుమటాయిడ్‌ కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? అవుననే అంటున్నారు స్వీడన్‌ పరిశోధకులు. ముఖ్యంగా తీవ్రమైన రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌ కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. పైకి కనిపించని వాపు లక్షణాలు, రోగ నిరోధక శక్తిని అణచేందుకు ఇచ్చే మందులు, జన్యు, పర్యావరణ సంబంధ అంశాల వంటివన్నీ ఈ క్యాన్సర్లకు దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. రుమాటాయిడ్‌ కీళ్లనొప్పుల వల్లనే లింఫోమా ముప్పు ముంచుకొస్తుందా? ఇతరేతర అంశాలేవైనా కారణమవుతున్నాయా? అనేది తెలుసుకోవటానికి 6,745 మంది వివరాలను ఇతరులతో పోల్చి చూశారు. రుమటాయిడ్‌ కీళ్లనొప్పులు ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే లింఫోమా బారిన పడుతున్నవారి సంఖ్య మిగతావారిలో కన్నా అధికమని గుర్తించారు.

Arithritis - కీళ్ళ నొప్పులు

మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం!

https://medicaltipsintelugu.files.wordpress.com/2016/01/70c21-arthritisday.jpg