Thursday, 31 March 2016

Hip Joint replacement process-awareness - తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన ,


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మోకాలి కీళ్ల గురించి మనందరికీ తెలుసు. మన శరీరం బరువు మొత్తం అవే మోస్తుంటాయని భావిస్తుంటాం. అది కొంత వరకూ నిజమేగానీ... వాటికంటే ముందు మన శరీరం బరువును మోస్తుండేవి...మన తుంటి కీళ్లు! శరీరం పైభాగం మొత్తాన్ని..కాళ్లకు అనుసంధానించే అత్యంత కీలకమైన, సున్నితమైన కీళ్లు ఇవి! కటి ఎముకల చట్రానికి ఇరువైపులా ఉండే ఈ కీళ్ల నిర్మాణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 'బంతి-గిన్ని' ఆకృతిలో ఒకదానిలో ఒకటి స్వేచ్ఛగా కదులుతూ.. ఒకవైపు బరువు మోస్తూనే.. మనం కాళ్లను ముందుకు, వెనక్కు, పక్కలకు.. ఇలా ఎన్నో కోణాల్లో కదల్చటానికి ఇవి సహకరిస్తుంటాయి.

అందుకే తుంటి కీళ్లలో ఏదైనా సమస్య తలెత్తితే జీవితం నరకప్రాయం అవుతుంది. కాలు కదపాలంటే కష్టం. గజ్జల్లో ఒకటే నొప్పి. సున్నితమైన.. ఎన్నో కోణాల్లో తిరుగుతుండే కీలు కాబట్టి దీన్ని సరిచెయ్యటం కూడా అంత తేలికేం కాదు. క్లిష్టమైన ప్రక్రియ. వైద్య రంగానికి ఇది ఎంతోకాలం పెను సవాల్‌గా నిలిచింది. అయితే ఆధునికమైన 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ సమస్యను చాలా వరకూ విజయవంతంగా జయించామని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సాధారణంగా తుంటి కీలుకు తలెత్తే సమస్యలేమిటి? -మార్పిడి ఆపరేషన్‌ ప్రత్యేకత ఏమిటన్నది వివరంగా తెలుసుకుందాము .


మన శరీరంలో బరువు మోసే కీళ్లలో అత్యంత కీలకమైనది తుంటి కీలు! కాబట్టి దీనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తోసేసుకుని తిరగటం చాలా కష్టం. ఈ తుంటి కీలు అన్నది 'గిన్నిలో బంతి'లా ఆడుతుంటుంది కాబట్టి దీన్ని 'బంతి-గిన్ని' (బాల్‌ సాకెట్‌ జాయింట్‌) కీలు అనే పిలుస్తుంటారు. కటి ఎముక చివర్లో 'గిన్ని' లాంటి నిర్మాణం ఉంటుంది. తొడ దగ్గరి నుంచి వచ్చే పొడవాటి ఎముక.. చివర్లో బంతి ఆకృతిలా ఉండి.. అది ఈ గిన్నిలో కూర్చుంటుంది. ఈ కదలికలు సున్నితంగా ఉండేందుకు బంతిపైన సున్నితమైన మృదులాస్థి పొరలు ఉంటాయి. బరువు మోస్తుండటంతో నిర్మాణపరంగా ఈ కీలు ఎంత సంక్లిష్టమైందో అంత సున్నితమైనదనీ చెప్పక తప్పదు. అందుకే ఒక్కో వయసులో ఈ కీలుకు ఒక్కో రకమైన ముప్పు పొంచి ఉంటుంది.

ముఖ్యంగా ప్రమాదాల్లో దెబ్బలు తగలటం, వృద్ధులు తూలిపడటం వంటి సందర్భాల్లో ముందుగా ఈ కీలు దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కారణమేదైనా ఈ కీలు తీవ్రంగా ప్రభావితమైనప్పుడు దీన్ని మార్చటం మినహా మరో మార్గం ఉండదు. 1920ల నుంచీ కూడా ఈ కీలు మార్పిడి కోసం పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

బరువు మోసే కీలకమైన జాయింట్‌ కాబట్టి త్వరగా అరిగిపోకుండా.. పక్కకు వైదొలగిపోకుండా 'బంతి-గిన్ని' స్థిరంగా ఉండేలా చూడటం కోసం ఎన్నో కృత్రిమ నమూనాలతో ప్రయోగాలు చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ సర్‌ జాన్‌ ఛార్న్‌లీ ఆధునిక మైన తుంటి మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఎన్నో మెరుగులు దిద్దుకుని ఈ మార్పిడి సర్జరీ ఇప్పుడు.. తుంటికి సంబంధించి అత్యంత సమర్థమైన విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

తుంటి సమస్యల్లో ఏవి ఎక్కువ?
* రక్తప్రసారం దెబ్బతినటం: మన దేశంలో బంతికి రక్తప్రసారం తగ్గటమన్నది (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) చాలా ఎక్కువగా కనబడుతోంది. పైగా మన దేశంలో చాలామందికి దీనికి ప్రత్యేకమైన కారణం కూడా ఏదీ ఉండటం లేదు. మద్యం మితిమీరి తాగేవారిలో, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌, కొన్ని రకాల చర్మవ్యాధులకు, కిడ్నీ మార్పిడి తర్వాత తప్పనిసరిగా స్టిరాయిడ్స్‌ తీసుకునేవారికి ఈ రక్తప్రసారం తగ్గే సమస్య ఎక్కువ. వీరిలో రెండు తుంటి కీళ్లూ పాడవ్వచ్చు, వీరికి మార్పిడి అనివార్యమవుతోంది.

* తొలగిపోవటం: పుట్టుకతోనే బంతి-గిన్ని సరిగా ఒకదాన్లో ఒకటి కూర్చుని ఉండకపోవటం, ప్రమాదాల వంటి కారణాల రీత్యా తుంటి కీలు తొలగిపోవటం వంటి కారణాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి.

* ఒక ఆపరేషన్‌ తర్వాత: దెబ్బతగలటం తదితర కారణాల రీత్యా తుంటికి ఒకసారి ఆపరేషన్‌ చేసిన తర్వాత.. క్రమేపీ కీలు అరిగిపోవటం ఆరంభం కావచ్చు. దీనికీ మార్పిడి అనివార్యమవుతుంది.


* మన దేశంలో మోకాలి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ. దానితో పోలిస్తే వాటంతట అవేగా తుంటి కీళ్లు అరగటమన్నది తక్కువ. కానీ పాశ్చాత్య దేశాలు ఇందుకు విరుద్ధం. అక్కడ తుంటి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ.

* తుంటి మార్పిడి అన్నది 97% విజయవంతమైన సర్జరీ. ఈ కృత్రిమ కీళ్లు కూడా 20-25 ఏళ్లు మన్నికగా ఉంటున్నాయి.

* సరిగా చెయ్యకపోతే దీనివల్ల దుష్ప్రభావాలూ ఉంటాయి. ఉదాహరణకు కీలు తొలగిపోవచ్చు. అమరిక సరిగా లేకపోతే అవి త్వరగా అరిగిపోవచ్చు. ప్లాస్టిక్‌ కారణంగా కొన్నిసార్లు ఎముక మొత్తం దెబ్బతినిపోవచ్చు (ఆస్టియోలైసిస్‌). నైపుణ్యంతో చేసినప్పుడు ఈ ఇబ్బందులన్నీ తక్కువనే చెప్పుకోవాలి.

నొప్పి కీలకం:

* తుంటి కీలు అరగటం (ఆర్త్థ్రెటిస్‌), దెబ్బతినటం ఇలా కారణమేదైనా అన్నింటిలోనూ కూడా ప్రధానంగా కనిపించే సమస్య... గజ్జల్లో లోపలగా నొప్పి. ఉదయం లేవగానే కీలు కొద్దిగా బిగుతుగా అనిపిస్తుండటం.. నడుస్తున్నప్పుడు కీలు మీద బరువు పడగానే కలుక్కుమన్నట్టుండటం. అడుగేసినప్పుడల్లా నొప్పితో బాధ. రాత్రి కూడా వేధించే నొప్పి. మెట్లు ఎక్కటం మహా కష్టం. కూర్చుని లేవాలంటే ఇబ్బంది. క్రమేపీ నడక కూడా కష్టం కావచ్చు. అయితే లోపల కీలు దెబ్బతింటున్నా పైకి వాపులాంటి లక్షణాలేవీ కనబడవు. కీలు ఎక్కడో లోపలగా ఉంటుంది కాబట్టి బాధ కూడా ఎక్కడో లోపలగానే అనిపిస్తుంటుంది.

* పరీక్షలు: గజ్జల్లో నొప్పి, నడవటం కష్టంగా ఉందని గుర్తించినప్పుడు ముందు రెండు వైపులా తుంటి కీళ్లు కనబడేలా ఎక్స్‌రే తీస్తారు. దీనిలో కీలుకు సంబంధించిన సమస్యలు చాలా వరకూ బయటపడతాయి. అయితే తుంటి కీలులోని బంతికి రక్తప్రసారం సరిగా ఉందా? లేదా? (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) వంటివి దీనిలో స్పష్టంగా తెలియవు కాబట్టి అవసరమైతే ఎమ్మారై స్కానింగ్‌ కూడా చేయిస్తారు. కీలులో ఏ కొంచెం తేడా ఉన్నా దీనిలో బయటపడుతుంది.

జాగ్రత్తలు:
నొప్పికి కారణం ఏదైనా మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* తుంటి కీలు మీద బరువు పడకుండా చూడటం ముఖ్యం. కింద కూర్చోకుండా ఉండాలి. వెస్ట్రన్‌ టాయ్‌లెట్స్‌ వాడుకోవాలి.
* బరువు తగ్గటం కూడా అవసరం.
* నొప్పి తగ్గేందుకు మందులు ఇస్తారు.
* తుంటి దగ్గరి 'అబ్డక్టార్‌' కండరాన్ని (మన ప్యాంటు జేబులో చేతులు పెట్టినప్పుడు సరిగ్గా కింద ఉండే కండరం) బలోపేతం చేసేందుకు 'అబ్డక్టార్‌ ఎక్సర్‌సైజులు' సూచిస్తారు. ఈ కండరాలు బలపడితే కీలు మీద భారం తగ్గుతుంది, కీలు స్థిరత్వం పెరుగుతుంది.

ఈ చర్యలతో నొప్పి తగ్గి మంచి ఫలితం ఉంటుంది. అయితే క్రమేపీ కీలు అరుగుతూ, ఆర్త్థ్రెటిస్‌ ముదిరిన కొద్దీ.. మళ్లీ నొప్పి పెరుగుతుంటుంది. ఆ స్థితిలో ఉన్న ఒకే ఒక సమర్థవంతమైన మార్గం 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌.

మార్పిడి ఆపరేషన్‌:

                             
సర్‌ జాన్‌ ఛార్న్‌లీ తొలిగా తుంటి మార్పిడి చేసినప్పుడు పైన ప్లాస్టిక్‌ గిన్ని, దానిలో స్టీలు బంతి వాడారు. ఆ తర్వాత పరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ.. దీనిలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకటి లోహం/ మరోటి ప్లాస్టిక్‌, సెరామిక్‌/సెరామిక్‌, లోహం/లోహం, సెరామిక్‌/పాలీఎథిలీన్‌.. ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటన్నింటి ప్రధాన లక్ష్యం- త్వరగా అరిగిపోకుండా మన్నికగా ఉండేలా చూడటమే.

* గిన్నిని కటి ఎముకలో కూర్చోబెట్టేందుకు అప్పట్లో ఛార్న్‌లీ బోన్‌ సిమెంట్‌ (పాలీ మిథైల్‌ మిథాక్రిలేట్‌) వాడారు. తర్వాత్తర్వాత ఆ సిమెంట్‌కు ప్రాచుర్యం తగ్గి.. సిమెంట్‌ అవసరం లేకుండానే కటి ఎముకతో కలిసిపోయే రకం కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎముక క్రమేపీ దానిలోకి పెరిగి అది అక్కడ స్థిరపడిపోతుంది.

* తొలిరోజుల్లో ఛార్న్‌లీ వాడినప్పుడు 22 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే చిన్న బంతి ఉన్న కీలు వాడారు. కానీ క్రమేపీ దాని సైజు పెంచుకుంటూ వస్తూ.. ఇప్పుడు 40 మిల్లీమీటర్ల వరకూ కూడా వాడుతున్నారు. ఇలా బంతి సైజుపెద్దగా ఉన్నందువల్ల కీలుకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముక ఆకృతిని బట్టి సాధ్యమైనంత పెద్దసైజు బంతి వెయ్యటం వల్ల ఉపయోగం ఉంటుంది.

* తొలినాళ్లలో తుంటి మార్పిడి తర్వాత కింద కూర్చో కూడదు, పరుగెత్తకూడదు వంటి రకరకాల నిబంధనలు విధించేవారు. అప్పట్లో అమర్చే బంతి సైజు చిన్నగా ఉండేది కాబట్టి ఎప్పుడు కీలు బెసిగిపోతుందో, ఎప్పుడు తొలిగిపోతుందోనని భయం. అయితే ఇప్పుడు బంతి సైజు పెద్దగా ఉంటోంది కాబట్టి కీలుకు స్థిరత్వం వస్తోంది. దీంతో ఎటువంటి ఆంక్షలూ ఉండవు. ఇప్పుడు తుంటి మార్పిడి చేయించుకున్నవారు జాగింగ్‌ వంటి వ్యాయామాలు, టెన్నిస్‌ వంటి క్రీడలు కూడా ఆడుతున్నారు. ఏదైనా కారణాన యుక్త వయస్కులకు మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినా.. వారి జీవనశైలిలో ఎటువంటి మార్పుల అవసరం ఉండదు.

సర్జరీ ఎలా చేస్తారు?

                 
1. తుంటి ప్రాంతంలో కోత బెట్టి గిన్ని-బంతి కీలును చేరుకుంటారు.
2. కీలులో గిన్ని భాగాన్ని సరిచేసి.. అక్కడ లోహం/సిరామిక్‌/ప్లాస్టిక్‌ ఇలా ఎంపిక చేసిన కృత్రిమ గిన్నిని అమరుస్తారు. దీనికి సిమెంట్‌ వాడేవి కొన్ని రకాలు, సిమెంట్‌ లేని రకాలూ ఉన్నాయి.
3. తొడ ప్రాంతం నుంచి వచ్చే ఎముక చివరి భాగం బంతిలా ఉంటుంది.
4. పాడైపోయిన ఈ బంతి ఎముక భాగాన్ని తొలగిస్తారు.
5. ఆ తొలగించిన భాగంలో- పొడవాటి దృఢమైన స్టెమ్‌ సాయంతో కృత్రిమ బంతిని అమరుస్తారు. ఈ బంతుల్లో కూడా చాలా రకాలున్నాయి.బంతి సైజు ఎంత పెద్దగా ఉంటే కీలు అంత స్థిరంగా ఉంటుంది.
6. బంతిని గిన్నిలో కూర్చోబెట్టి.. కీలుకు స్థిరత్వాన్ని తెస్తారు. అది అలాగే లోపల ఉండిపోతుంది.

ఒకప్పుడు తుంటి కీలుకు క్షయ రావటమన్నది మన దేశంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పటికీ పల్లెల్లో ఇది ఎక్కువగానే కనబడుతుంది. అలాగే తుంటి కీలులో చీము చేరటమన్నదీ (పయోజెనిక్‌ ఆర్త్థ్రెటిస్‌) ఎక్కువగా ఉండేది. కాన్పు పద్ధతుల వంటివి సరిగా లేని రోజుల్లో రకరకాల కారణాల రీత్యా పిల్లలకు ఇన్ఫెక్షన్‌ వచ్చి అది తుంటి కీలులో చేరేది. ఇటీవలి కాలంలో ఇవి గణనీయంగా తగ్గాయని చెప్పుకోవాలి.
రీ సర్ఫేస్‌మెంట్‌--బంతి, గిన్నితో సహా కీలు మొత్తాన్ని మారిస్తే దాన్ని 'టోటల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌' అంటారు. అయితే సహజమైన ఎముకను ఎక్కువ భాగం తొలగించాల్సిన అవసరం లేకుండా.. దెబ్బతిన్న బంతి భాగం మొత్తాన్ని తియ్యకుండా దాన్నే చెక్కి.. దాని ఆకృతి మార్చి.. దానిపై లోహపు బంతిని అమర్చే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్నే 'రీ సర్ఫేస్‌మెంట్‌' అంటారు. అయితే దీనికి పరిమితులు ఎక్కువ. సమస్యను బట్టి దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వయసు వయసుకో సమస్య!
తుంటి కీలుకు సంబంధించి... పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకూ కూడా ప్రతిదశలోనూ కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పుట్టగానే: తుంటి కీలు అన్నది 'బంతి-గిన్ని' కీలు. గిన్నిలాంటి కటి ఎముకలో బంతి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. కొందరికి పుట్టేసరికే ఈ బంతి.. గిన్నిలో కుదురుగా కూర్చుని ఉండదు. పక్కకు వైదొలగి, ఉంటుంది. దీన్నే 'కంజెనిటల్‌ డిస్‌లొకేషన్‌ ఆఫ్‌ హిప్‌' అంటారు. గిన్నిలోంచి బంతి బయటకు వచ్చేసి ఉంటుంది. దీన్ని పసివయసులోనే పట్టుకోకపోతే- కీలు (ముఖ్యంగా గిన్ని) సరిగా ఎదగదు. అర్థ చంద్రాకారంగా ఉండాల్సిన గిన్ని భాగం.. పెద్దగా, ఖాళీగా ఉండిపోతుంది. దీన్నే 'డిస్‌ప్లాస్టిక్‌ హిప్‌' అంటారు. అందుకే బిడ్డ పుట్టగానే వైద్యులు తుంటి కీలు స్థిరంగా కూర్చుని ఉందా? లేదా? అన్నది తప్పనిసరిగా చూస్తారు. ఒకవేళ అది స్థిరంగా లేకపోతే వెంటనే ప్రత్యేకమైన పద్ధతిలో 'బిగుతుగా కట్టు కట్టటం(పావ్‌లిక్‌ హార్నెస్‌)' వంటి వాటితో దాన్ని సరిచెయ్యచ్చు. పెద్దవయసు వరకూ గుర్తించకపోతే మాత్రం ఆపరేషన్ల వంటివి తప్పవు. ఎందుకంటే బంతి-గిన్ని కీలులో- బంతిని బట్టి గిన్ని, గిన్నిని బట్టి బంతి పెరుగుతుంటాయి. చిన్నతనంలో ఒకటి బయటకు తొలగిపోతే రెండోదాని ఎదుగుదలా ప్రభావితమవుతుంది.

టీనేజీలో:
 తొడ నుంచి వచ్చే ఎముక చివర ఎదుగుదలకు వీలుగా 'గ్రోత్‌ప్లేట్స్‌' అనేవి ఉంటాయి. ఎముక పొడుగు సాగుతుండటానికి ఇవి కీలకం. వీటి దగ్గర కొద్దిగా మృదులాస్థి కణజాలం ఉంటుంది. టీనేజీలో కొందరికి, ముఖ్యంగా లావుగా ఉండే మగపిల్లలకు ఈ గ్రోత్‌ప్లేట్స్‌ దగ్గర ఉండే మృదులాస్థి కణజాలం పక్కకు జారిపోయి.. కీలు ఆకృతి మారిపోతుంది. దీన్నే 'స్లిప్‌డ్‌ అప్పర్‌ ఫిమరల్‌ ఎపిఫైసిస్‌ (సూఫీ)' అంటారు. దీంతో క్రమేపీ నొప్పి, నడక తీరు మారిపోవటం వంటివన్నీ మొదలవుతాయి. దీన్ని వెంటనే గుర్తించి సరిచెయ్యటం చాలా అవసరం.

మధ్యవయసులో: 30-40 ఏళ్ల వయసు వారిలో 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అనే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే మోకాలి ఎముకలో బంతికి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అత్యంత కీలకమైనవి. ఈ రక్తప్రసార వ్యవస్థ చాలా సున్నితమైనది. దీనిలో ఏ తేడా వచ్చి బంతికి రక్తప్రసారం నిలిచిపోయి.. ఎముక దెబ్బతింటుంది. బంతి పాడైపోతుంది. దీన్నే 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అంటారు. దీర్ఘకాలం పాటు మితిమీరి మద్యం తీసుకునేవారిలో, అలాగే స్టిరాయిడ్‌ మందులు నిత్యం వాడేవారికి కూడా ఇలా జరగొచ్చు. కానీ మన దేశంలో చాలామందికి ఇటువంటి స్పష్టమైన కారణమేదీ లేకుండా కూడా బంతికి రక్తప్రసారం దెబ్బతినటం చాలా తరచుగా చూస్తున్నాం. కాబట్టి 30-40 ఏళ్ల సమయంలో తుంటి కీలు నొప్పి వచ్చిందంటే కచ్చితంగా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీసి చూడటం చాలా అవసరం. దీనికి 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అవసరమవుతుంది.

వృద్ధాప్యంలో: ముసలి వయసులో రకరకాల కారణాల రీత్యా కింద పడిపోతుండటం, తుంటి ఎముకలు విరగటమన్నది చాలా ఎక్కువగా కనిపించే సమస్య. సహజంగా తుంటి కీలు కింది భాగం (ఫ్రాక్చర్‌ నెక్‌ ఆఫ్‌ ద ఫీమర్‌) విరుగుతుంటుంది. దీన్ని రకరకాల పద్ధతుల్లో సరిచేస్తారుగానీ ఆ తర్వాత క్రమేపీ తుంటి కీలు అరిగిపోవటమన్నది చాలా ఎక్కువమందిలో కనబడుతుంటుంది. ఒక్కోసారి పడిపోయినప్పుడు బంతి బయటకు తోసుకువచ్చేయవచ్చు. దాంతో పాటు బంతికి రక్తప్రసారం దెబ్బతిని కీలు పాడైపోవచ్చు. వీటన్నింటివల్లా తుంటి కీలు దెబ్బతింటుంది. చాలాసార్లు దాన్ని మార్చి, కృత్రిమ కీలు అమర్చాల్సిన అవసరం కూడా తలెత్తుతుంటుంది.

Interstitial Lung Disease(ILD) - ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ)




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఐఎల్‌డీ(ILD) లో ఆక్సిజన్:

పీల్చే గాలికి అనుగుణంగా సాగి దేహానికి ఆక్సిజన్ అందేలా చేయడం ఊపిరితిత్తుల లక్షణం. సాగడానికి వీలుగా ఉండే ఇవి... ఆ గుణం కోల్పోతే? ఊపిరి అందదు. ఫలితంగా గుండెపై, మెదడుపై దుష్పరిణామాలుంటాయి. ఊపిరితిత్తుల సహజగుణమైన సాగే తత్వాన్ని కోల్పోవడం వల్ల ఇలాంటి పరిణామాలు కలగజేసే జబ్బే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ). దీన్ని మందులతోనే పూర్తిగా తగ్గించలేకపోయినా స్టెరాయిడ్స్ వంటి మందులతో రోగి పరిస్థితిని మెరుగుపరచి, ఆయుః ప్రమాణాన్ని చాలావరకు పెంచవచ్చు. దాంతో పాటు ఇటీవల ప్రాచుర్యం పొందిన ఆక్సిజన్ థెరపీ తీసుకుంటే ఐఎల్‌డీ రోగులు సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు. చికిత్స లేదని భావించే ఈ ఐఎల్‌డీపై అవగాహన, ఆక్సిజన్ థెరపీ వంటి ఆధునిక చికిత్స ప్రక్రియలపై అవగాహన కోసం... ఈ కథనం.

ఊపిరితిత్తులకు సాధారణంగా ఉండే సాగే గుణం కోల్పోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇలా ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే కండిషన్‌ను ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) అంటారు. దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా రెండు రకాలు.

1. పుట్టుకతో వచ్చే ఐఎల్‌డి : దీన్ని ఇడియోపథిక్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి కారణం ఏమీ ఉండదు. వంశపారంపర్యంగా వస్తుందన్న విషయమే రూఢీ అయ్యింది. ఈ జబ్బు ఉన్నప్పుడు యుక్తవయసులోనైనా ఆయాసం, దగ్గు వస్తుంటాయి. సాధారణంగా వచ్చే జబ్బే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువ. దాంతో జబ్బు తీవ్రత పెరిగి గుండె మీద దుష్ర్పభావాలు కలిగితే... అప్పుడు జబ్బు బయటపడే అవకాశాలు ఎక్కువ.

2. సెకండరీ ఐఎల్‌డీ : ఇది ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే... తమ రోగనిరోధక శక్తి తమపైనే దుష్ర్పభావాలు చూపే జబ్బులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్, సోరియాసిస్ వంటి చర్మ సంబంధమైన కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో ఊపిరితిత్తులకు ఉండే సాగే గుణం తగ్గడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్‌లో ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడటం వల్ల సెకండరీ ఐఎల్‌డీ వస్తుంది.

లక్షణాలు : 
సాధారణంగా మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినా అన్ని వయసుల వారికీ రావచ్చు. లక్షణాలలో మొదట కనిపించేది దగ్గు. సాధారణంగా పొడి దగ్గు ఉంటుంది. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా దగ్గు, ఆయాసం రావడం జరుగుతుంది. రాత్రివేళలో కంటే పగలు పనిచేస్తున్న సమయంలో ఆయాసం ఎక్కువగా ఉండటం ఐఎల్‌డీలో ప్రత్యేకత.

ఈ ప్రధాన లక్షణంతో పాటు కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి ప్రమాదకరమైన కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగి మెదడుపై దుష్ర్పభావాలు పడినప్పుడు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. అంటే... మత్తుగా ఉండటం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, గురక పెరగడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపించినప్పటికీ చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు.

నిర్ధారణ పరీక్షలు :
ఐఎల్‌డీ జబ్బును ఎక్స్-రే పరీక్షతో గుర్తిస్తారు. ఎక్స్-రేలో రెటిక్యులార్ నాడ్యుల్స్ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపిస్తే అప్పుడు హై రెజల్యూషన్ సీటీ ఆఫ్ చెస్ట్ అనే పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్ డిసీజ్, సొరియాసిస్ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఆర్నెల్లకోమారు ఎక్స్-రే పరీక్ష చేస్తే ఈ జబ్బును కనిపెట్టే అవకాశం ఉంది.
జబ్బు నిర్ధారణ అయిన తర్వాత దాని తీవ్రతను తెలుసుకోడానికి టూ-డీ ఎకో, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు చేస్తారు. (ఏబీజీ పరీక్ష వల్ల రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు తెలుసుకోవచ్చు).

అలాగే ఇమ్యూన్ జబ్బుల గురించి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఎల్‌ఈ సెల్స్, ఏఎన్‌ఏ, యాంటీ డీఎస్ డీఎన్‌ఏ, సీఆర్‌పీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

చికిత్స :
 ఐఎల్‌డీని పూర్తిగా నయం చేసే మందులు లేకపోయినా, ఊపిరితిత్తుల డాక్టర్ పర్యవేక్షణలో సరైన పద్ధతిలో సక్రమంగా చికిత్స తీసుకోవడం వల్ల రోగుల జీవితకాలాన్ని చాలావరకు పెంచవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్ వాడతారు. అయితే స్టెరాయిడ్స్ అనగానే ప్రజల్లో ఉండే అపోహలతో రోగికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. దీనికి స్టెరాయిడ్స్‌తో పాటు ఇమ్యూనో రెస్పాన్స్‌ను తగ్గించే మందులు అంటే... మెథోట్రెక్సేట్, కాల్చిసిన్, సైక్లోఫాస్ఫమైడ్ వంటివి వాడాలి. అయితే జబ్బు తీవ్రతతో పాటు అవి శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు చూపకుండా ఉండేలా వీటి మోతాదును నిపుణులు నిర్ణయిస్తారు. స్టెరాయిడ్స్ తాలూకు దుష్ర్పభావాలను నివారించేందుకు క్యాల్షియమ్ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్ కూడా ఉపయోగిస్తారు. దాంతోపాటు బలవర్థకమైన ఆహారం సూచిస్తారు. గతంలోలా కాకుండా ఇప్పుడు దుష్ర్పభావాలు చాలా తక్కువగా ఉండే స్టెరాయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇలాంటి జబ్బులు ఉన్నవారు అపోహలను తొలగించుకుని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో చికిత్స తీసుకుంటే ఆయుప్రమాణాన్ని సాధారణ జీవితకాలం పొడిగించుకోవచ్చు.

ఆక్సిజన్ థెరపీ:

ఈ జబ్బుకు చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ను కూడా ఒక మందులా ఉపయోగిస్తున్నారు. గత పదేళ్లలో ఈ ఆక్సిజన్ చికిత్స మంచి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆక్సిజెన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఐఎల్‌డీ ఉన్నట్లు నిర్ధారణ కాగానే ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తుల మీద శ్రమ తగ్గించడంతో పాటు, మందులకు ఊపిరితిత్తులు సక్రమంగా రెస్పాండ్ అయ్యేలా చేయడం, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెంచడం ఆక్సిజెన్ థెరపీ ప్రధాన ఉద్దేశం.

ఆక్సిజెన్ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు:
1. సిలెండర్స్ ద్వారా : గతంలోలా సిలెండర్స్ ద్వారా ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి పట్టే వ్యవధి వల్ల ఈ ప్రక్రియ క్రమంగా ఆదరణ కోల్పోతోంది.

2. ఆక్సిజన్ కాన్సట్రేటిక్ మెషిన్ ద్వారా: ఈ మెషిన్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం పేషెంట్స్‌కూ సౌలభ్యంగా ఉంటుంది. వాతావరణంలో ఉండే 21 శాతం ఆక్సిజన్‌నే ఉపయోగించుకుని రోగికి అవసరమైన నిర్ణీత మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. ఇందులో మళ్లీ నింపాలనే అసౌకర్యం ఉండదు. పైగా ఆక్సిజన్ తీసుకుంటున్నామనే మానసికమైన ఫీలింగ్ ఉండదు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీని ధర రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుంది.

ఇటీవలి పరిశోధన ఫలితాలను బట్టి ఆక్సిజన్ థెరపీ తీసుకునే పేషెంట్స్ ఆయుప్రమాణం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఆక్సిజన్ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియలో భాగంగా అధిక మోతాదుల్లో దీన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను తీసుకోడాన్ని నియంత్రించే మెదడులోని కేంద్రం ఒక్కోసారి తన సహజగుణాన్ని (స్టిమ్యులేషన్) కోల్పోవచ్చు. ఫలితంగా రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆక్సిజన్ థెరపీని తీసుకునే రోగులు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే దీన్ని తీసుకోవాలి.

Treatment with Music(Musical therapy) - సంగీతంతో వైద్యం


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంగీతంతో వైద్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


-మ్యూజిక్‌ థెరపీ అనేది క్లినికల్‌ థెరపీ, బయో మ్యూజికాలజీ, మ్యూజికల్‌ అకౌస్టిక్స్‌, మ్యూజిక్‌ థీరీ, సైకో అకౌస్టిక్స్‌, కంపే రిటివ్‌ మ్యూజికాలజీల మధ్య సంబంధా లను అధ్యయనంచేసే శాస్ర్తీయ పరిశోధన. ఈ చికి త్సా క్రమంలో సుశిక్షితుడైన మ్యూజిక్‌ థెర పిస్టు భౌతిక, భావాత్మక, మానసిక, సామా జిక, సౌందర్య, ఆధ్యాత్మిక కోణాల్లో సంగీతా న్ని ఉపయోగించి వ్యక్తులు ఆరోగ్యాన్ని పొంద డానికి సహాయపడతాడు. వివిధ సంగీత రీతు లను ఉపయోగించి వివిధ రంగాల్లో జీవిత నాణ్యతను, పనిచేసేతీరును మెరుగు పరు చుకోవడానికి మ్యూజిక్‌ థెర పిస్టులు ప్రధానంగా సహాయ పడతారు. ఫలితంగా అంచనా వేయదగ్గ చికి త్సా లక్ష్యాలను సాధిస్తారు. డాక్టరుగానీ, సైకా లజిస్టులు, ఫిజికల్‌ థెరపిస్టులు, వృత్తిపర మైన థెరపిస్టులున్న ఇంటర్‌ డిసిప్లినరీ టీమ్‌ మ్యూజిక్‌ థెరపీ సేవలను సిఫార్సు చేయ వచ్చు. సహాయపడే వృత్తుల్లో దాదాపు ప్రతి అంశంలో మ్యూజిక్‌ థెరపిస్టులు వున్నారు. టర్కో-పెర్షియన్‌ సైకాలజిస్టు, మ్యూజిక్‌ సిద్ధాంతవేత్త అయిన అల్‌-ఫరాబీ (872- 950) యూరోప్‌లో ‘అల్‌ఫరాబియస్‌’గా సుప్రసిద్ధుడు.

‘మీనింగ్‌ ఆఫ్‌ ఇంటెలెక్ట్‌’ అన్న తన పుస్తకంలో మ్యూజిక్‌ థెరపీ గురించి చర్చించాడు. ఈ రచనలో సంగీతం ఆత్మపై కలిగించే చికిత్సాపరమైన ప్రభావాలను వివరించాడు. 17 శతాబ్దపు రాబర్ట్‌ బర్టన్‌ తన రచన ‘ది అనాటమీ ఆఫ్‌ మెలాంకొలీ’ లో మానసిక జబ్బును ముఖ్యంగా మెలొంకొలి యా వ్యాధి చికిత్సకు సంగీతం నాట్యం ఎంతో ఉపయోగకరమైనవని అభిప్రాయపడ్డాడు.

మ్యూజిక్‌ థెరపీ - రకాలు...:- మ్యూజిక్‌ థెరపీ ఆధారాల గురించి విభిన్న ఆలోచనా ధోరణులున్నాయి. ఒకటి విద్యపై ఆధారపడినది. రెండు సరాసరి మ్యూజిక్‌ థెర పీ పైనే ఆధారపడినవి. ఇదే కాక సైకాలజీ పై ఆధారపడిన ధోరణులు కూడా వున్నాయి. న్యూరోసైన్స్‌పై ఆధారపడిన చికిత్సా ధోరణి కూడా ఉంది. ప్రవర్తనా పరమైన-భావోద్రేక పరమైన రుగ్మతలకు లోనైన వ్యక్తులకు మ్యూ జిక్‌ థెరపిస్టులు వైద్యం చేయవచ్చు. ఈ తర హా ప్రజానీకం అవసరాలను నెరవేర్చడం కోసం సమకాలీన మనస్తత్వ సిద్ధాంతాలను తీసుకుని మ్యూజిక్‌ థెరపిస్టులు వివిధ తరహా ల మ్యూజిక్‌ థెరపీకి ఆధారంగా వాటిని విని యోగించారు. బిహేవియరల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, సైకోడైనమిక్‌ థెరపీ వీటిలో వివిధ నమూనాలు. న్యూరోసైన్సు పై ఆధారపడిన థెరపీ నమూనాను న్యూరలాజిక ల్‌ మ్యూజిక్‌ థెరపీ (ఎన్‌ఎంటి) అంటారు. సంగీతం లేనప్పుడు మెదడు ఎలా వున్నదీ, సంగీతం వున్నప్పుడు మెదడు ఎలావున్నదీ, తేడాలను అంచనా వేసి మ్యూజిక్‌ ద్వారా మెద డులో మార్పులు తీసుకురావడానికి ఆ తేడాల ను వినియోగిస్తారు. చివరికి సంగీతరహితం గా చికిత్సపొందుతున్న వారిని ఎలా ప్రభావి తం చేస్తుందో పరిశీలిస్తుంది. ‘‘ఈ విధానంలో మెదడును సంగీతంలో లీనం చేసి మార్చుతా రు’’ అని అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రొఫె సర్‌, పరిశోధకుడు డా థాట్‌ అంటున్నారు.

పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ...:పిల్లలకు చేసే మ్యూజిక్‌ థెరపీలో రెండు విధానాలున్నాయి. ఒక గ్రూపు సిట్టింగులో చికిత్స చేయయడం ఒకటి కాగా, ప్రత్యేకిం చి ఒకరికి కూడా ఈ చికిత్స ఇవ్వవచ్చు. భావప్రసార (కమ్యూనికేషన్‌) సమస్యలు న్న బాలలకు, ప్రేరణ, ప్రవర్తనాపరమైన సమస్యలున్న పిల్లలకు మ్యూజిక్‌ థెరపీ సహాయపడగలదు. ఇందులో చికిత్స చేసే గది ఏర్పాటు చాలా ప్రధానమైంది. పిల్లలు సౌకర్యంగా వుంటూ వారు సరైన సంగీతం వినిపించడానికి ఇదెంతో అవసరం. అలాంటి గది పూర్తిగా సంగీతానికే కేటాయించిన గదై వుండాలి. గదిలో దృష్టిని మళ్ళించే ఇతర వస్తువులుండకూడదు. గదిలో వెలుతురు బాగుండాలి, వాతవరణం సమశీతోష్ణంగా వుండాలి. మరీ వేడిగా లేక మరీ చల్లగా ఉండ కూడదు. గదిలోకి సులువుగా రాకపోకలకు వెసులుబాటు వుండాలి. కుర్చీలు మంచివై వుండాలి. జాగిలపడేలా వుండకూడదు. ఇక వాయిద్యాల విషయానికి వస్తే వివిధ ప్రాంతాల కు చెందిన భిన్న వాయిద్యాలుండడం మంచి ది. వివిధ రంగులు, రకాల వాయిద్యాలుండ డం మంచిది. థెరపిస్టు పియానోగానీ గిటార్‌ గానీ వాయించాలి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మంచి నాణ్యమైన వాయి ద్యాలు వినియోగించాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి.

కొందరు పిల్లలు వాయిద్యాలను వాయించగలరు, కొందరు వాయించలేరన్న విషయం గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. కనుక పిల్లలకు వారికి తగిన వాయిద్యం ఇవ్వాలి. ఈ అంశాలన్నీ మ్యూజిక్‌ థెరపీ సఫలమవడానికి సత్ఫలితాలివ్వడానికి దోహ దపడతాయి. నిజానికి పిల్లల మ్యూజిక్‌ థెరపీ మాతృగర్భంలోనే మొదలవుతుందంటారు డానియెల్‌ లెవిటిన్‌. ఏమ్నియోటిక్‌ ఆసిడ్‌లో చుట్టుకొనివున్న గర్భస్థ శిశువు తల్లి గుండె చప్పుడు వింటుంది. అదే కాక సంభాషణలు, పర్యావరణపనమైన శబ్దాలు వింటుంది. పిండం సంగీతం వింటుందని యుకెలోని కీల్‌ విశ్వవిద్యాలయంకు చెందిన అలెగ్టాండ్రా లమోంట్‌ అంటున్నారు. పుట్టిన ఏడాది తర్వాత పిల్లలు సంగీతాన్ని గుర్తిస్తారని, కోరుకుంటారని కూడా అంటున్నారు. ఆకృతి దాల్చిన తర్వాత 20 నెలలు నిండిన గర్భస్థ శిశువు వినికిడి వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయనారంభిస్తుందని వారంటున్నారు.

భారత్‌లో మ్యూజిక్‌ థెరపీ...:
మన భారతీయ శాస్ర్తీయ సంగీత రాగాలకు చికిత్సాపరమైన గుణాలున్నాయని వేదాలు చెబుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే సంగీ తాన్ని చికిత్సాపరమైన సాధనంగా మన పూర్వీ కులు ఉపయోగించారు. భారతదేశంలో సంగీ తం ఒక యోగా పద్ధతి. శ్రావ్యతకు ఆధారం రాగం. భారతీయ సంగీతానికి శ్రావ్యతే మౌ లిక స్వరం. కేంద్ర నాడీ మండలానికి సంబం ధించిన ఎన్నో వ్యాధులు మాన్పడంలో వివిధ రాగాలు ఎంతో ప్రభావవంతమైనవని వెల్లడైం ది. సంగీతాన్ని ఒక చికిత్సగా వినియోగించే ముందు ఏ విధమైన సంగీతం వాడాలో నిర్ధా రించుకోవాలి. సంగీతం మౌలిక గుణగణా లను సరిగా వినియోగించడం, స్వరం సవ్యం గా పలకడంపై సంగీత చికిత్స భావన ఆధారప డివుంది. ఒక్కో రాగం వైవిధ్యం అనూహ్యమైం ది. కను క ఒక నిర్ణీత వ్యాధికి ఒక నిర్దిష్టమైన రాగం పనిచేస్తుందని చెబుతారు. మ్యూజిక్‌ థెరపీ అన్న మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతికి వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో భార తీయ శాస్ర్తీయ గాత్ర సంగీతానికి సంబంధిం చిన లిఖిత సాహిత్యం తగినంతగా లేదు.

Oral Cancer - నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌)


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నోటి క్యాన్సర్‌(ఓరల్‌ క్యాన్సర్‌),Oral Cancer- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

శరీరంలో వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో మూడింటొక వంతు నోటి క్యాన్సర్‌ (ఓరల్‌ క్యాన్సర్‌) వస్తుంది. నోటిలో వచ్చే క్యాన్సరు వ్యాధి 50% వరకు 'నాలుక' 'పెదవుల'లో వస్తుంది. మిగతా శాతం నోటిలోపలి బుగ్గ లు (బక్కల్‌ మ్యూకోజా) మృదు అంగుటి భాగం (సాఫ్ట్‌పేలెట్‌) టాన్సిల్స్‌, నాలుక, క్రిం దనోటి భాగం, చిగుళ్ళు (గమ్స్‌) మొదలలైన నోటి భాగాలలో వస్తుంది.

కాలుతున్న చుట్ట భాగాన్ని (అడ్డచుట్ట) నోటిలో పెట్టుకొని పొగ త్రాగేవారిలోను, సిఫిలిస్‌ వ్యాధి గ్రస్తుల్లోను, అంగుటి భాగా నికి క్యాన్సరు వస్తుంది. అదే పనిగా కిళ్ళీలు జర్ధాకిళ్ళీలు బుగ్గన నిల్వ ఉంచుకొని ఉండే వారిలో బుగ్గ క్యాన్సరు వస్తుంది. పాన్‌ పరాగ్‌, పాన్‌మసాలా, గుట్కావంటి పొగాకు సంంబంధమయిన పొడులు చప్పరించే వారిలో చిగుళ్ళ క్యాన్సరు, గొంతుక్యాన్సరు, బుగ్గ క్యాన్సరు వచ్చే అవకాశం ఉంది. వీటి వాడకం వల్ల శరీరంలో యితరభాగాలు కూడా క్యాన్సరు వ్యాధికి గురికావచ్చు.

దవుడలోని పళ్ళు విరిగిపోయినా, అరిగి పోయినా అవి తరచుగా బుగ్గకు, నాలుకకు, పెదవులకు గుచ్చుకొని పుండుగా మారి ఆ పైన క్యాన్సరు వ్యాధిగా మారవచ్చు.

పళ్ళు లేనివారు ఉపయోగించే కట్టుడు పళ్ళు సరిగా కుదరక నోటిలోని సున్నిత భా గాల పై వత్తిడి తెచ్చే పరోస్థితిలోను, వంకర పళ్ళు సరిచేసే విషయంలో నోటిలోని సున్ని త భాగాలు పుండ్లుగా మారి ఆ తర్వాత క్యాన్సరుగా మారే అవకాశం ఉంది.

నోటిలో వచ్చే 'సబ్‌- మ్యూకస్‌ఫైబ్రోసిస్‌', 'ల్యూకోప్లేకియా', 'లైకన్‌ ప్లాసస్‌', 'సిలిఫిలిస్‌' పంటి వ్యాధులను నిర్ల క్ష్యం చేసినా అవి క్యాన్సరుగా మారు తాయి.

త్వరగా తగ్గని నోటిలోని పుండ్లు, విపరీత మయిన నొప్పి, వాచిన లింపు గ్రంధులు, లాలాజలం అధికంగా ఊరడం, నోటి దుర్వాసన, నోరు తెరవలేని పరిస్థితిలో మూసుకు పోవడం వంటి లక్షణాల ద్వా రా క్యా న్సరు వ్యాధిని గుర్తించ వచ్చు.

వ్యాధి నిర్ధారణ ఆలస్యంగా జరగడం - వ్యాధి నిర్ధారణ లోపం వల్ల క్యాన్సరు వ్యాధి మురిదిపోతుంది. కనీసం ఆరు నెలల కొకసారి దంత వైద్య పరీ క్షలు చేయించుకొంటే యిలాంటి వాటిని యిట్టే పసిగట్టవచ్చు.

నోట్లో క్యాన్సర్‌:

ఆయా వ్యక్తుల హౌదాలను బట్టి, సమా జంలో కొందరు సిగరెట్లు త్రాగితే, మరి కొందరు బీడీలు చుట్టలు త్రాగుతు న్నారు. వీటిల్లో ఏది త్రాగినా జరిగే నష్టం అతి ప్రమాదమయిందే.

పొగ పీల్చడంవల్ల, సిగరెట్లలో వాడే పొగాకులో వుండే 'నికోటిన్‌ పదార్థం' సరాసరి ఊపిరితిత్తులలోనికి పోయి, క్షయ వ్యాధిని కలుగజేస్తుంది. విపరీతంగా దగ్గడం, ఉమ్మ డం, బరువును కోల్పోవడం, బక్కచిక్కి పోవడం, జ్వర పీడితులు కావడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు. ఇలాంటివారి వల్ల యింట్లో వారికే కాక వీరి ఉమ్మి తుంపరలు తాకిన ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమి స్తుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో- నది, సముద్ర తీరాలలో నివసించే ప్రజలు, శ్రామికులు చుట్టలు కాలుస్తారు. నిప్పు ఉన్న భాగాన్ని నోట్లో పెట్టుకొని 'గుప్పు'తారు ఈ అలవాటు వల్ల చుట్ట యొక్క నిప్పు వేడికి నోట్లోని సున్ని తమైన అంగుటి భాగం కమిలి పుండుగా మారి ఆ తర్వాత 'క్యాన్సర్‌'గా మారుతుంది. ప్రపంచ దేశాలలో 'చుట్టక్యాన్సర్‌'గా దీనికి పేరుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విధంగా ఆయా దేశాలలో అందరి నోళ్ళలోను నాను తున్నది. పొగత్రాగడం వల్ల వచ్చే నోటి క్యా న్సర్‌ వ్యాధి మన దేశంలో అధికంగా ఉంది. అలవాట్లలో ఏమాత్రం మార్పు రానుందున రాను-రాను యి వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కేవలం 'పొగాకు' వల్ల వచ్చే జబ్బులతోనే దాదాపు ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా, మన దేశంలోని క్యాన్సర్‌ పీడితుల్లో మూడింట ఒక వంతు మంది నోటి క్యాన్స ర్‌తో బాధపడ్తున్నావారే!

అయితే, ఈ మధ్య పొగత్రాగడానికి ప్రత్యా మ్నాయంగా, నమలడానికి, ముక్కుతో పీల్చ డానికి అనువుగా ఎన్నో రకాల పొగాకు ఉత్పత్తులు విపణిలో లభ్యమవుతున్నాయి. 'స్మోకలెస్‌(smokeless) టొబాకొ'గా వీటికిపేరుంది. అంటే పొగతో పనిలేని తంబాకు అన్న మాట! దీనికి కూడా అన్ని రకాల ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అయితే పొగాకు పీల్చడం కంటే, నమలడం వల్ల మరెన్నో అనర్ధాలు ఉన్నట్లు పరిశోధకుల అంచనా, పొగాకును నమలడం ద్వారాను, ముక్కుపొడి రూపంలో పీల్చడం ద్వారాను, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కో మనిషికి సంవత్సరానికి 1.8 కిలోల పొగాకు ఖర్చవుతున్నట్లు తేలింది.

'స్మోకలెస్‌ టుబాకొ' లో 'బెంజో'పైరిన్‌', పోటోనియం-210, కొన్ని రకాల 'నైట్రోజమైన్‌' అనే క్యాన్సర్‌ను కలిగించే రసాయనిక పదార్థాలు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటివల్ల గొంతుక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదముంది. దీనితో పాటు 25 సంవత్సరాలు పరుసగా ఈ పొగాకు ఉత్పత్తులను వాడితే, పదమూడు వంతులు అధికంగా 'చిగుళ్ళ క్యాన్సర్‌', 'బుగ్గ క్యాన్సర్‌' వస్తుందని ధృవీకరించబడింది. మన దేశంలో పుగాకును కిళ్ళీలలో - తమలపాకుతో, వక్కలు సున్నం కలిపి వాడతారు. ఇవన్నీ నోటి క్యాన్సర్‌ను కలిగించడానికి తోడ్పడతాయి. పొగాకు నమిలేవారిలో క్యాన్సరుగా మారే 'లూకాప్లేకియా (తెల్లమచ్చ) అనే వ్యాధి నోటిలోని అతి సున్నిత భాగమైన బుగ్గకు వస్తుంది. పొగాకులో అధికంగా ఉండే 'నికోటిన్‌' నోటిలోని లాలాజలంతో కలిసి, నోటి మ్యూకస్‌ పొర- దారా గ్రహింపబడి సరిసరి రక్త ప్రవాహంతో కలియడం వల్ల దీని ప్రభావానికి రక్తపోటు కూడా వస్తున్నట్లు తేలింది. అందుచేత పొగత్రాగడానికి ప్రత్యామ్నాయంగా, స్మోకలెస్‌ టుబాకోను వాడడం వల్ల మరిన్ని అనర్ధాలు సంభవిస్తున్నాయన్నది నగ్నసత్యం. పొగత్రాగే అలవాటును మానుకోవాలే తప్ప దానికి ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేనే లేదు.

Botox therapy - బొటాక్స్ థెరపీ





















ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బొటాక్స్ థెరపీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వయసు కనిపించకుండా అందంగా ఉండాలనే కోరికతో ఎన్నోచికిత్సలకు ఆకర్షితులు అవుతున్నారు. ఆ చికిత్సలలో ఒకటి బొటిక్స్ థెరపీ. చూసే కళ్లను బట్టి అందం ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేసి ఓ రేషియో ను శాస్త్రవేత్తలు రూపొందించారు. విశ్వవ్యాప్తంగా పర్ఫెక్ట్ ఫేస్ కు ఉండే రేషియో ఇదేనని అందరూ అంగీకరించారు. ఈ రేషియోను పెదాల నుంచి ముక్కు వెడల్పు వరకు లెక్కిస్తారు. బొటాక్ష్ (Botox) అనేది బొటిలినమ్‌ టాక్షిన్‌ ఎ (Botilinum Toxin A) కి ట్రేడ్ నేమ్‌ . 1990 లో ఎఫ్.డి.ఎ. ద్వారా కంటి కండరాల బిగువును (eye muscle spasm) తగ్గించడానికి వినియోగములోనికి వచ్చినది . తక్కువ మోతాదులో ముఖము కండాలలో ఇంజక్ట్ చేయడము వలన ఆయా కండరాలు రిలాక్ష్ అయ్యి ముఖము లోని ముడతలు , గుంటలు , లైన్స్ /గ్రూవ్స్ సరిచేయబడి అందముగా యవ్వనములో ఉన్నట్లు కనిపించును . ఈ విధానము అనుభవము ఉన్న కాజ్మెటిక్స్ స్పెసలిస్ట్స్ చే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సుమారు 7 -8 నెలలు దీని ప్రభావము ఉంటుంది . మళ్ళీ కావాలనుకుంటే ఎన్ని సార్లైనా తీసుకోవచ్చును .

బొటాక్ష్ వల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి :

  • మైగ్రైన్‌ తలనొప్పులకు పనిచేయును. నొప్పి తగ్గించుటలో సహకరించును,
  • ముఖము పై ఎక్కు వగా చెమట పట్టకుండా నివారించుటలో సహకరించును .
  • దీర్ఘ్కాలిక దవడ నొప్పి , నడుమ నొఫ్ఫి చికిత్సలో మంచి ఫలితాలు ఉన్న్నాయి .
  • కండరాల వణుకు (muscle twitchings) తగ్గించుటలో ఉపయోగపడును .
ఎవరు అర్హులు : 
మంచి ఆరోగ్యము ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా తీసుకోవచ్చును .
గర్భిణి స్త్రీలు , బాలింతరాళ్లు తీసుకోకూడదు ,
నరాల జబ్బులు ఉన్న వారూ తీసుకోకూడదు (Neuro muscular disorders).

బొటాక్ష్ ఇంజక్షన్‌ చేసే విధానము :
ఈ ఇంజక్షన్‌ చాలా సులువుగా చాలా సన్నని సూది ఉన్న సిరంజ్ తో ఇస్తారు . ఏయే కండరాలకు అవసరమో అంతవరకే తక్కువ మోతాదులో ఇస్తారు . ఇది తీసుకోవాలనుకునే వారు సుమారు 10 రోజులు ముందుగా ఏవిధమైన విటమిన్లు, విటమిన్‌ ఇ(vit.E) , నొప్పినివారణ మందులు (anti inflamatary drugs) వాడకూదదు .

Cerebral palsy -సెరిబ్రల్‌ పాల్సీ


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెరిబ్రల్‌ పాల్సీ,Cerebral palsy- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



పోలియోని దాదాపు జయించాం! బాల్యాన్ని కబళిస్తూ జీవితాలను కకా'వికలం' చేసే ఆ దురవస్థను చాలావరకూ తరిమికొట్టాం. కానీ ఇదే తీరులో నిండు జీవితాలను నిట్టనిలువునా నిర్వీర్యం చేస్తున్న మరో సమస్య 'సెరిబ్రల్‌ పాల్సీ' మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టటం లేదు. మనం గుర్తించటంలేదు గానీ ఇది పెద్ద సమస్య. చేతికి అందిరావాల్సిన బిడ్డలను వికలాంగులుగా మార్చివేసి.. భవిష్యత్తును అంధకారం చేస్తున్న సమస్య. పుడుతున్న ప్రతి వెయ్యి మంది పిల్లల్లో దాదాపు ఇద్దరు ముగ్గురు దీనితోనే కుంగిపోతున్నారు. ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది, రాష్ట్రంలో కనీసం 1.5 లక్షల మంది పిల్లలు ఈ నరకం అనుభవిస్తున్నారని అంచనా.

సెరిబ్రల్‌ పాల్సీని మనం పూర్తిగా నయం చేసి.. బిడ్డలను మిగతా పిల్లలందరిలా మార్చలేకపోవచ్చు. కానీ వైకల్యాన్ని చాలా వరకూ ఎదుర్కొనొచ్చు. బిడ్డ 'తన కాళ్ల మీద తాను నిలబడేలా' చెయ్యచ్చు. ముఖ్యంగా వీరు ప్రతి చిన్నదానికీ మరొకరి మీద ఆధారడాల్సిన దుర్భర స్థితి దాపురించకుండా చూడొచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఆ పనే చేస్తున్నాయి. దీనికి భారీ నిధులేం అక్కర్లేదు. బడా ఆసుపత్రులూ, హైటెక్‌ చికిత్సల అవసరమూ లేదు. కావాల్సిందల్లా ప్రభుత్వం వైపు నుంచి బలమైన నైతిక సంకల్పం. తల్లిదండ్రుల్లో అవగాహన, స్ఫూర్తి!

దుర్భరం : సెరిబ్రల్‌ పాల్సీ పిల్లల్లో కాళ్లు చేతులు సహకరించక పోవటం, వయసుకు తగిన పెరుగుదల లేకపోవటంతో వాళ్లు దైనందిన అవసరాల కోసం కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తుతుంది. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఐదారేళ్ల వరకూ బాగానే చూడొచ్చుగానీ ఆ తర్వాత సమస్యలు మొదలవుతుంటాయి. బిడ్డ పెరిగి పెద్దవుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతుండటం, బరువు పెరుగుతుండటం వల్ల ఎత్తుకోవటం కష్టం కావటం.. ఇవన్నీ సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఫలితంగా బిడ్డ అన్ని రకాలుగానూ కుంగిపోతుంటే, మరోవైపు కుటుంబాలు అతలాకుతలమైపోతుంటాయి. పైగా ఈ సమస్య పేద కుటుంబాల్లో ఎక్కువ. ఆసుపత్రి ప్రసవాల్లో అయితే.. కాన్పు సమయంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనా వైద్యులు బిడ్డ గుండె కొట్టుకునే తీరు వంటివన్నీ జాగ్రత్తగా గమనిస్తూ బిడ్డకు నష్టం జరగకుండా చూస్తారు. అదే మంత్రసానులు కాన్పు చేస్తుంటే ఇది సాధ్యం కాదు. దీనివల్ల పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది. రెండోది- ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బిడ్డ తన పని తాను చేసుకునేలా చూడటం అత్యవసరం. కొన్ని తేలికపాటి చికిత్సలతో ఈ బిడ్డల పరిస్థితి మెరుగై.. ఎంతోకొంత స్వతంత్రంగా జీవించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల మీద పెట్టే ఖర్చుకు.. దీర్ఘకాలంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతిఫలం గొప్పగా ఉంటుంది.

* తెలివితేటలు - సెరిబ్రల్‌పాల్సీ బాధితుల్లో శారీరక కదలికలు కష్టం తప్పించి చాలామందిలో తెలివితేటలు బాగానే ఉంటాయి. చూడటానికి కొందరు మానసిక ఎదుగుదల లేనివారిలా కనిపించవచ్చు. ముఖంలోని కండరాల మధ్య సమన్వయం దెబ్బతినటం వల్ల వీళ్ల ముఖ కవళికలూ కొంత భిన్నంగా ఉండొచ్చుగానీ సాధారణంగా వీరిలో చాలామందికి మానసిక సమస్యలు తక్కువనే చెప్పాలి.
సురక్షిత కాన్పు సదుపాయాలు, ఆసుపత్రి ప్రసవాలు లేక .....పేద కుటుంబాల్లో ఈ సెరిబ్రల్‌ పాల్సీ సమస్య ఎక్కువగా కనబడుతోంది.

* ఇటువంటి పిల్లలకు పేద కుటుంబాల్లో ఆలనాపాలనా కూడా కష్టమే. రెక్కాడితేగానీ డొక్కాడని తల్లిదండ్రులు వీరిని దీర్ఘకాలం కనిపెట్టుకుని ఉండలేక, క్రమేపీ నిస్పృహలోకి జారిపోయి వీరిని విధికి వదిలేస్తుంటారు. దీంతో పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది.
* వీరికి సహాయం చేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది.
పింఛను కోసం చూసుకోవద్దు!
సెరిబ్రల్‌ పాల్సీకి చికిత్స చేయిస్తే.. వికలాంగుల పింఛను వంటి సదుపాయాలు ఇవ్వరేమోనన్న భయంతో కొందరు తల్లిదండ్రులు సర్జరీల వంటివాటికి ముందుకు రావటం లేదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభుత్వం పింఛను ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవటం అవసరమే. అయితే అక్కడితోనే చేతులు దులిపేసుకోకుండా చికిత్స చేయించటం మీద కూడా దృష్టిపెడితే.. బిడ్డ ఏదో రోజు పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత తన కాళ్ల మీద నిలబడటం, తన పని తాను చేసుకోగలగటం వంటివి సాధ్యమవుతాయి. వ్యక్తిగా ఆత్మాభిమానం, గౌరవం పెరుగుతాయి. ఎంతైనా తల్లిదండ్రులు ఒక వయసు దాటిన తర్వాత సేవలు చేయలేరు, వాళ్లూ వృద్ధులవుతుంటారు. కాబట్టి ఏదో పింఛను రూపంలో తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు రూకల కోసం చూసుకుని.. బిడ్డలకు చికిత్స చేయించకపోవటం, చేయించినా చికిత్సలతో పెద్దగా ప్రయోజనం ఉండదని నిరాశలో కూరుకుపోవటం సరికాదు. అందరూ ప్రధానంగా తెలుసుకోవాల్సింది- సెరిబ్రల్‌ పాల్సీ వంటి సమస్యలను మనం పూర్తిగా నయం చెయ్యలేకపోవచ్చుగానీ.. బిడ్డ తన జీవితం తాను జీవించేలా చేసే అవకాశాలున్నాయి. బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఈ అవకాశాలను ఉపయోగించుకోవటం ముఖ్యం.ఈ సమస్య కారణంగా ఎన్నో పేద కుటుంబాలు ఘోరంగా కుంగిపోతున్నాయి. వీరికి చేసే చికిత్సలు, సర్జరీలు కూడా ఖరీదైనవేం కాదు. చాలా తేలికగా, ఎటువంటి ప్రభుత్వాసుపత్రిలోనైనా చెయ్యటానికి వీలైనవే. మనకు కావాల్సిందల్లా వీరి జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పం!

పోలియో.. సెరిబ్రల్‌ పాల్సీ: తేడాలేంటి?
* పోలియో వైరస్‌ కారణంగా వచ్చే వ్యాధి. సెరిబ్రల్‌ పాల్సీ అన్నది మెదడులో కీలక కేంద్రాలు దెబ్బతినటం వల్ల వచ్చే సమస్య.

* పోలియోలో మెదడు బాగానే ఉంటుంది, వెన్ను దగ్గర నాడులు దెబ్బతిని, తత్ఫలితంగా కండరాలు కాళ్లు చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కీలక మెదడు భాగాలు దెబ్బతింటాయి, వెన్ను దగ్గర సమస్యేం ఉండదు.

* పోలియోలో సాధారణంగా కాళ్లకు శక్తి ఉండదు, అవి చచ్చుబడిపోతాయి. సెరిబ్రల్‌ పాల్సీలో కాళ్లు చచ్చుబడిపోవటమన్నది ఉండదు, పైగా కాళ్ల కండరాలు అతిగా స్పందిస్తూ బలంగా బిగుసుకుపోతుంటాయి.

* పోలియో మనలాంటి బడుగు దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. సెరిబ్రల్‌ పాల్సీ పాశ్చాత్య దేశాల్లోనూ ఎక్కువే. కాకపోతే మనదేశంలో జనాభా సంఖ్య, శిశుజననాల సంఖ్య ఎక్కువ కాబట్టి మన దగ్గర బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.

* పోలియో, సెరిబ్రల్‌పాల్సీ.. వీటివల్ల జరిగే నష్టమేదో చిన్నతనంలోనే జరిగిపోతుంది. వ్యాధి క్రమేపీ ముదరుతూ పోవటమన్నది ఉండదు. కాకపోతే అప్పటికే జరిగిన నష్టం తాలూకూ దుష్ప్రభావాలు వైకల్యం రూపంలో జీవితాంతం వేధిస్తాయి, బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆ లోపాలు మరింతగా పెరుగుతుంటాయి. కాబట్టి వాటిని సరిచేయటం కోసం, ఆ నష్టాన్ని సాధ్యమైనంత వరకూ పూడ్చటం కోసం చికిత్స తప్పనిసరి.



చచ్చుబడిపోయిన కాళ్లు చూస్తూనే మనకు 'పోలియో' గుర్తుకొస్తుంది. టీకాల కార్యక్రమాన్ని ఉద్ధృతంగా అమలు చేయటం ద్వారా ఇప్పుడు దాన్ని మనం చాలా వరకూ అధిగమించగలిగాం. కానీ దాదాపు ఇదే తీరులో పిల్లలను వైకల్యం పాలు చేసే 'సెరిబ్రల్‌ పాల్సీ' మాత్రం ఇప్పటికీ మనకు పెద్ద సవాల్‌గానే నిలుస్తోంది. పోలియో అనేది వైరస్‌ ద్వారా వ్యాపించే వ్యాధి. కానీ 'సెరిబ్రల్‌ పాల్సీ' అంటువ్యాధి కాదు. ఇదేమీ వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల కారణంగా వచ్చేదీ కాదు. ప్రధానంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడో.. కాన్పు సమయంలోనో.. పుట్టిన తర్వాతో.. బిడ్డ మెదడులోని కీలక కేంద్రాలు.. అందులోనూ కండరాల కదలికలను నియంత్రించే మెదడు భాగాలు దెబ్బతినటం దీనికి మూలం. ఫలితంగా కాళ్లు వంకర్లు తిరిగిపోయి.. చేతులు, వేళ్లు స్వాధీనంలో లేక.. కదలికలు కష్టమై ఎంతోమంది పిల్లలు అంగవైకల్యానికి గురవుతున్నారు. ఒకసారి మెదడు కణాలు దెబ్బతింటే తిరిగి అవి కోలుకోవటం కష్టం. అందుకే ఈ వ్యాధిని మనం పూర్తిగా నయం చెయ్యలేంగానీ.. మెదడులో జరిగిన నష్టం కారణంగా కండరాల్లో తలెత్తే సమస్యలను మాత్రం రకరకాల చికిత్సల ద్వారా చక్కదిద్దే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి 'సెరిబ్రల్‌ పాల్సీ' అనగానే ఇక మనమేం చెయ్యలేమని వదిలేయకుండా.. పసివయసులోనే సమస్యల్ని గుర్తించి వీలైనంత మేర సరిచేయటం అవసరం.

సెరిబ్రల్‌ పాల్సీ: ఏమిటీ సమస్య?
చిన్న ఉదాహరణ చూద్దాం. టేబుల్‌ మీద ఉన్న పెన్నును పైకి తీసుకోవాలనుకున్నాం. అదెలా సాధ్యం? ముందు చేతి, వేళ్ల కండరాలు సమన్వయంతో కదులుతూ... మన వేళ్లు కాస్త వదులుగా పెన్ను వరకూ వెళ్లాలి. అవి కచ్చితంగా పెన్నును పట్టుకోవాలి. వెంటనే బిగువుగా మారి, ఆ పెన్నును పైకి లేపాలి, వెనక్కిరావాలి. ఇలా ప్రతి కదలికా.. ప్రతి పనీ.. కండరాల సమన్వయంతో సున్నితంగా జరగాల్సిందే. లేకపోతే శారీరక కదలికలు అసంభవం. ఇందుకోసం మెదడులోని కీలక కేంద్రాలు.. ఎప్పుడు బిగువుగా మారాలి, ఎప్పుడు వదులవ్వాలి.. ఎలా కదలాలన్నది నిరంతరం ఆయా కండరాలకు ఆదేశాలు పంపిస్తూనే ఉంటాయి. కానీ సెరిబ్రల్‌ పాల్సీ బాధితుల్లో... ఇలా కండరాలను నియంత్రించాల్సిన మెదడు భాగాలు దెబ్బతింటాయి. ఫలితంగా కండరాల కదలికలన్నీ అసహజంగా, అస్తవ్యస్తంగా తయారవుతాయి. క్రమేపీ కండరాలు బిగుసుకుపోవటం.. మోకాళ్లు ముడుచుకుపోతుండటం, కాళ్లు కత్తెరలా వంకరైపోతుండటం, పాదాలు తిరిగిపోతుండటం, చేతుల వేళ్లు ముడుచుకుపోతుండటం.. ఇలా ఎన్నో వైకల్య లక్షణాలు మొదలవుతాయి.

చెప్పలేని కారణాలు అనేకం:

మన మెదడు ఎదుగుదల తల్లిగర్భంలోనే ఆరంభమై.. పుట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్ల వరకూ కూడా కొనసాగుతుంది. ఇలా గర్భంలో పెరుగుతున్నప్పుడుగానీ, కాన్పు సమయంలో గానీ, చిన్న వయసులోగానీ పసి మెదడు దెబ్బతింటే పరిస్థితి 'సెరిబ్రల్‌ పాల్సీ'కి దారి తియ్యచ్చు. గర్భిణికి రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లు రావటం, హైబీపీ, పోషకాహార లోపం, తల్లీబిడ్డల రక్తం గ్రూపులు సరిపడకపోవటం వంటివి గర్భంలోనే పిండం మెదడును దెబ్బతియ్యచ్చు. ఇక కాన్పు కష్టమై, బిడ్డ మధ్యలోనే ఎక్కువసేపు ఉండిపోయినా, ఆ సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందక సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చు. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే మెదడు నిర్మాణంలో లోపాలు తలెత్తచ్చు. ఇక పసివయసులో మెదడు, మెదడు పొరల వాపు (ఎన్‌సెఫలైటిస్‌, మినింజైటిస్‌), తలకు దెబ్బలు తగలటం వంటివీ మెదడును దెబ్బతియ్యచ్చు. బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు సెరిబ్రల్‌ పాల్సీ ముప్పు 20 రెట్లు ఎక్కువ. కవలల్లోనూ ఎక్కువగా కనిపించొచ్చు. ఇలా మెదడుకు ఏ రూపంలో నష్టం జరిగినా సెరిబ్రల్‌ పాల్సీ రావచ్చుగానీ వీటిలో దేనివల్ల వచ్చిందన్నది కచ్చితంగా నిర్ధారించటం మాత్రం కష్టం.

గుర్తించేదెలా?
సమస్య తీవ్రంగా ఉండి, బిడ్డ కదలికలు మరీ అసహజంగా ఉంటే తల్లిదండ్రులు 3 నెలల్లోపే తేడా గుర్తిస్తారు. మెదడుకు జరిగిన నష్టం మధ్యస్తంగా ఉంటే మాత్రం- రెండు మూడేళ్ల వరకూ వ్యాధి అంతగా బయటపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు చూడటానికి బాగానే ఉంటారుగానీ మెడ నిలబెట్టటం, పాకటం, కూచోవటం, నిలబడటం, నడవటం వంటివి ఆలస్యం అవుతుంటాయి. దాన్నిబట్టి తల్లిదండ్రులు అనుమానించే అవకాశం ఉంటుంది. పుట్టగానే బిడ్డ ఏడ్వకపోవటం కీలక సమస్యలకు సంకేతం. కొందరు పిల్లల్లో పాలుతాగటం, మింగటం, మాటల వంటివీ కష్టంగా ఉండొచ్చు. మెదడులోని ఏ భాగం దెబ్బతిందన్న దాన్నిబట్టి- కండరాలు బలంగా ముడుచుకుపోతుండటం నుంచి ఉన్నట్టుండి జర్క్‌లు వచ్చినట్టు అసహజమైన కదలికల వరకూ సెరిబ్రల్‌ పాల్సీలో చాలా రకాలున్నాయి.

చికిత్స: స్వతంత్రులను చేయటమే లక్ష్యం!

మనం సెరిబ్రల్‌పాల్సీ వ్యాధిని పూర్తిగా నయం చేసి.. వారిని చక్కటి ఆరోగ్యవంతులుగా మార్చలేకపోవచ్చు. కానీ సమస్యను గుర్తించి.. చిన్నతనం నుంచీ చిన్నచిన్న సంరక్షణ చర్యలు ఆరంభిస్తే ఈ పిల్లలను చాలా వరకూ స్వతంత్రులను చేసే అవకాశం ఉంటుంది. కనీసం పూర్తి అంగ వైకల్యంలోకి జారిపోకుండానైనా చూడొచ్చు. వైద్యులు బిడ్డ పరిస్థితిని పరిశీలించి.. బిడ్డ సాధ్యమైనంత చక్కగా ఎదిగేందుకు సహాయపడతారు. పూర్తిగా మంచానికి అతుక్కున్న బిడ్డను కొంత లేచి కూర్చునేలా చూడటం.. నడవ లేకపోతున్న బిడ్డను క్యాలిపర్స్‌ వంటివాటి సహాయంతోనైనా.. కుంటుకుంటూ అయినా నడిచేలా చూడటం.. ఇలా ప్రతి దశలోనూ పరిస్థితి మెరుగయ్యేలా చూడటం సాధ్యమే. దీనిలో- ఫిజియోథెరపీ, సర్జరీ రెండింటికీ ప్రాధాన్యం ఉంది.

* ఫిజియోథెరపీ: సెరిబ్రల్‌ పాల్సీ వల్ల బిగుసుకుపోతున్న కండరాలను దారిలోకి తేవటం, కదలికలను మెరుగుపరచటం వంటివాటికి ఫిజియోథెరపీలో ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. వీటిని తల్లిదండ్రులు నేర్చుకుని నిత్యం బిడ్డతో చేయించటం ద్వారా దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. కొందరికి కండరాల సమస్యలు తీవ్రంగా ఉంటే ఆపరేషన్‌తో సరిచేసి.. ఆ తర్వాత మళ్లీ ఫిజియోథెరపీ చెయ్యాల్సి ఉంటుంది.

* సర్జరీ: బిగుసుకుపోతున్న కండరాలు, టెండన్లను వదులు చేయటం, మరీ బలంగా ముడుచుకుంటున్న వాటిని కాస్త సాగదీసి, సమన్వయ పరచటం, వంకర్లు సరిచెయ్యటం వంటివన్నీ సర్జరీలో కీలకాంశాలు. మోకాళ్లు వంగిపోతుంటే ముడుచుకుంటున్న టెండన్లను 'జడ్‌ప్లాస్టీ' వంటి విధానాల ద్వారా సాగదీసి, సాఫీగా నిలబడి.. క్రమేపీ నడిచేలా చెయ్యచ్చు. కొన్నిసార్లు వీటికి 'బొటాక్స్‌' ఇంజక్షన్ల వంటివీ ఉపయోగపడతాయి.

* కొందరిలో బొటనవేలు ముడుచుకుపోతూ ఏ పని చెయ్యాలన్నా అరిచేతిలో పెద్ద అడ్డుగా తయారవుతుంది. కండరాన్ని సరిచేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

* కొందరికి కాళ్లు రెండూ దగ్గరగా బిగుసుకుపోయి.. ఏం చేసినా వెడంగా, దూరంగా వెళ్లవు. గజ్జల దగ్గరి కండరాలను వదులు చేయటం, కట్‌ చేయటం వంటి సర్జరీలతో కొంత సరిచెయ్యచ్చు. గూని వంటివి ఉన్నా సర్జరీలో సరిచేయచ్చు.

* కొన్నిసార్లు కాళ్లు సాఫీగా సాగటానికి- ఒకవైపు కండరం సరిగా పనిచేయకుండా రెండోది బాగుంటే.. ఒకవైపు కండరాన్నీ, టెండన్లనూ ఇంకోవైపునకు మార్చటం కూడా సర్జరీల్లో ముఖ్యమైన భాగం.

* కండర బిగుతుదనానికి కారణమవుతున్న నాడులను కట్‌ చేయటం గురించి తరచూ మాట్లాడుతుంటారుగానీ అది చాలాచాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అవసరమవుతుంది. సాధ్యమైనంత వరకూ నాడులనుకట్‌ చేయకుండా కండరాలను సరి చేయటమే ఉత్తమ విధానంగా నిలుస్తుంది.

* అతిగా పనిచేస్తున్న కండరాలను గాడిలో పెట్టటానికి 'యాంకిల్‌ ఫ్లోర్‌ ఆర్థ్రోసిస్‌ (ఏఎఫ్‌ఓ)' రకం క్యాలిపర్స్‌ వంటివి ఇస్తారు.

* సర్జరీ తర్వాత నడకలో తర్ఫీదు ఇస్తారు. ముందు అటూఇటూ కర్రదండాలు పట్టుకుని నడవటం, తర్వాత స్ట్రెచర్‌తో నడవటం, తర్వాత వదిలేసి నడవటం.. ఇలా తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నతనంలో సరిచేయకపోతే క్రమేపీ ఎముకలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

* మొత్తమ్మీద ఫిజియోథెరపీ చేయించటం, కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటే సర్జరీతో సరిచేయటం, క్యాలిపర్స్‌తో నడిచేలా తర్ఫీదునివ్వటం.. ఇవి చికిత్సలో కీలకాంశాలు. వీటికి పెద్ద ఖర్చేం కాదు. కష్టమేం లేదు. కాకపోతే చికిత్సా విధానాలు ఉన్నాయని.. పరిస్థితిని పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత సరిచేయవచ్చని అందరూ అవగాహన పెంచుకోవటం ముఖ్యం.

* పునర్వికాసం: చికిత్సల తర్వాత వీరు స్కూలుకు వెళ్లి చదువుకునేలా చూడటం, ఏ రకం పని బాగా చేయగలుగుతారో గుర్తించి దానికి సంబంధించిన వృత్తుల్లో కుదురుకునేలా చూడటం కూడా అవసరం.

good cholesterol,HDL - మంచి కొలెస్ట్రాల్‌ ,హెచ్‌డీఎల్‌


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మంచి కొలెస్ట్రాల్‌ ,హెచ్‌డీఎల్‌,good cholesterol,HDL- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు ఎక్కువ. అయితే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయులను పెంచుకోవటం ద్వారా ఈ ముప్పులను బాగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. రక్తంలో హెచ్‌డీఎల్‌ స్థాయి ఓ 5 ఎంజీ/డీఎల్‌ పెరిగినా గుండె జబ్బులు, పక్షవాతం కారణంగా ఆసుపత్రి పాలు కావటమనేది 4% తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. మరోవైపు ఈ హెచ్‌డీఎల్‌- 6.5 ఎంజీ/డీఎల్‌ తగ్గితే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే ముప్పు 11% పెరుగుతోందని వెల్లడైంది. అంటే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుకోవటం అత్యుత్తమం, కనీసం అది తగ్గకుండా చూసుకోవటం అత్యవసరం. సాధారణంగా హెచ్‌డీఎల్‌ స్థాయి 40 ఎంజీ/డీఎల్‌ కన్నా ఎంత ఎక్కువుంటే అంత మంచిది. (ఈ విలువ ప్రయోగశాల, పరీక్షా విధానాలను బట్టి కాస్త అటూఇటూగా మారచ్చు) అయితే మధుమేహుల్లో చాలామందికి ఇది మామూలు స్థాయి కన్నా తక్కువగానే ఉంటోంది. హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ మోతాదును పెంచేందుకు కొన్ని మందులున్నా వాటి సమర్థత ఏపాటిదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. నిత్యం తప్పనిసరి వ్యాయామం, రోజూ కొంతసేపు ఎండలో గడపటం, పొగ మానెయ్యటం, బరువు తగ్గటం వంటి జీవనశైలీ మార్పులు మంచి కొలెస్ట్రాల్‌ పెరగటానికి దోహదం చేస్తాయి. ఇవే జాగ్రత్తలు.. గుండె జబ్బులు దరిజేరకుండానూ చూస్తాయి. కాబట్టి హెచ్‌డీఎల్‌ స్థాయులను పెంచుకోవటానికి ప్రయత్నించటం అన్ని విధాలా శ్రేయస్కరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.

కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?

టోటల్ కొలెస్టిరాల్ :

* 200 మి.గా% వరకు -- మంచిది .
* 200 - 239 %--కొంతవరకు రిష్క్ ,
* 240 - కంటే ఎక్కువ % -- హై రిష్క్ ,

LDL :


* 100 లోపు -- మంచిది ,
* 100-129 --- ఉండవచ్చును ,
* 130-159---కొంతవరకు రిష్క్ ,
* 160-- అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,

HDL :


* 50 మి.గ్రా% -- మంచిది ,
* 50- 35 -------కొద్దిక రిష్క్ ,
* 35 -- తక్కువ - హై రిష్క్ .... ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .