Sunday, 3 April 2016

How do we breath? - మన శ్వాస ఎలా జరుగుతుంది ?

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము . జీవన మనుగడలో ముఖ్యమైనది ఆరోగ్యము . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మనం ఎలా శ్వాసిస్తున్నాం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

                     

మన శ్వాస ఎలా జరుగుతుంది ?...మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌, లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌, రెస్పిరేటరీ బ్రాంకియోల్‌, ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి.ఇక్కడ ఆక్షిజన్‌ , కార్బన్‌ డైయాక్షైడ్ మార్పిడి జరుగుతుంది . 

ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

-దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు, గాలి, ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న పిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు, ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితిత్తి పరిమాణం 45 శాతం ఉంటుంది.

Post-delivery Precautions - ప్రసవం తర్వాత జాగ్రత్తలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇక్కడ ఇప్పుడు -ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు (placenta)బయటకు రావడం.
చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ అంటారు.

ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నెన్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్‌ డిశ్చార్జ్‌ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.

ఇన్‌ఫెక్షన్‌ల నివారణ, చికిత్సలు...:
మహిళల్లో కాన్పు తర్వాత ఇన్‌ఫెక్షన్‌ల నివారణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గర్బం ధరించినప్పుడు రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్‌లను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్లు రక్తం తక్కువగా ఉన్నవారికి, బిపి ఉన్న వారికి అవసరమైన చికిత్సలు చేస్తారు. ప్రసవానికి ముందు పళ్లలో, చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, ట్రాన్సిల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకో వాలి. బిపి, షుగర్‌, టిబి, మలేరియా, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వెంటనే వైద్యం చేయించుకోవాలి. డెలివరీ సమయంలో వాటర్‌ లీక్‌ అవుతుందని తెలిస్తే డాక్టర్లు ముందే ట్రీట్‌మెంట్‌చేస్తారు.

-గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్‌, పల్స్‌ చెకప్‌, బిపి, లీవర్‌, లంగ్స్‌ చెకప్‌ చేస్తారు. గర్భం తర్వాత స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్‌, సర్విక్స్‌ నుంచి యూరిన్‌, బ్లడ్‌ టోటల్‌ కౌంట్‌, డిఫరెన్షియల్‌ కౌంట్‌ను డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్‌ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబ యాటిక్స్‌ను అందిస్తారు.

ఇక డెలివరీ జరిగే గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకో వాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించవచ్చు. డెలివరీకి ముందు లోపల తక్కువగా పరీక్షలు చేయడం మంచిది. స్టెరైల్‌ కండీషన్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశు భ్రతను పాటిం చాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు లోకల్‌పార్ట్స్‌ను ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్‌ మందులను వాడాలి. స్టెరైల్‌ ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. బాగా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే విడిగా ఉండే గది లో విశ్రాంతితీసుకోవాలి. మాయముక్కలను శుభ్రం చేయాలి.

యూరినరీ సమస్యలు...:
-కాన్పు తర్వాత కొందరు మహిళలకు యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకోవాలి. ఈ మహిళలు మంచినీటిని బాగా తాగాలి. ఇటువంటి వారు మూత్ర విసర్జనను ఆపుకోకూడదు. వీరికి మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి రావచ్చు. యూరిన్‌ బ్లాడర్‌లో వాపు కూడా రావచ్చు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడానికి ఓవర్‌ ఫ్లో, వెజినల్‌ డ్యామేజీ కారణం కావచ్చు. దగ్గినప్పుడు నొప్పి రావచ్చు. కొన్నిసార్లు యూరిన్‌ ఔట్‌పుట్‌ తక్కువగా ఉండవచ్చు.

బ్రెస్ట్‌ సమస్యలు...:
ప్రసవం తర్వాత కొందరు మహిళ లకు బ్రెస్ట్‌ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్‌లో నొప్పులు ఏర్పడతాయి. ఇటువంటి వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి. బ్రెస్ట్‌లలో నొప్పి ఎక్కువగా ఉండే పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బ్రెస్ట్‌ చుట్టూ అల్సర్లు ఏర్పడి నొప్పి రావచ్చు. దీనివల్ల శిశువుకు పాలిచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఇటువంటివారికి బ్రెస్ట్‌ నొప్పి నివారణకు క్రీమ్‌ రాసుకోవడం, పెయిన్‌ కిల్లర్‌ మందులను వాడాల్సి ఉంటుంది. అల్సర్‌లు ఎక్కువగా రోజులు ఉంటే క్యాన్సర్‌ పరీక్షలు సైతం చేసుకోవాలి.

బ్రెస్ట్‌ సమస్యల్లో అక్యూర్డ్‌ మాస్‌టైటిస్‌ ఒకటి. దీని వల్ల ఒళ్లు నొప్పులు, బ్రెస్ట్‌ ఎర్రగా కావడం, ముట్టుకుంటే నొప్పి కలగడం జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పడే రిట్రాచ్‌ నిప్పల్‌, క్రాక్‌ నిప్పల్‌ సమస్యలు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ల చేత వైద్యం చేయించుకోవాలి. వీరికి యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. కొందరు మహిళలకు బ్రెస్ట్‌లో పాలు గడ్డ కట్టడం సంభవిస్తుంది.

-ఇటువంటి వారికి ఎక్స్‌ట్రా మిల్క్‌ను ఎప్పటి కప్పుడు తీసేయాలి. కొందరు బ్రెస్ట్‌ సమస్యల వల్ల పాలు తక్కు వగా వస్తాయి. హై ఫీవర్‌ ఉంటుంది. బిపి ఉన్నవాళ్లు, రక్తం తక్కువగా ఉన్నవాళ్లు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు, డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లకి బ్రెస్ట్‌ సమస్యలు ఏర్పడతాయి. పాలు రానివారికి, తక్కువగా వస్తున్నవారికి సైకలాజికల్‌గా వారిని ప్రిపేర్‌ చే యాలి. శిశువును ఎల్లప్పుడు తల్లి పక్కనే ఉంచడం మంచిది. తల్లికి పాల సమస్య ఉంటే సరైన పోషకాహారం, విశ్రాంతి అవసరమన్న విషయం గమనించాలి. ఇక పాలు ఎక్కువ రావడానికి ప్రత్యేకంగా ఎటువంటి మందులు లేవన్న విషయం తెలుసుకోవాలి.

సబ్‌ ఇన్‌వల్యూషన్‌...:
డెలివరీ తర్వాత గర్భాశయం సరిగా ముడుచుకోకపోవ డాన్ని సబ్‌ ఇన్‌వల్యూషన్‌ అంటారు. ఇటువంటి వారికి బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపు నొప్పి రావడం, బ్లీడింగ్‌ రంగు మారి వాసనరావచ్చు. ఇటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా డెలివరీలు జరిగినవారికి, సిజేరియన్‌ అయిన వాళ్లకు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవాళ్లకి ఏర్పడుతుంది. యుటెరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది.

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోవడం...:

కాళ్ల నరాల్లో, పెల్విక్‌ నరాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టుకుపోతుంది. నరాల నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్‌ ఉన్నవాళ్లకి ఈ సమస్య ఏర్పడుతుంది. వీరు యాంటిబయాటిక్స్‌ తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. కొన్నిసార్లు కాళ్ల నరాల మీద వత్తిడి పడి నొప్పులు రావచ్చు. డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ కావడం, షాక్‌కు గురవ్వడం, ఫిట్స్‌ రావడం, లంగ్స్‌లో సమస్యల వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇటువంటి వారు గైనకాలజిస్ట్‌ చేత వెంటనే వైద్యం చేయించుకోవాలి. వీరు రెగ్యులర్‌గా పోస్ట్‌నాటల్‌ ఎక్సర్‌సైజులు చేయా లి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉన్న ప్పుడు, డిశ్చార్జి అవుతు న్నప్పుడు వెంటనే చెకప్‌చే యించుకోవాలి.

hernia - హెర్నియా




  • హెర్నియా అంటే ఏమిటి? : 
  •  మనశరీరములో వివిధ భాగాలు నిర్ధిష్ట స్థానాలలో స్థిరముగా ఉండేలా చూసేవి కండరాలు గజ్జల్లో కాని, ఉదరంలో కాని కండరాలు బలహీనపడినప్పుడు, కడుపు లోని కొవ్వు, ప్రేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే "ఉబ్బు"ను గిలక లేదా హెర్నియా (Hernia) అంటాము. కారు లేదా బైక్‌ టైర్‌ పంచర్‌ అయినప్పుడు లేదా దెబ్బ తిన్నప్పుడు ట్యూబ్‌ ఆ ప్రాంతంలో ఉబికి వచ్చినట్లుగా ఉంటుం ది. హెర్నియాలో ఇలాగే జరుగుతుంది. ఏ వయస్సు వారికై నా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాంటపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదట్లో నొప్పి ఉన్నట్లు అనిపించక పోయినా ఆ తర్వాత సమస్య మరింత జటిలమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించాలి.

హెర్నియా పలు రకాలు:
* 1. గజ్జల్లో వచ్చే హెర్నియా (Inguinal Hernia)
* 2. తొడ లోపలి భాగంలో వచ్చే హెర్నియా (Femoral Hernia)
* 3. ఉదర పైభాగంలో వచ్చే హెర్నియా (Epigastric Hernia, Umbilical Hernia, Para-Umbilical Hernia)
* 4. శస్త్రచికిత్స ఐన తరువాత, కొంత కాలానికి, శస్త్రచికిత్సజరిగిన చోట ఏర్పడే హెర్నియా (Postoperative Incisional Hernia)

వ్యాధి లక్షణాలు:
1. దగ్గినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు "ఉబ్బు" కనబడుతుంది. చేతితో ఒత్తితే "ఉబ్బు"తిరిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2. ఒక్కోసారి కడుపులోని ప్రేగులు అక్కడే చిక్కుకొని, తిరిగి కడుపు లోనికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు రోగికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలవవచ్చు. దీనిని Strangulated Hernia అంటారు. ఇది ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే రోగికి ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి వస్తుంది ఈ వ్యాధి ?

1. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలో-వృత్తి రీత్యా , కూలీలు, హమాలీలు, రైతులు వగైరా. 2. మద్యపానం చేసేవారిలో, కొందరికి కండరాలు పలచబడుతాయి. 3. వృద్ధుల్లో. 4. ఊబకాయం గలవారికి. 5. పుట్టుకతోనే కొందరికి కండరాలు బలహీనంగా ఉండొచ్చు. వారిలో. 6. ఆపరేషన్ చేయించుకొన్న వారిలో, ముఖ్యంగా Cessarian, Tubectomy, Appendicectomy మొదలైనవి.(అంటే ప్రతి ఒక్కరికీ రావాలని ఏమీలేదు.)


వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
ఏమీ లేవు. వైద్యుడు కళ్ళతో చూసి, చేతితో పరీక్షించి, రోగ నిర్ధారణ చేస్తాడు. 

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

హెర్నియా ఎందువల్ల వస్తుంది?
పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

హెర్నియా ఏర్పడిన తరువాత ఏం జరుగుతుంది?
హెర్నియా ఏర్పడితే దాన్ని తొలగించేందుకు ఆపరేషన్‌ మినహా మరో మార్గం లేదు. హెర్నియా ఏదీ దానంతదే తగ్గదు. కాలం గడుస్తున్న కొద్దీ మానిపోదు. ఏ రకం హెర్నియా అయినా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇతరత్రా తీవ్ర సమస్యలూ తలెత్తవచ్చు.

హెర్నియాతో ఎలాంటి సమస్యలు రావచ్చు?
నిరంతరాయంగా తీవ్రమైన నొప్పి, వాపు, తీపు ఉండవచ్చు. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలే. సర్జరీ ద్వారా హెర్నియాను తొలగించుకోవచ్చు.

హెర్నియాను నయం చేయడమెలా?
లోకల్‌ అనస్తేషియా ఇచ్చి మూడు, నాలుగు అంగుళాల గాటు చేయడం ద్వారా సర్జరీ చేస్తారు. పేషెంట్‌ 5 రోజుల్లోఇంటికి వెళ్ళవచ్చు. లాప్రోస్కోప్‌ ద్వారా కూడా ఇది చేయవచ్చు. దీనికి జనరల్‌ అనస్త్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్‌ మరుసటి రోజు ఇంటికి వెళ్ళవచ్చు.

హెర్నియా సర్జరీతో ఇతర దుష్ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఏవైనా ఉంటాయా?
ఏ ఆపరేషన్‌కైనా ఇతర దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. హెర్నియా కూడా ఇతర సాధారణ ఆపరేషన్‌ లాంటిదే. దీనిలో వాటిల్లే సమస్య లు మాత్రం చాలా తక్కువ, మరీ ముఖ్యంగా లోకల్‌ అనస్తీషియా ఇచ్చి చేసినప్పుడు.

Unani medicine - యునాని వైద్యం



యునానితో... అన్ని వ్యాధులు నయం

-యునాని అనేది ఒక దేశం పేరు. ప్రస్తుతం ఆ దేశాన్ని గ్రీకుగా పిలుస్తు న్నారు. చాలా సంవత్సరాల క్రితం మనిషికి సంబంధించిన వైద్యం, విద్య ఇలా ప్రతి ఒక్కటి గ్రీకు నుంచే మొదలయ్యాయి. యునానీ (Unani) అన్న మాట "అయోనియా" అన్న గ్రీకు మాట లోంచి వచ్చింది. 'అయోనియా' గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు హకీమ్ బిన్ సీనా (అవిసెన్నా). హకీం అంటేనే వైద్యుడు. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ భారతదేశం లో బహుళ ప్రచారంలో ఉంది. గ్రీస్ దేశాన్ని సెంట్రల్ ఆసియా లోని ఇతర ప్రాంతాలన్ని 'యునాన్' అని పిలిచేవి. ఈ వైద్య ప్రక్రియ గ్రీస్ లో మొదలైంది కాబట్టి దీన్ని యునాని వైద్యం అనేవాళ్ళు. మాయలూ, మంత్రాల నుండి వైద్యాన్ని వేరు చేసి ఒక శాస్త్రంగా చెప్పిన 'హిప్పొక్రెటస్'(క్రీ.పూ377-460) ఈ యునాని వైద్య ప్రక్రియకు పితామహుడు. ఈ వైద్య ప్రక్రియను ఈజిప్టు, సిరియా, ఇరాక్, పర్షియా, భారత్, చైనా దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలు జోడించి మరింత సుసంపన్నం చేసాక, అరబ్బులు ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసారు. అందువల్ల దీన్ని గ్రీకో-అరబ్ మెడిసిన్ అంటారు. ఈవైద్య ప్రక్రియ భారత్ కు వచ్చాక ఇక్కడి రాజవంశస్తులు అయిన ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొఘల్ చక్రవర్తులూ ఆదరించారు. రాజ వంశాల ఆదరణ తో 17 వ శతాబ్దం వరకూ యునానీ వైద్యం అభివృద్ధి చెందినా, బ్రిటిష్ వారి పాలన లో దీనికి పూర్తిగా ఆదరణ తక్కువయింది.

                           
సిద్ధాంతాలు:

మనిషిలో నాలుగు విధాలైన ద్రవాలుంటాయి. ఖూన్ (రక్తం), బల్గం (తెమడ లేదా కఫం), సఫ్రా (ఎల్లో బైల్), సౌదా (బ్లాక్ బైల్). ఈ నాలుగు రకాల ద్రవాల మధ్య సమన్వయం ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లేనని యునాని వైద్యం చెబుతుంది. ఈ నాలుగు ద్రవాలను హ్యూమర్స్ అంటారు కాబట్టి దీన్ని హ్యూమరల్ థియరీ అంటారు. పై నాలుగు ద్రవాలు సమన్వయంగా ఉండటానికి ఓ శక్తి (వైటల్ ఫోర్స్) తోడ్పడుతుంది. శరీరానికి అవసరపడే ఆ శక్తిని ఖువ్వతే ముదబ్బిరే బదన్ అంటారు. ఈ శక్తి కి విఘాతం కలిగినా మనిషిలో హ్యూమరల్ ద్రవాల సమన్వయం దెబ్బతిన్నా, ఆ వ్యక్తికి జబ్బు వస్తుంది. ఇక్కడ మరో సిద్దాంతము కూడా ఉంది. మనిషిలోని ఈ నాలుగు ద్రవాలకు వేరు వేరు స్వభావాలుంటాయి. రక్తం వేడిగా ఉంటుంది, తెమడ చల్లగా ఉంటుంది, సఫ్రా (పైత్య రసం) వేడిగా పోడిగా ఉంటుంది, సౌదా(బ్లాక్ బైల్) చల్లగా ఉంటుంది. ఈద్రవాల స్వభావాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలు వేరుగా ఉంటాయి. దాన్ని బట్టే సైనసైటిస్, న్యుమోనియా వంటి చల్లటి స్వభావం గల జబ్బులు, మూల శంక, టైఫాయిడ్ వంటి వేడి స్వభావమున్న జబ్బులు వస్తాయి. ఈ సిద్ధాంతాన్ని టెంపర్మేంట్ థియరీ అంటారు. 'హ్యూమరల్ థియరీ', 'ఇమ్యూనిటీ థియరీ', 'టెంపర్ మెంటల్ థియరీ' ఆధారంగా జబ్బు లక్షణాలపై వ్యతిరేకంగా పనిచేసి రోగాన్ని మూలాలనుండి పెరికి వేస్తుందీ 'యునానీ వైద్యం' అంటారు .

వ్యాధి నిర్ధారణ:
యునానీ వైద్యంలో ప్రధానంగా నాడీ(నబ్జ్) చూసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తరువాత మూత్ర పరీక్ష (బవుల్), మల పరీక్ష (బరాజ్). రకరకాలైన యంత్ర పరీక్షలు లేకుండా కేవలం నాడీ, మూత్ర, మల పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.
చికిత్స విధానాలు

యునానీ వైద్యంలో నాలుగు రకాలుగా చికిత్స చేస్తారు:
* మొదటిది : (ఇలాజ్ బిద్ తద్బీర్), అంటే ఎలాంటీ మందులు ఇవ్వకుండా కేవలం భౌతిక పరిస్థితుల మార్పు ద్వారా వైద్యం చేయడం.
* రండవ రకం : (ఇలాజ్ బిల్ గిజా) ఇది ఆహారంతో చేస్తారు.
* మూడవ రకం : మందులతో వైద్యంచేస్తారు. ఈ మందుల తయారీ లో వనమూలికలు, జంతువుల నుండి సేకరించిన పధార్థాలు, ఖనిజాలు ఉపయోగిస్తారు.
* నాలుగో రకం : (ఇలాజ్ బిల్ జరాహత్) అవసరమైనప్పుడు శస్త్ర చికిత్స. యునానీ లో శస్త్ర చికిత్స ప్రవేశ పెట్టింది "రేజస్" కాబట్టి ఆయన్ను ఫాదర్ ఆఫ్ సర్జరీ గా అభివర్ణిస్తారు.


ఈ వైద్యం హిపోక్రటీస్ ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం(yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, గాలి)చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ ఇస్లాంకీ ఉంది.యునానీ మందులని తేనెతో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన ముత్యాలు, బంగారం కూడ యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.

వైద్యానికి తండ్రిగా పిలవబడే హెప్సోక్రేట్‌ (బొక్రాత్‌) చాలా రకాల రోగాల గురించి కనుక్కొన్నారు. అవి క్లినికల్‌ పిక్చర్స్‌, సిమ్‌టమ్స్‌,వీటికి సంబంధించిన సైంటిఫిక్‌ యునాని వైద్యం. ఈ ఆధునిక కాలంలో వైద్య రంగంలో అన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆధునిక వైద్యంలో 50 శాతం రోగాలకు పూర్తిగా వైద్యం లేదు.

మనం జీవితాంతం ఆ మందులు వాడినా వ్యాధులు తగ్గకుండా కొంతకాలానికి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ మందులని మనం వాడకుండా ఉండలేకపోతున్నాము. దీనికి కారణం ఈ కాలపు బిజీ జీవితాలలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, ఇంకా మనకు ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి శ్రేష్ఠమో తెలీదు. ఒకవేళ తెలిసినా ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు మనకు రసాయనాలు కలపి రావటం వల్ల మనకు చాలా విటమిన్ల లోపాలు కలుగుతున్నాయి.

ప్రత్యేక వన మూలికలతో వైద్యం...:కొన్ని రోగాలకు ఇంగ్లీష్‌ వైద్యంలో పూర్తిగా వైద్యం లేదు. కానీ అన్ని రకాల వ్యాధులకు యునాని మందులు ఉన్నాయి. ఈ మందులతో ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవు.

యునాని వైద్యంతో ఈ క్రింది వ్యాధులను నయం చేయవచ్చు:
* రకరకాల గుండె జబ్బులు.
* రక్తంలో క్రొవ్వు పదార్థాలు పెరగటం.
* అన్ని రకాల పక్షవాతములు.
* దమ్ము రోగం(ఎలర్జీ).
* డయాబెటిస్‌.
* 12 రకాల కీళ్ల వ్యాధులు .
* క్యాల్షియం తగ్గడం వల్ల ఎముకలు బలహీ నపడటం.
* లైంగిక వ్యాధులు .
* పిల్లలు పుట్టకపోవడం.
* హెచ్‌ఐవి.
* సౌందర్యం కొరకు- కలర్‌ ఫెయిర్‌నెస్‌, బ్యూటీ కేర్‌.
* చర్మానికి సంబంధించిన వ్యాధులు : మొటిమలు రావటం, స్కిన్‌ఎలర్జీ, జటు ్టరాల టం, చుండ్రు, చర్మ వ్యాధులు.
* మూత్ర పిండాల లో రాళ్లకు ఆపరేషన్‌ లేకుండా వైద్యం.
* కాలేయానికి సంబంధించిన వ్యాధు లుః హెపటైటిస్‌, పచ్చ కామర్లు, హై బ్లడ్‌ ప్రెషర్‌.
* అర్షమొలలు.

Knee replacement surgery - మోకాళ్లలో కీలు మార్పిడి విధానం



ఎక్స్‌రే రిపోర్టులో కీళ్ల మధ్య ఉండే ఖళీ బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తే ఇదిది మూడో దశకు సూచిక అవుతుంది. ఒకప్పుడైతే ఈ సమస్యకు ఆస్టియాటమీ అనే శస్త్ర చికిత్స చేసేవారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తాత్కాలికంగానే ఉండేవి. కానీ, అధునికంగా వచ్చిన మోకాలి కీలు మార్పిడి చికిత్స మాత్రం అత్యంత ప్రామాణికమైనది. ఈ శస్త్ర చికిత్సలు 98 శాతం దాకా విజయవంతం అవుతున్నాయి. మిగతా రెండు శాతం ఇన్‌ఫెక్షన్ల కారణంగా గానీ, కీలు వదులైపోవడం వల్లగానీ ఏదైనా ఇబ్బంది రావచ్చు. అయితే వాటిని కూడా ఆ తరువాత సరిచేసే వీలుంటుంది. ఈ కృత్రిమ కీలును అమరుస్తాం. ఇది 15 ఏళ్ళకు పైగానే మన్నుతుంది.

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

అందువల్ల ఎముకల మధ్య ఒరిపిడి తగ్గి అవి ఎక్కువ కాలం అంటే సుమారు 15 నుంచి 20 ఏళ్ల దాకా మన్నుతున్నాయి. అందుకే ప్రమాదాల్లో గానీ, ఇతర కారణాలతో గానీ చిన్న వయసులోనే మోకాలి కీళ్ళు దెబ్బతిన్న వారికి కూడా వీటిని అమర్చడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. ఫిజియోథెరపీలో వచ్చిన కొత్త నైపుణ్యాల వల్ల కండరాలు త్వరగా బలపడి చాలా వేగంగా కోలుకునే స్థితి ఏర్పడింది. ఒకప్పుడు రెండు మోకాళ్లలోనూ కీలుమార్పిడి అవసరమైతే ముందు ఒక కాలుకు మాత్రమే చేసి కొన్ని నెలల తరువాత ఆ రెండవ కాలుకు చేసే వాళ్లం. ఇప్పుడు అదేమీ లేదు. ఒకేరోజు ఒకే సమయంలో రెండు కాళ్లకూ చేయడం సాధ్యమవుతోంది.


                           
అపోహలు:
కీలు మార్పిడి చికిత్స చేసుకున్న తరువాత నెలల తరబడి మంచం మీదే పడి ఉండవలసి ఉంటుందన్న భావన చాలా మందిలో ఉంది. నిజానికి ఆ వ్యక్తిని శస్త్ర చికిత్స జరిగిన మూడవ రోజే నడిపిస్తాం.

శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్‌ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.

శస్త్ర చికిత్స తరువాత భరించలేని నొప్పి వస్తుందేమోనని కొందరు భయపడుతూ ఉంటారు. కానీ, ఇటీవల వచ్చిన కొన్ని కొత్త రకాల మాత్రలు, ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు ఆ నొప్పి చాలా తక్కువగా ఉంటోంది.

పాటించాల్సిన జాగ్రత్తలు:
శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం

Some Hints for reduction of overweight - బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


- వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు ...

వ్యాయామ పద్ధతి:
                        
వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నిద్రలేమీ కారణమే:
                             
నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆరోగ్య సమస్యలతో:
                          
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగటానికి బీజం వేస్తుంది. అధిక బరువు గలవారు నిపుణులతో థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే తగు చికిత్స తీసుకోవాలి.

మితాహారం మేలు:
                      
బరువు తగ్గకపోవటానికి ఎక్కువగా తినటమూ ఒక కారణమే. అందువల్ల మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడి ముప్పు:
                         
అధిక బరువు, ఒత్తిడి ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిజోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది ఆకలి పెరగటానికే కాదు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికీ దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

క్రమం తప్పరాదు:
                         
వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

మద్యానికి దూరం:
                           

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

తిండి మానేస్తే చేటు:
బరువు తగ్గటానికి చాలామంది మధ్యమధ్యలో తిండి తినటం మానేస్తుంటారు. దీనివల్ల కీడే ఎక్కువ. ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవటానికి కండరాలు క్షీణించటం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకి 5-6 సార్లు తినటం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజుని ప్రారంభించటం మేలు.

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవగాహనాలేమితో చేసే పొరబాట్లతో మరింత బరువు పెరుగుతాం. వాస్తవాలు తెలుసుకుని సరైన నియమాలు పాటించగలగాలి.

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

బరువు పెరగడమనేది కుటుంబచరిత్రలోనే ఉందని తేలిగ్గా తీసుకుంటారు కొందరు. కానీ మనసు పెడితే సన్నగా మారడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి. తీసుకునే కెలొరీలను గమనించుకుంటూ.. వాటిని ఖర్చుచేసేందుకు సరైన వ్యాయామం చేయాలి. శరీరానికి శక్తినందిస్తూ.. అదేసమయంలో తక్కువ కెలొరీలనిచ్చే పదార్థాలను తీసుకోవడం కూడా సులువుగా బరువు తగ్గగలుగుతాం.

అతి ఎప్పుడూ అనర్థమే అవుతుంది. సన్నగా మారే క్రమంలో మితిమీరి పాటించే కొన్ని నియమాల వల్ల లాభం కన్నా ఇతర సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమతులాహారానికి ప్రాధాన్యం ఇస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అతిగా వ్యాయామం చేయడం కూడా సరికాదు. రోజులో ఓ గంటన్నరకు మించి వ్యాయామం చేయకూడదు.

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.

బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వేళపట్టున భోంచేయాలి. ప్రతి రెండుగంటలకోసారి కొద్దికొద్దిగా తినాలి. వేళపట్టున నిద్రపోవడం వల్ల కూడా స్థూలకాయం బాధించదని ఓ అధ్యయనం పేర్కొంటోంది. కాబట్టి రాత్రిళ్లు త్వరగా భోంచేసి రెండు గంటల తరవాత నిద్రపోవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవాలి.

ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. త్వరగా జీర్ణమవుతాయి. అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. బాగా నమిలి తినడం, మంచినీళ్లు ఎక్కువగా తాగడం, మిఠాయిలను మితంగాతినడం వంటి జాగ్రత్తలను పాటించడం ఎంతయినా మంచిది.

బరువుకు సర్జరీ:బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ వ్యాయామం చేయాలన్నా, ఆహార నియమాలు పాటించాలన్నా కొందరు ఇష్టపడరు. చికిత్స పద్ధతులతో సన్నబడాలని కోరుకుంటారు. ఇలాంటివారికి సర్జరీ అవకాశముంది కానీ ఇది పెద్ద ప్రక్రియ. దీంతో బరువు గణనీయంగా తగ్గినప్పటికీ.. అది కొనసాగాలంటే మాత్రం ఆహార నియమాలు పాటించటంతో పాటు వ్యాయామమూ కచ్చితంగా చేయాల్సిందే. బరువు తగ్గటానికి కొన్ని మందులూ లేకపోలేదు. వీటిల్లో కొన్ని ఆకలిని తగ్గించేవైతే.. మరికొన్ని కొవ్వు జీర్ణం కాకుండా చేసేవి. వీటిని కూడా ఆపకుండా వేసుకోవటం తగదు. దుష్ప్రభావాలూ ఉంటాయి. ఆహారం, వ్యాయామంతో వాటిని పూడ్చుకోవాల్సీ ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం తప్పదు. తేలికైన మరో దగ్గరి మార్గమేదీ లేదు.

బరువు తగ్గడములో పండ్ల ఉపయోగము:కొందరు బరువు తగ్గటం కోసం మిగతా ఆహారం మానేసి రోజంతా కేవలం పండ్లు, కూరగాయలే తింటుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు, కూరగాయలు ఒకేవిధంగా ఉండవు. కొన్ని పండ్లలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే.. కొన్ని కూరగాయల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, బ్రకోలీ, పుట్టగొడుగుల వంటి వాటిల్లో పిండి పదార్థం తక్కువ. ఇలాంటివాటిని కాస్త ఎక్కువగా తిన్నా ఇబ్బందేమీ ఉండదు. అయితే పిండి పదార్థం ఎక్కువగా ఉండే బఠాణీలు, మొక్కజొన్న, బంగాళాదుంప వంటి వాటిని పరిమితంగానే తీసుకోవాలి. పండ్లలో విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నమాట నిజమే కావొచ్చు. వాటితో పాటు సహజ చక్కెర కూడా ఉంటుందని మరవరాదు. ముఖ్యంగా మామిడి, యాపిల్‌, ద్రాక్ష వంటి పండ్లలో చక్కెర ఎక్కువ. ఇవి కేలరీల మోతాదు పెరగటానికి దోహదం చేస్తాయి. అందువల్ల అదేపనిగా పండ్లు, పండ్ల రసాలనే తీసుకుంటే బరువు తగ్గటం అటుంచి పెరిగే ప్రమాదముంది.


శరీరంలో అధిక బరువు, పొట్ట అందానికి ఆరోగ్యానికి సమస్యాత్మకంగా మారుతాయి. ఇవి ఆత్మ న్యూనతకి గురిచేసి అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అధిక బరువు లావు పొట్ట వల్ల గురక నుంచి గుండె జబ్బుల వరకు బీపీ నుంచి షుగర్ వరకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. బరువు తగ్గించుకోవడం కష్టం, కొవ్వు తగ్గించుకోవడం మరింత కష్టం. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానంతో ఇది సులభతరంగా మారింది.

కారణాలు:అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు.

సమస్యలు:అధిక బరువు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి డయాబెటిస్, గుండె సమస్యలు, రక్త పోటు, కీళ్ల నొప్పులు, స్త్రీలలో క్రమం తప్పిన నెలసరి, అవాంచిత రోమాలు, మెడమీద నుదుటి మీద పిగ్మెం సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఆయాసం, ముఖం మీద కాక వీపు మీద కూడా మొటిమలు వస్తాయి.

చికిత్స:బీసీఏ (బాడీ కాంపోజిషన్ ఎనలైజర్)--
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి మొదట  బాడీ కంపోజేషన్ ఎనలైజర్ ద్వారా ఎనాలిసిస్ చేసి మీ ఆహారపు అలవాట్లు సమీక్షించి, మీరు బరువు పెరగటానికి కారణం గుర్తిస్తారు. కన్సల్టేషన్‌లో వీటి మీద ఒక అవగాహన వచ్చి, మీ శరీర సహకారం అంచనా వేసి మీరు ఎన్ని సిట్టింగ్స్ అవసరం అని నిర్ణయిస్తారు.

నాన్‌సర్జికల్ లైపోకేవి:ఈ నాన్ సర్జికల్ లైపోకేవి చికిత్సా విధానం చాలా సులభతరం ఎలాంటి నొప్పి, రంధ్రం చేయడం కుట్టు వేయడం లాంటివి జరగవు. మీ శరీర పై భాగం నుంచి తక్కువ ప్రీక్వెన్సీ కలిగిన అల్ట్రాసోనిక్ తరంగాలు పంపించడం ద్వారా శరీరంలోని కొవ్వును తొలగించడం జరుగుతుంది. ఈ చికిత్సా విధానం వారానికి రెండు సిట్టింగులు అవసరం ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్ ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం ఉండదు.  క్లినిక్‌లో అడ్మిట్ అవటం కానీ మందులు, పొడులు ఇవ్వడం జరగదు. ఈ చికిత్స తీసుకోవడానికి పేషెంట్‌కు మరొకరి అవసరం ఉండదు. ఎటువంటి రెస్ట్ కూడా అవసరం ఉండదు. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ సిట్టింగులు అవసరం పడతాయి. కొవ్వు తక్కువ, నీరు ఎక్కువగా ఉన్న వారు తక్కువ సిట్టింగులతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చికిత్సా విధానంలో 5 నుంచి 20 కేజీల వరకు బరువు తగ్గవచ్చు.

ఆర్‌ఎఫ్ (రేడియో ఫ్రీక్వెన్సీ):నాన్ సర్జికల్ లైపోకేవి ద్వారా కొవ్వు తగ్గడం వల్ల చర్మం వదులుగా అవుతుంది. అలా సాగిన చర్మం మళ్లీ బిగుతు కావాలంటే ఆర్‌ఎఫ్ మిషన్ ద్వారా అది సాధ్యమవుతుంది. చాలా మందికి చేతులు, పొట్ట తొడలు, గడ్డం కింద చర్మం వదులుగా ఉండి ఊగుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ పెరుగుదలకు అనుగుణంగా పొట్ట సాగుతుంది. కానీ ప్రసవం తర్వాత కొంత మందిలో ఈచర్మం మునపటి స్థితికి చేరుకోదు. అలాంటి వారికి ఈ చికిత్స ఒక వరమని చెప్పవచ్చు.

Precautions in Rainy season - వర్షాకాలంలో జాగ్రత్తలు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వర్షాకాలంలో జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...Add Image

వానాకాలం గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉడడంతో చర్మం తడిగా ఉండి ఫంగల్‌ ఇన్‌ఫెక్షెన్లు త్వరగా వచ్చే ఆస్కారం ఎక్కువ. ముఖ్యంగా అరిచేతులకు, అరికాళ్ళకు ఇన్‌ఫెక్షన్‌ త్వరగా వస్తుంది. వర్షంలో తడిసినవెంటనే తల తుడుచుకుంటే సరిపోతుందనేది చాలామంది అభిప్రాయం. అలాగే చేస్తారు కూడా. కానీ అదే పొరపాటు. వర్షపునీటిలో ఉండే లెడ్‌, ఆర్సెనిక్‌ రసాయనాలు చర్మానికి, శిరోజాలకు హాని కలిగిస్తాయి కనుక తగినజాగ్రత్తలు పాటించాలి.

చర్మ సంరక్షణ:
వానలో తడిసిన తర్వాత కళ్ళను చల్లని నీటితో కడిగి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. స్నానానికి ముందు కాళ్లు, చేతులకు డెట్టాల్ సబ్బు రాసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుమూడుసార్లు చేయాలి.ఆడు వారు సున్నిపిండిలోనూ చిటికెడు పసుపు చేర్చి వాడాలి. నీటిలో వేపాకుల్ని వేసి మరగబెట్టి స్నానంచేసే నీటికి కలుపుకోవాలి. ఔషధగుణాలున్న సబ్బునే వాడాలి. టేబుల్‌ స్పూన్‌ పాలలో రెండు బాదం పలుకులు ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పొట్టుతీసి మెత్తగా చేయాలి.ఇందులో నాలుగు చుక్కల నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 25 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా 3 రోజులకు ఒకసారి చేస్తే 10 రోజులకల్లా చర్మంలో నిగారింపు వస్తుంది.

ఆహారం:
ఈ కాలంలో చాలామందిని జలుబు, దగ్గు, విరేచనాలు వేధిస్తాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను నివారించవచ్చు.
విటమిన్‌ సి సమృద్ధిగా లభించే పండ్లు, కూ రగాయలు తరచూ తినాలి. అర స్పూను మిరియాలు లేదా వాము పొడితో మొదటి అన్నం ముద్ద తినాలి. దీన్ని మధ్యాహ్న భోజనంలో తీసుకోవాలి. రోజులో ఒకసారి 4-6 వరకు పచ్చి వెల్లుల్లి రేకులను తినాలి. వారంలో కనీసం రెండు మూడుసార్లు కాకరకాయల్ని వేపుడు, కూర, పులుసు ఏ విధంగానైనా తప్పక వాడాలి. ఈ కాలంలో నిస్సత్తువుగా ఉంటుంది కనుక తరచూ లెమన్‌ టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ తాగాలి.కొత్తిమీర పుదీనాలను తరచుగా వాడుతుండాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించినట్లయితే వానాకాలంలో ఎలాంటి అనారోగ్యాలు దరిజేరవు.

Heart valvular diseases - గుండె కవాటాలకు వచ్చే సమస్యలు










గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... ట్రైకస్పిడ్‌ వాల్వ్‌, పల్మనరీ వాల్వ్‌, మైట్రల్‌ వాల్వ్‌, ఆయోర్టిక్‌ వాల్వ్‌.
ఇక ఈ నాలుగు కవాటాలలో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు.
1. వాల్వ్‌ సన్నబడడం (స్టెనోసిస్‌)
2. వాల్వ్‌ లీక్‌ కావడం (రీగర్జిటేషన్‌)

వాల్వ్‌ సమస్యలకు కారణాలు...:
- కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల...

- కొందరిలో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజెస్‌ వల్ల...

- మరికొందరిలో ఇవి పుట్టుకతోనే రావచ్చు(కొంజెనిటల్‌).

- కొందరిలో అవి వయసు పెరగడం వల్ల (డీజనరేటిల్‌) వచ్చే సమస్యలుగా రావచ్చు.

వాల్వ్‌ సమస్యలు...లక్షణాలు...:
- హార్ట్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయాసం.

- పొడి దగ్గు.

- పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం (నాక్టర్నల్‌ డిస్నియా).

- గుండె దడ (పాల్పిటేషన్స్‌).

- బలహీనంగా అయిపోవడం (వీక్‌నెస్‌).

- ఒక్కోసారి గుండెనొప్పి కూడా రావచ్చు.
ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన గుండె కవాటాన్ని బట్టి నిర్దిష్టంగానూ కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు...

- ట్రైకస్పిడ్‌ వాల్వ్‌ లీక్‌ (రీగర్జిటేషన్‌) సమస్యలో కాళ్లలో వాపు కనిపిస్తుంది.

- మైట్రల్‌ వాల్వ్‌ సన్నం (స్టెనోసిస్‌) అయితే రక్తపు వాంతులు కావచ్చు.

- అయోర్టిక్‌ వాల్వ్‌ సన్నం (స్టెనోసిస్‌) అయితే స్పృహ తప్పవచ్చు.

ట్రాన్స్‌ ఈపోఫీజియల్‌ కార్డియోగ్రామ్‌ ఒక వరం...
ఇప్పుడు ట్రాన్స్‌ ఈసోఫీజియల్‌ ఎకో కార్డియోగ్రామ్‌ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు.

వాల్వ్‌ సమస్యలకు చికిత్స ఇలా...:వాల్వ్‌ సమస్యలకు కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు.

- కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరం అవుతుంది.

- మైట్రాల్‌ వాల్వ్‌ సన్నగా మారడం (స్టెనోసిస్‌) అయితే అలాంటి రోగుల్లో బెలూన్‌ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు.


-అయితే మిగతా గుండె కవాటాలు సన్నగా మారినా లేదా లీక్‌ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ అన్నదే పరిష్కారం.
వాల్వ్‌ను రిప్లేస్‌ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్‌లను ఉపయోగించవచ్చు.
1.మెటల్‌ వాల్వ్‌
2.టిష్యు వాల్వ్‌

- మెకానికల్‌ వాల్వ్‌ (మెటల్‌ వాల్వ్‌)ను ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబరిచే మందుఎసిట్రోమ్‌ వాడాల్సి ఉంటుంది.

- ఒక టిష్యూ వాల్వ్‌లు అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్‌ను వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబర్చే మందు ఎసిట్రోమ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.

కవాటాలకు సరికొత్త చికిత్స ప్రక్రియలివే...:
ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్‌ చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను మార్చడం కన్న వాల్వ్‌ ఎప్పుడూ మెరుగైనది కావడం వల్ల ఇప్పుడు వైద్య నిపుణులు రిపేర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్‌ను రిపేర్‌ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్‌ (రక్తాన్ని పలుచబరిచే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్‌, ట్రైకస్పిడ్‌ వాల్వ్‌లు అయితే రిపేర్‌ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

Neck pain in human - మెడనొప్పి


ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం జీవనశైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నమయవుతుంది.
మెడ నుంచి భుజానికో, చేతుల చివర్లకో నొప్పి పాకు తూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మెడ నొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

మనం నిలబడే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్ళే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్తప్రసారంలో తేడా వచ్చి మెదడుకు రక్త ప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతు లు అవడం జరుగుతుంది.

మెడ దగ్గర ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ అని, రెండవ దానిని ఆక్సిస్‌ అని అంటారు. ఆ తర్వాత పూ సలను వరుసగా సర్వెకల్‌ 3,4,5,6,7 అంటారు. ఇవ న్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. ఈ సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ పారామినా నుండి ఒకకొక్క నరం బయటకు వస్తుం ది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది.

కారణాలు :

  • ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడడం వల్ల వస్తుంది.
  • స్పాంజి లేదా దూది ఎక్కువ ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం.
  • కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
  • ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం.
  • నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

పరీక్షలు :
ఎక్స్‌రే -స్కానింగ్‌: మెడనొప్పి వచ్చేవారికి ఎక్స్‌రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దీనిని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దానిని బట్టి పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైనా వచ్చి చేరాయా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత వత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల వచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ. పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంతమేరకు ఆ సమస్య ఉందో గమనించి దానికి చికిత్స చేస్తారు.

పర్సనల్‌ కేర్‌: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.

బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:
ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...

తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువ్ఞను మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.

కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి. టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు ...................... వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.


చింతాకుల ముద్ద మెడచుట్టూ నాలుగు నుండి ఐదురోజులు పట్టిస్తూ ఉంటే మెడనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది చిట్కా మాత్రమే. కొన్నిసార్లు మెడ దగ్గర చాలా ఎక్కువగా ఉండే లింఫ్‌గ్లాండ్స్‌ వాస్తే కూడా మెడనొప్పి వస్తుంది. మెడనరాలపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు నొప్పి చేతులు, భుజాలలోకి వ్యాపించడం జివ్ఞ్వమని లాగడం ఉంటుంది. ఛాతీలో ముందు వెనుకలకు కూడా వ్యాపించ వచ్చు.


కంటిదోషాల వల్ల కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిన వైద్యం చేయిస్తే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండ, వేడి, చలి వీటికి మెడ ఎక్స్‌పోజ్‌ చేయకూడదు. అలాచేస్తే మెడ కమిలి పోతుంది. నల్లబడుతుంది. మరీ ఎక్కువ ఆభర ణాలతో మెడను ఇబ్బంది పెడితే చర్మం ఒరుసుకు పోతుంది. బిరుసుగా అవ్ఞతుంది. ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్‌గా ఉండే నగలు ధరించడం మంచిది. ముఖంతో పాటు మెడను కూడా సబ్బుతో శుభ్రపరుస్తుండాలి.
గిల్ట్‌ నగలు ధరించినప్పుడు ఆయా నగల తయా రీలో ఉపయోగించిన మెటల్స్‌ పడక కొందరికి ఎలర్జీ వస్తుంది. మెడనల్లగా మారడానికి స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కూడా కొంత వరకు కారణం.
మెడకు కూడా వ్యాయామం అవ సరం. అన్ని వైపులకు మెడను తిప్పాలి. అందువల్ల మెడకు సరిగా రక్తప్రసరణ జరుగుతుంది. అంతేగాక మెడ కొవ్ఞ్వ కరిగి చర్మం పలచబడుతుంది. నాజూకుగా ఉంటుంది. ఎక్కువ బరువ్ఞలు మోయడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, నిలబడడం మానాలి.
నిద్రపోయే సమయంలో చాలామంది తలగడపై తల మాత్రమే ఉంచుతారు. తలతో పాటు మెడ కూడా ఉంచాలి. నరాల మీద ఒత్తిడి తగ్గుతుంది. యోగా చేసేవారు కూర్మాసనం వేస్తే మెడలోని అనవసరపు కొవ్ఞ్వ తగ్గి మెడ సన్నబడుతుంది.

జాగ్రత్తలు-:
- మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెడితే సాధారణ నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
- మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
- ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
- సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకు అయిదారుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
- బరువైన బ్యాగ్‌లను ఒక భుజానికే తగిలించుకుని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.
- నడిచేప్పుడు ఒకవైపు ఒంగి నడవడం మంచిది కాదు.