Sunday, 3 April 2016

Youth age problems and Treatment - యుక్త వయసు సమస్యలు -నివారణ


మనిషి జీవితంలో యుక్తవయసు చాలా క్లిష్టమైన దశ. శారీరక, మానసిక మార్పులు వేగంగా జరిగే తరుణం. చదువులపై దృష్టి పెట్టటమే కాదు భావోద్వేగాల విషయంలోనూ ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయమిది. అందుకే యుక్తవయసులో తరచుగా కనిపించే సమస్యలపై అవగాహన పెంచుకోవటం ఎంతో అవసరం.

* యుక్తవయసులో శారీరక, మానసిక మార్పులకు అనుగుణంగా ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. చాలామంది బయట నూనె, కొవ్వుతో నిండిన చిరుతిళ్లు తినటమే కాదు.. తరచుగా ఇంట్లో భోజనమూ మానేస్తుంటారు. దీంతో శరీరానికి సరైన పోషకాలు అందకపోవటంతో పాటు మలబద్ధకం, చర్మ సమస్యల వంటి వాటికీ దారితీస్తుంది.

* యువతీ యువకులను వేధించే సమస్యల్లో అతి ముఖ్యమైంది మొటిమలు రావటం. దీనికి హర్మోన్ల స్థాయిలో తేడాలు, జన్యువులు కారణమవుతాయి. దీనికి చికిత్సలున్నాయి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవచ్చు.

* హార్మోన్ల మార్పుల మూలంగా జిడ్డు చర్మం కూడా ఎంతోమందిని క్షోభకు గురిచేస్తుంది. దీంతో చర్మం అందంగా కనిపించటానికి సౌందర్య సాధనాల వాడకం మొదలెడుతుంటారు. ఇవి చర్మంలోని నీటిని లాగేసి పొడిబారేలా చేస్తాయి. దీంతో సూక్ష్మమైన రంధ్రాలు మూసుకుపోయి చర్మానికి అవసరమైన మేరకు నూనె బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంది. యుక్తవయసులో చర్మాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే మరీ ఎక్కువసార్లు కడుక్కుంటే చర్మం మరింత అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. రోజుకి రెండు, మూడుసార్ల కన్నా మించి కడుక్కోకపోవటమే మంచిది. జిడ్డు చర్మం గలవారు ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, చాక్లెట్లు, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలి.

* కొందరికి యుక్తవయసులో కంటి చుట్టూ నల్లటి గీతలు కూడా వస్తుంటాయి. దీనికి జన్యువులతో పాటు నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గటం కారణమవుతాయి. ఈ గీతల నుంచి తప్పించుకోవాలంటే రోజూ పండ్లు, కొబ్బరినీళ్లు, పచ్చి కూరగాయలు, రసాలు, సూప్‌లు తీసుకోవాలి. ఇవి శరీరంలోని విష పదార్థాలు బయటకు పోవటానికీ దోహదం చేస్తాయి.

* యవ్వనంలో ఉన్నప్పటికీ చాలామంది యువతీ యువకులు నిస్సత్తువ, అలసటతో బాధపడుతుంటారు. రక్తంలో చక్కెర మోతాదును పెంచే పిండి పదార్థాలను ఎక్కువ తీసుకోవటం వల్ల ఇలాంటి భావన కలుగుతుంది. చక్కెర తక్కువగా ఉండే ముడి ధాన్యాలు, పప్పులు, పనీర్‌, కోడిమాంసం, చేపలు, కూరగాయలు, సలాడ్ల వంటివి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

* పరీక్షల సమయంలో ఒత్తిడి మూలంగా కొందరు కడుపులో మంటతోనూ బాధపడుతుంటారు. మద్యం, మసాలా పదార్థాలు, వేళకు భోజనం చేయకపోవటం కూడా దీనికి దారితీస్తాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం, జీవనశైలి మార్పుల వంటివి కడుపులో మంట తగ్గటానికి తోడ్పడతాయి.

* యవ్వనంలో ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సరిపడినంత విశ్రాంతి తీసుకోవటం ప్రధానమని గుర్తించాలి.

Allergic Rhinitis - అలర్జిక్‌ రైనైటిస్

ఇది చాలా పెద్ద సమస్య. మన సమాజంలో దాదాపు మూడో వంతు మంది ఈ రకం అలర్జీతో బాధపడుతున్నారు. మనకు 'అలర్జీ' కలిగించే ఆ శత్రువు.. మన పరిసరాల్లోనే.. మన ఇంట్లోనే ఉండొచ్చు. అది ఇతరుల్ని ఏ ఇబ్బందీ పెట్టకపోవచ్చు. కానీ మన పాలిట మాత్రం విలయం సృష్టిస్తుంటుంది. నిజం చెప్పాలంటే దాన్ని మనమేం చెయ్యలేం. మరి దీన్నుంచి బయటపడేదెలా?


ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం.. ఇవన్నీ చూడటానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ కొందరి పాలిట ఇవే శత్రువులు! ఇవి తగులుతూనే శరీరంలో తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు.. పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు.. ఇలా అలర్జీ కారకాల జాబితా చాలా పెద్దది! సాధారణంగా ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యని ఈ సాధారణ పదార్థాలే కొందరి పాలిట మాత్రం తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. ముక్కు, కళ్లు, చెవులు, గొంతు, వూపిరితిత్తులు, చర్మం.. ఇలా రకరకాల శరీర భాగాల్లో విలయం సృష్టిస్తుంటాయి. ముక్కుకు సంబంధించి చాలా ఎక్కువగా కనబడే సమస్య ఈ అలర్జీ. దీన్నే 'అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. ఆ సరిపడని పదార్థాలేవో ముక్కుకు సోకినప్పుడు.. ముక్కులోని సున్నితమైన పొరలు తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో 'అలర్జీ' బెడద ఆరంభమవుతుంది.

కొందరిలో ఎప్పుడూ..!

అలర్జీ అన్నది కొన్ని కొన్ని సీజన్లలో ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసి, గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉండే కాలంలో, అలాగే చల్లదనం పెరిగే శీతకాలంలో.. ఇలా కొన్నికొన్ని సీజన్లలో ముక్కు అలర్జీలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీన్నే 'సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌' అంటారు. గాలి ద్వారా వచ్చే పుప్పొడి పెద్ద అలర్జీ కారకం. అందుకే పాశ్చాత్య దేశాల్లో మన వాతావరణ హెచ్చరికల్లాగే గాలిలో ఈ పుప్పొడి శాతం (పోలెన్‌ కౌంట్‌) ఎంత ఉందన్నది కూడా చెబుతుంటారు. అయితే కొందరిలో ఇలా కాలాలతో, సీజన్లతో ఏ సంబంధం లేకుండా ఏడాది పొడవూనా అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి. దీన్నే 'పెరీనియల్‌ అలర్జిక్‌ రైనటిస్‌' అంటారు. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ అలర్జీ తత్వం రావచ్చు. ముఖ్యంగా చర్మం మీద అలర్జీలు, తుమ్ములు, ఉబ్బసం వంటివి కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. చిన్న పిల్లల్లో అంటే ఐదారేళ్ల వయసు వరకూ సాధారణంగా ముక్కు అలర్జీలు కనబడవుగానీ.. వూపిరితిత్తుల్లో అలర్జీ కారణంగా ఉబ్బసం (అలర్జిక్‌ ఆస్థమా) అన్నది చిన్నవయసులో కూడా కనబడుతుంటుంది. మొత్తానికి 'అలర్జీ' అన్నది ఎవరికైనా, వేటి కారణంగానైనా రావచ్చు. కాబట్టి ఎవరికివారు తమకు దేనివల్ల అలర్జీ వస్తోంది, ఆ సరిపడనిదేమిటి? అన్నది గుర్తించటం మంచిది.

అలర్జీ నుంచి ఆస్థమా!
ముక్కులో తలత్తే అలర్జీ లక్షణాల వంటివే వూపిరితిత్తుల్లోకి కూడా పాకితే.. అలర్జిక్‌ బ్రాంకైటిస్‌, ఆస్థమా వంటి బాధలూ తలెత్తుతాయి. వీరిలో శ్వాస ఆడనట్లుండటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలు కనబడతాయి. 60-70 శాతం మందిలో ముక్కులోనూ, ఛాతీలోనూ కూడా ఈ అలర్జీ లక్షణాలు వేధిస్తుంటాయి.

దూరమే విరుగుడు:
ప్రధానంగా అలర్జీ కారకాలు తగిలే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసేసుకోవటం, కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసెయ్యటం, పుప్పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండే ఉదయం సమయాల్లో ఆరుబయటకు వెళ్లకుండా ఉండటం.. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్‌ వంటివి కట్టుకోవటం.. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.


సమస్యల దొంతర అలర్జీ ఆరంభం:
సరిపడనివేవో తగిలి ముక్కులోని పొరల్లో ఈ అలర్జీ మొదలైతే.. 'హిస్టమైన్‌' విడుదల అవుతుంది. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్త్లె.. ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. అప్పుడు ఆగకుండా తుమ్ములు, ఆ వెంటనే ముక్కు వెంట నీరు ధారలా కారటం మొదలవుతుంది. తర్వాత మెల్లగా ముక్కు బిగిసిపోతుంది. ఇది 'అలర్జిక్‌ రైనైటిస్‌'. ఇది బాగా చికాకుపెట్టే సమస్య. ఈ దశలోనే దీనికి చికిత్స తీసుకుంటే మంచిది. ఇది ముదిరి.. దీర్ఘకాలిక సమస్యగా తయారైతే 'సైనుసైటిస్‌' వంటి దుష్ప్రభావాలు చాలా తలెత్తుతాయి.

                           

* చాలామందికి ముక్కు దూలం, రంధ్రాల మధ్య గోడ కాస్త వంకరగా ఉంటుంది (డీఎన్‌ఎస్‌). దీంతో ముక్కు మార్గాలు లోపలికి వెళ్లినకొద్దీ సన్నగా ఉంటాయి. అలర్జీ కారణంగా ముక్కులోని పొరలు కొద్దిగా ఉబ్బినా కూడా.. వెంటనే ఈ మార్గాలు మూసుకుపోయినట్లవుతుంటాయి.

* దీనికి తోడు- మనం పీల్చే గాలిని తడిగా మార్చేందుకు, ధూళిని వడకట్టేందుకు ముక్కులో వర్తులాకార కండల్లాంటి 'టర్బినేట్స్‌' మూడు ఉంటాయి. ముక్కుకు పక్కన ఉండే సైనస్‌ గాలి గదుల నుంచి వచ్చే మార్గాలు ఈ టర్బినేట్స్‌ మధ్యనే తెరుచుకుంటూ ఉంటాయి. ముక్కులో అలర్జీ తీవ్రంగా ఉన్న వారికి ఈ టర్బినేట్స్‌ కండలు బాగా ఉబ్బిపోయి (హైపర్‌ట్రోఫీ) ఉంటాయి. అలర్జీ తగ్గగానే ఇవి తగ్గిపోతుంటాయి. కానీ కొన్నేళ్లుగా అలర్జీ ఉన్న వారికి ఇవి ఉబ్బి, అలాగే ఉండిపోతాయి. ఇలా ఇలా టర్బినేట్స్‌ పెద్దగా అయిపోవటాన్ని 'మల్బరీ హైపర్‌ట్రోఫీ' అనీ అంటారు. గోడ వంకర ఉండి, ఈ టర్బినేట్స్‌ ఉబ్బి ఉంటే ముక్కు మరింతగా బిగిసిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటివల్ల లోపలికి గాలి సరిగా ఆడదు. దీంతో సైనస్‌ గదుల్లో ఇన్ఫెక్షన్‌ వంటివి మొదలవుతాయి.

* ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచినకొద్దీ ఘ్రాణశక్తి, వాసనలు తగ్గిపోతాయి. ఎందుకంటే వాసన తెలియాలంటే మనం పీల్చే గాలి.. ముక్కు పైభాగాన ఉండే 'ఆల్‌ఫ్యాక్టరీ' ప్రాంతానికి తగలాలి. కానీ ముక్కులోని పొరలన్నీ ఉబ్బినప్పుడు గాలి అలా లోపలికి వెళ్లలేదు. దీంతో వాసనలూ తగ్గిపోతాయి.


అలర్జిక్‌ సైనుసైటిస్‌:

ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ముక్కుకు ఇరువైపులా, పై భాగాన ఉండే 'సైనస్‌ గదుల్లో' కూడా అలర్జీ ప్రక్రియ మొదలవుతుంది. మన ముక్కు చుట్టుపక్కల మొత్తం 8 సైనస్‌ గదులుంటాయి. ఒక రకంగా ఇవి గాలి గదులు. వీటిలో గాలి మినహా మరేమీ ఉండదు. కానీ దీర్ఘకాలంగా అలర్జీ ఉన్న వారికి ఈ గదుల్లోపలి పైచర్మమంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది. ఎక్స్‌-రేల వంటివి తీస్తే.. ఆ పొరలు ఉబ్బి వాచినట్లు స్పష్టంగా కనబడతాయి. దీంతో వీరికి తలభారంగా ఉండటం, ముందుకు వంచితే నొప్పి, ముఖం మధ్యభాగంలో నొప్పి వంటి 'సైనుసైటిస్‌' లక్షణాలు బాధిస్తాయి. దీన్నే 'అలర్జిక్‌ రైనో సైనుసైటిస్‌' అంటారు. దీన్నీ నిర్లక్ష్యం చేస్తే సైనస్‌ గదుల్లో నుంచి ముక్కులోకి తెరచుకునే గాలి గొట్టాలు మూసుకుపోతాయి. దీంతో సైనస్‌ గదుల్లో వూరే స్రావాలు లోపలే పేరుకుపోయి.. అవి చిక్కబడి ఇన్ఫెక్షన్‌ ఆరంభమవుతుంది. దీంతో తలనొప్పి వంటి బాధలు మొదలవుతాయి. దీన్నీ నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత ముదురుతుంది.


ముక్కులో పిలకలు:
అలర్జీ మరింతగా ముదిరితే ముక్కులో పాలిప్స్‌ (పిలకలు) కూడా తయారవ్వచ్చు. దీన్నే 'నేసల్‌ పాలిపోసిస్‌' అంటారు. ఇవి సాధారణంగా సైనస్‌లలో, ముఖ్యంగా కళ్ల మధ్య ఉండే సైనస్‌ గదుల్లో మొదలవుతాయి. ఇవి ముక్కులో రెండు వైపులా నీటి తిత్తుల్లా పెరుగుతాయి. ముక్కులోకి తెరుచుకునే సైనస్‌ మార్గాల్లో నుంచి ఇవి బయటకొచ్చి.. తోలు తీసిన తెల్లద్రాక్షలా.. ముక్కు మార్గాల్లోకి వేళ్లాడుతూ కనబడుతుంటాయి. సైనస్‌ గదుల్లో పేరుకుపోయి, అక్కడంతా నిండిపోయిన తర్వాత ఇవి ముక్కులోకి వచ్చి వేళ్లాడుతుండటంతో.. ముక్కు మార్గాలు మూసుకుపోయి.. అప్పుడు శ్వాస ఆడని పరిస్థితి ఎదురవుతుంటుంది.


తోడయ్యే ఫంగస్‌:
అలర్జీ ముదిరిపోయి ముక్కులోపల పిలకలు పెరిగిన దశలో.. అక్కడ 'ఫంగస్‌' కూడా చేరటం మొదలవుతుంది. దీన్నే 'అలర్జిక్‌ ఫంగల్‌ సైనుసైటిస్‌' అంటారు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూస్తున్న సమస్య ఇది. ముక్కులోకి కెమేరా గొట్టాన్ని (నేసల్‌ ఎండోస్కోప్‌) పెట్టి చూసినప్పుడు.. లోపల పిలకలతో పాటు తెల్లటి బంకలాంటి ముద్దలు, చిక్కటి జిగురు పదార్థం వంటివి కనబడుతుంటాయి. సీటీ స్కాన్లో చూస్తే- సైనస్‌ గదుల్లో తెల్లటి ముద్దల్లా, చుక్కల్లా కనబడతాయి. ఇవి కనబడ్డాయంటే ముక్కులో, సైనస్‌ గదుల్లో ఫంగస్‌ చేరిపోయిందని అర్థం. దీనికి సాధారణంగా 'ఆస్పర్‌జిల్లోసిస్‌' అనే రకం ఫంగస్‌ కారణమవుతుంటుంది. ఈ దశలో సాధారణంగా సర్జరీ చేసి దీన్నంతటినీ తొలగించటం తప్పనిసరి అవుతుంటుంది. అలర్జీకి తొలి దశలోనే చికిత్స తీసుకుని.. దాన్ని నియంత్రణలో పెట్టుకుంటుంటే పరిస్థితి ఇక్కడి వరకూ రాదు.


గుర్తించేదెలా?అలర్జీని చాలా వరకూ రోగి లక్షణాల ద్వారానే గుర్తించవచ్చు. చలిగాలి, దిండ్లు పరుపుల్లో ఉండే తవిటి పురుగులు, దుమ్ము, పుప్పొడి.. ఇవే ఎక్కువ మందిలో అలర్జీకి కారణమవుతుంటాయి. వీరికి రక్తపరీక్ష చేస్తే 'ఇస్నోఫిల్స్‌' పెరిగి ఉంటాయి. వైద్యులు లైట్‌తో లేదా కెమేరా గొట్టం (నేసల్‌ ఎండోస్కోపీ)తో ముక్కులోకి చూసి- 'టర్బినేట్స్‌' ఉబ్బి ఉన్నాయా? గోడ వంకర ఉందా? సైనస్‌ గదుల్లో ఎలా ఉంది? లోపల పిలకలు పెరుగుతున్నాయా? ఫంగస్‌ ఉందా? ఇవన్నీ పరిశీలిస్తారు. అలర్జీని గుర్తించేందుకు 'స్కిన్‌ ప్రిక్‌ టెస్టు'లు వంటివి ఉన్నాయిగానీ వాటి అవసరం పెద్దగా ఉండదు. లక్షణాలను బట్టి సైనస్‌ గదుల పరిస్థితి తెలుసుకునేందుకు ఎక్స్‌-రే, సీటీ స్కాన్‌ వంటివి చేయిస్తారు. దీర్ఘకాలంగా అలర్జీ ఉన్న వారికి ముక్కులోని లోపలి పొరలన్నీ పాలిపోయినట్టు.. టర్బినేట్స్‌ ఉబ్బినట్లు కనబడతాయి. పాలిప్స్‌, ఫంగస్‌ వంటివీ సీటీ స్కాన్‌లో స్పష్టంగా కనబడతాయి.

ఏమిటి మార్గం?
అలర్జీ బాధలకు ప్రధానంగా చెయ్యాల్సింది ఆ 'అలర్జీ కారకాలకు' సాధ్యమైనంత దూరంగా ఉండటం. ఇది చెప్పటం తేలికేగానీ ఆచరించటం అంత సులభం కాదు. ఎందుకంటే దేనికి అలర్జీ వస్తోందో గుర్తు పట్టటమే పెద్ద సమస్య, ఒకవేళ గుర్తు పట్టినా కాలుష్యం వంటివాటన్నింటికీ దూరంగా ఉండటం అంత తేలిక కాదు.

* యాంటీ హిస్టమిన్‌ మాత్రలు: చికిత్సలో వైద్యులు ప్రధానంగా 'యాంటీ హిస్టమిన్‌' మాత్రలు ఇస్తుంటారు. వీటిలో 'క్లోర్‌ఫినిరామిన్‌ మాలియేట్‌, అవిల్‌' వంటివి ఎక్కువగా ఇస్తుంటారు. కానీ వీటితో సమస్య ఏమంటే వీటివల్ల మత్తు వస్తుంది. అలాగే సిట్రిజెన్‌ హైడ్రోక్లోరైడ్‌, లివో సిట్రిజెన్‌ వంటి వాటితో కూడా కొంత మత్తు ఉంటుంది. ఇప్పుడు 'ఫెక్సఫెనడిన్‌, లొరాటిడిన్‌, రూపాటిడిన్‌' వంటి యాంటీ హిస్టమిన్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజూ ఒక మాత్ర వేసుకుంటే 24 గంటల పాటు తుమ్ములు, ముక్కు కారటం వంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

* ఈ యాంటీ హిస్టమిన్‌ మాత్రలు వేసుకుంటే మత్తురావటం వంటి ఇబ్బందులున్నాయి. నిద్ర, తలభారం, దాహం, అంతా విరగలాగుకు పోతున్నట్లుండటం, రాత్రి ఈ బిళ్ల వేసుకుంటే పగలు కూడా మగతగా అనిపించటం, డ్రైవింగ్‌ వంటివి కష్టం కావటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వీటిని నేరుగా ముక్కులోకి కొట్టుకునే 'స్ప్రే'ల రూపంలో కూడా తెచ్చారు. కానీ ఈ స్ప్రేలను రోజుకు ఐదుసార్లు వాడాలి. కాబట్టి ఆచరణలో ఇబ్బంది ఎక్కువ. 'అజలాస్టిన్‌' వంటి స్ప్రేలు విపరీతమైన చేదు కావటం, ఐదుసార్లు వాడాల్సి రావటంతో ఈ 'యాంటీ హిస్టమిన్‌' రకం స్ప్రేలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.

* స్టిరాయిడ్‌ స్ప్రేలు: ముక్కులోకి కొట్టుకునే 'కార్టికో స్టిరాయిడ్‌' స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. ఇవి నేరుగా ముక్కులోకి వెళతాయి కాబట్టి వీటితో ఇతరత్రా దుష్ప్రభావాలూ ఉండవు. మత్తురావటం వంటి ఇబ్బందులూ ఉండవు. అలర్జీ లక్షణాలు తగ్గి వెంటనే ఫలితం ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వైద్యులు కేవలం ఈ స్టిరాయిడ్‌ స్ప్రేలనే సిఫార్సు చేస్తారు. 'ఫ్లూటికసోన్‌, మొమెటసోన్‌, బుడిసనైడ్‌, ట్రామ్‌సిలనోన్‌' వంటివి స్ప్రే రూపంలో లభిస్తాయి. వీటిని రోజుకు ఒక్కసారి- రెండు రంధ్రాల్లో రెండు రెండు స్ప్రేల చొప్పున కొట్టుకుంటే 24 గంటల వరకూ మళ్లీ సమస్య తలెత్తదు.

* ఈ స్ప్రేలను ఎంతకాలం వాడాలన్నది ముఖ్యమైన అంశం. సీజనల్‌గా వచ్చే వారికి ఆయా సీజన్లో వాడుకుంటే సరిపోతుంది. దీర్ఘకాలం ఉండే వారికి ఇన్ని రోజులు వాడాలనేం లేదు. ఓ నెల రోజులు వాడి.. ఆ తర్వాత ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు వాడొచ్చు. ఇవి సురక్షితమైనమే కానీ మరీ ఎక్కువ కాలం వాడితే అరుదుగా ముక్కు నుంచి కొద్దిగా రక్తం రావచ్చు. కాబట్టి వైద్యుల సిఫార్సు మేరకే వాడుకోవటం మంచిది.

* అలర్జీ లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే- కొంతకాలం నోటి ద్వారా యాంటీహిస్టమిన్‌ మాత్ర, ముక్కులోకి స్టిరాయిడ్‌ స్ప్రే- రెండూ సిఫార్సు చేస్తారు. అరుదుగా కొందరికి ఒకటి, రెండు వారాల పాటు 'ప్రెడ్నిసలోన్‌' వంటి స్టిరాయిడ్‌ నోటి మాత్రలూ సిఫార్సు చేస్తారు.

ఇప్పటికే సైనుసైటిస్‌కు మారితే:
అలర్జీ ముదిరిపోయి సైనస్‌ గదుల్లో ఇన్ఫెక్షన్‌ ఉంటే యాంటీ బయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. గోడ వంకర (డీఎన్‌ఎస్‌) ఉంటే దాన్ని సర్జరీ చేసి సరిచెయ్యటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టర్బినేట్లు బాగా ఉబ్బిపోయి ఉంటే.. సర్జరీలో వాటిని తగ్గిస్తారు. దాంతో అలర్జీకారణంగా ముక్కు బిగిసిపోయే బాధ బాగా తగ్గుతుంది. టర్బినేట్లు తగ్గించేందుకు 'సబ్‌మ్యుకోజల్‌ డయాథర్మీ, లీనియర్‌ కాటరీ' వంటి అత్యాధునిక ప్రక్రియలున్నాయి. ఒకవేళ సైనుసైటిస్‌ బాగా ముదిరిపోయి ఉంటే సైనస్‌ సర్జరీ (ఎఫ్‌ఈఎస్‌ఎస్‌) చేసి.. సైనస్‌ గదులను, వాటి మార్గాలను తెరవటం అవసరం. ఫంగస్‌ చేరితే.. పాలిప్స్‌, వాటితో పాటు మొత్తం ఫంగల్‌ పదార్థాలను తొలగించి.. సైనస్‌లలోకి బాగా గాలి వచ్చేలా చేసి.. అప్పుడు స్టిరాయిడ్‌ స్ప్రేలు లేదా మాత్రలు ఇస్తారు. ఈ రకం ఫంగల్‌ సమస్యకు 'యాంటీఫంగల్‌' మందులతో ఎటువంటి ప్రయోజనం ఉండదు, దీనికి స్టిరాయిడ్‌ మందులు ఒక్కటే మార్గం. ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు మళ్లీమళ్లీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి తరచూ వీటిని ఎండోస్కోపీతో పరీక్షిస్తుండాలి. పాలిప్‌ల వంటివి పెరుగుతుంటే స్టిరాయిడ్‌ మాత్రలు ఇస్తారు. స్ప్రేలు దీర్ఘకాలం వాడుకోవచ్చు.
* చాలామందికి ముక్కులోకి ఇచ్చే స్ప్రేలతోనే సమస్యను చక్కగా నియంత్రించవచ్చు. కొద్దిమందికే సర్జరీ అవసరమవుతుంది.
* అలర్జీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది కాబట్టి సర్జరీల తర్వాతా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
లోలోపల యుద్ధం.. అలర్జీ మనకు సరిపడని అలర్జీ కారకాలైన పుప్పొడి, తవిటి పురుగుల వంటివి సోకినప్పుడు.. మన శరీరంలో ఒక్కసారిగా తీవ్రమైన ప్రతిస్పందన మొదలవుతుంది. ఇదే 'అలర్జీ'.

* అలర్జీ కారకాలు తొలిసారిగా మనకు తగిలినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మన శరీరం కొన్ని యుద్ధకణాలు (యాంటీబాడీలు) ఉత్పత్తి చేస్తుంది. ముక్కు అలర్జీల్లో 'ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఇ' (ఐజీఈ) రకం యాంటీబోడీలు సిద్ధంగా ఉంటాయి.
* ఈ యాంటీబాడీలు ముక్కులోని కణజాలంలో ఉండే 'మాస్ట్‌ కణాలకు' అతుక్కుని.. మళ్లీ అదే తరహా శత్రువు కనిపిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా కాచుకొని కూర్చుంటాయి.
* తర్వాత మళ్లీ ఎప్పుడైనా ఆ అలర్జీ కారకాలు తగిలితే.. అప్పటికే మాస్ట్‌ కణాల మీద కాచుకొని కూచున్న ఈ యాంటీబాడీలు వాటిని గట్టిగా పట్టేసుకుంటాయి.
* వెంటనే మాస్ట్‌ కణాలు ఒక్క ఉదుటున 'హిస్టమిన్‌' అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో ముక్కులోని పొరలన్నీ వాచి, దురద, వాటి నుంచి నీరు కారటం, తుమ్ములు రావటం, ముక్కు బిగిసిపోవటం.. ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే 'ఐజీఈ మీడియేటెడ్‌ హైపర్‌సెన్సిటివిటీ రియాక్షన్‌' అంటారు.
* అలర్జీ కారణంగా- కళ్ల దురద, గొంతులో కిచ్‌ కిచ్‌, చెవుల్లో దురద.. ఇవన్నీ రావచ్చు.

Hereditary diseases - వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు


ఆనువంశిక వ్యాధుల్ని వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు అ కూడా అంటారు. ఇవి మనుషులకి చాలా దుఃఖం కలిగించే వ్యాధులనే చెప్పాలి. క్రోమోజోమ్స్‌లో జీన్స్‌లో కలిగే మార్పువల్ల లేక అసాధారణ జీన్స్ లేదా పరిసరాల ప్రభావం కారణంగా ఈ వ్యాధులు ఏర్పడతాయి. ఈ ఆనువంశిక వ్యాధులు ప్రారంభదశలోనే నిర్ధారించబడినప్పటికీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇవి బయట పడవచ్చు. రోగులుగా వారి బంధువులు గా, తమకు ఏదైనా వ్యాధి లేక అవలక్షణం ఆనువంశికంగా (వంశపారంపర్యంగా) సంక్రమించి వుండవచ్చనే సందేహం వారిలో కలిగినప్పుడు వారికి ఆ వ్యాధి పరిణామాలను, అది వృద్ది పొందే మరియు ఇతరులకు సంక్రమించే అవకాశాలతో పాటు, వాటి రోధించేగలిగే మార్గాలను వివరించే విధానాన్నే ఆనువంశిక పరమైన సలహా సంప్రదింపులు అంటారు.

క్రోమోజోమ్‌లు మరియు జీన్సు అంటే......?మానవ శరీరం అనేది జీవ కణాల సముదాయం. వీటినే జీవభాగాలు అని కూడా అంటారు. ఆ కణాల్లో న్యూక్లియస్‌లో దారం వంటి పదార్ధం వుంటుంది. ద్నీ క్రోమోటిస్ అని అంటారు. ఇది(క్రోమోటిస్) డీఎన్ఏ (డిఆక్షి రైబోన్యూక్లియక్ యాసిడ్) తో తయారవుతుంది. జీన్స్ అనేది డిఎన్ఏ యూట్లు, అవి ఆర్గాజమ్స్ లో (ఇంద్రి యాల్లో) స్వభావ వ్యక్తీకరణకి బాధ్యత వహిస్తాయి. కణవిభజనకు సంబంధించిన క్రోమోటిన్ ఏర్పడే సమయంలో, ఒక సింగిల్ కణం నుండి రెండు కణాలుగా విభజించబడే కార్యక్రమంలో ఇవి పాలు పంచుకుంటాయి. మానవులలో 46 క్రోమోజోములుంటాయి. తల్లి దండ్రుల్లో ప్రతి ఒక్కరినుంచి ఒక్కొక్కటిగా ఏర్పడి జంటగా మారుతాయి. 46 క్రోమోజోములకు గాను 44 లేదా 22 జంటల్ని ఆటో జోన్సు అని అలాగే మిగిలిన ఒక జంటను (ఎక్స్ మరియు వై) సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటారు. ఈ క్రోమోజోములే వ్యక్తి లింగ నిర్ధారణ చేస్తాయి. మగవారిలో ఈ క్రోమోజోములు '‘xy’గాను ఆడవారిలో xx గానూ వుంటాయి.

ఆనువంశిక వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి?
ఆనువంశిక వ్యాధులను 3 ప్రధాన వర్గాలుగా విభజింపవచ్చు.
1, క్రోమోజోమోల్ వ్యాధులు-- క్రోమోజోము ర్మాణం లేక సంఖ్యలో అసాధారణత్వం కారణంగా ఏర్పడుతాయి. ఉదాహరణకి డౌన్స్ సిండ్రోమ్. (సాధారణమైన వాటికి బదులుగా థ్రీ 21 క్రోమోజోములు వుంటాయి.
2, ఆటోజోన్సు లేక సెక్స్ క్రోమోజోములపైన జీన్స్ వుంటే జీన్స్‌లో సంభవించే పరిణామాల కారణంగా సింగిల్ జీన్ వ్యాథులు వ్యాపిస్తాయి.
3, అనేక కారణాలున్నా వ్యాధులు అనేక జీన్సు మరియు పాక్షికంగా కాజేషన్‌లో పర్యావరణ సంబంధమైనవి. ఉదా: సామాన్యమైన పుట్టుక లోపాలు.

ఆనువంశికమైన వ్యాధుల్లో చాలా వరకూ వైద్యా కి లొంగవి, తగ్గినవి అయిన కారణంగా వీటి నివారణ చాలా ముఖ్యం. జనాభాలో వ్యాప్తితో వున్న వంశపారపర్య సౌధుల్ని తెరపై చూపడం, గర్భధారణకు పూర్వమే వ్యాధి గుర్తించడం అనేవి కౌన్స్ లింగ్‌లో భాగాలు.

కౌన్స్ లింగ్ ఎవరికి అవసరం?
1.తమ పిల్లలోగా, ఎవరైన కుటుంబ సభ్యుల్లో గాని ఆ కింది లక్షణాలు వుంటే

ఎ, బుద్ధి మాంద్యం
బీ, పుట్టుకతో వచ్చిన అనేక లోపాలు
సి, చికిత్సకు లొంగ రక్తహీనత
డి, గాయం తగలినప్పుడు రక్తం కట్టుపడకుండా కారిపోతూ వుండటం
ఇ, బిర్రబిగుసు పోవడం
ఎఫ్, పెరుగుదలలో జాప్యం
జి, క్నొ రకాల చర్మ వ్యాధులు

2. ఈ కింది నేపధ్యం వున్న దంపతులు

ఎ, రక్త సంబంధీకులు
బి, తరచూ జరిగే గర్భస్రావాలు(3సార్లు కన్న ఎక్కువ)
సి, చపోయిన బిడ్డ పుట్టడం.
డి, వికృత రూపంతో పుట్టిన పిల్లలు

3. గర్భధారణ సమయంలో చక్కెర వ్యాధి నేపధ్యం వున్నప్పుడు

4. ఇంకా ఇతర రకమైన బాగా తెలిసిన వ్యాధి ఏమన్నా వున్నప్పుడు

ఆనువంశిక సంప్రదింపు పరామర్శలో జెనెటిక్ క్సౌలింగ్‌లో వివిధ దశలు/స్థాయిలు:
1. ఒక ఖచ్చితమైన రోగర్ధారణ చేయడం అనేది మొదటి దశ. వ్యాధిగ్రస్తు తాలుకు చికిత్సా/ వైద్య పరమైన పూర్వ విశేషాలను విచారించడం, సంబధించిన మెడికల్ రికార్డులను సమీక్షించడం, కుటుంబంలో రెండు పక్షాల వారి కుటుంబ చరిత్ర సంపాదించడం, ప్రభావితుడైన రోగి పరీక్షించడం, అవసరమైనప్పుడు ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా పరీక్షించడం, అవసరమైన పరీక్షలకు ఏర్పాటు చేయడం. (హేమటోలోజికల్ : రక్తపరీక్షలు బయోకెమికల్ జీవరసాయన పరీక్షలు క్రోమోజోమల్ మరియు డిఎన్ఏ విశ్లేషకులు)

2. ఇటువంటి వ్యాధులే వున్న కుటుంబంలో ఈ వ్యాధులు మళ్లీ సంభవించే ప్రమాదం అంచనా వేయడం: ఇది వ్యాధి లక్షణం పైన ఆధారపడి వుంటుంది. అంటే ఆ వ్యాధి క్రోమో జోముల్ సంబంధితమా, ఒకే జీన్‌కి సంబంధించినదా లేక వివిధ కారణాలకు (మల్టీ ఫ్యాక్టోరియల్) సంబంధించినదా అనే దాపై ఆధారపడి వుంటుంది.

కన్సల్‌టెంట్లకు సమాచార వ్యక్తీకరణం: పరామర్శ కోరే వారికి అర్ధమయ్యే విధంగా సమాచారాలు వివరంగా చెప్పగలిగే సామర్థ్యం పైన, సమయం పైన ఇది ఆధారపడి వుంటుంది.

3. వ్యాథి స్వభావం, లక్షణాలు, ముందు కలిగిన అనుమానాల తీరు, వ్యాధుల నైసర్గిక చరిత్ర, తరు వాత సంభవించే సమస్యలు మొదలైన వాట్నటి గురించి జెనెటిక్ కౌన్‌సలర్ దంపతులతో చర్చిస్తాడు. అలాగే పుట్టబోయే సంతానాకి సంక్రమించే అవకాశం, ప్రమాదం వున్న సంగతి గురించి, గర్భధారణకు ముందు వ్యాధికి సంబంధించి చేయించుకున్న పరీక్షల రిపోర్టుల గురించి కూడా క్సౌలర్ చర్చిస్తాడు. అలాగే ఆ వ్యాధి శిశువు జ్మంచే అవకాశాలు, పునరుత్పత్తికి సంబం ధించిన ప్రత్యామ్నాయాలు వుంటే వాటి గురించి చర్చించడం జరుగుతుంది. కౌన్‌సలింగ్ చేయించుకునేవారిలో మానసికపరమైన, భావుకతా పరమైన సమస్యలు, ఇబ్బందులేమైనా వుంటే వాటి కూడా పరీశీలించి, బాగా అవగాహన చేసుకున్న తరువాత వారిలో తప్పు చేసామే అన్న భావాలను తొలగించే ప్రయత్నం కూడా క్సౌలింగ్‌లోకే వస్తుంది.

4. క్సౌలింగ్ చేయించుకున్న వారు తమకు చెప్పబడిన సమాచారాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్నారా లేదా అనే విషయంతో పాటు వ్యాధి గురించిన విషయాలను అవగతం చేసుకు కుటుంబ సభ్యులు కూడా తెలిసి చేసారా అనేది తెలుసుకోవడం కోసం అనువర్తిత చర్య అనేది అవసరం. కౌన్‌సలింగ్ తర్వాత కలిగే సందేహాలు తీర్చుకునే విషయంలో ఈ చర్య తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Habits for good health - మంచి ఆరోగ్యానికి అలవాట్లు



ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు.

అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము.

పల్లెటూళ్లలో మరియు మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే.మన అలవాట్లు , ఆహార నియమాలు బట్టి మన ఆరోగ్యము అధారపడి ఉంటుంది .

ఎన్ని పనులున్నా.. ఆరోగ్యం మీద దృష్టిపెట్టి శ్రద్ధ తీసుకోవాలి. అందుకు అనువైన అలవాట్లను అలవరచుకొంటే ఆరోగ్యం... ఆనందం మనసొంతమవుతాయి..........అవి ఏమిటంటే ----------

1 .  పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అదే పనిగా విధుల్లో నిమగ్నమవుతుంటారు కొందరు. దానివల్ల ఊబకాయం సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా అరగంటకోసారి లేచి రెండుమూడు నిముషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. దానివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివీ దూరంగా ఉంటాయి.

2 . ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకొంటేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. లేదంటే ఆకలి, నీరసంతో పనిచేయగలం అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారము తీసుకోవడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను వెంట తెచ్చుకొని తింటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

3 . పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది.

4 . చల్లటి నీళ్లు తీసుకొనే బదులు పని చేసే సమయంలో కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అవి సూక్ష్మజీవుల రహితం గా ఉంటాయి . శారీరక నొప్పులను దూరం చేసి.. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది.

5 . సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. భుక్తాయాసంగా కాకుండా కాస్త వెలితిగా తీసుకోవడం ఉత్తమం.

6 . మధ్యాహ్న భోజనంలో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా వాటిని దూరంగా ఉంచితే మంచిది. అవి పడని సందర్భాల్లో కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పని చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. చక్కగా అరుగుతాయి.

7 . కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం.

8 . కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్‌ లోషన్‌ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవు.

9 .ధూమపానము , మధ్యపానము ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు .

10 . రాత్రి భోజనము తొందరగా 8.00 గంటలలోపు తినెయ్యాలి. లేటుగా భోజనం చేయడం వల్ల నిద్రాభంగము కలుగును .

11 . రాత్రి 9.00 గంటల తర్వాత నీరు ఎక్కువగా త్రాగరాదు ... ఎక్కువసార్లు నీరుడై నిద్రకి భంగము కలుగును .

12 . రాత్రి నిద్రపోయే ముందు పళ్ళు బ్రెష్ తో తోముకోవాలి ...దీనివల్ల దంతక్షయము నివారించవచ్చును .

13 . రాత్రి బాగా లేటు అయ్యేంతవరకు టి.వి. చూడకూడదు . కళ్ళు ఒత్తిడికి లోనై ఉదయానికి నీరసమనిపించును ,

14 . బందువులు , స్నేహితులతో సరదాగా నవ్వుతూ గడపాలి . ఒత్తిడి తగ్గి ఆయుస్సు పెరుగును ,

15 .ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సమస్త వ్యాధి వర్థకం మలబద్దకం అని మనవైద్యశాస్త్రం చెప్తుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందటమే.

16 . రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం.రోజూ ఒకగంట వాకింగ్‌ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్‌ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.

17 . బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు. 

18 .ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి. అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి. జంక్ పుడ్స్ అసలు తినకూడదు .

19 .ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి. ఆదుర్ధాగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది .

20. అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

Friday, 1 April 2016

Precautions in Summer - ఎండాకాలము లో జాగ్రత్తలు


ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వేసవిలో జాగ్రత్తలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వేసవిలో జాగ్రత్తలు-వేసవిని కూల్‌ కూల్‌గా గడపండి----ప్రతి సీజన్‌కూ ఒక ప్రత్యేకత వుంటుంది. సమ్మర్‌ సీజన్‌ (వేసవి) కి అయితే, ప్రత్యేకతలెన్నో వున్నాయి. అలాగే వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తలూ ఎన్నో రకాలు. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా సమ్మర్‌ ప్రభావంతో ఢమాల్‌ అవ్వాల్సిందే వేసవి ముగిసేవరకూ ప్రతి ఒక్కరూ, ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే! ఇది తప్పదు. ఉదయం లేచింది మొదలు, తీసుకునే ఆహారంలో త్రాగే నీటిలో పానీయాలలో ధరించే దుస్తులలో ఇక బయటకు వెళ్లినపుడు తగిన జాగ్రత్తలెన్నో తీసుకోక తప్పదు. మనిషి తినకా తప్పదు, తిరగకా తప్పదు కాబట్టి ఈ రెంటిలో వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు.

ఆహారపానీయాల విషయంలో జాగ్రత్త పాటించడం పట్ల సరైన అవగాహన లేకపోబట్టే, చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. వేసవిలో ముఖ్యంగా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే వీరు ఏ రోజు, ఏ నిమిషంలోనైనా వేసవి తాపానికి చిక్కి డీలా పడిపోతారు. అలాగే వృద్ధుల విషయంలోనూ. నీడ పట్టున వుండే వారికి, ముఖ్యంగా గృహిణుల మీద సమ్మర్‌ ప్రభావం కనిపించదు కాని, బయట ఎక్కువగా తిరిగేవారికి, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, ఇలా మూడొంతుల శాతం జనాలు వేసవి తాపం బారిన పడకతప్పదు. వేసవి ఉద్ధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ఎవరికి వారు తగిన జాగ్రత్త సూత్రాలు పాటిస్తే వేసవి సైతం కూల్‌.. కూల్‌..గా సాగిపోతుంది. బయట తిరిగే వారందరూ తలపై ఆచ్ఛాదనగా, టోపీ గాని, గొడుగు, తలపాగా వంటివి సిద్ధం చేసుకుని, కళ్లకు నల్లద్దాల కళ్లజోళ్లు (కూలింగ్‌ గ్లాసెస్‌) పెట్టుకుంటే వేసవి ప్రతాపం ఫిఫ్టీ పర్సెంట్‌ తక్కువగానే అనిపిస్తుంది. ఎన్ని సాధనాలతో బయటకు వెళ్లినా తట్టుకోలేని వేడిమి వున్న సమయంలో అసలు తిరగడం తగ్గించడమే అసలైన జాగ్రత్త. ఉదయం 10, 11 గంటలలోపు సాయంత్రం, 4, 5 గంటల తరువాత పనులు చేసుకోవటానికి బయలుదేరితే, మంచిదంటున్నారు పెద్దలు.

వేసవిలో తాపం తగ్గడానికి అందరూ, ఎక్కువగా నీటినే త్రాగుతుంటారు. ఒక్క నీరే సరిపోదు. రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని వినియోగించుకుంటే మంచిది. రోడ్ల మీద పెట్టే పదార్థాలు, పానీయాలు ఏ మాత్రం ఆరోగ్యంగా ఉండవు. చూడడానికి, పట్టుకోడానికి చల్లగా ఉంటాయి గాని, అవి అదే పనిగా స్వీకరిస్తే ఆరోగ్యం అంతే సంగతులు. ఐస్‌ క్రీములు, కోలా పానీయాలు, రసాయనపూరితాలు, అయినా అందరి దృష్టి ఎక్కువ వీటిపైనే వుంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు పానీయాలు, ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన నీటిని ఎప్పుడూ దగ్గర వుంచుకోవాలి. ఆకలి తగ్గించుకోడానికి ఏది పడితే అది తినకూడదు. ఫాస్ట్‌ ఫుడ్‌, ఫ్రైస్‌ (వేపుళ్లు) అస్సలు దగ్గరకు రానివ్వకూడదు. ద్రవపదార్థాలకు ఎక్కువ ప్రాముఖ్యమివ్వాలి. ఇండ్లలో కూడా గృహిణులు వేసవి సీజన్‌లో వంటకాలలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. వేసవి తాపానికి విరుగుడుగా, ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల పండ్ల రసాలు పానీయాలు చాలా తెలీక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు, పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లపురసం పానీయం, దానిమ్మ, ద్రాక్ష రసాలు, జ్యూస్‌లు, ఐస్‌ క్రీములు వంటివి కూడా ఇండ్లలోనే తయారు చేసుకుని తెలివైన నిర్వాకం, ఇక తాపం తగ్గించే కొబ్బరి నీళ్లు, శుభ్రంగా తయారు చేసిన చెరకురసం, తేలికగా లభిస్తాయి వేసవిలో తాత్కాలికంగా తాపం తగ్గించడంలో దృష్టి సారించడం కన్నా, ఆరోగ్యపరంగా వొంటిలో వేడి పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. వేసవిలో వాతావరణంలో వేడి ఎక్కువగా వుంటుంది కాబట్టి, శరీరంలో నీటి శాతం త్వరగా తరిగిపోతుంటుంది. దీని వల్ల కండరాలు శక్తిహీనమౌతాయి. నీరసం, నిస్సత్తువగా అయిపోతుంటారు. అందువల్ల ఆహారాలలో చలువ చేసే పదార్థాలను ఎక్కువగా ఉపయోగించాలి. రాగి జావ (మాల్ట్‌) వేసవి తాపానికి విరుగుడు. పుదీనా, జీలకర్ర, సబ్జా, పుచ్చకాయ, కొబ్బరి పానీయాలు ఎక్కువ సేపు సేదతీర్చుతాయి. వేసవి రోజులన్నీ వీటితో గడిపితే, ఎంత వేడైనా ఇంతే కదా! అనిపిస్తుంది.

దుస్తులూ ప్రత్యేకమే...:

వేసవిలో దుస్తులు ధరించడం కూడా ప్రత్యేకంగా వుండాలి. నూలు దుస్తులే వాడడం సరైంది. ఏ వయసువారైనా సరే, నూలు దుస్తులు వాడితే, వేసవి తాపం చాలా శాతం తగ్గిపోతుంది. పిల్లలకైతే నూలు దుస్తులు వేయడం తప్పదు కాక తప్పదు. ముదురురంగు, మందపాటి వస్త్రాలు, దుస్తులు దూరంగా వుంచడమే, అలాగే పాలియెస్టర్‌, సింథటిక్‌ అసలు వాడకూడదు లేత రంగులవి, తెల్లని కాటన్‌ దుస్తులే సరిగ్గా వేసవి వేడిని అడ్డుకునేవి.

వేసవిలో ఆరోగ్యపానీయాలు:

పుచ్చకాయ రసంతో అల్లం మిళితం : పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలు మిక్సర్‌లో లేదా జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రసం తీయాలి. చల్లదనం కోసం కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో వుంచి త్రాగాలి.

ఈ రసం వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది, తగిన నీటి శాతాన్ని కల్పిస్తుంది. అల్లం రసం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాససంబంధసమస్యలుండవు.

ద్రాక్ష, దానిమ్మలు:


దానిమ్మ గింజలు కప్పు, రెండు కప్పులు ద్రాక్ష (గింజలు లేకుండా), చెంచా పంచదార మొత్తం మిక్స్‌ చేసి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు వుంచి సేవించాలి.

దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, ప్రేవులలో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ చైతన్యంగా వుంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా వుంటాయి. హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు మంచి దోహదకారి.

రాగి మాల్డ్‌:

మార్కెట్లో రాగి పిండి చౌకగా లభిస్తుంది. లేకుంటే రాగులను పిండి పట్టించి వుంచుకుని ప్రతి రోజూ మాల్డ్‌ (జావ) గా కాచి, వినియోగించుకోవచ్చు. కప్పు రాగి పిండి రెండు, మూడు కప్పుల నీరు కలిపి వేడి చేసి, దానిలో రెండు స్పూన్‌ల పంచదార, ఒక ఏలక్కాయ పొడి కలిపి, చల్లగాను, కొంచెం వేడిగానూ సేవించవచ్చు. రాగి మాల్డ్‌ను ప్రతి రోజూ సేవించడం వల్ల, శరీరానికి ధాతుపుష్టి కలగడమే కాక, శరీరంలోని అదనపు వేడిని హరిస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా హుషారుగా వుంచుతుంది.

వంటకాలు:

వేసవిలో రోజువారీ వంటకాలు తయారుచేసుకోవడం ప్రత్యేకంగా ఉండాలి. శరీరానికి 'వేడి' నిచ్చే పదార్థాలు తగ్గించాలి. బీర, పొట్ల, దోస, సొర, ఆకుకూరలు, పప్పులు ఎక్కువగా వాడాలి. రసం, సాంబారు, సూప్‌లు ఒక పూట నియమంగా చేసుకుంటే మంచిది. దాని వల్ల ఆహారం సమతౌల్యంగా, చల్లగా ఉండి శరీరం తాపానికి దూరంగా ఉంటుంది.

అవును, ఎండ వేడిమి ఎంతగా వున్నా సమ్మర్‌లోనే టూర్‌లు, ట్రిప్పులు చేసేవారూ అధికంగా వుంటారు ఎందుకంటే పిల్లలకు పరీక్షలు ముగిసి వారు విశ్రాంతి పొందిన తరుణంలో వారికి కొంచెం గాలి మార్పు కోసం, ఎక్కడికైనా సరదాగా తీసుకువెళ్ళడం మంచిది. వేసవి సెలవుల కాలం పదునైన వేడిమితోవున్న అందరూ సరదాగా టూర్‌చేసి రావడానికి అదనైన కాలం కూడా. వేసవిలో టూరిస్టుల హడావిడి వున్నంతగా చలి, వాన కాలాలలో ఉండదు. కొంతమంది సెలవులకు స్వస్థలాలు, బంధుమిత్రులుండే ఊళ్లకు వెళ్లి, వారితో కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. కొన్ని కుటుంబాలవారు సమ్మర్‌ టూర్‌ ప్యాకేజీలననుసరించి, ఉత్తర, దక్షిణ దేశయాత్రలూ చేసివస్తుంటారు. అంతగా హైరానా అనుకునేవారు. రాష్ట్రంలో పలు సందర్శనస్థలాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. ఎవరు ఎక్కడికి వెళ్లినా ముందుగా టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్లేది ఎన్ని ప్రదేశాలు, ఎన్ని రోజులు తిరిగేది ఎంతమంది ఏ విధంగా వెళ్లాలన్నది ముందుగానే ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి టూర్‌కెళ్లే బృందంలో వృద్ధులూ, పిల్లల అనారోగ్యం ఉన్నవారు వుంటే చాలా అప్రమత్తంగా వుండాలి ముందుగానే వైద్యపరీక్షలు చేయించి డాక్టర్‌ సలహా ప్రకారం కొన్ని రకాల మందులు, ఆరోగ్యసాధనాలు సిద్ధం చేసుకోవాలి. మరీ అనారోగ్యంగా వున్నవారు, టూర్‌ జోలికి పోకపోవడమే మంచిది వేసవిలో వెళ్లే ప్రదేశాలు చల్లదనంతో ఉండేవి ఎంచుకుంటే మంచిది.

మన రాష్ట్రంలో దర్శనీయస్థలాలు, విహారకేంద్రాలు రాష్ట్రం నలుచెరుగులా వున్నాయి. ఉత్తరకోస్తా జిల్లాలైన, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో చాల చల్లని సేదతీరే స్థలాలే కాకుండా చారిత్రకపుణ్యక్షేత్రాలున్నాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలైతే సుందరసముద్రతీరాలలో సందర్శకులను అలరిస్తుంటాయి. విశాఖ జిల్లాలో వేసవి పర్యటన మంచి అనుభూతిని మిగిలిస్తుంది. ఇక దక్షిణాంధ్రలో చిత్తూరు జిల్లా ఎంత వేసవి అయిన శీతలపవనాలతో పచ్చని ప్రకృతి రమణీయంగా వుంటుంది. మదనపల్లి, హార్స్‌లీ హిల్స్‌, కాణిపాకం, తిరుమల, తిరుపతి ప్రదేశాలన్నీ వేసవి సాధారణకాలాలలోనూ అనునిత్యం విహరించే సుందరప్రదేశాలే కడప, కర్నూలు జిల్లాలలో పెక్కు దర్శనీయస్థలాలున్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల నెలవులే మంత్రాలయం, అహోబిలం, మహానంది, శ్రీశైలం లేపాక్షి, గుంటుపల్లి గుహలు, బ్రహ్మంగారు తిరుగాడిన పుణ్యస్థలాలు, మఠాలు వంటివి సందర్శించడం వేసవిని మరిపింపచేస్తాయి.

మహానగరంలో మరెన్నో....:

దూర, సుదూరప్రాంతాలకు వెళ్లే వీలులేకపోయినపుడు హైదరాబాద్‌ మెగానగరంలోనే పలు సందర్శనస్థలా

లను చుట్టిరావచ్చు. ఈ నాడు భాగ్యనగరంలో అన్ని ప్రాంతాలలోనూ మెగా పార్కులను అభివృద్ధి చేశారు, వాటర్‌ పార్క్‌లు, స్నో వరల్డ్‌ నగరం వెలుపల పచ్చని రిసార్ట్స్‌లు, అనునిత్యం సందర్శకులను ఆహ్వానిస్తుంటాయి. సమ్మర్‌లో దరిదాపులలో, దూరంగా ఎక్కడికైనా ట్రిప్‌ కొట్టి రాదలచేవారు ముందుగా ప్రణాళిక చేసుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఆందోళనలు, అనారోగ్యాలను దరిచేరనీయకుండా హాయిగా ఉషారుగా తిరిగివత్తుమా... అనవచ్చు.

వృద్ధులు, పిల్లలు... పెంపుడు జంతువుల పట్ల వేసవి జాగ్రత్తలు:

వేసవిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో వృద్ధులు, పిల్లలు పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తలుండాలి. వీరి శారీరకపరిస్థితి అతిసున్నితంగా వుంటుంది. వేసవిలో తాపం ఎక్కువగా ఉండి, త్వరగా అలసిపోతారు. పిల్లలూ పెంపుడు జంతువులు కూడా అంతే.

సహజంగా పెంపుడు జంతువులలో కుక్క, పిల్లి, ఎక్కువగా పెంచుకుంటారు. కొంతమంది పక్షులను పెంచుతుంటారు. పెంపుడు జంతువులు, పక్షులు, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు వేడి, చలి, అనేవి మనిషి కన్నా వాటికే గ్రహింపు ఎక్కువగా ఉంటుంది. అవి ప్రాకృతికంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే వాటిని మన ఇండ్లలో పెంచుకునేటప్పుడు మన పెంపకంలో వాటి సహజస్థితిని కోల్పోయి వుంటాయి. మనపై ఆధారపడతాయి గనుక వాటిని చాలా సున్నితంగా చూడాలి చల్లని వాతావరణంలో వుంచాలి అవి నివాసం ఉండే బోనులు వగైరా మరీ చీకటిలో వుంచకుండా నీడగా ఉండే ప్రదేశంలో ఆక్సిజన్‌ బాగా అందేటట్లూ ఉంచాలి. నిత్యం త్రాగు నీరు, టైం ప్రకారం ఆహారం అందించడం సాయంత్రాలు చల్లని గాలిలో తిప్పడం చెయ్యాలి పెంపుడు జంతువులకు ప్రత్యేకమైన పడక, వస్తువులు తిండి పెట్టే బౌల్స్‌ నీరు త్రాగేవి అన్ని లభిస్తాయి. వేసవి వేడిమికి అవి ఏమన్నా అనారోగ్యం పాలైతే వెంటనే వెటర్నరీ డాక్టర్‌కి చూపించి తగిన సూచనలు పొందాలి.

Glaucoma Understanding - గ్లకోమా - అవగాహన


ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గ్లకోమా వ్యాధి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



-గ్లకోమా వ్యాధిని నీటికాసుల వ్యాధి నల్ల ముత్యం అని సాధారణ పరిభాషలో వ్యవహరిస్తుంటారు. కంటిపాప వద్ద స్రావాల ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి కంటి నరం వద్ద ఒత్తిడి అధికమై అది బలహీనపడుతుంది. ఫలితంగా దృష్టిక్షేత్రం తగ్గడం ఆరంభమై నెమ్మదిగా సంపూర్ణ అంధత్వం ఏర్పడుతుంది.

గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అవి 1.ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా, 2.ఎక్యూట్‌ యాంగిల్‌ క్లోజ్డ్‌ గ్లకోమా.

గ్లకోమా గురించి నాలుగు ప్రధానాంశాలు:
1) అంధత్వానికి ముఖ్య కారణం : అంధత్వం కలగడానికి కారణమయ్యే అంశాల్లో గ్లకోమా ముఖ్యమైనది. గ్లకోమాకు చికిత్స చేయకుండా వదిలివేస్తే సంపూర్ణ అంధత్వం ఏర్పడుతుంది. గ్లకోమాతో బాధపడుతూ, చికిత్స తీసుకున్నప్పటికీ సుమారు 10 శాతం మంది దృష్టి కోల్పోవడం జరుగుతుంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లకోమాను అంధత్వం కలగడానికి రెండవ అతి పెద్ద కారణంగా పేర్కొంది.
2) గ్లకోమా పలు రకాల చికిత్సలు: దీనిని పూర్తిగా నయం చేయడం కాని, కోల్పోయిన దృష్టి మళ్లీ వచ్చేలా చేయడం కాని సాధ్యం కాదు. అయితే, మందులతో కాని, శస్త్ర చికిత్సతో కాని, లేదా ఈ రెండింటి అనుసంధానంతో కాని ఈ వ్యాధి కారణంగా దృష్టి మరింతగా కోల్పోకుండా చేయవచ్చు. గ్లకోమా దీర్ఘకాలిక వ్యాధి కనుక జీవితాంతం దీనిని పరీక్షించుకుంటూ ఉండాలి. దృష్టి కోల్పోకుండా కాపాడుకోవడానికి వ్యాధి నిర్ధారణే తొలిమెట్టు.

3) ప్రతి ఒక్కరికీ గ్లకోమా రావచ్చు : వయస్సుతో సంబంధం లేకుండా అతి చిన్న ప్రాయంలోని పిల్లలనుంచి వృద్ధుల వరకూ ఎవరైనా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కాగా, వృద్ధులలో ఈ వ్యాధి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. పిల్లలలో ఈ వ్యాధి పుట్టుకతోనే ఉంటుంది. మధ్యవయస్కుల్లోనూ ఈ వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ.
4) ముందస్తు లక్షణాలేమీ కనిపించకపోవచ్చు : గ్లకోమాకు గురవుతున్నారని ముందుగా హెచ్చరించడానికి అవసరమైన వ్యాధి లక్షణాలేమీ దీనిలో కనిపించవు. అత్యంత సాధారణంగా కనిపించే ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా అనే రకంలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించవు. కంటిలో ఒత్తిడి పెరిగినప్పటికీ నొప్పి ఉండకపోవచ్చు.

కంటి చివరి భాగంనుంచి కానీ, ఇరుప్రక్కలా కాని వస్తువులు / దృశ్యాలు కనిపించకపోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితిని బాధితులు తమ తలను పక్కకు తిప్పి చూడటం ద్వారా సరి చేసుకుంటూ ఉంటారు తప్ప తమ దృష్టి క్షేత్రానికి ఏదో సమస్య ఉత్పన్నమవుతున్నదని గ్రహించలేరు.
ప్రత్యేకించి దృష్టిలోపం ఏర్పడినట్లు తెలిసే వరకూ బాధితులు ఈ సమస్య గురించి తెలుసుకోలేరు. గ్లకోమా ఉందా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి నేత్ర వైద్యులను సంప్రదించడం అవసరం.

ప్రాధమిక అవగాహన :
కంటి ఆకృతిని పరిరక్షించడానికి కంటిలో ఒకరకమైన ద్రవం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాన్నే ‘యాక్వస్ హ్యూమర్’ అంటారు. అది నిత్యం ఉత్పత్తి అయ్యే క్రమంలో కొత్తద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాతది బయటకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఇది బయటకు వెళ్లడంలో ఏదైనా అడ్డుపడితే? అప్పుడు కంటి నరంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతుంటుంది. ఇలా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నరం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడం వల్ల వచ్చే ప్రమాదాన్ని ‘గ్లకోమా లేదా గ్లుకోమా’ అంటారు. మనం నేరుగానే కాదు... పక్కలకు కూడా చూడగలం. దీన్నే ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదా విజువల్ ఫీల్డ్ అంటారు. మనమిలా పక్కగా చూడగల విస్తృతి, సామర్థ్యం గ్లకోమా వ్యాధి వల్ల క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రోజులో జరిగేది కాదు. అందుకే తమ చూపు తగ్గిపోవడాన్ని చాలామంది చాలాకాలం వరకు గమనించలేరు.
గ్లకోమాలో రకాలు...:
1. ప్రైమరీ గ్లకోమా
2. సెకండరీ గ్లకోమా
3. కంజెనిటల్ గ్లకోమా / పీడియాట్రిక్ గ్లకోమా 
1. ప్రైమరీ గ్లకోమా:  నిర్దిష్టమైన కారణం ఏదీ లేకుండా ఈ వ్యాధి కనిపిస్తే దాన్ని ప్రైమరీ గ్లకోమా అంటారు. ఇందులోనూ మళ్లీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా (పీఓఏజీ) అని, క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమా (పీీసీఏజీ) అని రెండు రకాలున్నాయి. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో యాక్వస్ హ్యుమర్ ద్రవం చాలా నెమ్మదిగా బయటకు వెళ్తుంది. అందువల్ల అంధత్వం కూడా చాలా నెమ్మదిగా వస్తుంది. అందుకే దీన్ని ఇంగ్లిష్‌లో నిశ్శబ్దంగా చూపును దెబ్బతీసే దొంగ (స్నీక్ థీఫ్ ఆఫ్ ది సైట్)గా చెబుతుంటారు. క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమాలో కంటి ముందు ఉండే ‘యాంగిల్’ భాగం అకస్మాత్తుగా సన్నబడిపోతుంది లేదా మూసుకుపోతుంది. దాంతో యాక్వస్ బయటకు ప్రవహించడానికి అవకాశం లేక కంటినరంపై ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ తరహా కేసుల్లో నొప్పి, కన్ను ఎరబ్రారడంతో పాటు చూపును కాస్త వేగంగా కోల్పోతారు.
2. సెకండరీ గ్లకోమా: 
ఈ తరహా గ్లకోమా కంటికి దెబ్బతగలడం (ట్రామా), కంటి కటకం (లెన్స్) దెబ్బతినడం, కంటిలో ఇన్ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల వస్తుంది.
3. కంజెనిటల్ గ్లకోమా : 
ఇది చిన్నపిల్లల్లో వచ్చే గ్లకోమా. కొంతమందిలో పుట్టుకతోనే కంటిలో ఉండే యాక్వస్ ద్రవం బయటకు ప్రవహించదు. దాంతో కనుగుడ్డు మామూలు కంటే పెద్దదిగా ఉంటుంది. దీన్నే బూఫ్తాల్మస్ అంటారు. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. పిల్లలు కాంతిని చూడలేరు. ఈ పరిస్థితిని ఫొటోఫోబియా అంటారు.


ప్రమాదకరాంశాలు:
ప్రతి ఒక్కరూ గ్లకోమాకు గురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు ఈ వ్యాధి సోకడానికి హేతువులవుతాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఈ కింద పొందుపరుస్తున్నాం.
- 40 సంవత్సరాల వయస్సు దాటిన వారు
- కుటుంబ సభ్యులలో ఎవరికైనా గ్లకోమా వ్యాధి ఉన్నట్లయితే
- దగ్గరి చూపు కోసం వాడుతున్న కళ్లద్దాల నెంబరు తరచూ పెరుగుతూ ఉన్నట్లయితే
- తరచుగా తలనొప్పి వస్తుండటం
- దీపం చుట్టూ కాంతి వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉండటం
- దృష్టి క్షేత్రంలో లోపాలు ఏర్పడటం
- మధుమేహంతో బాధపడే వారు,
- ధూమపానం చేసేవారు
- కంటికి బలమైన గాయం తగలడం
- అధిక రక్తపోటు
- కార్నియా మధ్యభాగం 0.5 మి.మీ. కంటే తక్కువ దళసరి కలిగి ఉండటం
మొదలైన అంశాలు గ్లకోమా సోకడానికి ప్రమాదకరాం శాలుగా పరిణమిస్తాయి. ఈ అంశాల్లో ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.

పరీక్షలు:
గ్లకోమా అని అనుమానం కలిగినప్పుడు వైద్యులు ఈ కింద పేర్కొన్న పరీక్షలు నిర్వహిస్తారు.
- కంటిలో ఒత్తిడిని నమోదు చేయడం
- కంటి నాడి పరీక్ష
- దృష్టి క్షేత్ర పరీక్ష
- ప్రత్యేకమైన లెన్స్‌ సహాయంతో గొనియోస్కోపీ పరీక్ష

గ్లకోమా రకాలు : చికిత్స
ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా : కంటిలో ఒత్తిడి పెరిగి కంటి నాడి నెమ్మదిగా దెబ్బ తినడం వల్ల దృష్టి క్షేత్రం
నెమ్మదిగా కుంచించుకుంటూ చివరకు శాశ్వత అంధత్వం ప్రాప్తిస్తుంది.
వీరికి లేజర్‌ లేదా శస్త్ర చికిత్స ద్వారా కంటిలోని ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు.
క్లోజ్డ్‌ యాంగిల్‌ గ్లకోమా : ఈ సమస్యలో ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా మాదిరిగా నెమ్మదిగా కాకుండా అకస్మాత్తుగా కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల కన్ను నొప్పితో ఎర్రబడుతుంది. వాంతులు తలనొప్పి మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి.
వీరికి అత్యవసర చికిత్స అవసరమవుతుంది. కంటిలోని ఒత్తిడిని తగ్గించి, లేజర్‌ ద్వారా ఆపరేషన్‌ చేస్తే కొద్దిగా దృష్టి నిలబడే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా పక్కకంటికి కూడా చికిత్స చేస్తారు.


చికిత్స  : 
1. వైద్యచికిత్స: 
కంట్లో చుక్కల మందులు వేయడం (ఈ చుక్కల మందులు జీవితాంతం వాడాలి)
2. లేజర్ చికిత్స:
  కొన్ని రకాల గ్లకోమాలకు మాత్రమే ఈ చికిత్స ఉపయోగపడుతుంది
3. శస్తచ్రికిత్స:
  పై పద్ధతుల వల్ల కంటిలోని ఒత్తిడి(ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్) నియంత్రణలోకి రాకపోతే శస్తచ్రికిత్స అవసరమవుతుంది.

ఈ చికిత్సల ద్వారా కంటిలో ఉండే యాక్వస్ ద్రవం ఒత్తిడిని స్థిరంగా ఉంచడం వల్ల ఇకపై చూపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకసారి గ్లకోమా ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఆ రోగులు జీవితకాలం పాటు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణుడితో ఫాలో-అప్‌లో ఉండటం, వారు సూచించినట్లుగా పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తీసుకునే చికిత్స క్రమాన్ని డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. మందులను మారుస్తుంటారు. 

Updates :  



నీటి కాసులు-లేదా గ్లకోమా (Glaucoma) అనేది ఒక రకమైన కంటి వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వైద్యము లభించుచున్నది. ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్ల మంది ప్రజలు, అందులో 80 శాతం మంది ఆసియా వాసులను గ్లకొమ ప్రభావితం చేస్తోంది.ప్రైమరీ యాంజెల్‌ క్లొజర్‌ గ్లకొమ (పిఎసిజి)తో సంబంధం ఉన్న మూడు కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు విడదీశారు. 1854 పిఎసిజి కేసులు, పిఎసిజి కేసులు కాని 9608 కేసులను శాస్త్రవేత్తల బృందం జీనోమ్‌- వైడ్‌ అసోసియేషన్‌ స్టడీని నిర్వహించింది. దీని కోసం ఆసియాలో ఒక్కొక్కరి నుండి ఐదు నమూనాల చొప్పున సేకరించారు. వీరు మరో 1917 పిఎసిజి కేసులు, పిఎసిజి కాని 8943 కేసులపై దృవీకరణ ప్రయోగాలు నిర్వహించారు. దీని కోసం వీరు ప్రపంచవ్యాప్తంగా నమూనాలు సేకరించారు. సింగపూర్‌ ఐ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సెరి), జీనోం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సింగపూర్‌ (జిఐఎస్‌), నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సింగపూర్‌ (ఎన్‌యుఎస్‌), నేషనల్‌ యూనివర్శిటీ హాస్పిటల్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆఫ్తాల్మజి, టన్‌ టక్‌ సెంగ్‌ హాస్పిటల్‌ సంయుక్తంగా ఈ పరిశోధనను చేపట్టాయి. జీనోమ్‌-వైడ్‌ పర్‌స్పెక్టివ్‌ను ఉపయోగిస్తూ, పిఎసిజిని అధ్యయనం చేయడం ఇదే తొలిసారి అని 'నేచర్‌ జెనిటిక్స్‌' అనే జర్నల్‌ పేర్కొంది. చాలా కాలం నుండి ఎన్‌యుఎస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అంగ్‌ టిన్‌ వ్యక్తం చేసిన అనుమానాలను ఈ ఫలితాలు నిర్ధారిస్తున్నాయి. టిన్‌ పదేళ్లకుపైగా పిఎసిజిపై పనిచేశారు. గ్లకొమ వ్యాధి వంశపారంపర్యంగా వస్తోందని భావించారు. 'పిఎసిజి వృద్ధి చెందడంలో జన్యుపరమైన కారణాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇది మరింత ఆధారాన్ని అందిస్తోంది. వ్యాధిని అర్థం చేసుకోవడానికి ఈ ఫలితాలు కొత్త మెళకువలకు దారితీస్తాయి. భవిష్యత్తులో కొత్త చికిత్స కనుక్కోవడానికి ఆస్కారమేర్పడింది. ముందే జబ్బును గుర్తించి నయం చేసే అవకాశముంది. 

Hiccoughs-disturbence - ఎక్కిళ్ళు- ఇబ్బంది


                    
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎక్కిళ్ళు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-ఎక్కిళ్లను నిత్యజీవితం లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొం టారు. ఎక్కిళ్లు డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన 'ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది.

ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో 'హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

కారణాలు : 
ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే
మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల,
విష పదార్థాల సేవనం వల్ల,
శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల,
కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
ఆదుర్థా, భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల ,
కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన ,
సుగరు వ్యాధి ముదినపుడు ,
ఎక్కువగా మందు (సారా) త్రాగడం వల్న ,
ఎక్కువగ పొగ త్రాగడం వలన ,
నోటి పూత తో బాధపదుతున్నా,
ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు ,
కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు ,
తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు ,
తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు ,
అంటే నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.
ఆయుర్వేధిక చిట్కాలు : 

  • పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • క్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • పచ్చి తాటాకు నమిలి ఊటను మింగుతే ఎక్కిళ్లు పోతాయి.దయం,
  • సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • నేల ఉసిరి ఆకుల్ని నమిలి మింగటం వల్ల కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిల్లు ఆగుతాయి.
  • తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
  • రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి.
  • కొబ్బరి బోండాం నీళ్లు తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా, నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి లేదా కరక్కార పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకున చెంచాడు తేనెను కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.
  • విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
  • వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మెతాదులో తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
  • ఆవాలను పొంగబెట్టి తాగిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి.
అల్లోపతిక్ చికిత్స :Tab . backfen (antispasmodic) 1 tab 3 times /day for 3-4 days ,
Tab . Aceloc Rd (anti acidic) 1 tab 3 times /day for 3-4 days


ఎక్కిళ్లు వేధిస్తుంటే?--చిట్కాలు :
ఎక్కిళ్లతో ప్రమాదమేమీ లేకపోవచ్చు గానీ వచ్చినపుడు మాత్రం చాలా ఇబ్బంది పెడతాయి. చిన్న చిట్కాలతో వీటిని తగ్గించుకునే అవకాశముంది.
* ఛాతీ నిండుగా గాలి పీల్చుకొని.. కొద్దిసేపు అలాగే పట్టి ఉంచండి. దీంతో డయాఫ్రం సర్దుకొని ఎక్కిళ్లు తగ్గటానికి తోడ్పడుతుంది.
* కాస్త చక్కెరను నోట్లో వేసుకొని చప్పరించండి. ఇది అన్నవాహికను ఒకింత చికాకు పరచి, మెడ నుంచి డయాఫ్రం వరకు వెళ్లే ఫ్రెనిక్‌ నాడి సర్దుకునేలా చేస్తుంది. లేకపోతే ఒక చెంచాడు వెనిగర్‌నైనా తీసుకొని చూడండి.
* వేడి సూప్‌ కూడా ఉపయోగపడొచ్చు. దీన్ని తాగినపుడు మనసు ఎక్కిళ్ల మీద కన్నా వేడి, మంట మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది.
* గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె కలిపి.. నాలుక వెనక భాగంలో వేసుకొని మింగి చూడండి. తేనె వేగస్‌ నాడిని సైతం ప్రేరేపిస్తుంది కాబట్టి ఎక్కిళ్లు తగ్గటానికి తోడ్పడుతుంది.
* కాగితం కవరులో ముఖాన్ని పెట్టి నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకొని చూడండి. ఇది రక్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పెరిగేలా చేస్తుంది. అప్పుడు మరింత ఆక్సిజన్‌ను లోనికి తీసుకోవటానికి డయాఫ్రం సంకోచించటం వల్ల ఎక్కిళ్లు తగ్గొచ్చు.


ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే...:

ఒక్కోసారి కొందరికి ఎక్కిళ్లు అదేపనిగా వస్తుంటాయి. అలాంటప్పుడు మనకే కాదు, తోటివారికీ ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే తరచూ వచ్చే ఎక్కిళ్లను త్వరగా తగ్గించాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ప్రయత్నిస్తే సరిపోతుంది.

అల్లం: చాలామంది వంటల్లో అల్లాన్ని వేస్తారు తప్ప తినడానికి ఇష్టపడరు. కానీ అల్లాన్ని సన్నగా తరిగి ఎక్కిళ్లు వచ్చినప్పుడు బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. రెండు చుక్కల వెనిగర్‌ని నాలుక మీద వేసుకుని చప్పరిస్తే, ఆ పుల్లదనానికీ ఎక్కిళ్లు ఆగిపోతాయి.

యాలకులు: ఎక్కిళ్లు అదే పనిగా వచ్చిపోతుంటే ఇలా చేయొచ్చు. కప్పున్నర నీళ్లలో చెంచా యాలకుల పొడి వేసి మరిగించాలి. తరవాత వడకట్టి తాగాలి. ఆ నీళ్ల వల్ల గొంతూ, శ్వాసకోశ వ్యవస్థ ఉత్తేజితమై ఎక్కిళ్లు తగ్గుతాయి. ఆ సమయంలో పెరుగులో ఉప్పు కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

ఆవాలు: చిటికెడు ఆవాల పొడిలో అరచెంచా నెయ్యి కలిపి, ఆ మిశ్రమాన్ని తినేయాలి. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి. తీపి పదార్థాలు నోట్లో వేసుకున్నా ఫలితం ఉంటుంది.