Medical Tips in Telugu - All Medical Related Queries, Some Common Medical Problems And Solutions, Medical Knowledge, Medical Tips
Pages
▼
Thursday, 21 January 2016
Antibiotics use in Children - పిల్లలకు యాంటీ బయోటిక్స్ జాగ్రత్తలు
పిల్లలకు యాంటీ బయోటిక్ మందులు వేస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము . యాంటి(Anti) అనంటే వ్యతిరేకమై(opposite)నది అని అర్ధము . జీవులు నశింపజేయడానికి ... తద్వారా వాటివల్ల కలిగే జబ్బులను నయము చేయడానికి వాడే రసాయనాలు .
దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్‌ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు 3-7 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలావాటికి యాంటిబయోటిక్స్ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువ ఇవ్వటం, అవసరమైతే కొద్ది మోతాదులో నొప్పి నివారణ మందులతోనే ఇవి నయమవుతాయి.
కడుపు నిండుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీ బయోటిక్స్ వెయ్యద్దు. అలాచేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.
ఆంపిసిలిన్, అమాక్జసిలిన్ వంటి యాంటీ బయోటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే. వాటంతటవే తగ్గిపోతాయి. మందులు మానేయాల్సిన అవసరం లేదు.
పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా.. దద్దు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.
యాంటీ బయోటిక్స్ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
No comments:
Post a Comment