తీరిక లేని తేనెటీగలు ప్రత్యేకంగా మనకిస్తున్న బహుమతులు తేనె, మైనం. తేనె ఒక సంపూర్ణ ఆహారం. తేనె గురించిన వివరం మన పురాణాలలో, వేదాలలో బైబుల్లో, గ్రీకు, రోమనుల పురాణాలలో చూడవచ్చు. శక్తికి ముఖ్యాధారమైన ఖర్జూరం తరువాత స్థానం పోషకపదార్ధమైన తేనె వస్తుంది. పౌష్టికత్వపు దృష్టితో చూసినప్పుడు ఇది పాలకంటే ఆరు రెట్లు బలవర్ధకమైనది. మనదేశపు ఋషులు తేనెను సేవించి కాలం గడిపారు. గ్రీసు పాతకాలంలో ఒలెంపిక్ పందాల సందర్భంగా తమ శరీరాన్ని పునర్ శక్తివంతం చేసుకోవడానికి పుష్టి నిచ్చే తేనెను వాడేవారు.
అతిముఖ్యమైన ఖనిజాలు - ఐరన్, పొటాషియం, రాగి, మాంగనీసు, - విటమిన్లు, మాంసకృతులు, సహజ పంచదార మొదలగునవి తేనెలో ఉన్నాయి. ఇవన్నీ కలసి జీర్ణమై రక్తంలో ప్రత్యక్షంగా, అతివేగంగా కలసిపోయే ముఖ్య ఆహారం అంతర్భాగాలు అవుతాయి. ఇప్పుడు ఉన్నవాటిలో తేనె అతిశ్రేష్టమైన కార్బో హైడ్రేట్ ఆహారం. ఇందులోని తీపిదనం చెరుకు తీపికి రెండింతలు ఉంటుంది. ఒత్తిడికి గురి అయినప్పుడు రెండు చెంచాల తేనె తీసుకుంటే నరాలను శాంతపరచి విశ్రాంతిని తప్పక ప్రసాదిస్తుంది. ఒక గ్లాసు చల్లని నీళ్ళలో కొంచెం తేనె కలిపి పరగడుపున తీసుకొంటే అది కండరాలను తీర్చిదిద్దుతుంది.

తేనె గురించి:
ఒకప్పుడు మహాకవి కాళిదాసు "లోకంలో అత్యంత మధుర పదార్ధం ఏది?" అని ప్రశ్నిస్తాడు. "తేనె" అని బదులు వస్తుంది. రుచికి సంబంధించినంత వరకు తేనెకు మించిన మధుర పదార్ధం మరేదీ లేదు. తేనె, పంచదారల కృత్రిమ మధుర పదార్ధం కాదు. అది ప్రకృతిలో సహజంగా లభిస్తుంది. తేనెను తేనెటీగలు స్వయంగా తయారు చేసి, తేనె తుట్టెలలో భద్రపరుస్తుంటాయి. ఇవి రకరకాల పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుకుంటాయి. ఆ మకరందాన్ని, తమ శరీరంలోని ఇతర ద్రవ్యాలతో సంయోగం చేసి, దాన్ని మధువు కంటే తేనెగా మారుస్తాయి. తేనె కేవలం మధురపదార్ధమే కాదు, అది బలవర్ధకమైనది కూడా. తేనెలో ద్రాక్షఫల చక్కెరలు అధికంగా ఉంటయి. ఈ చక్కెరలు త్వరగా జీక్ణం కావటమే కాక బలశక్తులను కూడా ప్రసాదిస్తుంటాయి. కాబట్టే మధుమేహం గలవారు తగుమాత్రం తేనెను స్వీకరించవచ్చు. దానివల్ల వారి రక్తంలో చక్కెర లోపం తీరుతుంది. చెరకు చక్కెర జీర్ణం కాక మూత్రంలో బహిర్గతమౌతుంది.
తేనెలో 'ఫల చక్కెర, క్షారం, నత్రజని, చెరకు' మొదలగు పదార్ధాలు ఉంటాయి. పోషక శక్తిలో తేనె పాలకన్నామించి ఉంటుంది. 7 ఔన్సుల తేనె - 3 పౌనుల పాలకు, 56 ఔన్సుల మీగడ జున్నుకు, 12 ఔన్సుల మాంసానికి, 15 ఔన్సుల కాడ్ చేప మాంసానికి, 8 నారింజ పండ్లకు, 10 గ్రుడ్లకు సమానం. తేనెలో మైనం, ఆమ్లరసం, సాయిక్ ఆమ్లం మొదలైనవి కూడా ఉంటాయి. మధుర చక్కెర రూపంలో తేనెలో గ్లూకోజ్ ఉంటుంది. తేనేలో 'బి' విటమిను ఉంది. 'బి' విటమిను శరీర పోషకత్వానికి ఎంతో అవసరం. 'బి' విటమిన్ లొపిస్తే, రక్తక్షిణత, విరేచనాలు, నంజు, మచ్చలు, వాపు, గుండె బలహీనత, దృష్టిమాంద్యం, బుగ్గలు మడతపడటం మొదలైనవి సంభవిస్తాయి. తేనెను స్వీకరించటం ద్వారా ఈ విటమిన్ లోపం తీరుతుంది. ఈ రోగాలు రావు. 'బి' విటమిన్ పార్శిక్ ఆమ్లం రూపంలో తేనె ఉంటుంది. తేనె నేరుగా రక్తంలో కలిసిపోతుంది. త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి అనగా బాలురు, రోగులు, వృద్ధులు, కఠిన పరిశ్రమ చేయువారికి తేనె అమృతంతో సమానం. రక్తంలోని ఎర్రకణాలను వృద్ధిచేసే శక్తి తేనేలో ఉంది. హృదయం, మూత్రాశయం, చర్మానికి - శక్తిని, తేజాన్ని తేనె యిస్తుంది.
తేనెను స్వతంత్రంగా, అనుపానంగా సేవించవచ్చు. అనుపానంలో ముందు శక్తిని తేనె వృద్ధిపరుస్తుంది. ముల్లంగి, అరటి, మజ్జిగ, పెరుగు వీటితో కలిపి దీనిని గ్రహించరాదు. ఇవి పరస్పరం విరుద్ధ పదార్ధాలు. నెయ్యితో సమంగా కలిపి గాని; క్రొవ్వు, నూనెలతో గాని దీనిని గహించరాదు. వేడి నీటితో, వేడి పాలతో కలిపి తేనెను త్రాగవచ్చు. వేడి నీటితో కలిపి త్రాగితే వాంతులు తగ్గుతాయి. పాలను చల్లబరచి తేనెను కలపాలి. తేనెను వేడి చేయరాదు. మత్స్య, మాంసాలతో తేనెను స్వీకరించరాదు. ఎండలో వచ్చినప్పుడు, చెమటలు పట్టినప్పుడు దీన్ని తీసుకోవద్దు. వేడి వేడి తీపి పదార్ధాల్లో తేనె కలిపి తినవద్దు. తేనెను కలిపి తీపి పదార్ధాలు వండవద్దు.

తేనెతో కొన్ని చికిత్సలు:
- చిన్నపల్లలకు దగ్గు, జ్వరం, స్లీహం వస్తే పిప్పల్ల చూర్ణ, తేనె కలిపి నాకించాలి. శొంఠి, మిరియాలతో కూడా కలిపి యివ్వవచ్చు.
- త్రిఫల చూర్ణం + తేనె + నెయ్యి + కాంతిసార భస్మం - ఈ మిశ్రమాన్ని సేవిస్తే పుస్త్వం వృద్ధి అవుతుంది.
- త్రిఫల కషాయం, తేనె కలిపి వాడితే క్రొవ్వు తగ్గుతుంది. తేనెను ముఖానికి పట్టిస్తే అందం ఇనుమడిస్తుంది. పొడి పసుపు + ఉసిరి రనం + తేనె - ఈ మిశ్రమాన్ని నాకితే పమేహాలు హరిస్తాయి.
- ఇలానే మధుమేహం, కామెర్లు, దమ్యవ్యాధులు, పుండ్లు, వ్రణాలు మొదలైన వాటికి కూడా తేనెతో చికిత్సలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది.
- తేనె - మాక్షికం, బ్రమరం, క్షుద్రం, పూతకం అని నాలగు రకాలు. ఈ నాలుగు రకాలతో అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్సలున్నాయి.
- మొత్తం మీద తేనె ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన, సౌందర్యదాయకమైన ఔషధ పదార్ధం. దాన్ని నిత్యం స్వతంత్రంగానో, అనుపానంగానో ఏదో రూపంలో పుచ్చుకోవటం వల్ల శరీరం, మనసు కూడా స్వస్ధంగా ఉంటాయి.
No comments:
Post a Comment